యః విద్యా ప్రధానః నిత్య ముక్తః మాయా యాః అనావారకత్వాత్, ఆశ్రయ వ్యామోహక త్వాచ్చ - విద్వాన్ దేహస్థోపి దేహస్థో న భవతి - యథా స్వప్నాన్ ఉద్ధితః స్మర్యమాణః స్వప్నస్థితోపి తత్రస్థో న భవతి. విద్వాన్ ఇంద్రియైః ఇంద్రియార్థేషు గృహ్యమాణేష్వపి న అహం కుర్యాత్ - (అహం గృహ్ణామి ఇతి మతం న కుర్యాత్) - రాగాది శూన్యః అన్యగతమేవ కర్మమాం న బద్నాతి ఇతి. ఏవం విద్యా విరక్తో అవిద్వాన్ ఇవ శయనాసనాదిషు న బద్ధ్యతే. (తత్ర తత్ర విషయేషు గుణాని ఇంద్రియాణి అదయన్ భోజయన్ తత్సాక్షిత్వేన వర్తమానః న స్వయం అదన్), ప్రకృతిస్థోపి అసంగేన (వైరాగ్యేన) తీక్ష్ణయా ఈక్షయా భిన్న సంశయస్సన్ నానాత్వాత్ - దేహాది ప్రపంచాత్ - వినివర్తతే - యథా ఆకాశః సర్వగతమపి న సజ్జతే, తద్వత్ హింసైః దుర్జనైరన్యైర్వా ప్రాణిభిః యస్య ఆత్మాదేహం పీడ్యతే, యదృచ్ఛయా (యేన కేనాపి క్వచిత్ కించిదర్చ్యతే) సః బుధః చేత్ న వ్యతిక్రియతే
“సాదు అసాధువా కుర్వతో వదతోవా జనాన్ న స్తువతి, న నిందతి యో లౌకిక వ్యవహారే విముఖః సః ముక్తః” (శ్రీమద్భాగవతం - 11 -).
(విద్యాప్రధానుడైనవాడు - జ్ఞానమే ప్రథానమైనవాడు - నిత్యముక్తుడు - ఎల్లపుడు ముక్తుడే - మాయ చేత ఆవరింపబడియుండకపోవుటచేత. నిద్రనుండి మేల్కొనినవాడు కలలోకన్న విషయములను తలచుకొనుచున్నపుడు తను ఆ కలలో ఉన్నప్పటికీ వాస్తవముగా లేడు. అట్లే విద్వాన్సుడు దేహముతో నుండినను లేనట్లే - విషయములు ఇంద్రియములను వాటి ప్రక్కకు లాగుచున్నను వాటి యందు అహంకారము కూడదు - నేనే ఈ విషయములను గ్రహించుచున్నాను అని తలంచకూడదు. దేనియందును అనురాగములేని విద్వాంసుడు ఇతరములు చేయుచున్న కర్మ నన్ను బంధించదు అని విరక్తిని బొంది అవిద్వాన్సునివలె శయనము ఆసనము మొదలగు కర్మలచేత బద్దుడుకాడు. ఇంద్రియములచేత విషయములను అనుభవము చేయుచున్నను ఆ కర్మలకు సాక్షియగుటవలన స్వయముగా ఆ పనులు చేయుటలేదు - ప్రకృతిలో నున్నప్పటికీ - ప్రకృతికి సంబంధించిన ప్రపంచములో నున్నను - వైరాగ్యం చెందుటవలన (దేనియందైనను రాగము లేకుండుటచేత సంశయ నివృత్తి కలిగినవాడై ప్రపంచముతో సంబంధించిన దేహము మొదలగు వాటినుండి నివర్తించును - ఆకాశము అన్నింటిలోను వ్యాపించియుండినను వాటిని అంటనట్లు దుర్మార్గులు తనను హిన్సించినను జ్ఞాని యగువాడు ఏ విధమైన మార్పును చెందడు).
yaḥ vidyā pradhānaḥ nitya muktaḥ māyā yāḥ anāvārakatvāt, āśraya vyāmōhaka tvācca - vidvān dēhasthōpi dēhasthō na bhavati - yathā svapnān uddhitaḥ smaryamāṇaḥ svapnasthitōpi tatrasthō na bhavati. vidvān iṃdriyaiḥ iṃdriyārthēṣu gṛhyamāṇēṣvapi na ahaṃ kuryāt - (ahaṃ gṛhṇāmi iti mataṃ na kuryāt) - rāgādi śūnyaḥ anyagatamēva karmamāṃ na badnāti iti. ēvaṃ vidyā viraktō avidvān iva śayanāsanādiṣu na baddhyatē. (tatra tatra viṣayēṣu guṇāni iṃdriyāṇi adayan bhōjayan tatsākṣitvēna vartamānaḥ na svayaṃ adan), prakṛtisthōpi asaṃgēna (vairāgyēna) tīkṣṇayā īkṣayā bhinna saṃśayassan nānātvāt - dēhādi prapaṃcāt - vinivartatē - yathā ākāśaḥ sarvagatamapi na sajjatē, tadvat hiṃsaiḥ durjanairanyairvā prāṇibhiḥ yasya ātmādēhaṃ pīḍyatē, yadṛcchayā (yēna kēnāpi kvacit kiṃcidarcyatē) saḥ budhaḥ cēt na vyatikriyatē
“sādu asādhuvā kurvatō vadatōvā janān na stuvati, na niṃdati yō laukika vyavahārē vimukhaḥ saḥ muktaḥ” (śrīmadbhāgavataṃ - 11 -).
(vidyāpradhānuḍainavāḍu - jñānamē prathānamainavāḍu - nityamuktuḍu - ellapuḍu muktuḍē - māya cēta āvariṃpabaḍiyuṃḍakapōvuṭacēta. nidranuṃḍi mēlkoninavāḍu kalalōkanna viṣayamulanu talacukonucunnapuḍu tanu ā kalalō unnappaṭikī vāstavamugā lēḍu. aṭlē vidvānsuḍu dēhamutō nuṃḍinanu lēnaṭlē - viṣayamulu iṃdriyamulanu vāṭi prakkaku lāgucunnanu vāṭi yaṃdu ahaṃkāramu kūḍadu - nēnē ī viṣayamulanu grahiṃcucunnānu ani talaṃcakūḍadu. dēniyaṃdunu anurāgamulēni vidvāṃsuḍu itaramulu cēyucunna karma nannu baṃdhiṃcadu ani viraktini boṃdi avidvānsunivale śayanamu āsanamu modalagu karmalacēta badduḍukāḍu. iṃdriyamulacēta viṣayamulanu anubhavamu cēyucunnanu ā karmalaku sākṣiyaguṭavalana svayamugā ā panulu cēyuṭalēdu - prakṛtilō nunnappaṭikī - prakṛtiki saṃbaṃdhiṃcina prapaṃcamulō nunnanu - vairāgyaṃ ceṃduṭavalana (dēniyaṃdainanu rāgamu lēkuṃḍuṭacēta saṃśaya nivṛtti kaliginavāḍai prapaṃcamutō saṃbaṃdhiṃcina dēhamu modalagu vāṭinuṃḍi nivartiṃcunu - ākāśamu anniṃṭilōnu vyāpiṃciyuṃḍinanu vāṭini aṃṭanaṭlu durmārgulu tananu hinsiṃcinanu jñāni yaguvāḍu ē vidhamaina mārpunu ceṃdaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.