← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రౌరవనరకము rauravanarakamu

Original — తెలుగు
  1. నరకవిశేషము -

  2. “శ్లో ||. రౌరవే నామ నరకే సర్వసత్వ భయావహే |

ఇహలోకే అమునా యేతుహింసితాః జంతువః పురా |

తయేవ రరహో భూత్వా పరత్ర పీడయంతి తం |

తస్మాత్ రౌరవ మిత్యాహుః పురాణజ్ఞాః మనీషిణః |

రురుః సర్వాత్ అతి క్రూరో జంతు రుక్తః పురాతనైః |

ఏవం మహారౌరవాఖ్యో నరకో యత్ర పూరుషః |

యాతనాం ప్రాప్య మాణో హియః పరందేహసంభవః ||“.

(ఈ లోకమునందు ఏ జంతువులు పూర్వము హింసింపబడినవో అవియే పరలోకమందు ‘రురు’ అను రూపములు దాల్చి వాటిని హింసించ వానిని పీడించును. అందుచేత అది రౌరవ నరకమని పురాణములను తెలిసిన పండితులు చెప్పుదురు. రురువు అనునది పాము కంటె మిక్కిలి క్రూరమైన జంతువు అని పూర్వులచే చెప్పబడినది. ఈ రౌరవమను నరకము గొప్ప భయమును కలిగించునది. ఇక్కడ నరుడు గొప్ప యాతనను - నరకయాతనను - బాధను - పొందును. ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

  1. “ఎవ్వండేనిం గుటుంబపోషణార్థంబు పరులకు ద్రోహము చేయు నానరుండు రౌరవ నరకంబునం బడు. ఎవ్వండిహలోకంబునందు స్వేచ్ఛావిహారంబున సంచరించుచు పరోపద్రవ పరాఙ్ముఖులయి యుండు పశుపక్షి మృగాదుల బాధించు నాయా మృగంబులు రురు రూపంబులు దాల్చి యట్టి పాపజనుల నానావిధ యాతనల బాధించుటం జేసి రైరవ మహారౌరవ నరకంబులం బడు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2- 138)

Transliteration
  1. narakaviśēṣamu -

  2. “ślō ||. rauravē nāma narakē sarvasatva bhayāvahē |

ihalōkē amunā yētuhiṃsitāḥ jaṃtuvaḥ purā |

tayēva rarahō bhūtvā paratra pīḍayaṃti taṃ |

tasmāt raurava mityāhuḥ purāṇajñāḥ manīṣiṇaḥ |

ruruḥ sarvāt ati krūrō jaṃtu ruktaḥ purātanaiḥ |

ēvaṃ mahārauravākhyō narakō yatra pūruṣaḥ |

yātanāṃ prāpya māṇō hiyaḥ paraṃdēhasaṃbhavaḥ ||“.

(ī lōkamunaṃdu ē jaṃtuvulu pūrvamu hiṃsiṃpabaḍinavō aviyē paralōkamaṃdu ‘ruru’ anu rūpamulu dālci vāṭini hiṃsiṃca vānini pīḍiṃcunu. aṃducēta adi raurava narakamani purāṇamulanu telisina paṃḍitulu ceppuduru. ruruvu anunadi pāmu kaṃṭe mikkili krūramaina jaṃtuvu ani pūrvulacē ceppabaḍinadi. ī rauravamanu narakamu goppa bhayamunu kaligiṃcunadi. ikkaḍa naruḍu goppa yātananu - narakayātananu - bādhanu - poṃdunu. ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

  1. “evvaṃḍēniṃ guṭuṃbapōṣaṇārthaṃbu parulaku drōhamu cēyu nānaruṃḍu raurava narakaṃbunaṃ baḍu. evvaṃḍihalōkaṃbunaṃdu svēcchāvihāraṃbuna saṃcariṃcucu parōpadrava parāṅmukhulayi yuṃḍu paśupakṣi mṛgādula bādhiṃcu nāyā mṛgaṃbulu ruru rūpaṃbulu dālci yaṭṭi pāpajanula nānāvidha yātanala bādhiṃcuṭaṃ jēsi rairava mahāraurava narakaṃbulaṃ baḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2- 138)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.