వృథా ప్రలాప నివృత్తిః, వృథా వాగనుచారణం. (వృథాగా మాటలాడకుండుట)
వాఙ్నియమః - (మాటలాడుటలో నియమము నవలంభించి మాటలాడుట)
మనసా వాక్ప్రవృత్తి నియమనం.
(మాటలాడుటలో నియమమును మనసులో అనుసరించుట)
తూష్ణీ భావం (మాటలాడక ఊరకయుండుట),
మునీనాం వ్రతం మౌనం అహింసాది లక్షణం
(మునులు వలంభించు వ్రతము మౌనము - హింస చేయకుండుట మొదలగు లక్షణములు గలది).
(మననము చేయు స్వభావము కలిగియుండుట).
నిధి ధ్యాసనం -
వాఙ్నియమోపి మనస్సం యమ పూర్వకో భవతి ఇతి కార్యేణ కారణం ఉచ్యతే, మనస్సం యమనం మౌనం.
(మౌనముగా వాఙ్నియమము - దీనికి మనస్సం యమము అవసరము - మనస్సం యమము కలిగియుండవలెను, అందుచేత కార్యము చెప్పినందున దాని కారణము చెప్పినట్లే - వాఙ్నియమము కార్యము, దానికి కారణము మనస్సం యమము. అందుచేత మౌనమనగా - మనస్సం యమము).
"వాచం యమత్వం గోప్యానామభిప్రాయస్య గూఢతా |
నిధిధ్యాసనమేవాత్రమౌనం వా గుహ్యమస్మ్యహం ||". (గీతాభావప్రకాశము - 10 - 38)
(గుహ్యము అనగా గోప్యము - మౌనం వాచం యమత్వము - అభిప్రాయము గూఢముగా నుంచుట. సన్యాస శ్రవణ మనన పూర్వకముగా ఆత్మనిధిధ్యాసనమే మౌనము - ఆ మౌనము నేనే (భగవంతుడే) అని శ్రీకృష్ణునివాక్యము).
"మౌనం పండిత లక్షణం ". (మౌనము నవలంభించుట పండితుల లక్షణము).
"మౌనం సర్వార్థ సాధనం"
(మౌనము సమస్త కార్యములను - పురుషార్థములను - సాధించునది).
vṛthā pralāpa nivṛttiḥ, vṛthā vāganucāraṇaṃ. (vṛthāgā māṭalāḍakuṃḍuṭa)
vāṅniyamaḥ - (māṭalāḍuṭalō niyamamu navalaṃbhiṃci māṭalāḍuṭa)
manasā vākpravṛtti niyamanaṃ.
(māṭalāḍuṭalō niyamamunu manasulō anusariṃcuṭa)
tūṣṇī bhāvaṃ (māṭalāḍaka ūrakayuṃḍuṭa),
munīnāṃ vrataṃ maunaṃ ahiṃsādi lakṣaṇaṃ
(munulu valaṃbhiṃcu vratamu maunamu - hiṃsa cēyakuṃḍuṭa modalagu lakṣaṇamulu galadi).
(mananamu cēyu svabhāvamu kaligiyuṃḍuṭa).
nidhi dhyāsanaṃ -
vāṅniyamōpi manassaṃ yama pūrvakō bhavati iti kāryēṇa kāraṇaṃ ucyatē, manassaṃ yamanaṃ maunaṃ.
(maunamugā vāṅniyamamu - dīniki manassaṃ yamamu avasaramu - manassaṃ yamamu kaligiyuṃḍavalenu, aṃducēta kāryamu ceppinaṃduna dāni kāraṇamu ceppinaṭlē - vāṅniyamamu kāryamu, dāniki kāraṇamu manassaṃ yamamu. aṃducēta maunamanagā - manassaṃ yamamu).
"vācaṃ yamatvaṃ gōpyānāmabhiprāyasya gūḍhatā |
nidhidhyāsanamēvātramaunaṃ vā guhyamasmyahaṃ ||". (gītābhāvaprakāśamu - 10 - 38)
(guhyamu anagā gōpyamu - maunaṃ vācaṃ yamatvamu - abhiprāyamu gūḍhamugā nuṃcuṭa. sanyāsa śravaṇa manana pūrvakamugā ātmanidhidhyāsanamē maunamu - ā maunamu nēnē (bhagavaṃtuḍē) ani śrīkṛṣṇunivākyamu).
"maunaṃ paṃḍita lakṣaṇaṃ ". (maunamu navalaṃbhiṃcuṭa paṃḍitula lakṣaṇamu).
"maunaṃ sarvārtha sādhanaṃ"
(maunamu samasta kāryamulanu - puruṣārthamulanu - sādhiṃcunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.