← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షమార్గము mōkṣamārgamu

Original — తెలుగు
  1. ముక్తిమార్గము, అపవర్గమార్గము -

  2. "భూతేంద్రియాశ్రయ విరహితమై విశుద్ధ

మైన జీవుని విమలాంతరాత్ముడనైన నన్ను నేకముగ జూచు నరుడు మోక్షపదమార్గవర్తియై భాసిల్లు - - - ".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 -)

  1. "మార్గాస్త్రయో మే విఖ్యాతా మోక్షప్రాప్తౌ నగాధిప |

కర్మయోగో, జ్ఞానయోగో, భక్తియోగశ్చ సత్తమ ||". (దేవీభాగవతము)

"మోఫ్క్షప్రాప్తౌ త్రయో మార్గాః కర్మోపాసనా జ్ఞాన భేదేన త్రివిధాః. తత్ర జ్ఞానమార్గః సాక్షాన్మోక్షసాధనం, ఇతరౌ చిత్తశుద్ధి ద్వారా ఇతి వివేకః, త్రయాణామపి మార్గాణాం మధ్యే తన్మార్గ గామినాం త్రయాణామపి పురుషాణాం భక్తియోగః కర్తుం యోగ్యః, శక్యశ్చ భవతి. అస్య భక్తియోగస్య అన్యాపేక్షయా సులభత్వాత్ మానసత్వాత్ ద్రవ్య శరీరాయా సమంతరేణ కేవలం మనోవృత్యా ఏవ సంపాద్యత్వాత్ - యస్మిన్ భక్తియోగే కాయచిత్త ద్రవ్య వ్యయాది పీడనాభావో భవతి. తస్మాత్ ఇత్యర్థః. తస్మాత్ సర్వైరపి అయంభక్తియోగో నియమేన ఆశ్రయి తవ్యః".

(మోక్షప్రాప్తికి మార్గములు మూడు, కర్మ, ఉపాసన (భక్తి), జ్ఞానము. జ్ఞానమార్గము సాక్షాత్ మోక్షసాధనము, మిగిలిన రెండు చిత్తశుద్ధిని కలిగించుటద్వారా మోక్షమార్గములు. ఈ మూడు మార్గముల నవలంభించినవారు భక్తియోగము చేయుట యోగ్యము, శక్యము - భక్తియోగము మఱియొక సాధనము నపేక్షించక మఱియొకదానిమీద ఆధారపడియుండనిది, సులభమైనది, మనసునకు సంబంధించినది. ద్రవ్యము అవసరము లేనిది, శరీరము నకాయాశము కలిగింపనిది, కేవలము మనోవృత్తి చేతనే సంపాదించ వీలగునది. భక్తియోగములో శరీరమునకు గాని, మనస్సునకుగాని బాధకలగనిది. ఏ ద్రవ్యమునైనను వ్యయము చేయ నవసరము లేనిది. అందుచేత భక్తియోగమునందఱు నియమముగా నభ్యసించవలయును).

  1. శబ్ద విషయత్యాగము, ఏకాగ్రధ్యానము, ప్రాణాయామము, ఇంద్రియమనోబుద్ధుల నిగ్రహము, మననశీలత్వము, మోక్షపరాయణత్వము, కామక్రోధభయరాహిత్యము - ఇవి మోక్షమార్గములు -

  2. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తియోగము అను మోక్షమార్గములలో ప్రతియొక్కమార్గమునందును మిగిలిన మార్గములయొక్క అంశలు ఏదోపాలున కలిగియే యుండును.

  3. "అష్టావక్రమహర్షి తాను జ్ఞానయోగి అయినప్పటికి జనకునకు వాని తత్వముననుసరించి ధ్యానప్రథానమగు కర్మయోగమార్గము నుపదేశించెను. జనకుండు తాను స్వయముగ కర్మయోగి అయినను శుకునకు వాని తత్వముననుసరించి జ్ఞానయోగమార్గమునుపదేశించెను - శ్రీశుకులు తాను జ్ఞానియోగియైనను పరీక్షిత్తునకు భక్తియోగము నుపదేశించెను".

Transliteration
  1. muktimārgamu, apavargamārgamu -

  2. "bhūtēṃdriyāśraya virahitamai viśuddha

maina jīvuni vimalāṃtarātmuḍanaina nannu nēkamuga jūcu naruḍu mōkṣapadamārgavartiyai bhāsillu - - - ".

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 -)

  1. "mārgāstrayō mē vikhyātā mōkṣaprāptau nagādhipa |

karmayōgō, jñānayōgō, bhaktiyōgaśca sattama ||". (dēvībhāgavatamu)

"mōphkṣaprāptau trayō mārgāḥ karmōpāsanā jñāna bhēdēna trividhāḥ. tatra jñānamārgaḥ sākṣānmōkṣasādhanaṃ, itarau cittaśuddhi dvārā iti vivēkaḥ, trayāṇāmapi mārgāṇāṃ madhyē tanmārga gāmināṃ trayāṇāmapi puruṣāṇāṃ bhaktiyōgaḥ kartuṃ yōgyaḥ, śakyaśca bhavati. asya bhaktiyōgasya anyāpēkṣayā sulabhatvāt mānasatvāt dravya śarīrāyā samaṃtarēṇa kēvalaṃ manōvṛtyā ēva saṃpādyatvāt - yasmin bhaktiyōgē kāyacitta dravya vyayādi pīḍanābhāvō bhavati. tasmāt ityarthaḥ. tasmāt sarvairapi ayaṃbhaktiyōgō niyamēna āśrayi tavyaḥ".

(mōkṣaprāptiki mārgamulu mūḍu, karma, upāsana (bhakti), jñānamu. jñānamārgamu sākṣāt mōkṣasādhanamu, migilina reṃḍu cittaśuddhini kaligiṃcuṭadvārā mōkṣamārgamulu. ī mūḍu mārgamula navalaṃbhiṃcinavāru bhaktiyōgamu cēyuṭa yōgyamu, śakyamu - bhaktiyōgamu maṟiyoka sādhanamu napēkṣiṃcaka maṟiyokadānimīda ādhārapaḍiyuṃḍanidi, sulabhamainadi, manasunaku saṃbaṃdhiṃcinadi. dravyamu avasaramu lēnidi, śarīramu nakāyāśamu kaligiṃpanidi, kēvalamu manōvṛtti cētanē saṃpādiṃca vīlagunadi. bhaktiyōgamulō śarīramunaku gāni, manassunakugāni bādhakalaganidi. ē dravyamunainanu vyayamu cēya navasaramu lēnidi. aṃducēta bhaktiyōgamunaṃdaṟu niyamamugā nabhyasiṃcavalayunu).

  1. śabda viṣayatyāgamu, ēkāgradhyānamu, prāṇāyāmamu, iṃdriyamanōbuddhula nigrahamu, mananaśīlatvamu, mōkṣaparāyaṇatvamu, kāmakrōdhabhayarāhityamu - ivi mōkṣamārgamulu -

  2. karmayōgamu, jñānayōgamu, dhyānayōgamu, bhaktiyōgamu anu mōkṣamārgamulalō pratiyokkamārgamunaṃdunu migilina mārgamulayokka aṃśalu ēdōpāluna kaligiyē yuṃḍunu.

  3. "aṣṭāvakramaharṣi tānu jñānayōgi ayinappaṭiki janakunaku vāni tatvamunanusariṃci dhyānaprathānamagu karmayōgamārgamu nupadēśiṃcenu. janakuṃḍu tānu svayamuga karmayōgi ayinanu śukunaku vāni tatvamunanusariṃci jñānayōgamārgamunupadēśiṃcenu - śrīśukulu tānu jñāniyōgiyainanu parīkṣittunaku bhaktiyōgamu nupadēśiṃcenu".

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.