← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రామనామ మహత్మ్యము rāmanāma mahatmyamu

Original — తెలుగు
  1. “నజానే జానకీజానే, రామ త్వన్నామ వైభవం |

సర్వేశో భగవాన్ శంభుర్వాల్మీకిర్వేత్తి వా నవా ||” (శ్రీరామకర్ణామృతం - 3 - 89)

(ఓ రామా! నీనామ వైభవము - మహాత్మ్యము నాకు తెలియదు. సర్వేశ్వరుడు భగవంతుడు అయిన శివునికి, రామాయణము వ్రాసిన శ్రీవాల్మీకిమహామునికైనను తెలుసునో తెలియదో!).

  1. “జానాతి, రామ, తవనామ రుచిం మహేశో” (శ్రీరామకర్ణామృతం - 1 - 36)

(పదే పదే ‘రామరామ’ అని ఆ రామజపమందు రమించుచున్నాను. శ్రీమహేశ్వరునకు అందువలన దాని రుచి తెలిసియున్నను, దాని మహత్మ్యము నెఱుగలేకనున్నాడు)

  1. “రామా దన్యం నజానే, నహి కిమపి మహారామనామ్నస్సమానం” (శ్రీరామకర్ణామృతం 1 - 17)

(శ్రీరామునికంటె ఈతరమైనది నాకు తెలియదు - మాకు తెలిసినదంతయు రాముడె. అటువంటప్పుడు రామనామముతో సమానమైనది యున్నదని నాకెట్లు తెలుసును - తెలియదన్నమాట)

  1. “క. శ్రీరామరామ రామేతి రమేరామే, మనోరమే”

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

(శ్రేష్టమైన ముఖముగల రామునియందు అదేపనిగ రమించుదును - ఎందుచేతననగా ఆ రామ అను నామము భగవంతుని ఇతర నామములు వేయి నామములతో సమానము - అంతశక్తి కలది)

  1. యన్నామైవ సహస్రనామ సదృశం, యన్నామ వేదైస్సమం |

యన్నామాంకిత వాక్యమాసురబలస్త్రీ గర్భవిచ్ఛేదనం |

యన్నామశ్వపచార్య బేదరహితం ముక్తి ప్రదానోజ్జ్వలం |

తన్నామా రఘురామ రమణం శ్రీరామనామామృతం ||. (శ్రీరామకర్ణామృతం - 3 - 23)

(శ్రీరామనామము పరబ్రహ్మయొక్క ఇతరనామములు వేయింటితో సమానమైనది. అనగా వేయి ఇతరనామములు శక్తి ‘రామ’ అము ఒక్క నామములో నున్నది. (చూడుము - రామానామమహత్మ్యము - 4) రామనామము వేదముతో సమానము, రామనామముతో జతపర్చినవాక్యము రాక్షసస్త్రీగర్భములను ఛేదించును - ఆ నామము వినినంతమాత్రమున రాక్షసస్త్రీల గర్భములోనున్న పిల్లలుకూడ చనిపోవుదురు. రామనామము జపించినవారు యోగ్యులు, చండాలురు అని భేదములేకుండ అందఱికి మోక్షమునిచ్చునది. అమృతతుల్యమైన ఆ రామమను నామమును నిత్యము స్మరించెదను). అంత శక్తివంతమైనది రామనామము -

  1. శ్రీరామే త్యేకదా వక్తుం మనోయస్య ప్రవర్తతే |

వైకుంఠవాసిన స్తస్యకులమేకోత్తరం శతం | (శ్రీరామకర్ణామృతం - 1 - 100)

(శ్రీరామా అని ఒక్క పర్యాయము పలుకుటకు ఎవరికి మనస్సు కలుగునో అతని కులములోనివారు 101 కులములవారు ముక్తిని పొందుదురు - వైకుంఠమునకు పోవుదురు)

  1. “రామరామ, తవనామ జపంతః, పామరా అపి తరంతి భవాబ్థిం |

అంగ సంగి భవదంగుళిముద్రః కిం విచిత్ర మతర త్కపి రబ్ధిం ||” (శ్రీరామకర్ణామృతం - 4 - 77)

(ఓ రామా ! నీ నామమును జపించినవారు పామరులైనను - మూఢులైనను, దాని మహత్మ్యము తెలియని వారైనను - జరామరణములు ప్రవాహరూపముగా గల సంసారమను మహాసముద్రమును దాటుదురు. అటువంటిది - నీచేతి ఉంగరము - నీ శరీర తాకిడు కలిగినంతమాత్రమున - నీ శక్తిగలదైన ఉంగరమును ధరించినంతమాత్రమున (ప్రాకృత) మహా సముద్రమును దాటగలిగెను అనుటలో విచిత్రమేమున్నది.

  1. “శ్రీరామ నామామృతమంత్రబీజం, సంజీవినం నేన్మనసి ప్రతిష్ఠం |

హాలాహలంవా, ప్రళయానలంవా మృత్యోర్ముఖం వా వితధీకరోతి ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 78)

  1. (అమృతముతో సమానమైన శ్రీరామనామ మంత్రబీజమును మనసులో ప్రతిష్టచేసి నట్లుంచు కొనినట్లైన - నిత్యము ధ్యానించినట్లయిన హాలాహలముగాని, ప్రళయకాలమందలి అగ్నికాని, మృత్యువుకాని వానిని ఏమియు చేయజాలవు)

  2. “రామేతి వర్ణద్వయమాదరేణ సదాస్మరన్ ముక్తిముపైతి జంతుః |

కలౌయుగే కల్మషమానుషాణాం అన్యత్ర ధర్మే ఖలు నాధికారః ||” (శ్రీరామకర్ణామృతం - 1 - 93)

(కలియుగమందు కల్మషమనస్సుగల మనుష్యులు ‘రామ’ అను రెండక్షరములు భక్తితో ఎల్లపుడు స్మరించుచున్నయడల వారు ముక్తిని పొందుదురు. కలియుగమునకు ఇది విశేషము - ఇతర యుగములందు యీ ధర్మము వర్తించదు).

  1. “రా శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః |

పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్“. (శ్రీరామకర్ణామృతం - 1 - 100)

(‘రామ’ శబ్దము - మాట - లోని మొదటి అక్షరమగు ‘రా’ అని అనుటలో నోటినుండి పాపములన్నియు పైకి పోవును, రెండవ అక్షరమగు ‘మ’ అనునపుడు నోటినుండి పోయిన పాపములు తిరిగి నోటిద్వారా ప్రవేశించకుండ ‘మ’ కారము తలుపు వలెను - నోరు మకారము నుచ్చరించినపుడు పోయిన పాపములు తిరిగి రాకుండ అడ్డివేయును - ‘రా’ అనునప్పుడు నోరు విప్పి వేసియుండును. ‘మ’ అనునపుడు నోరు మూతబడియుండును).

  1. “శ్రీరామచంద్ర మహాత్మ్యం కృత్స్నం జానాతి శంకరః |

తదర్థం గిరిజావేత్తి తదర్థం వేద్మ్యహం మునే ||“. (ఆధ్యాత్మరామాయణము -)

(శ్రీరామచంద్రుని మహాత్మ్యము శివునికి పూర్తిగా తెలుసును - దానిలో సగము తెలుసును పార్వతీ దేవికి, దానిలో సగము నాకు తెలుసును - అనగా, శివునికి తప్ప శ్రీరామచంద్రుని మాహత్మ్యము ఎవరికిని పూర్తిగా తెలియదు)

  1. “రామాన్నాస్తి పరం పదం” (చూడుము - రాముడు -15)

  2. “అహం భవన్నామ ఘృణక్ కృతార్థో వసామికాశ్యామనిశం భవాన్యా |

ముమూర్షుమాణప్య విముక్తయే (అ)హం దిశామి మంత్రం తవ రామనామ ||“. (ఆధ్యాత్మరామాయణం - 15 - 62)

(నీ నామము నేను జపించుచు కాశీలో పార్వతితో కలిసి నివసించుచున్నాను - మోక్షము కోరువారికి ముక్తి కొఱకు నేను (శ్రీరామరామ, రామ) నీ మంత్రమును ఉపదేశించు చున్నాను) (శివుడు)

  1. .”కృత్యాకృత్య వివేకహీనమనసాం హత్యాదిభి ర్జీవినా |

మత్యంతం బహుతారకం తనుభృతా మత్యంత శోకాపహం |

సత్యానందమయం సమస్తనిగమస్తుత్యాస్పదం సంపదాం |

స్థానం శ్రీరఘురామ నామ విమలం నిత్యం స్మరన్ ముచ్యతే ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 90)

(ఏ పని చేయవలసినదో, ఏ పని చేయరానిదో అను విచక్షణలేనివారికి,హత్యలు మొదలగువాటిని చేయుచు జీవించువారికి తారమైనది - సంసారమను మహాసముద్రమును దాటించునది దేహము కలవారందఱికి గొప్ప శోకము అయిన మృత్యుభయమును పోగొట్టునది. సత్యానందమయమైనది, నిగమములచేత స్తోత్రముచేయుటకు స్థానమైనది, సంపదలకు స్థానమైనది, ఏ విధమైన దోషము లేనిది అయిన శ్రీరామనామము నిత్యము స్మరించిన ముక్తుడగును)

Transliteration
  1. “najānē jānakījānē, rāma tvannāma vaibhavaṃ |

sarvēśō bhagavān śaṃbhurvālmīkirvētti vā navā ||” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 89)

(ō rāmā! nīnāma vaibhavamu - mahātmyamu nāku teliyadu. sarvēśvaruḍu bhagavaṃtuḍu ayina śivuniki, rāmāyaṇamu vrāsina śrīvālmīkimahāmunikainanu telusunō teliyadō!).

  1. “jānāti, rāma, tavanāma ruciṃ mahēśō” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 36)

(padē padē ‘rāmarāma’ ani ā rāmajapamaṃdu ramiṃcucunnānu. śrīmahēśvarunaku aṃduvalana dāni ruci telisiyunnanu, dāni mahatmyamu neṟugalēkanunnāḍu)

  1. “rāmā danyaṃ najānē, nahi kimapi mahārāmanāmnassamānaṃ” (śrīrāmakarṇāmṛtaṃ 1 - 17)

(śrīrāmunikaṃṭe ītaramainadi nāku teliyadu - māku telisinadaṃtayu rāmuḍe. aṭuvaṃṭappuḍu rāmanāmamutō samānamainadi yunnadani nākeṭlu telusunu - teliyadannamāṭa)

  1. “ka. śrīrāmarāma rāmēti ramērāmē, manōramē”

sahasranāma tattulyaṃ rāmanāma varānanē.

(śrēṣṭamaina mukhamugala rāmuniyaṃdu adēpaniga ramiṃcudunu - eṃducētananagā ā rāma anu nāmamu bhagavaṃtuni itara nāmamulu vēyi nāmamulatō samānamu - aṃtaśakti kaladi)

  1. yannāmaiva sahasranāma sadṛśaṃ, yannāma vēdaissamaṃ |

yannāmāṃkita vākyamāsurabalastrī garbhavicchēdanaṃ |

yannāmaśvapacārya bēdarahitaṃ mukti pradānōjjvalaṃ |

tannāmā raghurāma ramaṇaṃ śrīrāmanāmāmṛtaṃ ||. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 23)

(śrīrāmanāmamu parabrahmayokka itaranāmamulu vēyiṃṭitō samānamainadi. anagā vēyi itaranāmamulu śakti ‘rāma’ amu okka nāmamulō nunnadi. (cūḍumu - rāmānāmamahatmyamu - 4) rāmanāmamu vēdamutō samānamu, rāmanāmamutō jataparcinavākyamu rākṣasastrīgarbhamulanu chēdiṃcunu - ā nāmamu vininaṃtamātramuna rākṣasastrīla garbhamulōnunna pillalukūḍa canipōvuduru. rāmanāmamu japiṃcinavāru yōgyulu, caṃḍāluru ani bhēdamulēkuṃḍa aṃdaṟiki mōkṣamuniccunadi. amṛtatulyamaina ā rāmamanu nāmamunu nityamu smariṃcedanu). aṃta śaktivaṃtamainadi rāmanāmamu -

  1. śrīrāmē tyēkadā vaktuṃ manōyasya pravartatē |

vaikuṃṭhavāsina stasyakulamēkōttaraṃ śataṃ | (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 100)

(śrīrāmā ani okka paryāyamu palukuṭaku evariki manassu kalugunō atani kulamulōnivāru 101 kulamulavāru muktini poṃduduru - vaikuṃṭhamunaku pōvuduru)

  1. “rāmarāma, tavanāma japaṃtaḥ, pāmarā api taraṃti bhavābthiṃ |

aṃga saṃgi bhavadaṃguḷimudraḥ kiṃ vicitra matara tkapi rabdhiṃ ||” (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 77)

(ō rāmā ! nī nāmamunu japiṃcinavāru pāmarulainanu - mūḍhulainanu, dāni mahatmyamu teliyani vārainanu - jarāmaraṇamulu pravāharūpamugā gala saṃsāramanu mahāsamudramunu dāṭuduru. aṭuvaṃṭidi - nīcēti uṃgaramu - nī śarīra tākiḍu kaliginaṃtamātramuna - nī śaktigaladaina uṃgaramunu dhariṃcinaṃtamātramuna (prākṛta) mahā samudramunu dāṭagaligenu anuṭalō vicitramēmunnadi.

  1. “śrīrāma nāmāmṛtamaṃtrabījaṃ, saṃjīvinaṃ nēnmanasi pratiṣṭhaṃ |

hālāhalaṃvā, praḷayānalaṃvā mṛtyōrmukhaṃ vā vitadhīkarōti ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 78)

  1. (amṛtamutō samānamaina śrīrāmanāma maṃtrabījamunu manasulō pratiṣṭacēsi naṭluṃcu koninaṭlaina - nityamu dhyāniṃcinaṭlayina hālāhalamugāni, praḷayakālamaṃdali agnikāni, mṛtyuvukāni vānini ēmiyu cēyajālavu)

  2. “rāmēti varṇadvayamādarēṇa sadāsmaran muktimupaiti jaṃtuḥ |

kalauyugē kalmaṣamānuṣāṇāṃ anyatra dharmē khalu nādhikāraḥ ||” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 93)

(kaliyugamaṃdu kalmaṣamanassugala manuṣyulu ‘rāma’ anu reṃḍakṣaramulu bhaktitō ellapuḍu smariṃcucunnayaḍala vāru muktini poṃduduru. kaliyugamunaku idi viśēṣamu - itara yugamulaṃdu yī dharmamu vartiṃcadu).

  1. “rā śabdōccāramātrēṇa mukhānniryāṃti pātakāḥ |

punaḥ pravēśa bhītyā ca makārastu kavāṭavat”. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 100)

(‘rāma’ śabdamu - māṭa - lōni modaṭi akṣaramagu ‘rā’ ani anuṭalō nōṭinuṃḍi pāpamulanniyu paiki pōvunu, reṃḍava akṣaramagu ‘ma’ anunapuḍu nōṭinuṃḍi pōyina pāpamulu tirigi nōṭidvārā pravēśiṃcakuṃḍa ‘ma’ kāramu talupu valenu - nōru makāramu nuccariṃcinapuḍu pōyina pāpamulu tirigi rākuṃḍa aḍḍivēyunu - ‘rā’ anunappuḍu nōru vippi vēsiyuṃḍunu. ‘ma’ anunapuḍu nōru mūtabaḍiyuṃḍunu).

  1. “śrīrāmacaṃdra mahātmyaṃ kṛtsnaṃ jānāti śaṃkaraḥ |

tadarthaṃ girijāvētti tadarthaṃ vēdmyahaṃ munē ||“. (ādhyātmarāmāyaṇamu -)

(śrīrāmacaṃdruni mahātmyamu śivuniki pūrtigā telusunu - dānilō sagamu telusunu pārvatī dēviki, dānilō sagamu nāku telusunu - anagā, śivuniki tappa śrīrāmacaṃdruni māhatmyamu evarikini pūrtigā teliyadu)

  1. “rāmānnāsti paraṃ padaṃ” (cūḍumu - rāmuḍu -15)

  2. “ahaṃ bhavannāma ghṛṇak kṛtārthō vasāmikāśyāmaniśaṃ bhavānyā |

mumūrṣumāṇapya vimuktayē (a)haṃ diśāmi maṃtraṃ tava rāmanāma ||“. (ādhyātmarāmāyaṇaṃ - 15 - 62)

(nī nāmamu nēnu japiṃcucu kāśīlō pārvatitō kalisi nivasiṃcucunnānu - mōkṣamu kōruvāriki mukti koṟaku nēnu (śrīrāmarāma, rāma) nī maṃtramunu upadēśiṃcu cunnānu) (śivuḍu)

  1. .”kṛtyākṛtya vivēkahīnamanasāṃ hatyādibhi rjīvinā |

matyaṃtaṃ bahutārakaṃ tanubhṛtā matyaṃta śōkāpahaṃ |

satyānaṃdamayaṃ samastanigamastutyāspadaṃ saṃpadāṃ |

sthānaṃ śrīraghurāma nāma vimalaṃ nityaṃ smaran mucyatē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 90)

(ē pani cēyavalasinadō, ē pani cēyarānidō anu vicakṣaṇalēnivāriki,hatyalu modalaguvāṭini cēyucu jīviṃcuvāriki tāramainadi - saṃsāramanu mahāsamudramunu dāṭiṃcunadi dēhamu kalavāraṃdaṟiki goppa śōkamu ayina mṛtyubhayamunu pōgoṭṭunadi. satyānaṃdamayamainadi, nigamamulacēta stōtramucēyuṭaku sthānamainadi, saṃpadalaku sthānamainadi, ē vidhamaina dōṣamu lēnidi ayina śrīrāmanāmamu nityamu smariṃcina muktuḍagunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.