← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షము mōkṣamu

Original — తెలుగు
  1. “నిత్య కైంకర్య ప్రాప్తిరేవ మోక్షః” (శ్రీమాన్ రామానుజః)

(కింకరునియొక్క భావము - సేవకుని యొక్క భావము కైంకర్యము - ఎల్లపుడు భగవంతుని సేవ చేయుట సిద్ధించుటయే మోక్షము).

  1. అవిద్యాస్తమయో మోక్షః - (అవిద్య - అనగా, అజ్ఞానము - నశించుటయే మోక్షము).

  2. అవిద్యా నివృత్తిరేవ మోక్షః - (అవిద్య నివృత్తి యగుటయే - అజ్ఞానము నశించుటయే మోక్షము).

“పైన 2, 3 లో చెప్పబడినదాని లక్షణాలకు తాత్పర్యం ఏలాగంటే - బహువాదాలవారున్నూ మతభేదాలవల్ల మోక్షవస్తువు అనిర్వచనీయ ధర్మం అభావమనిన్నీ,”ఏక వింశతి దుఃఖవిభేదలక్షణో మోక్షః” అనిన్నీ, “మృత్యురేవాపవర్గః” అనిన్నీ, సమగ్దర్శనమనిన్నీ బహు విధాల పలికేది క్రియా సాధ్యము. మఱికొందరు ఆత్మకు అజ్ఞానావరణం కద్దు అందురు. పరమాత్మయొక్క ఆనంద పరిపూర్ణపదాలకు అవిద్య ఆవరణమై యుండు నందురు - అందుచేత వారి మతంలో “అవిద్య్తాస్తమయో మోక్షః” అని అందురు.

“దేహేంద్రియాద్యావరణ విక్షేపాలకు విలక్షణమైన అతండు ముక్తుడందురు. విలక్షణమనగా తనకు ఆ గుణములు లేవనుట. అందు ఆవరణశక్తికి స్వరూపజ్ఞానోదయమందు పర్యవసానము - పర్యవసానమనగా విరగడ అనే అర్థము - విక్షేపశక్తి ప్రారబ్ధముతోడ పర్యవసానమనెడిది ఈషద్భేదం వల్ల” అవిద్యాస్తమయో మోక్షః” అందురు. నిరతిశయానంద నిత్య స్వయంప్రకాశ స్వతస్సిద్ధ పరమాద్వైత పరిపూర్ణమైన నిలుకడ యిప్పుడు మోక్షము ” - (బ్రహ్మవిద్యా సుధార్ణవము -3)

“అవిద్యా నివృత్తిరేవ మోక్షః” - సకల విశేష ప్రత్యనీక బ్రహ్మవిజ్ఞాన దేవ అవిద్యానివృత్తిః -

(నిర్విశేష, నిర్గుణ, నిరాకార పరబ్రహ్మజ్ఞానము వలననే అవిద్యా నివృత్తి కలుగును. అవిద్యా నివృత్తియే మోక్షము).

  1. “మోక్షో విషయ వైరస్యం” (అష్టావక్రగీత)

(విషయములయడల ఆసక్తి లేకుండుటే మోక్షము).

  1. “నిత్యానిత్య వస్తు విచారాత్ అనిత్య సంసార సుఖదుఃఖ విషయ సమస్త క్షేత్ర మమతా బంధక్షయో మోక్షః” ( నిరాలంబోపనిషత్)

(ఎల్లకాలములందుండునదేది, అట్లుండనిదేది అను విషయము గుఱించి విచారించుటవలన సంసారము దానివలన కలుగు సుఖదుఃఖములు, వాటికి విషయములగు శబ్ద స్పర్శ రూప రస గంధములు, వాటి ఆశ్రయములగు క్షేత్రములు మొదలగు వాటియందు మమకారము, అను బంధము క్షీణించి నశించుటయే మోక్షము. విషయములయడల కలుగు సంకల్పము నశించిన వాటికి కారణమైన వాసనలు నశించును - వాసనలు నశించుటయే మోక్షమని వేదాంతుల అభిప్రాయము).

  1. “సర్వప్ర పంచకారిణీ భూతాత్మజ్ఞానం తత్కార్య దృశ్యభూతం సర్వం ద్వైతంచ జనన మరణ ప్రబంధ రూపాఖిల దుఃఖ నిదానత్వాత్ మహానర్థః ఇతి శ్రుతి స్మృతి పురాణేతిహాసానుభవాది సకల ప్రమాణ సిద్ధం, ఈదృశానర్థ నివృత్తిః పరమానందావాప్తిశ్చ మోక్షః ఇత్యుచ్యతే”.

(సమస్త ప్రపంచమునకు కారణమైనట్టి ఆత్మ దాని కార్యమైనట్టి దృశ్యమైన ద్వైత ప్రపంచము జనన మరణ రూపమైనది, దుఃఖనిదానమైనది అగుటవలన మహా అనర్థము అని శ్రుతి స్మృతి, ఇతిహాసములు, పురాణములు వలనను సిద్దపడినది - సిద్ధాంతము చేయబడినది. ఇటువంటి అనర్థనివృత్తియే, పరమానంద ప్రాప్తియే మోక్షమని చెప్పబడినది.)

  1. “పూరమవస్థా త్రయ కలుషితః సంసారీ వాతిష్టమానోపి సర్వసంసారానర్థ వ్రాతాన్ముక్తిః పరితః ప్రద్యోతమాన పూర్ణానందాత్మనా అవతిష్టతే మహానయం విశేషః”.

(జాగ్రత్స్వప్న సుషుప్తియను మూడు అవస్థలు కలిగియుండి వాటిదోషములతో కూడిన సంసారివలె ప్రవర్తించుచున్నప్పటికీ సంసారమునకు సంబంధించిన అన్ని విధములగు అనర్థములనుండి విముక్తుడై పూర్ణానందమే లక్షణముగా గల పరమాత్మవలెనుండును - ఇదియే మోక్షము - ఇదియే విశేషము).

  1. మిథ్యాజ్ఞాన నిబర్హణమేవ మోక్షః - (మిథ్యాజ్ఞానము అంతరించుటయే మోక్షము).

  2. కర్తృత్వాద్యనర్థహేతో రధ్యాసస్య స మూల స్యాత్యంతిక వినాశో మోక్షః.

(కర్తృత్వము మొదలగు అనర్థములకు హేతువగు అధ్యాస దాని కారణముతోకూడ - వేళ్ళతో కూడ - పూర్తిగా నశించుటయే మోక్షము.)

  1. ఆత్యంతిక దుఃఖ నివృత్తిః పరమానంద ప్రాప్తిశ్చ మోక్షః ఇతి కథ్యతే.

(అత్యంత దుఃఖనివృత్తి, పరమానంద ప్రాప్తియే మోక్షము).

  1. “నిరతిశయానందావిర్భావో మోక్షః” ఇతి మోక్ష లక్షణం పాద త్రయే వర్తతే తస్మాత్ పాద త్రయం పరమ మోక్షః, పాద త్రయం పరమ వైకుంఠః, పాదత్రయం కైవల్యమితి.

(నిరతిశయమైన ఆనందము ఆవిర్భవించుటయే మోక్షము అని చెప్పబడియుండుటచేత మోక్షము పాదత్రయమందున్నది. పరబ్రహ్మయొక్క ఒక పాదము సృష్టి అంతయు - మిగిలిన మూడు పాదములు పరమ మోక్షము - అదియే పరమ వైకుంఠము - అదియే పరమ కైవల్యము - “పాదో(అ)స్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి” పరమాత్మకు సర్వభూతములు ఒకపాదము - మిగిలిన మూడులోకములు ద్యులోకమున నున్నవి. అవియే అమృతము - నాశము లేని మోక్షపదము - “తద్విష్ణోః పరమం పదం”).

  1. సుఖ దుఃఖా భావమే మోక్షమునకు స్వరూపము -

  2. అశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః |

మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మాన్ స ఏవ విమల క్రమః || (యోగవాశిష్టము - 3 - 8)

(వాసనలన్నింటినీ పరిత్యజించుట మోక్షమని చెప్పబడియున్నది).

  1. సాయుజ్యమేవ మోక్షః -

(విష్ణు సన్నిధి చేరి అతనితో సమానరూపులై అతని సన్నిధినే యుండుట - అతనితో కలిసిపోవుట).

  1. “అమృతత్వం పదం బ్రహ్మానందం మాయా వివర్జితం |

పురుషార్థం విమోక్షాఖ్యం ప్రాప్నువంతీహ తాదృశాః ||“. (గీతాభావప్రకాశము - 2 - 525)

(అమృతత్వమైన పదము - మరణములేని స్థానము - స్థితి, బ్రహ్మానందరూపమైనది, మాయ మొదలగునవి లేనిది చతుర్విధపురుషార్థములలో నాలుగవది అయిన మోక్షమను పేరు గలది మోక్షము).

  1. ధర్మార్థకామ మోక్షములనునవి చతుర్విధ పురుషార్థములు - వీటిలో ఆఖరుది - నాలుగవది మోక్షము - పురుషార్థములనగా పురుషుడు అర్థించి - ప్రయత్నించి - సాధించవలసినవి. మొదటిమూడును ఆఖరుదియగు మోక్షమును సాధించుటకే ఉపయోగించవలెను - మొదటిమూడును సాధించలేకపోయినను ఆఖరుదియగు మోక్షమును సాధించవలెను -

“సీ. అనఘా! యీ సంసారమతిసయంబున దరియింపంగ మదినిశ్చయించువాడు

గైకొని ధర్మార్థకామ మోక్షములకు నతి విఘాతుకమెద్ది, యట్టి దాని

వలన సంగము సేయవలవదా ధర్మాదులందు ద్రివర్గంబునం తకోగ్ర

భయకారి యగుటను పరమ మోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లునండ్రు – బుధులు

భువి గుణవ్యతికరమున బుట్టినట్టి

యబ్జజాతాదులకు నస్మదాదులకును

గాల విధ్వంసితాఖిల క్రమము గల్గు

గలుగదెన్నడు సేమంబు; గాన వినుము

మోక్షంబె పరమ పురుషార్థంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -)

  1. “క్రియా నాశాద్భవేచ్చింతా నాశో, (అ)స్మాద్వాసనాక్షయ వాసనా ప్రక్షయో మోక్షస్స జీవన్ముక్తిరిష్యతే ||”.

(అధ్యాత్మోపనిషత్)

(కర్మ నశించిన చింత నశించును, చింత నశించిన కర్మవాసనలు నశించును, వాసనలు నశించిన అదియే మోక్షము - అదియే జీవన్ముక్తియని చెప్పబడును).

  1. “చిత్సదానందా ద్వితీయబ్రహ్మ నాహం బ్రహ్మస్మీతి సమాధానం కృత్వాతేన ఈశ్వర సేవానాత్ అమృతత్వమేతి, యస్తు పూర్ణానంద బ్రహ్మరూపేణ ఆత్మానామవ గచ్ఛతి, సముచ్యతే”.

(సత్, చిత్, ఆనంద, అద్వితీయమైనవాడు బ్రహ్మ - నేను బ్రహ్మకాను అని సమాధానం చేసుకొని భగవంతుని సేవచేసిన అమృతత్వమును - మరణములేని స్థితిని - పొందును - ఎవడు పరబ్రహ్మ తననే పూర్ణానందబ్రహ్మము అని తెలుసుకొనునో వాడు ముక్తుడగును).

  1. స్వాతిరిక్త కలనా పహ్నవ సిద్ధ బ్రహ్మాత్మావస్థానం హి మోక్షః -

(తన స్వస్వరూపమునకు అతిరిక్తమైన ప్రపంచముచేత కప్పబడియుండు పరబ్రహ్మరూపముతోనుండుట - ఏ విధమైన ఉపాధియు లేకుండ కేవల బ్రహ్మ తత్వముగా నుండుటయే మోక్షము).

  1. “స్వస్వరూపస్థితి”.

(భగవంతునియొక్క యదార్థ స్వరూపము - జీవునియొక్క స్వస్వరూపము - తాను భగవంతుని అంశయే యని అనుభవమువలన తెలుసుకొని యట్లుండుట).

  1. “మోక్షతే అనేన ఇతి మోక్షః” (శ్రీమాన్ రామానుజః)

(విడుదల చేయునది - సంసారమునుండి విడుదల చేయునది. జన్మ లేకుండ చేయునది).

  1. “సంగత్యాగం విదుర్మోక్షం సంగత్యాగాద జన్మతా” (అన్నపూర్ణోపనిషత్)

(దేనితోను సంపర్కము లేకుండుటయే మోక్షము - అన్నింటితోను సంపర్కము వదలుకొనుటవలన జన్మ కలుగదు - అదియే మోక్షము).

  1. ఆనందాత్మక బ్రహ్మవాప్తిశ్చ మోక్షః, శోకనివృత్తిశ్చ -

(ఆనందరూపుడైన బ్రహ్మను పొందుటయే మోక్షము - శోకము లేకపోవుటమోక్షము).

  1. “అనవధి విభావం - అనవధిః నిస్సీమః విభవః ఐశ్వర్యం యస్మిన్ తథా భూతం, అనశ్వర సుఖాది సంపద్యుక్తం”.

(అంతులేని వైభవము - అవధి లేనిది, ఒడ్డు లేనిది, మితి లేనిది అయిన ఐశ్వర్యముండు చోటు, క్షీణింపని, నశింపని సౌఖ్య సంపదతో కూడియున్నది - మోక్షము).

  1. “యత్తు చంచలతా హీనం తన్మనో అమృతముచ్యతే” తదైవచ తపః శాస్త్ర సిద్ధాంతే మోక్ష ఉచ్యతే (మహోపనిషత్)

(మనస్సు చంచలముగా లేకుండుటయే - లక్ష్యముమీద నిశ్చలముగా, స్థిరముగా నుండుటయే అమృతత్వము - మరణము లేని స్థితి, మోక్షము - ఆ ప్రకారముగానే చేయు తపస్సు కూడా).

  1. “అశరీరం వావసంతం న ప్రియాప్రియౌ స్పృశతః” ఇతి శ్రుతిః -

(సుఖదుఃఖములు - ప్రియాప్రియములు మంచి చెడ్డలు - శరీరము లేనివానికి అంటవు. శరీరముండిన సుఖదుఃఖముల అనుభవము కలుగును. అందుచేత సుఖదుఃఖాభావరూపమగు మోక్షమునకు శరీరము లేకుండుటయే రూపము.సుఖదుఃఖా భావమే మోక్షము).

(1). జీవుడు అద్వితీయమగు సచ్చిదానందబ్రహ్మరూపము పొందియుండుట మోక్షము -;

(2) మోక్షమనగా స్వస్వరూప స్థితియే - జీవుడు అజ్ఞానముచేత తన స్వస్వరూపమును మఱచి తన స్వస్వరూపముకంటె వేరైనవాడు అని తలచును - ఇట్టి అజ్ఞానము తొలగిపోయి తన నిజతత్వమును తాను తెలుసుకొని స్వస్వరూపముతో నుండుటే మోక్షము –

(3) మోక్షమనగా విడుదల - బంధమునుండి విడుదల - జీవుడు ప్రకృతివలన కలుగు ఆవరణములనుండి విముక్తి పొంది, స్వస్వరూపముతో పరమాత్మతత్వముతో మిగిలియుండుట.

(4) జీవునకు జననమరణములు మొదలగువాటివల్ల కలుగు దుఃఖమంతయు నశించి వాస్తవమైన శాశ్వతమైన సుఖము కలుగుటయే మోక్షము.

  1. “న మోక్షో నభసః వృష్టే నపాతాళే నభూతలే |

సర్వాశాసంక్షయే చేతః క్షయో మోక్ష ఇతీష్యతే ||“.

- - - మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం ||“.

(మోక్షమనునది ఆకాశములో లేదు, పాతాళమందు లేదు, భూమిమీద లేదు - ఆశలన్నియు క్షీణించి మనస్సు సమ్యక్ జ్ఞానము కలిగియుండిన - అదియే మోక్షము).

  1. “మోక్షస్య నహి వాసోస్తి నగ్రామాంతరమేవవా |

అజ్ఞానహృదయగ్రంధినాశో మోక్ష ఇతి స్మృతిః||“.

(మోక్షమనుదానికి ఒక చోటు - నివాసస్థానము అని లేదు - వేరొక గ్రామములో నుండునదికాది. అజ్ఞానమను హృదయగ్రంధి విడుటయే - నశించుటయే మోక్షమని చెప్పబడినది).

  1. “సకల మతములందున్నూ ప్రతిపాదింపబడినమోక్షలక్షణం బెట్లన్నను - మరణమే మోక్షమందురు చార్వాకులు. అలౌకికాకాశమధ్య మందు గూడిన గగనమే మోక్షమందురు - జైనులు - సుఖ దుఃఖాదులు జెందకయుండు శుద్ధ బుద్ధి సంగతియే మోక్షమందురు బౌద్ధులు - ఆకాశగమనాది సిద్ధిప్రాప్తులే మోక్షమందురు కాళయామళులు. ఆనందప్రాప్తియే మోక్షమందురు శాక్తేయులు. వాసుదేవాత్మక ప్రకృతియందు స్వరూపహాని లేక యుండుటయే మోక్షమందురు పాంచరాత్రులు. ఇహపరాదులందు పుత్ర భార్యాదుల గూడి వ్యాధ్యాది దుఃఖముల బొరయకుండుటయే మోక్షమందురు లౌకికులు. స్వర్గాది పరప్రాప్తియే మోక్షమందురు పూర్వ మీమాన్సకులు. శరీరేంద్రియాదికంబును ఏకవింశతి దు విచ్ఛేదంబై ప్రాషాణ ప్రాయంబై యాత్మయుండుటయే మోక్షమందురు - న్యాయ వైశేషికులు - ప్రకృతి పురుష వివేకంబువలన అవిద్యానాశంబె మోక్షమందురు సాంఖ్యులు - యోగాభ్యాసబలంబువలన మనోలయద్వారంబున నజ్ఞానంబు చెడుటయే మోక్షమందురు పాతంజలులు - బ్రహ్మాత్మైకత్వ జ్ఞానంబువలన ఈశ్వ రత్వంబున కన్యంబై యాత్మజ్ఞప్తి మాత్రంబై యుండుటయే మోక్షమందురు పాశుపతులు. కర్తృత్వంబే సంసారంబగుటంజేసి వాటి తొలంగి జ్ఞప్తిమాత్రంబై యుండుటయే మోక్షమందురు కాపాలిక మహావ్రతులు - అత్మకు షడధ్వాతీత శివసమానత్వమే మోక్షమందురు శైవ సిద్ధాంతులు”.

  2. “యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ” (శ్రీమద్భగవద్గీత - 15 - 6)

(ఎచ్చటికి వెళ్ళి వెనుకకు మరలిరారో - ఎచ్చటికి వెళ్ళిన, ఏ లోకమునకు వెళ్ళిన - ఏ తత్వములో ఏకమైన, మరల జన్మించరో అదే పరమపదము, పరమధామము, పరబ్రహ్మపదము - పరబ్రహ్మతత్వము - వైకుంఠము - నాలోకము -” తద్విష్ణోః పరమం పదం“) మోక్షము - వైకుంఠమే వైకుంఠుడు - వైకుంఠుడే వైకుంఠము - రెండింటికి భేదములేదు - రెండూ ఒకటే). (చూడుము - ముక్తి).

Transliteration
  1. “nitya kaiṃkarya prāptirēva mōkṣaḥ” (śrīmān rāmānujaḥ)

(kiṃkaruniyokka bhāvamu - sēvakuni yokka bhāvamu kaiṃkaryamu - ellapuḍu bhagavaṃtuni sēva cēyuṭa siddhiṃcuṭayē mōkṣamu).

  1. avidyāstamayō mōkṣaḥ - (avidya - anagā, ajñānamu - naśiṃcuṭayē mōkṣamu).

  2. avidyā nivṛttirēva mōkṣaḥ - (avidya nivṛtti yaguṭayē - ajñānamu naśiṃcuṭayē mōkṣamu).

“paina 2, 3 lō ceppabaḍinadāni lakṣaṇālaku tātparyaṃ ēlāgaṃṭē - bahuvādālavārunnū matabhēdālavalla mōkṣavastuvu anirvacanīya dharmaṃ abhāvamaninnī,”ēka viṃśati duḥkhavibhēdalakṣaṇō mōkṣaḥ” aninnī, “mṛtyurēvāpavargaḥ” aninnī, samagdarśanamaninnī bahu vidhāla palikēdi kriyā sādhyamu. maṟikoṃdaru ātmaku ajñānāvaraṇaṃ kaddu aṃduru. paramātmayokka ānaṃda paripūrṇapadālaku avidya āvaraṇamai yuṃḍu naṃduru - aṃducēta vāri mataṃlō “avidytāstamayō mōkṣaḥ” ani aṃduru.

“dēhēṃdriyādyāvaraṇa vikṣēpālaku vilakṣaṇamaina ataṃḍu muktuḍaṃduru. vilakṣaṇamanagā tanaku ā guṇamulu lēvanuṭa. aṃdu āvaraṇaśaktiki svarūpajñānōdayamaṃdu paryavasānamu - paryavasānamanagā viragaḍa anē arthamu - vikṣēpaśakti prārabdhamutōḍa paryavasānamaneḍidi īṣadbhēdaṃ valla” avidyāstamayō mōkṣaḥ” aṃduru. niratiśayānaṃda nitya svayaṃprakāśa svatassiddha paramādvaita paripūrṇamaina nilukaḍa yippuḍu mōkṣamu ” - (brahmavidyā sudhārṇavamu -3)

“avidyā nivṛttirēva mōkṣaḥ” - sakala viśēṣa pratyanīka brahmavijñāna dēva avidyānivṛttiḥ -

(nirviśēṣa, nirguṇa, nirākāra parabrahmajñānamu valananē avidyā nivṛtti kalugunu. avidyā nivṛttiyē mōkṣamu).

  1. “mōkṣō viṣaya vairasyaṃ” (aṣṭāvakragīta)

(viṣayamulayaḍala āsakti lēkuṃḍuṭē mōkṣamu).

  1. “nityānitya vastu vicārāt anitya saṃsāra sukhaduḥkha viṣaya samasta kṣētra mamatā baṃdhakṣayō mōkṣaḥ” ( nirālaṃbōpaniṣat)

(ellakālamulaṃduṃḍunadēdi, aṭluṃḍanidēdi anu viṣayamu guṟiṃci vicāriṃcuṭavalana saṃsāramu dānivalana kalugu sukhaduḥkhamulu, vāṭiki viṣayamulagu śabda sparśa rūpa rasa gaṃdhamulu, vāṭi āśrayamulagu kṣētramulu modalagu vāṭiyaṃdu mamakāramu, anu baṃdhamu kṣīṇiṃci naśiṃcuṭayē mōkṣamu. viṣayamulayaḍala kalugu saṃkalpamu naśiṃcina vāṭiki kāraṇamaina vāsanalu naśiṃcunu - vāsanalu naśiṃcuṭayē mōkṣamani vēdāṃtula abhiprāyamu).

  1. “sarvapra paṃcakāriṇī bhūtātmajñānaṃ tatkārya dṛśyabhūtaṃ sarvaṃ dvaitaṃca janana maraṇa prabaṃdha rūpākhila duḥkha nidānatvāt mahānarthaḥ iti śruti smṛti purāṇētihāsānubhavādi sakala pramāṇa siddhaṃ, īdṛśānartha nivṛttiḥ paramānaṃdāvāptiśca mōkṣaḥ ityucyatē”.

(samasta prapaṃcamunaku kāraṇamainaṭṭi ātma dāni kāryamainaṭṭi dṛśyamaina dvaita prapaṃcamu janana maraṇa rūpamainadi, duḥkhanidānamainadi aguṭavalana mahā anarthamu ani śruti smṛti, itihāsamulu, purāṇamulu valananu siddapaḍinadi - siddhāṃtamu cēyabaḍinadi. iṭuvaṃṭi anarthanivṛttiyē, paramānaṃda prāptiyē mōkṣamani ceppabaḍinadi.)

  1. “pūramavasthā traya kaluṣitaḥ saṃsārī vātiṣṭamānōpi sarvasaṃsārānartha vrātānmuktiḥ paritaḥ pradyōtamāna pūrṇānaṃdātmanā avatiṣṭatē mahānayaṃ viśēṣaḥ”.

(jāgratsvapna suṣuptiyanu mūḍu avasthalu kaligiyuṃḍi vāṭidōṣamulatō kūḍina saṃsārivale pravartiṃcucunnappaṭikī saṃsāramunaku saṃbaṃdhiṃcina anni vidhamulagu anarthamulanuṃḍi vimuktuḍai pūrṇānaṃdamē lakṣaṇamugā gala paramātmavalenuṃḍunu - idiyē mōkṣamu - idiyē viśēṣamu).

  1. mithyājñāna nibarhaṇamēva mōkṣaḥ - (mithyājñānamu aṃtariṃcuṭayē mōkṣamu).

  2. kartṛtvādyanarthahētō radhyāsasya sa mūla syātyaṃtika vināśō mōkṣaḥ.

(kartṛtvamu modalagu anarthamulaku hētuvagu adhyāsa dāni kāraṇamutōkūḍa - vēḷḷatō kūḍa - pūrtigā naśiṃcuṭayē mōkṣamu.)

  1. ātyaṃtika duḥkha nivṛttiḥ paramānaṃda prāptiśca mōkṣaḥ iti kathyatē.

(atyaṃta duḥkhanivṛtti, paramānaṃda prāptiyē mōkṣamu).

  1. “niratiśayānaṃdāvirbhāvō mōkṣaḥ” iti mōkṣa lakṣaṇaṃ pāda trayē vartatē tasmāt pāda trayaṃ parama mōkṣaḥ, pāda trayaṃ parama vaikuṃṭhaḥ, pādatrayaṃ kaivalyamiti.

(niratiśayamaina ānaṃdamu āvirbhaviṃcuṭayē mōkṣamu ani ceppabaḍiyuṃḍuṭacēta mōkṣamu pādatrayamaṃdunnadi. parabrahmayokka oka pādamu sṛṣṭi aṃtayu - migilina mūḍu pādamulu parama mōkṣamu - adiyē parama vaikuṃṭhamu - adiyē parama kaivalyamu - “pādō(a)sya sarvabhūtāni tripādasyāmṛtaṃ divi” paramātmaku sarvabhūtamulu okapādamu - migilina mūḍulōkamulu dyulōkamuna nunnavi. aviyē amṛtamu - nāśamu lēni mōkṣapadamu - “tadviṣṇōḥ paramaṃ padaṃ”).

  1. sukha duḥkhā bhāvamē mōkṣamunaku svarūpamu -

  2. aśēṣēṇa parityāgō vāsanānāṃ ya uttamaḥ |

mōkṣa ityucyatē brahmān sa ēva vimala kramaḥ || (yōgavāśiṣṭamu - 3 - 8)

(vāsanalanniṃṭinī parityajiṃcuṭa mōkṣamani ceppabaḍiyunnadi).

  1. sāyujyamēva mōkṣaḥ -

(viṣṇu sannidhi cēri atanitō samānarūpulai atani sannidhinē yuṃḍuṭa - atanitō kalisipōvuṭa).

  1. “amṛtatvaṃ padaṃ brahmānaṃdaṃ māyā vivarjitaṃ |

puruṣārthaṃ vimōkṣākhyaṃ prāpnuvaṃtīha tādṛśāḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 525)

(amṛtatvamaina padamu - maraṇamulēni sthānamu - sthiti, brahmānaṃdarūpamainadi, māya modalagunavi lēnidi caturvidhapuruṣārthamulalō nālugavadi ayina mōkṣamanu pēru galadi mōkṣamu).

  1. dharmārthakāma mōkṣamulanunavi caturvidha puruṣārthamulu - vīṭilō ākharudi - nālugavadi mōkṣamu - puruṣārthamulanagā puruṣuḍu arthiṃci - prayatniṃci - sādhiṃcavalasinavi. modaṭimūḍunu ākharudiyagu mōkṣamunu sādhiṃcuṭakē upayōgiṃcavalenu - modaṭimūḍunu sādhiṃcalēkapōyinanu ākharudiyagu mōkṣamunu sādhiṃcavalenu -

“sī. anaghā! yī saṃsāramatisayaṃbuna dariyiṃpaṃga madiniścayiṃcuvāḍu

gaikoni dharmārthakāma mōkṣamulaku nati vighātukameddi, yaṭṭi dāni

valana saṃgamu sēyavalavadā dharmādulaṃdu drivargaṃbunaṃ takōgra

bhayakāri yaguṭanu parama mōkṣaṃbe mukhyārthamai vilasillunaṃḍru – budhulu

bhuvi guṇavyatikaramuna buṭṭinaṭṭi

yabjajātādulaku nasmadādulakunu

gāla vidhvaṃsitākhila kramamu galgu

galugadennaḍu sēmaṃbu; gāna vinumu

mōkṣaṃbe parama puruṣārthaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 -)

  1. “kriyā nāśādbhavēcciṃtā nāśō, (a)smādvāsanākṣaya vāsanā prakṣayō mōkṣassa jīvanmuktiriṣyatē ||”.

(adhyātmōpaniṣat)

(karma naśiṃcina ciṃta naśiṃcunu, ciṃta naśiṃcina karmavāsanalu naśiṃcunu, vāsanalu naśiṃcina adiyē mōkṣamu - adiyē jīvanmuktiyani ceppabaḍunu).

  1. “citsadānaṃdā dvitīyabrahma nāhaṃ brahmasmīti samādhānaṃ kṛtvātēna īśvara sēvānāt amṛtatvamēti, yastu pūrṇānaṃda brahmarūpēṇa ātmānāmava gacchati, samucyatē”.

(sat, cit, ānaṃda, advitīyamainavāḍu brahma - nēnu brahmakānu ani samādhānaṃ cēsukoni bhagavaṃtuni sēvacēsina amṛtatvamunu - maraṇamulēni sthitini - poṃdunu - evaḍu parabrahma tananē pūrṇānaṃdabrahmamu ani telusukonunō vāḍu muktuḍagunu).

  1. svātirikta kalanā pahnava siddha brahmātmāvasthānaṃ hi mōkṣaḥ -

(tana svasvarūpamunaku atiriktamaina prapaṃcamucēta kappabaḍiyuṃḍu parabrahmarūpamutōnuṃḍuṭa - ē vidhamaina upādhiyu lēkuṃḍa kēvala brahma tatvamugā nuṃḍuṭayē mōkṣamu).

  1. “svasvarūpasthiti”.

(bhagavaṃtuniyokka yadārtha svarūpamu - jīvuniyokka svasvarūpamu - tānu bhagavaṃtuni aṃśayē yani anubhavamuvalana telusukoni yaṭluṃḍuṭa).

  1. “mōkṣatē anēna iti mōkṣaḥ” (śrīmān rāmānujaḥ)

(viḍudala cēyunadi - saṃsāramunuṃḍi viḍudala cēyunadi. janma lēkuṃḍa cēyunadi).

  1. “saṃgatyāgaṃ vidurmōkṣaṃ saṃgatyāgāda janmatā” (annapūrṇōpaniṣat)

(dēnitōnu saṃparkamu lēkuṃḍuṭayē mōkṣamu - anniṃṭitōnu saṃparkamu vadalukonuṭavalana janma kalugadu - adiyē mōkṣamu).

  1. ānaṃdātmaka brahmavāptiśca mōkṣaḥ, śōkanivṛttiśca -

(ānaṃdarūpuḍaina brahmanu poṃduṭayē mōkṣamu - śōkamu lēkapōvuṭamōkṣamu).

  1. “anavadhi vibhāvaṃ - anavadhiḥ nissīmaḥ vibhavaḥ aiśvaryaṃ yasmin tathā bhūtaṃ, anaśvara sukhādi saṃpadyuktaṃ”.

(aṃtulēni vaibhavamu - avadhi lēnidi, oḍḍu lēnidi, miti lēnidi ayina aiśvaryamuṃḍu cōṭu, kṣīṇiṃpani, naśiṃpani saukhya saṃpadatō kūḍiyunnadi - mōkṣamu).

  1. “yattu caṃcalatā hīnaṃ tanmanō amṛtamucyatē” tadaivaca tapaḥ śāstra siddhāṃtē mōkṣa ucyatē (mahōpaniṣat)

(manassu caṃcalamugā lēkuṃḍuṭayē - lakṣyamumīda niścalamugā, sthiramugā nuṃḍuṭayē amṛtatvamu - maraṇamu lēni sthiti, mōkṣamu - ā prakāramugānē cēyu tapassu kūḍā).

  1. “aśarīraṃ vāvasaṃtaṃ na priyāpriyau spṛśataḥ” iti śrutiḥ -

(sukhaduḥkhamulu - priyāpriyamulu maṃci ceḍḍalu - śarīramu lēnivāniki aṃṭavu. śarīramuṃḍina sukhaduḥkhamula anubhavamu kalugunu. aṃducēta sukhaduḥkhābhāvarūpamagu mōkṣamunaku śarīramu lēkuṃḍuṭayē rūpamu.sukhaduḥkhā bhāvamē mōkṣamu).

(1). jīvuḍu advitīyamagu saccidānaṃdabrahmarūpamu poṃdiyuṃḍuṭa mōkṣamu -;

(2) mōkṣamanagā svasvarūpa sthitiyē - jīvuḍu ajñānamucēta tana svasvarūpamunu maṟaci tana svasvarūpamukaṃṭe vērainavāḍu ani talacunu - iṭṭi ajñānamu tolagipōyi tana nijatatvamunu tānu telusukoni svasvarūpamutō nuṃḍuṭē mōkṣamu –

(3) mōkṣamanagā viḍudala - baṃdhamunuṃḍi viḍudala - jīvuḍu prakṛtivalana kalugu āvaraṇamulanuṃḍi vimukti poṃdi, svasvarūpamutō paramātmatatvamutō migiliyuṃḍuṭa.

(4) jīvunaku jananamaraṇamulu modalaguvāṭivalla kalugu duḥkhamaṃtayu naśiṃci vāstavamaina śāśvatamaina sukhamu kaluguṭayē mōkṣamu.

  1. “na mōkṣō nabhasaḥ vṛṣṭē napātāḷē nabhūtalē |

sarvāśāsaṃkṣayē cētaḥ kṣayō mōkṣa itīṣyatē ||“.

- - - mōkṣōhi cētō vimalaṃ samyak jñāna vibōdhitaṃ ||“.

(mōkṣamanunadi ākāśamulō lēdu, pātāḷamaṃdu lēdu, bhūmimīda lēdu - āśalanniyu kṣīṇiṃci manassu samyak jñānamu kaligiyuṃḍina - adiyē mōkṣamu).

  1. “mōkṣasya nahi vāsōsti nagrāmāṃtaramēvavā |

ajñānahṛdayagraṃdhināśō mōkṣa iti smṛtiḥ||“.

(mōkṣamanudāniki oka cōṭu - nivāsasthānamu ani lēdu - vēroka grāmamulō nuṃḍunadikādi. ajñānamanu hṛdayagraṃdhi viḍuṭayē - naśiṃcuṭayē mōkṣamani ceppabaḍinadi).

  1. “sakala matamulaṃdunnū pratipādiṃpabaḍinamōkṣalakṣaṇaṃ beṭlannanu - maraṇamē mōkṣamaṃduru cārvākulu. alaukikākāśamadhya maṃdu gūḍina gaganamē mōkṣamaṃduru - jainulu - sukha duḥkhādulu jeṃdakayuṃḍu śuddha buddhi saṃgatiyē mōkṣamaṃduru bauddhulu - ākāśagamanādi siddhiprāptulē mōkṣamaṃduru kāḷayāmaḷulu. ānaṃdaprāptiyē mōkṣamaṃduru śāktēyulu. vāsudēvātmaka prakṛtiyaṃdu svarūpahāni lēka yuṃḍuṭayē mōkṣamaṃduru pāṃcarātrulu. ihaparādulaṃdu putra bhāryādula gūḍi vyādhyādi duḥkhamula borayakuṃḍuṭayē mōkṣamaṃduru laukikulu. svargādi paraprāptiyē mōkṣamaṃduru pūrva mīmānsakulu. śarīrēṃdriyādikaṃbunu ēkaviṃśati du vicchēdaṃbai prāṣāṇa prāyaṃbai yātmayuṃḍuṭayē mōkṣamaṃduru - nyāya vaiśēṣikulu - prakṛti puruṣa vivēkaṃbuvalana avidyānāśaṃbe mōkṣamaṃduru sāṃkhyulu - yōgābhyāsabalaṃbuvalana manōlayadvāraṃbuna najñānaṃbu ceḍuṭayē mōkṣamaṃduru pātaṃjalulu - brahmātmaikatva jñānaṃbuvalana īśva ratvaṃbuna kanyaṃbai yātmajñapti mātraṃbai yuṃḍuṭayē mōkṣamaṃduru pāśupatulu. kartṛtvaṃbē saṃsāraṃbaguṭaṃjēsi vāṭi tolaṃgi jñaptimātraṃbai yuṃḍuṭayē mōkṣamaṃduru kāpālika mahāvratulu - atmaku ṣaḍadhvātīta śivasamānatvamē mōkṣamaṃduru śaiva siddhāṃtulu”.

  2. “yadgatvā na nivartaṃtē taddhāma paramaṃ mama” (śrīmadbhagavadgīta - 15 - 6)

(eccaṭiki veḷḷi venukaku maralirārō - eccaṭiki veḷḷina, ē lōkamunaku veḷḷina - ē tatvamulō ēkamaina, marala janmiṃcarō adē paramapadamu, paramadhāmamu, parabrahmapadamu - parabrahmatatvamu - vaikuṃṭhamu - nālōkamu -” tadviṣṇōḥ paramaṃ padaṃ”) mōkṣamu - vaikuṃṭhamē vaikuṃṭhuḍu - vaikuṃṭhuḍē vaikuṃṭhamu - reṃḍiṃṭiki bhēdamulēdu - reṃḍū okaṭē). (cūḍumu - mukti).

English

1. "Liberation is nothing but the attainment of eternal service" (Śrīmān Rāmānuja) — kaiṅkarya is the state of a servant; mokṣa is nothing other than the accomplishment of ceaseless service to the Lord.

2. Avidyāstamayo mokṣaḥ — the setting, the extinguishing, of avidyā (ignorance) is itself mokṣa.

3. Avidyā nivṛttireva mokṣaḥ — the cessation of avidyā is itself mokṣa. The purport of these two definitions is this: because schools differ, mokṣa itself is described in many ways — some call it an indefinable absence of quality in the object of liberation, some call it "liberation marked by the twenty-one distinctions of sorrow," others say "death alone is liberation," still others call it complete insight. Some hold that the Self is covered by a veil of ignorance which conceals the fullness of the Supreme Self's bliss — hence their view that "the setting of ignorance is mokṣa." One free from the veiling and projecting powers of body and senses is called liberated; the veiling power culminates in the dawning of true self-knowledge, while the projecting power resolves along with one's remaining past karma — through this distinction it is said, "the setting of ignorance is mokṣa." That abiding state of unsurpassed, eternal, self-luminous, fully non-dual bliss is mokṣa (Brahmavidyā Sudhārṇavamu 3). And: the cessation of avidyā comes only through knowledge of the qualityless, formless Supreme Brahman — that cessation is mokṣa.

4. "Mokṣa is dispassion toward sense-objects" (Aṣṭāvakragītā).

5. Through inquiry into what is eternal and what is not, the bond of attachment — to worldly existence, its pleasures and pains, the sense-objects connected with them, and the bodies that host them — wastes away: that is mokṣa (Nirālambopaniṣad). When desire for sense-objects perishes, the latent impressions (vāsanās) causing it perish too — the Vedāntins hold that the destruction of these impressions is itself mokṣa.

Since the Self, cause of the whole manifest world, and its effect — this visible world of duality, taking the form of birth and death — is established by scripture, tradition, epic, purāṇa, and direct experience alike to be a great calamity, the very source of all sorrow, the cessation of that calamity together with the attainment of supreme bliss is what is called mokṣa.

6. Though one continues to behave outwardly like a worldly person tainted by the three states — waking, dream, and deep sleep — he abides, freed from every calamity of worldly existence, radiant on every side, of the very nature of full and complete bliss, as the Supreme Self himself. This is mokṣa, and this is the crucial distinction.

7. Mithyājñāna nibarhaṇameva mokṣaḥ — the utter extinguishing of false knowledge is itself mokṣa.

8. The complete destruction, root and all, of the superimposition (adhyāsa) that causes agency and its attendant calamities — that is mokṣa.

9. The utter cessation of sorrow together with the attainment of supreme bliss is called mokṣa.

10. Since mokṣa is defined as "the manifestation of unsurpassed bliss," and this applies to the remaining three-quarters of the Supreme Brahman, those three-quarters are supreme mokṣa, supreme Vaikuṇṭha, and kaivalya alike. One quarter of the Supreme Self is all beings; the remaining three quarters, imperishable, abide in the heavenly realm — "that is the supreme abode of Viṣṇu."

11. The absence of both pleasure and pain is the very nature of mokṣa.

12. "The complete relinquishing of every latent impression — this alone, O Brahman, is called mokṣa; this alone is the flawless path" (Yogavāśiṣṭha 3.8).

13. Sāyujya itself is mokṣa — reaching Viṣṇu's presence, becoming of one form with him, abiding there always, merged into him.

14. "Such souls attain, here, that state called vimokṣa — the deathless station, of the nature of Brahman's bliss, free of māyā" (Gītābhāvaprakāśamu 2.525) — the fourth of the fourfold aims of human life.

15. Dharma, artha, kāma, and mokṣa are the four aims of human life; mokṣa is the last. The first three should be pursued only as means toward the fourth; even if they cannot all be achieved, mokṣa, the last, must be attained. "O sinless one — whoever resolves to cross this ocean of worldly existence must give up whatever most obstructs dharma, artha, kāma, and mokṣa; the wise say mokṣa alone shines forth as the true aim, since all things born of this world's flux — from Brahmā down to us — are subject to time's destruction and never find lasting peace. Mokṣa alone is the supreme aim of human life" (Śrīmadāndhra Mahābhāgavatamu 4).

16. "When action perishes, anxious thought perishes; when thought perishes, the impressions born of action perish; when these perish — that is mokṣa, and that is jīvanmukti, liberation while yet living" (Adhyātmopaniṣad).

17. Having resolved firmly, "I am not Brahman — the One without a second, of the nature of being, consciousness, and bliss," and having thereupon served the Lord, one attains the deathless state; but whoever comes to know the Self itself as the very form of Brahman's fullness of bliss is liberated.

18. Abiding as the very form of the Supreme Brahman — without any limiting adjunct whatsoever — is mokṣa.

19. "Svasvarūpasthiti" — coming to know, through direct realization, one's own true nature as the soul, none other than a portion of God, and abiding as such.

20. "That by which one is set free" (Śrīmān Rāmānuja) — that which releases one from worldly existence and ends further birth: hence, mokṣa.

21. "They call it mokṣa, the relinquishing of all contact; through relinquishing all contact, one is no longer born" (Annapūrṇopaniṣad).

22. Attaining Brahman, of the very nature of bliss, is mokṣa; and freedom from sorrow is mokṣa.

23. A state possessed of boundless, limitless majesty, endowed with imperishable wealth of happiness — this is mokṣa.

24. A mind free of restlessness, steady upon its goal, is called amṛta, the deathless state — and it is precisely this that scripture and austerity, in their settled conclusion, call mokṣa (Mahopaniṣad).

25. "Pleasure and pain do not touch one who is without a body," says scripture — only one who has a body experiences them. Hence bodilessness, the absence of pleasure and pain, is the true form of mokṣa.

26. (1) Mokṣa is the soul's attainment of the form of Brahman — being, consciousness, and bliss without a second. (2) Mokṣa is simply abiding as one's own true nature, once the ignorance that made the soul forget it and imagine itself otherwise is dispelled. (3) Mokṣa is release from bondage — the soul, freed from the veils cast by Prakṛti, remains established in its own true nature, in the nature of the Supreme Self. (4) The complete cessation of all sorrow that comes through birth and death, together with the arising of real, everlasting happiness, is mokṣa.

27. Mokṣa is not found in the sky, the netherworld, or upon the earth; it is when all desire has utterly waned and the mind itself dissolves. Mokṣa is nothing but the mind made pure, awakened by right knowledge.

28. Mokṣa has no fixed abode, no dwelling elsewhere; it is the severing of the knot of ignorance lodged in the heart.

29. How mokṣa is defined across the schools: the Cārvākas say death itself is mokṣa. The Jainas say it is merging into the transcendent ether beyond the sky. The Buddhists say it is a purified intellect untouched by pleasure and pain. The Kālāmukhas say it is the attainment of powers such as flight through the sky. The Śāktas say it is simply the attainment of bliss. The Pāñcarātrins say it is remaining, without loss of one's own nature, within Vāsudeva-natured Prakṛti. Ordinary people say it is living happily, here and beyond, with family, free of disease. The Pūrva Mīmāṃsakas say it is attaining heaven. The Naiyāyikas and Vaiśeṣikas say it is the state in which body, senses, and the twenty-one kinds of sorrow are entirely severed and the soul remains inert, like a stone. The Sāṅkhyas say it is the destruction of avidyā through discriminating Prakṛti from Puruṣa. The followers of Patañjali say it is the destruction of ignorance through the dissolution of mind in yoga. The Pāśupatas say it is abiding as pure consciousness alone through knowledge of the oneness of Brahman and the Self. The Kāpālika Mahāvratins say that since agency itself constitutes worldly existence, mokṣa is casting agency aside to abide as pure consciousness. The Śaiva Siddhāntins say it is the soul's equality with Śiva, beyond the six paths.

30. "That place, having gone to which none return, is My supreme abode" (Bhagavad Gītā 15.6) — whatever world one reaches, whatever principle one becomes one with, beyond which there is no further birth, is the supreme station — Vaikuṇṭha, mokṣa. Vaikuṇṭha is the Lord of Vaikuṇṭha himself, and the Lord is Vaikuṇṭha itself — there is no difference between the two. (See: mukti.)