← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రజ్జు సర్పభ్రాంతి rajju sarpabhrāṃti

Original — తెలుగు

"రజ్జు సర్పభ్రాంతియందు రజ్జువు భ్రాంతికాధారము, సర్పము కార్యము. ఈ సర్పము వాస్తవముగా భ్రాంతికి పూర్వమందులేదు, భ్రాంతికాలమునందును లేదు, నివారణానంతరమున లేదు - ఇటులనే బ్రహ్మమందు జగత్తు తోచెనుగాని వాస్తవముగా నది కాలత్రయమందును లేదు - సర్పభ్రాంతి కలిగినవానికి వాని బుద్ధ్యనుసారముగ తోచిన సర్పమును సర్పముగానే యనువదించి పిమ్మట నది సర్పము గాదని ప్రతిషేధించుటయే సర్పవర్ణనమునకు ప్రయోజనము - ఈ విమర్శయే అధ్యారోపవాదములనబడును - ప్రపంచమునకును, బ్రహ్మమునకును గల సంబంధము రజ్జువునకు సర్పమునకును గల సంబంధము వంటిది. అంతియకాని మృద్ఘటములకు గల సంబంధమువంటిది కాదు - అనగా, ప్రపంచమునకు బ్రహ్మము వివర్తోపాదానకారణముగాని పరిణామ్యుపాదాన కారణము కాదని సిద్ధాంతము-".

Transliteration

"rajju sarpabhrāṃtiyaṃdu rajjuvu bhrāṃtikādhāramu, sarpamu kāryamu. ī sarpamu vāstavamugā bhrāṃtiki pūrvamaṃdulēdu, bhrāṃtikālamunaṃdunu lēdu, nivāraṇānaṃtaramuna lēdu - iṭulanē brahmamaṃdu jagattu tōcenugāni vāstavamugā nadi kālatrayamaṃdunu lēdu - sarpabhrāṃti kaliginavāniki vāni buddhyanusāramuga tōcina sarpamunu sarpamugānē yanuvadiṃci pimmaṭa nadi sarpamu gādani pratiṣēdhiṃcuṭayē sarpavarṇanamunaku prayōjanamu - ī vimarśayē adhyārōpavādamulanabaḍunu - prapaṃcamunakunu, brahmamunakunu gala saṃbaṃdhamu rajjuvunaku sarpamunakunu gala saṃbaṃdhamu vaṃṭidi. aṃtiyakāni mṛdghaṭamulaku gala saṃbaṃdhamuvaṃṭidi kādu - anagā, prapaṃcamunaku brahmamu vivartōpādānakāraṇamugāni pariṇāmyupādāna kāraṇamu kādani siddhāṃtamu-".

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.