← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రామమంత్రము rāmamaṃtramu

Original — తెలుగు
  1. “శ్రీరామ రామ రామ”

“శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామనామ, వరాననే ||“.

(నేను “శ్రీరామరామ, రామ” అని రామునియందు (ఆ పరబ్రహ్మమందు) నిత్యము రమించుదును; ఎందుచేతననగా, శ్రీరామనామము పరబ్రహ్మ యొక్క వేయినామములతో సమానము - వేయినామముల శక్తి (ప్రభావము) తో సమానమైనది)

“తే. శ్రీమనోరామ, శ్రీరామరామరామ

యనుచు రమియింతు రామునియంద, రామ

నామము, వరానన, సహస్రనామతుల్య

మట్లు గావున దానిని నీ వవధరింపు“. (శ్రీసీతారామాజనేయసంవాదము - 1 - 46)

పైన శ్లోకములోను, పద్యములోను శ్రీరామనామము మూడు పర్యాయములు చెప్పుటలో అర్థమేమనగా

(1) స్థూల సూక్ష్మకారణ శరీరములు వాటినభిమానించు ప్రాజ్ఞుడు, తైజసుడు అను భగవంతుని మూడు అంశలు చెప్పుటకు

(2) వీరి అవస్థలైన జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనునవి చెప్పబడినవి. మొదటిది (రామయనునది) పరబ్రహ్మయనియు, రెండవది సాక్షియనియు, మూడవది కూటస్థుడనియు అన్వయించుకొనుటకు చెప్పబడినది.)

  1. “శ్రీరామశ్శరణం మమ” (శ్రీరాముడు నాకు శరణమగుగాక).

“శ్లో”|| కిం మంత్రైర్బహు భిశ్చ దుష్కర దుష్కరఫలై రాయాసదై స్తద్విదాం |

కించిల్లోప విధానమాత్రవిఫలైస్సంసార దుఃఖావహైః |

ఏక స్సన్నపి సర్వమంత్రఫలదో దోషోజ్ఘిత స్సర్వదా |

శ్రీరామశ్శరణం మమేతి పరమో మంత్రో యమష్టాక్షరః. (శ్రీరామకర్ణామృతం - 4 - 74)

(అతికష్టమువలనే ఫలమునిచ్చునది, ఆయాసముకలుగ చేయునది, విధానములో ఏ మాత్రము లోపమున్నను విషములగునవియు (ఫలము నివ్వకపోవునవియు) జననమరణముల కలుగచేయునవియు నగు అనేకమంత్రములతో బ్రహ్మజ్ఞానులకు ఏమి పని? ఒకటే అయినను అన్ని మంత్రముల ఫలములనిచ్చునదియు సమస్త దోషములను పోగొట్టునదియు అగు “శ్రీరామశ్శరణం మమ” అను ఉత్కృష్టమైన అష్టాక్షరీమంత్రము (ఎనిమిది అక్షరములుగల మంత్రము) ఉన్నదికదా!)

  1. గాణా సత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టదః |

వైష్ణవేస్యపి సర్వేషు రామమంత్రః ఫలాధికః |

గాణా పత్యాది మంత్రేభ్య కోటికోటి గుణాధికః | ఇతి శ్రుతిః.

(శైవ శాక్త (శక్తికి లేక దేవికి సంబంధించినది).గాణాసత్య (గణపతికి సంబంధించినది) సౌర (సూర్యునికి సంబంధినది), వైష్ణవ (విష్ణువునకు సంబంధించినది) మంత్రోపాసనలవలన కలుగు ఫలములకంటె రామమంత్రఫలము అధికము అని, పైన చెప్పిన మంత్రములు ఒక్కొక్కటికంటె రామమంత్రము కోటికోటి రెట్లు ఆధిక్యము గలది)

  1. “శ్లో || - - - భవకులహరమంత్రం భూమిజా ప్రాణమంత్రం |

పవనజనుత మంత్రం పార్వతీ మోక్షమంత్రం |

పశుపతి నిజమంత్రం పాతుమాం రామ మంత్రం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 108)

(జన్మలేకుండ చేయునది - అనగా, మోక్షమిచ్చునది - సీతాదేవికి ప్రాణమైనట్టిది, హనుమంతుని చేత స్తోత్రముచేయబడినది, పార్వతీదేవికి మోక్షమిచ్చునది, ఈశ్వరునకు ముఖ్యమైనది - స్వంతమైనది - అయిన శ్రీరామమంత్రము నన్ను రక్షించుగాక)

  1. “శ్లో || సంసారసాగర భయాపహ విశ్వమంత్రం |

సాక్షాన్ముముక్షు జనసేవిత సిద్ధమంత్రం |

సారంగహస్త ముఖహ స్త నివాసమంత్రం |

కైవల్యమంత్ర మనిశం భజ రామమంత్రం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 110)

(జననమరణములు ప్రవాహరూపముగాగల సంసారమను మహాసముద్రమువలన కలుగు భయమును పోగొట్టునదిన్నీ, మోక్షమును కఓరువారలచేత సేవించబడినదిన్నీ, శివుడు మొదలగు వారికి కరతలామలకమైనదిన్నీ, మోక్షము కలిగించునదిన్నీ అయిన రామమంత్రమును ఎల్లపుడు జపింపుము).

Transliteration
  1. “śrīrāma rāma rāma”

“śrīrāmarāma rāmēti ramē rāmē manōramē |

sahasranāma tattulyaṃ rāmanāma, varānanē ||“.

(nēnu “śrīrāmarāma, rāma” ani rāmuniyaṃdu (ā parabrahmamaṃdu) nityamu ramiṃcudunu; eṃducētananagā, śrīrāmanāmamu parabrahma yokka vēyināmamulatō samānamu - vēyināmamula śakti (prabhāvamu) tō samānamainadi)

“tē. śrīmanōrāma, śrīrāmarāmarāma

yanucu ramiyiṃtu rāmuniyaṃda, rāma

nāmamu, varānana, sahasranāmatulya

maṭlu gāvuna dānini nī vavadhariṃpu”. (śrīsītārāmājanēyasaṃvādamu - 1 - 46)

paina ślōkamulōnu, padyamulōnu śrīrāmanāmamu mūḍu paryāyamulu ceppuṭalō arthamēmanagā

(1) sthūla sūkṣmakāraṇa śarīramulu vāṭinabhimāniṃcu prājñuḍu, taijasuḍu anu bhagavaṃtuni mūḍu aṃśalu ceppuṭaku

(2) vīri avasthalaina jāgratta, svapnamu, suṣupti anunavi ceppabaḍinavi. modaṭidi (rāmayanunadi) parabrahmayaniyu, reṃḍavadi sākṣiyaniyu, mūḍavadi kūṭasthuḍaniyu anvayiṃcukonuṭaku ceppabaḍinadi.)

  1. “śrīrāmaśśaraṇaṃ mama” (śrīrāmuḍu nāku śaraṇamagugāka).

“ślō”|| kiṃ maṃtrairbahu bhiśca duṣkara duṣkaraphalai rāyāsadai stadvidāṃ |

kiṃcillōpa vidhānamātraviphalaissaṃsāra duḥkhāvahaiḥ |

ēka ssannapi sarvamaṃtraphaladō dōṣōjghita ssarvadā |

śrīrāmaśśaraṇaṃ mamēti paramō maṃtrō yamaṣṭākṣaraḥ. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 74)

(atikaṣṭamuvalanē phalamuniccunadi, āyāsamukaluga cēyunadi, vidhānamulō ē mātramu lōpamunnanu viṣamulagunaviyu (phalamu nivvakapōvunaviyu) jananamaraṇamula kalugacēyunaviyu nagu anēkamaṃtramulatō brahmajñānulaku ēmi pani? okaṭē ayinanu anni maṃtramula phalamulaniccunadiyu samasta dōṣamulanu pōgoṭṭunadiyu agu “śrīrāmaśśaraṇaṃ mama” anu utkṛṣṭamaina aṣṭākṣarīmaṃtramu (enimidi akṣaramulugala maṃtramu) unnadikadā!)

  1. gāṇā satyēṣu śaivēṣu śākta saurēṣvabhīṣṭadaḥ |

vaiṣṇavēsyapi sarvēṣu rāmamaṃtraḥ phalādhikaḥ |

gāṇā patyādi maṃtrēbhya kōṭikōṭi guṇādhikaḥ | iti śrutiḥ.

(śaiva śākta (śaktiki lēka dēviki saṃbaṃdhiṃcinadi).gāṇāsatya (gaṇapatiki saṃbaṃdhiṃcinadi) saura (sūryuniki saṃbaṃdhinadi), vaiṣṇava (viṣṇuvunaku saṃbaṃdhiṃcinadi) maṃtrōpāsanalavalana kalugu phalamulakaṃṭe rāmamaṃtraphalamu adhikamu ani, paina ceppina maṃtramulu okkokkaṭikaṃṭe rāmamaṃtramu kōṭikōṭi reṭlu ādhikyamu galadi)

  1. “ślō || - - - bhavakulaharamaṃtraṃ bhūmijā prāṇamaṃtraṃ |

pavanajanuta maṃtraṃ pārvatī mōkṣamaṃtraṃ |

paśupati nijamaṃtraṃ pātumāṃ rāma maṃtraṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 108)

(janmalēkuṃḍa cēyunadi - anagā, mōkṣamiccunadi - sītādēviki prāṇamainaṭṭidi, hanumaṃtuni cēta stōtramucēyabaḍinadi, pārvatīdēviki mōkṣamiccunadi, īśvarunaku mukhyamainadi - svaṃtamainadi - ayina śrīrāmamaṃtramu nannu rakṣiṃcugāka)

  1. “ślō || saṃsārasāgara bhayāpaha viśvamaṃtraṃ |

sākṣānmumukṣu janasēvita siddhamaṃtraṃ |

sāraṃgahasta mukhaha sta nivāsamaṃtraṃ |

kaivalyamaṃtra maniśaṃ bhaja rāmamaṃtraṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 110)

(jananamaraṇamulu pravāharūpamugāgala saṃsāramanu mahāsamudramuvalana kalugu bhayamunu pōgoṭṭunadinnī, mōkṣamunu kaōruvāralacēta sēviṃcabaḍinadinnī, śivuḍu modalagu vāriki karatalāmalakamainadinnī, mōkṣamu kaligiṃcunadinnī ayina rāmamaṃtramunu ellapuḍu japiṃpumu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.