కేషాంచిత్ ఊర్థ్వ రేతస్వా శ్రమేషు యధోక్త ధరానుష్టవతాం సూర్యోవలక్షితేన అర్చిరాది మార్గేణ బ్రహ్మలోకం గత్వా బ్రహ్మ సమీపే అవస్థానం సామీప్య రూపా ముక్తిః –
కేషాంచిత్ ప్రతిమాదిషు విష్ణ్వాది దేవతానామివ నామాది ప్రతీకేషు దేవతోపాసకానాం సాలోక్యరూపా ముక్తిః
అంతరేణైవ ప్రతీకం స్వాత్మానః పృథక్త్వేన వివిదైశ్వర్య విశేష విశిష్టతయా దేవతోపాసకానాం కేషాంచిత్ సార్షితో సమా నార్థతా సారూప్యం.
సగుణ దేవతా రూపమహం గ్రహణోపాస నానాం ఉపాస్యదేవతా తాదాత్మ్యం సాయుజ్యం
“యాతు జ్ఞానఫల భూతా నిత్య నిరతిశయానందాభి వ్యక్త లక్షణాసా నిర్గుణ సాయుజ్యరూపా పంచమీ ముక్తిః”
(ముక్తి అయిదు విధములుగా నున్నది - సామీప్యముక్తి, సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సగుణసాయుజ్యముక్తి, నిర్గుణసాయుజ్యముక్తి –
(1) కొందఱు ఊర్థ్వరేతస్కులు వారి ఆశ్రమములకు నిర్ణయించబడిన అనుష్ఠానముచేసి అర్చిరాది మార్గముద్వారా చతుర్ముఖబ్రహ్మలోకమునకు వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మ సమీపమందుండుట సామీప్యముక్తి
(2). విష్ణువు మొదలగు దేవ తలగుఱించి వలెను కొన్ని ప్రతిమలందు దేవతా భావమునుంచి ఉపాసన చేయువారికి సాలోక్యముక్తి
(3) ఆత్మస్వరూపముకంటె ప్రతీకము వేరైనది యని భావించి ఉపాసించువారికి సారూప్యముక్తి
(4) సగుణదేవతారూపమైన అహం గ్రహోపాసకులకు వారు వారుపాసించు దేవతలతో తాదాత్మ్యమును పొందుట సాయుజ్య ముక్తి.
(5) జ్ఞానఫలభూతమై నిత్యనిరతియానందాభివ్యక్తి లక్షణముగల నిర్గుణ సాయుజ్యముక్తి).
“బహుధా శ్రూయతే ముక్తిర్వేదాంతేషు విలక్షణ |
ఏకా సాలోక్య రూపోక్తా, ద్వితీయా కమలేక్షణ |
సామీప్యరూప్యా సారూప్యా తృతీయా పురుషోత్తమ |
అన్యా సాయుజ్య రూపోక్తా సుఖదుఃఖ వివర్జితా |
సర్వ ద్వంద్వ వినిర్ముక్తా సత్య విజ్ఞానరూపిణీ |
కేవలం బ్రహ్మరూపోక్తా సర్వదా సుఖలక్షణా |
నహేయా నాప్యుపాదేయా సర్వ సంబంధేవర్జితా |
సర్వావరణ నిర్ముక్తా నవిజ్ఞేయా నిరాశ్రయా |
వాచ్య వాచక నిర్ముక్తా లక్ష్య లక్షణ వర్జితా |
సర్వేషాం ప్రాణినాం సాక్షాదాత్మ భూతా స్వయంప్రభా |
ప్రతిబంధ వినుర్ముక్తా సర్వదా పరమార్థతః |
అవిచార దశాయాం తు ప్రతి బద్ధా స్వమాయయా |
ఏషైవ పరమా ముక్తిః ప్రోక్తా వేదాంత వేదిభిః |
అన్యాశ్చ ముక్తయస్సర్వా అపరాః పరికీర్తితాః |
జన్మ నాశాభి భూతాశ్చ తారతమ్యేన సంస్థితాః |
స్పర్థ యోపహృతా నిత్యం పరతంత్రాచ సర్వదా |
సుఖోత్తరా (అ)విశేష్టా దుఃఖమిశ్రాశ్చ సర్వదా |
ఏతాశ్చి ముక్తయో(అ)న్యేషాం కేషాంచి దధికారిణాం ||“. (సూతసంహిత)
(ఉపనిషత్తులలో ముక్తి అనేక విధములుగా చెప్పబడినది - సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుజ్యముక్తి. సాయుజ్యముక్తి సుఖదుఃఖములు లేనిది, షడ్భావవికారములు లేనిది, శుభా శుభములు, ద్వంద్వములు లేనిది, సత్య విజ్ఞాన రూపమైనది, కేవలము బ్రహ్మరూపమే అయినది, ఎల్లపుడు సుఖమే లక్షణముగా గలది, హేయము ఉపాదేయము లేనిది, ఏ విధమైన సంబంధము లేనిది, కనబడనిది, వినబడనిది, తర్కించుటకు వీలుకానిది, ఏ విధమైన ఆవరణము లేనిది, తెలియబడనిది, ఆశ్రయములేనిది, వాచ్య వాచకములుగాని, లక్ష్య లక్షణములు గాని లేనిది, సమస్త ప్రాణులకు ఆత్మ అయినది, స్వయముగా ప్రకాశించునది, పరమార్థ దృష్టిలో ఏ విధమైన ప్రతిబంధము లేనిది. కాని. అజ్ఞానదశలో తన మాయచేతనే బంధించబడి యుండునది - ఇదియే - ఇట్టిదియే పరమ ముక్తియని వేదాంతమును (ఉపనిషత్సారమును) తెలిసినవారు చెప్పుదురు. మిగిలిన ముక్తులన్నియు అపరముక్తులని చెప్ప బడినవి, జననమరణములు
కలవి, తారతమ్యము కలవి, స్పర్థతోకూడియున్నవి, పరతంత్రమైనవి, ఆఖరున సుఖము కలుగచేయునవి, దుఃఖముతో మిశ్రమమై (కలిసి) యుండునవి. ఈ ముక్తులు కొందఱు అధికారులకు కలుగును).
సద్యోముక్తి ప్రదశ్చైకః క్రమముక్తి ప్రదః పరః |
శుకశ్చ వామదేవశ్చ ద్వౌ సృతీ దేవ నిర్మితౌ |
శుకో విహంగమః ప్రోక్తో వామదేవః విపీలికా ||” (వరాహోపనిషత్)
మంగళకరమైన బ్రహ్మప్రాప్తిని చేకూర్చునవి రెండు మార్గములు - సద్యోముక్తిమార్గము (అప్పటికప్పుడు) ముక్తినిచ్చునది; క్రమముక్తి నిచ్చునది రెండవది. ఒకటి శుకమార్గము, రెండవది వామదేవమార్గము - శుకమనగా పక్షి, వామదేవుడు అనగా పిపీలికము (చీమ).
“శుకో ముక్తో, వామదేవోపి ముక్తః” ఇతి శ్రుతిః. శుకో విహంగమ మార్గా నుసారీ సద్యో ముక్తో భవతి. వామదేవః పిపీలికా మార్గానుసారీ క్రమముక్తో భవతి. తాభ్యాం తౌమార్గావతిక్రమ్య నహికేపి ముక్తి భాజః సంతి జ్ఞన సాధన ప్రవృత్తిః ఫలవతీ భవతి“.
(శుకము ముక్తిని పొందెను, వామదేవుడుకూడా ముక్తిని పొందెను అని శ్రుతి చెప్పుచున్నది. ఈ రెండుమార్గముల ద్వారా వెళ్ళినవారు ముక్తిని పొందుదురు - శుకము - విహంగము (పక్షి) - ఈ మార్గముననసరించిన అప్పటికప్పుడే ముక్తుడగును. (సద్యోముక్తుడగును). వామదేవుడు – పిపీలికమార్గము ననుసరించినవాడు క్రమముక్తుడగును - ఇద్దరకు ఈ రెండుమార్గములు తప్ప వేరు మార్గములు లేవు. జ్ఞానసాధనము ఫలవంతమగును. శుకయోగము జ్ఞానయోగము, వామదేవమార్గము కర్మయోగము - అనగా ప్రాణాయామము - హఠయోగము మొదలగునవి).
“శుకో ముక్తో వామదేవోపి ముక్తస్తాభ్యాం వినా భాజో నసంతి. దీరా స్సద్యో ముక్తాస్తే భవంతీహ లోకే. వామదేవం యే అనుసరంతి నిత్యం మృత్వా జనిత్వాచ పునః పునస్తత్తే వైలోకే క్రమముక్తా భవంతి. యోగైస్సాంఖ్యైః కర్మభిః సత్వ యుక్తైః శుకశ్చ వామదేవశ్చ ద్వే సృతీ దేవనిర్మితౌ.
శుకో విహంగమః సోక్తో, వామదేవః పిపీలికః |
అతద్వ్యావృత్తి రూపేణ సాక్షా ద్విధి ముఖేనవా |
మహావాక్య విచారేణ సాంఖ్య యోగ సమాధినా |
విదిత్వాస్వాత్మనో రూపమసం ప్రజ్ఞా సమాధితః |
శుకమార్గేణ విరజాః ప్రయాంతి పరమం పదం |
యమాద్యాసన జాయా స హఠాభ్యాసాత్ పునః పునః |
విష్ణుచహళ్ళ సంజాత అణిమాది వశాదిహ |
అలబ్ధ్వాపి ఫలం సమ్యక్ పునర్భూత్వా మహాకులే |
పూర్వ వాసనా యైవాయం యోగాభ్యాసం పునశ్చరన్ |
అనేక జన్మాభాస్యేన వామదేవేన వై పథా |
సోపి ముక్తిం సమాప్నోతి తద్విష్ణోః పరమం పదం |
ద్వావిమావధి పంథానౌ బ్రహ్మ ప్రాప్తికరౌ శివౌ |
సద్యో ముక్తిప్రదశ్చైకః క్రమముక్తి పరః పరః||“. (వరాహోపనిషత్)
(శుకుడు ముక్తుడైనాడు, వామదేవుడు కూడా ముక్తుడైనాడు - ఈ రెండు విధముల ముక్తులుగాక మఱివేరుగా ముక్తులు లేరు - శుకమార్గము ననుసరించు ధీరులు ఈ లోకమందు సద్యోముక్తులు - వేంటనే అప్పటికప్పుడే ముక్తులు అగుచున్నారు - వామదేవమార్గము ననుసరించువారు నిత్యమూ చనిపోవుచు పుట్టుచు, మరల మరల జననమరణములనొందుచు క్రమముక్తిని పొందు చున్నారు. యోగులచేతను, సాంఖ్యులచేతను, కర్ములచేతను ఈ రెండు మార్గములే - శ్రుతిలోను - చెప్పబడినవి. ఇవి దేవ నిర్మితములు - శుకమనగా పక్షియని చెప్పబడినది. వామదేవమనగా పిపీలికములు (చీమలు). అతద్వ్యావృత్తిచేత “అహం బ్రహ్మస్మి” (నేను బ్రహ్మను అయితిని - నేను బ్రహ్మను అయియున్నాను - అను మొదలగు మహావాక్యముల సారాంశము గ్రహించుటవలన సాంఖ్యయోగాసమాధివలనగాని తన ఆత్మయొక్క రూపమును తెలుసుకొని అసంప్రజ్ఞాత సమాధివలన శుకమార్గముద్వారా కల్మషములను పోగొట్టుకొనినవారై పరమపదమును పొందుదురు. యమ, నియమ, ఆసనములు మొదలగువాటితో కూడిన హఠయోగము నభ్యసించుటవలన సిద్ధులను ఫలము పొందలేక, గొప్పకులమందు మరల పుట్టి పూర్వజన్మ వాసనలవలన తిరిగి యోగాభ్యాసము చేయుచు, ఇట్లనేక జన్మలలో అభ్యసించుటవలన ఈ వామదేవమార్గముననుసరించువారుకూడా శ్రీమహావిష్ణువుయొక్క పరమపదమను పేరుగల (అత్యుత్కృష్టమైనది, పొందతగినది యగు స్థానము - విష్ణువే పరమపదము, పరమపదమే విష్ణువు) ముక్తిస్థానమును పొందుదురు - బ్రహ్మప్రాప్తి కలిగించు మార్గములు ఈ రెండే - ఒకటి సద్యోముక్తినిచ్చునది, రెండవది క్రమముక్తినిచ్చునది).
(శుకమనగా పక్షి - శుకమార్త్గమను పేరు వచ్చుటకు కారణ మేమనగా - ఒక చెట్టుమీదనున్న పండును చూచి పక్షి దానికొరకు చెట్టుమీదవ్రాలి ఆ పండుతినును - అట్లే బ్రహ్మజ్ఞానము కలిగినపుడు తాను పరబ్రహ్మస్వర్తూపుడై (బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి = బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును) అవిద్య, లేక, అజ్ఞానమునుండి విముక్తుడగును - ముక్తిని పొందును. వామదేవమార్గమనగా - చెట్టుమీద (కొసను) ఉన్న పండుచూచి వాసన పడికట్టి (పక్షివలె మీదకు ఎగరలేక) చీమలు చెట్టుమొదలునుండి, కొమ్మలమీదుగా చివరికొమ్మమీదనున్న పండును తినును - ఇట్లు చేయుటకు చాలా ఆటంకములుండును - అనేక కొమ్మలుండునుగనుక ఏ కొమ్మమీదుగా వెళ్ళిన పండుదొరుకునో, ఒక కొమ్మమీదకు వెళ్ళుచూ, ఈ లోగా పట్టుతప్పి నేలకు పడుచు మరల చెట్టు మొదలనుండి చివరకు పాకురు చుండును. ఇట్లు చేయుటలో కాలయాపనయే కాక ఆటంకములెన్నో కలుగుచుండును. ఇట్లే కర్మయోగము, హఠయోగము మొదలగు ముక్తిమార్గములు పిపీలికముల ప్రయత్నమువంటివిగాన ఆ మార్గము వామదేవమార్గమని చెప్పబడినది. ఈ మార్గము ననుసరించినవారు అనేక జన్మల ఎత్తుచు, వాటిలో అనేక విఘ్నములనెదుర్కొనుచు, అనేక పుణ్యముల ఫలముగా చివరకు బ్రహ్మజ్ఞానము కలిగి ముక్తినొందురు - అందుచేత జ్ఞానమార్గమే శ్రేష్టము).
(7). “జ్ఞాన విజ్ఞాన శబ్దాభ్యాం తత్ఫలం ముక్తిరుచ్యతే |
సాద్విధాస్తి స దేహైకా విదే హాన్యత్ తత్రచ |
ఉత్పన్నే తత్వ విజ్ఞానే సాక్షాత్కారాభిదే |
అవశ్యం సభవేన్ముక్తో దేహపాతాదనంతరం“. (గీతాభావప్రకాశము - 3 - 292, 293)
(జ్ఞాన విజ్ఞానముల ఫలము - బ్రహ్మజ్ఞానముయొక్క ఫలము - ముక్తి అని చెప్పబడినది. ఆ ముక్తి రెండు విధములు - సదేహముక్తి; విదేహముక్తి. (దేహము తోనే ముక్తి, దేహముండగనే ముక్తి, దేహము వదలివేసిన తర్వాత ముక్తి)
బ్రహ్మ సాక్షాత్కరము పొందగలుగు బ్రహ్మజ్ఞానము కలుగగనే ముక్తి -).
(8).”నీవడిగిన సద్యోముక్తియు, గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదంబులందు వివరింపబడియే. నీనిం దొల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహచేత నారాధింతుండై చెప్పె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 347)
kēṣāṃcit ūrthva rētasvā śramēṣu yadhōkta dharānuṣṭavatāṃ sūryōvalakṣitēna arcirādi mārgēṇa brahmalōkaṃ gatvā brahma samīpē avasthānaṃ sāmīpya rūpā muktiḥ –
kēṣāṃcit pratimādiṣu viṣṇvādi dēvatānāmiva nāmādi pratīkēṣu dēvatōpāsakānāṃ sālōkyarūpā muktiḥ
aṃtarēṇaiva pratīkaṃ svātmānaḥ pṛthaktvēna vividaiśvarya viśēṣa viśiṣṭatayā dēvatōpāsakānāṃ kēṣāṃcit sārṣitō samā nārthatā sārūpyaṃ.
saguṇa dēvatā rūpamahaṃ grahaṇōpāsa nānāṃ upāsyadēvatā tādātmyaṃ sāyujyaṃ
“yātu jñānaphala bhūtā nitya niratiśayānaṃdābhi vyakta lakṣaṇāsā nirguṇa sāyujyarūpā paṃcamī muktiḥ”
(mukti ayidu vidhamulugā nunnadi - sāmīpyamukti, sālōkyamukti, sārūpyamukti, saguṇasāyujyamukti, nirguṇasāyujyamukti –
(1) koṃdaṟu ūrthvarētaskulu vāri āśramamulaku nirṇayiṃcabaḍina anuṣṭhānamucēsi arcirādi mārgamudvārā caturmukhabrahmalōkamunaku veḷḷi caturmukha brahma samīpamaṃduṃḍuṭa sāmīpyamukti
(2). viṣṇuvu modalagu dēva talaguṟiṃci valenu konni pratimalaṃdu dēvatā bhāvamunuṃci upāsana cēyuvāriki sālōkyamukti
(3) ātmasvarūpamukaṃṭe pratīkamu vērainadi yani bhāviṃci upāsiṃcuvāriki sārūpyamukti
(4) saguṇadēvatārūpamaina ahaṃ grahōpāsakulaku vāru vārupāsiṃcu dēvatalatō tādātmyamunu poṃduṭa sāyujya mukti.
(5) jñānaphalabhūtamai nityaniratiyānaṃdābhivyakti lakṣaṇamugala nirguṇa sāyujyamukti).
“bahudhā śrūyatē muktirvēdāṃtēṣu vilakṣaṇa |
ēkā sālōkya rūpōktā, dvitīyā kamalēkṣaṇa |
sāmīpyarūpyā sārūpyā tṛtīyā puruṣōttama |
anyā sāyujya rūpōktā sukhaduḥkha vivarjitā |
sarva dvaṃdva vinirmuktā satya vijñānarūpiṇī |
kēvalaṃ brahmarūpōktā sarvadā sukhalakṣaṇā |
nahēyā nāpyupādēyā sarva saṃbaṃdhēvarjitā |
sarvāvaraṇa nirmuktā navijñēyā nirāśrayā |
vācya vācaka nirmuktā lakṣya lakṣaṇa varjitā |
sarvēṣāṃ prāṇināṃ sākṣādātma bhūtā svayaṃprabhā |
pratibaṃdha vinurmuktā sarvadā paramārthataḥ |
avicāra daśāyāṃ tu prati baddhā svamāyayā |
ēṣaiva paramā muktiḥ prōktā vēdāṃta vēdibhiḥ |
anyāśca muktayassarvā aparāḥ parikīrtitāḥ |
janma nāśābhi bhūtāśca tāratamyēna saṃsthitāḥ |
spartha yōpahṛtā nityaṃ parataṃtrāca sarvadā |
sukhōttarā (a)viśēṣṭā duḥkhamiśrāśca sarvadā |
ētāści muktayō(a)nyēṣāṃ kēṣāṃci dadhikāriṇāṃ ||“. (sūtasaṃhita)
(upaniṣattulalō mukti anēka vidhamulugā ceppabaḍinadi - sālōkyamukti, sāmīpyamukti, sārūpyamukti, sāyujyamukti. sāyujyamukti sukhaduḥkhamulu lēnidi, ṣaḍbhāvavikāramulu lēnidi, śubhā śubhamulu, dvaṃdvamulu lēnidi, satya vijñāna rūpamainadi, kēvalamu brahmarūpamē ayinadi, ellapuḍu sukhamē lakṣaṇamugā galadi, hēyamu upādēyamu lēnidi, ē vidhamaina saṃbaṃdhamu lēnidi, kanabaḍanidi, vinabaḍanidi, tarkiṃcuṭaku vīlukānidi, ē vidhamaina āvaraṇamu lēnidi, teliyabaḍanidi, āśrayamulēnidi, vācya vācakamulugāni, lakṣya lakṣaṇamulu gāni lēnidi, samasta prāṇulaku ātma ayinadi, svayamugā prakāśiṃcunadi, paramārtha dṛṣṭilō ē vidhamaina pratibaṃdhamu lēnidi. kāni. ajñānadaśalō tana māyacētanē baṃdhiṃcabaḍi yuṃḍunadi - idiyē - iṭṭidiyē parama muktiyani vēdāṃtamunu (upaniṣatsāramunu) telisinavāru ceppuduru. migilina muktulanniyu aparamuktulani ceppa baḍinavi, jananamaraṇamulu
kalavi, tāratamyamu kalavi, sparthatōkūḍiyunnavi, parataṃtramainavi, ākharuna sukhamu kalugacēyunavi, duḥkhamutō miśramamai (kalisi) yuṃḍunavi. ī muktulu koṃdaṟu adhikārulaku kalugunu).
sadyōmukti pradaścaikaḥ kramamukti pradaḥ paraḥ |
śukaśca vāmadēvaśca dvau sṛtī dēva nirmitau |
śukō vihaṃgamaḥ prōktō vāmadēvaḥ vipīlikā ||” (varāhōpaniṣat)
maṃgaḷakaramaina brahmaprāptini cēkūrcunavi reṃḍu mārgamulu - sadyōmuktimārgamu (appaṭikappuḍu) muktiniccunadi; kramamukti niccunadi reṃḍavadi. okaṭi śukamārgamu, reṃḍavadi vāmadēvamārgamu - śukamanagā pakṣi, vāmadēvuḍu anagā pipīlikamu (cīma).
“śukō muktō, vāmadēvōpi muktaḥ” iti śrutiḥ. śukō vihaṃgama mārgā nusārī sadyō muktō bhavati. vāmadēvaḥ pipīlikā mārgānusārī kramamuktō bhavati. tābhyāṃ taumārgāvatikramya nahikēpi mukti bhājaḥ saṃti jñana sādhana pravṛttiḥ phalavatī bhavati”.
(śukamu muktini poṃdenu, vāmadēvuḍukūḍā muktini poṃdenu ani śruti ceppucunnadi. ī reṃḍumārgamula dvārā veḷḷinavāru muktini poṃduduru - śukamu - vihaṃgamu (pakṣi) - ī mārgamunanasariṃcina appaṭikappuḍē muktuḍagunu. (sadyōmuktuḍagunu). vāmadēvuḍu – pipīlikamārgamu nanusariṃcinavāḍu kramamuktuḍagunu - iddaraku ī reṃḍumārgamulu tappa vēru mārgamulu lēvu. jñānasādhanamu phalavaṃtamagunu. śukayōgamu jñānayōgamu, vāmadēvamārgamu karmayōgamu - anagā prāṇāyāmamu - haṭhayōgamu modalagunavi).
“śukō muktō vāmadēvōpi muktastābhyāṃ vinā bhājō nasaṃti. dīrā ssadyō muktāstē bhavaṃtīha lōkē. vāmadēvaṃ yē anusaraṃti nityaṃ mṛtvā janitvāca punaḥ punastattē vailōkē kramamuktā bhavaṃti. yōgaissāṃkhyaiḥ karmabhiḥ satva yuktaiḥ śukaśca vāmadēvaśca dvē sṛtī dēvanirmitau.
śukō vihaṃgamaḥ sōktō, vāmadēvaḥ pipīlikaḥ |
atadvyāvṛtti rūpēṇa sākṣā dvidhi mukhēnavā |
mahāvākya vicārēṇa sāṃkhya yōga samādhinā |
viditvāsvātmanō rūpamasaṃ prajñā samādhitaḥ |
śukamārgēṇa virajāḥ prayāṃti paramaṃ padaṃ |
yamādyāsana jāyā sa haṭhābhyāsāt punaḥ punaḥ |
viṣṇucahaḷḷa saṃjāta aṇimādi vaśādiha |
alabdhvāpi phalaṃ samyak punarbhūtvā mahākulē |
pūrva vāsanā yaivāyaṃ yōgābhyāsaṃ punaścaran |
anēka janmābhāsyēna vāmadēvēna vai pathā |
sōpi muktiṃ samāpnōti tadviṣṇōḥ paramaṃ padaṃ |
dvāvimāvadhi paṃthānau brahma prāptikarau śivau |
sadyō muktipradaścaikaḥ kramamukti paraḥ paraḥ||“. (varāhōpaniṣat)
(śukuḍu muktuḍaināḍu, vāmadēvuḍu kūḍā muktuḍaināḍu - ī reṃḍu vidhamula muktulugāka maṟivērugā muktulu lēru - śukamārgamu nanusariṃcu dhīrulu ī lōkamaṃdu sadyōmuktulu - vēṃṭanē appaṭikappuḍē muktulu agucunnāru - vāmadēvamārgamu nanusariṃcuvāru nityamū canipōvucu puṭṭucu, marala marala jananamaraṇamulanoṃducu kramamuktini poṃdu cunnāru. yōgulacētanu, sāṃkhyulacētanu, karmulacētanu ī reṃḍu mārgamulē - śrutilōnu - ceppabaḍinavi. ivi dēva nirmitamulu - śukamanagā pakṣiyani ceppabaḍinadi. vāmadēvamanagā pipīlikamulu (cīmalu). atadvyāvṛtticēta “ahaṃ brahmasmi” (nēnu brahmanu ayitini - nēnu brahmanu ayiyunnānu - anu modalagu mahāvākyamula sārāṃśamu grahiṃcuṭavalana sāṃkhyayōgāsamādhivalanagāni tana ātmayokka rūpamunu telusukoni asaṃprajñāta samādhivalana śukamārgamudvārā kalmaṣamulanu pōgoṭṭukoninavārai paramapadamunu poṃduduru. yama, niyama, āsanamulu modalaguvāṭitō kūḍina haṭhayōgamu nabhyasiṃcuṭavalana siddhulanu phalamu poṃdalēka, goppakulamaṃdu marala puṭṭi pūrvajanma vāsanalavalana tirigi yōgābhyāsamu cēyucu, iṭlanēka janmalalō abhyasiṃcuṭavalana ī vāmadēvamārgamunanusariṃcuvārukūḍā śrīmahāviṣṇuvuyokka paramapadamanu pērugala (atyutkṛṣṭamainadi, poṃdataginadi yagu sthānamu - viṣṇuvē paramapadamu, paramapadamē viṣṇuvu) muktisthānamunu poṃduduru - brahmaprāpti kaligiṃcu mārgamulu ī reṃḍē - okaṭi sadyōmuktiniccunadi, reṃḍavadi kramamuktiniccunadi).
(śukamanagā pakṣi - śukamārtgamanu pēru vaccuṭaku kāraṇa mēmanagā - oka ceṭṭumīdanunna paṃḍunu cūci pakṣi dānikoraku ceṭṭumīdavrāli ā paṃḍutinunu - aṭlē brahmajñānamu kaliginapuḍu tānu parabrahmasvartūpuḍai (brahma vidbrahmaiva bhavati = brahmajñānamu kalavāḍu brahmamē yagunu) avidya, lēka, ajñānamunuṃḍi vimuktuḍagunu - muktini poṃdunu. vāmadēvamārgamanagā - ceṭṭumīda (kosanu) unna paṃḍucūci vāsana paḍikaṭṭi (pakṣivale mīdaku egaralēka) cīmalu ceṭṭumodalunuṃḍi, kommalamīdugā civarikommamīdanunna paṃḍunu tinunu - iṭlu cēyuṭaku cālā āṭaṃkamuluṃḍunu - anēka kommaluṃḍunuganuka ē kommamīdugā veḷḷina paṃḍudorukunō, oka kommamīdaku veḷḷucū, ī lōgā paṭṭutappi nēlaku paḍucu marala ceṭṭu modalanuṃḍi civaraku pākuru cuṃḍunu. iṭlu cēyuṭalō kālayāpanayē kāka āṭaṃkamulennō kalugucuṃḍunu. iṭlē karmayōgamu, haṭhayōgamu modalagu muktimārgamulu pipīlikamula prayatnamuvaṃṭivigāna ā mārgamu vāmadēvamārgamani ceppabaḍinadi. ī mārgamu nanusariṃcinavāru anēka janmala ettucu, vāṭilō anēka vighnamulanedurkonucu, anēka puṇyamula phalamugā civaraku brahmajñānamu kaligi muktinoṃduru - aṃducēta jñānamārgamē śrēṣṭamu).
(7). “jñāna vijñāna śabdābhyāṃ tatphalaṃ muktirucyatē |
sādvidhāsti sa dēhaikā vidē hānyat tatraca |
utpannē tatva vijñānē sākṣātkārābhidē |
avaśyaṃ sabhavēnmuktō dēhapātādanaṃtaraṃ”. (gītābhāvaprakāśamu - 3 - 292, 293)
(jñāna vijñānamula phalamu - brahmajñānamuyokka phalamu - mukti ani ceppabaḍinadi. ā mukti reṃḍu vidhamulu - sadēhamukti; vidēhamukti. (dēhamu tōnē mukti, dēhamuṃḍaganē mukti, dēhamu vadalivēsina tarvāta mukti)
brahma sākṣātkaramu poṃdagalugu brahmajñānamu kalugaganē mukti -).
(8).”nīvaḍigina sadyōmuktiyu, gramamuktiyu naniyeḍu nī reṃḍu mārgaṃbulu vēdaṃbulaṃdu vivariṃpabaḍiyē. nīniṃ dolli bhagavaṃtuṃḍaina vāsudēvuṃḍu brahacēta nārādhiṃtuṃḍai ceppe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 347)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.