← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముని muni

Original — తెలుగు
  1. మననశీల ఋషిః; మననం యుక్తో మునిః -

(మననము చేయువాడు; మననము చేయు ఋషి - ఓంకారమునెఱిగి దానిని మననము చేయువాడు - మంత్రమును మననము చేయువాడు ముని).

  1. ఆత్మ మనన శీలః మునిః; బ్రహ్మ మనన శీలః - సహి లోకేమునిర్నామ యః కామ క్రోధ వర్జితః -

(ఆత్మను, లేక, బ్రహ్మను మననము చేయు స్వభావము గలవాడు; కామక్రోధములు లేనివాడు).

  1. మౌనవ్రతచారీ

(మౌనవ్రతము నాచరించువాడు - మాటలాడకుండ నుండువాడు - మౌనముగా జ్ఞానమును సమకూర్చు ధ్యానము చేయువాడు).

  1. “మనుతే ఇతి మునిః - ఆత్మవిత్” (శ్రీ ఆనందగిరి)

(ఆత్మతత్వమును మననము చేయువాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు).

  1. “మననేన అర్థ యాధాత్మ దర్శీ” (శ్రీమాన్ రామానుజః)

(మననము చేయుటచేత వస్తువుల యాధాత్మ్యమును - నిజస్థితిని - తెలుసుకొనినవాడు).

  1. ఆత్మారామః (ఆత్మయందు రమించువాడు - ఎల్లపుడు ఆత్మయందే ధ్యానము చేయువాడు).

  2. సర్వపదార్థజ్ఞః - (అన్నింటి గుఱించి తెలిసినవాడు - సర్వజ్ఞుడు).

  3. నిధి ధ్యాసనకృత్. (నిధి ధ్యాసనము చేయువాడు).

  4. “సాధనవశంబుగాని యాత్మారామత్వ ంబువలన ముని యయ్యును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా.)

  5. “నివృత్త సర్వ తత్వజ్ఞః; కామ క్రోధ వివర్జితః |

ధ్యానస్థో నిష్క్రియో దాంతః తుల్యమృత్కాంచనో మునిః ||”

ఇత్యుక్త లక్షణః కశిద్యోణీశ్వరః.

(నివృత్తిమార్గ లక్షణమును (తత్వమును) తెలిసినవాడు, కామము, క్రోధము లేనివాడు, ధ్యానము చేయువాడు, క్రియలు చేయనివాడు, దాంతుడు, మట్టిని బంగారమును ఒకే రీతిగ చూచువాడు, ఈ లక్షణములుగల యోగీశ్వరుడు - ముని).

  1. “మునీనామప్యహం వ్యాసః” (శ్రీమద్భగవద్ఘీత - 10 - 37)

మునీనాం సర్వ వేదార్థాభిజ్ఞానాం బాదరాయణః (గీతాభావప్రకాశము - 10 - 15)

(సమస్తమైన ఉపనిషత్తుల అంతరార్థమును బాగుగా తెలిసిన మునులలో వ్యాసమునిని నేను - వ్యాస ముని భగవంతుని అవతారములలో నొకటియని భాగవతములోనే చెప్పబడినది).

Transliteration
  1. mananaśīla ṛṣiḥ; mananaṃ yuktō muniḥ -

(mananamu cēyuvāḍu; mananamu cēyu ṛṣi - ōṃkāramuneṟigi dānini mananamu cēyuvāḍu - maṃtramunu mananamu cēyuvāḍu muni).

  1. ātma manana śīlaḥ muniḥ; brahma manana śīlaḥ - sahi lōkēmunirnāma yaḥ kāma krōdha varjitaḥ -

(ātmanu, lēka, brahmanu mananamu cēyu svabhāvamu galavāḍu; kāmakrōdhamulu lēnivāḍu).

  1. maunavratacārī

(maunavratamu nācariṃcuvāḍu - māṭalāḍakuṃḍa nuṃḍuvāḍu - maunamugā jñānamunu samakūrcu dhyānamu cēyuvāḍu).

  1. “manutē iti muniḥ - ātmavit” (śrī ānaṃdagiri)

(ātmatatvamunu mananamu cēyuvāḍu, brahmajñānamu kalavāḍu).

  1. “mananēna artha yādhātma darśī” (śrīmān rāmānujaḥ)

(mananamu cēyuṭacēta vastuvula yādhātmyamunu - nijasthitini - telusukoninavāḍu).

  1. ātmārāmaḥ (ātmayaṃdu ramiṃcuvāḍu - ellapuḍu ātmayaṃdē dhyānamu cēyuvāḍu).

  2. sarvapadārthajñaḥ - (anniṃṭi guṟiṃci telisinavāḍu - sarvajñuḍu).

  3. nidhi dhyāsanakṛt. (nidhi dhyāsanamu cēyuvāḍu).

  4. “sādhanavaśaṃbugāni yātmārāmatva ṃbuvalana muni yayyunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā.)

  5. “nivṛtta sarva tatvajñaḥ; kāma krōdha vivarjitaḥ |

dhyānasthō niṣkriyō dāṃtaḥ tulyamṛtkāṃcanō muniḥ ||”

ityukta lakṣaṇaḥ kaśidyōṇīśvaraḥ.

(nivṛttimārga lakṣaṇamunu (tatvamunu) telisinavāḍu, kāmamu, krōdhamu lēnivāḍu, dhyānamu cēyuvāḍu, kriyalu cēyanivāḍu, dāṃtuḍu, maṭṭini baṃgāramunu okē rītiga cūcuvāḍu, ī lakṣaṇamulugala yōgīśvaruḍu - muni).

  1. “munīnāmapyahaṃ vyāsaḥ” (śrīmadbhagavadghīta - 10 - 37)

munīnāṃ sarva vēdārthābhijñānāṃ bādarāyaṇaḥ (gītābhāvaprakāśamu - 10 - 15)

(samastamaina upaniṣattula aṃtarārthamunu bāgugā telisina munulalō vyāsamunini nēnu - vyāsa muni bhagavaṃtuni avatāramulalō nokaṭiyani bhāgavatamulōnē ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.