(యోగములలో ప్రకాశమైనది, ప్రశస్తమైన యోగము కనుక రాజయోగమని చెప్పబడుచున్నది).
(యోగములలో రాజు వంటిది - శ్రేష్టమైనది కనుక రాజయోగము).
యోగములలో ఉత్తమైనది జ్ఞానయోగము - జ్ఞానయోగము - రాజయోగము మూడు విధములు - తారకయోగము, సాంఖయ్యోగము, అమనస్కయోగము. తారకయోగమువలన చిత్తశుద్ధి కలుగును, సాంఖ్యయోగము వలన ఆత్మ తత్వము నెఱుంగనగును, అమనస్కయోగమువలన అపరోక్షానుభవము కలుగును.
"యోని మధ్యే మహా క్షేత్రే జపా బంధూకసన్నిభం |
రజో వసతి జంతూనాం దేవీ తత్వం సమావృతం |
రజసో రేతసో యోగాత్ రాజ యోగ ఇతి స్మృతః |
అణిమాదిపదం ప్రాప్య రాజతే రాజయోగతః ||". (యోగశిఖోపనిషత్)
"శిశ్నిస్థానే రేతో వర్తతే, తద్ధ శివతత్వం |
రజసో రేతసో యోగాత్ శక్తి శివయోగాత్ రాజయోగః ||".
(యోనిమధ్యను రజస్సు ఉన్నది. అది దేవీతత్వము. శిశ్నస్థానమందు రేతస్సు ఉన్నది. అది శివతత్వము - రజస్సు, రేతస్సు కలియుట రాజయోగము - అనగా శివశక్తుల యోగము (కలియుట) రాజయోగము. అణిమాది సిద్ధులను పొందిన తర్వాత ఇది కలుగును).
(yōgamulalō prakāśamainadi, praśastamaina yōgamu kanuka rājayōgamani ceppabaḍucunnadi).
(yōgamulalō rāju vaṃṭidi - śrēṣṭamainadi kanuka rājayōgamu).
yōgamulalō uttamainadi jñānayōgamu - jñānayōgamu - rājayōgamu mūḍu vidhamulu - tārakayōgamu, sāṃkhayyōgamu, amanaskayōgamu. tārakayōgamuvalana cittaśuddhi kalugunu, sāṃkhyayōgamu valana ātma tatvamu neṟuṃganagunu, amanaskayōgamuvalana aparōkṣānubhavamu kalugunu.
"yōni madhyē mahā kṣētrē japā baṃdhūkasannibhaṃ |
rajō vasati jaṃtūnāṃ dēvī tatvaṃ samāvṛtaṃ |
rajasō rētasō yōgāt rāja yōga iti smṛtaḥ |
aṇimādipadaṃ prāpya rājatē rājayōgataḥ ||". (yōgaśikhōpaniṣat)
"śiśnisthānē rētō vartatē, taddha śivatatvaṃ |
rajasō rētasō yōgāt śakti śivayōgāt rājayōgaḥ ||".
(yōnimadhyanu rajassu unnadi. adi dēvītatvamu. śiśnasthānamaṃdu rētassu unnadi. adi śivatatvamu - rajassu, rētassu kaliyuṭa rājayōgamu - anagā śivaśaktula yōgamu (kaliyuṭa) rājayōgamu. aṇimādi siddhulanu poṃdina tarvāta idi kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.