← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రేతః rētaḥ

Original — తెలుగు
  1. ఇంద్రియము

  2. కర్మజ్ఞానాధి కృతస్య ప్రజాపతేః రేతసః సృష్టిరుచ్యతే. ఇత్థం భూత ప్రజాపతేః రేతః కార్యం వాగాద్యభిమానినో అగ్న్యాదయో దేవాః సంభూతాః - దేవానాం రేతో వృష్టిః వర్షం. వృష్టేః కార్యం వ్రీహ్యాద్యోష ధయః - అఓషధీనాం రేతః ప్రసిద్ధం అన్నం. పురుష భుక్తాన్నస్య రేతః నృబీజం రేతః కార్యం. స్త్రీ యోని నిషిక్త రేతసః రేతః ప్రజాః. ఇత్యనేన క్రమేణ ప్రజానాం స్రష్టుత్వాత్ ప్రజాపతి త్వం పురుషస్య ఇత్యర్థః -

(కర్మజ్ఞానములనధికరించి యుండు ప్రజాపతియొక్క - చతుర్ముఖ బ్రహ్మయొక్క రేతస్సువలన సృష్టియగుచున్నదని చెప్పబడినది. వాక్కు మొదలగువాని అభిమానదేవతలు - అనగా, అగ్ని మొదలగునవి ఇటువంటి ప్రజాపతి యొక్క రేతస్సు, రేతస్సు యొక్క కార్యములు, రేతస్సువలన పుట్టినవి. ఆ దేవతుల రేతస్సు వర్షము - వర్షము యొక్క కార్యము, వర్షమువలన కలిగినవి, వ్రీహి మొదలగు ఓషధులు, ఓషధుల రేతస్సు అన్నము అని లోకములో ప్రసిద్దియే. ఈ అన్నము తినిన పురుషుని యొక్క రేతస్సు నరులు బీజము, రేతస్సు యొక్క కార్యము.(రేతస్సు వలన కలిగినది, రేతస్సు నుండి పరిణమించినది. స్త్రీ యోని యందుంచబడిన రేతస్సువలన ప్రజలు కలుగుచున్నారు. ఈ క్రమముగా సృష్టి చేయుచుండుటవలన పురుషుడు (భగవంతుడు) లేక, చతుర్ముఖబ్రహ్మ ప్రజాపతి చెప్పబడుచున్నాడు).

  1. “అన్నభావమాపన్న ప్రజాపతేరేవ శుక్ల శోణితాత్మకం ప్రజోద్భూత కారణం రేతో భవతి. తస్మాత్ రేతసః ఇమాః మనుష్యాదిలక్షణాః ప్రజాః జాయంతే”.

(ప్రజాపతి యొక్క - చతుర్ముఖబ్రహ్మయొక్క - శుక్లశోణితములు అన్నముగా పరిణమించి (మారి) ప్రజలను సృష్టించుటకు కారణమైన రేతస్సు అగుచున్నది. అందుచేత రేతస్సునుండి మనుష్యులు మొదలగు లక్షణములుగల ప్రజలు - జంతుజాలము, జీవకోటి - పుట్టుచున్నారు -)

  1. “ఆపో రేతో భూత్వా శిశ్నం ప్రావిశత్” (ఐతరేయోపనిషత్)

(జలము - నీరు - రేతస్సుగామారి శిశ్నమును పొందును. సప్త ధాతువులలో ఒకదానినుండి ఒకటి కలిగినపుడు వాటి రసము జలముతో కలిసియుండుటచేత అవి పరిణమించుటకు జలమే తోడ్పడును - జలములో అవి లీనమై శరీరములోని ఆయా అవయవములకు వ్యాపించును. (channel of supply or circulation).

  1. పంచాత్మకంగా కలిగినవారు స్త్రీపురుషులు - మధురామ్ల లవణ, తిక్త, కటుకషాయములచే షడ్రాసాలవల్ల షడాశ్రయమైనటువంటి భక్ష్య, భోజ్య, లేహ్య చోష్యంబులనే చతుర్విధ భోజ్య వస్తువులను భుజించిన స్త్రీపురుషులకు విషయ వైచిత్ర్యమువల్ల ఆ యన్నరసమే సప్త దివసాలకు రేతస్సాయెను - “అన్నాద్రసః, రసాచ్చోణితం, శోణితాత్ మాంసః, మాంసాన్మేదిః, మేదసః స్నాయుః, స్నాయుభ్యో అస్థీని, అస్థిభ్యో మజ్జా, మజ్జాయాః శుక్లః” ఇతి. ఈ యర్థమందు శ్రుతి - “రేతస్సేవ ప్రాణం దదాతి” సప్త ధాతువులవలన కలిగిన రేతస్సునందు జీవముండును. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

(అన్నమునుండి రసము, రసమునుడి రక్తము, రక్తమునుండి మాంసము, మాసమునుండి మేదస్సు, స్నాయువు, స్నాయువునుండి అస్తి (యెముకలు), అస్తినుండి మజ్జా, మజ్జానుండి శుక్లము” ఈ రీతిగా తినిన అన్నమే క్రమముగా మార్పులు చెందును - కనుక అన్నమే రేతస్సుగా చివరకు మారును. దీనిని గుఱించి శ్రుతి ఈ ప్రకారముగా చెప్పచున్నది - ” రేతస్సే ప్రాణము నిచ్చునది.” పైన చెప్పిన ఏడు ధాతువులవలన కలిగిన రేతస్సునందు జీవముండును - అన్నములోనుండు జీవాంశ, అన్నము ఎన్ని మార్పులు చెందినను వాటి అన్నిటిలోనుండి తుదకు రేతస్సులో సూక్ష్మరూపములో జీవుడై యుండును, జీవము కలది యనిపించుకొనును).

Transliteration
  1. iṃdriyamu

  2. karmajñānādhi kṛtasya prajāpatēḥ rētasaḥ sṛṣṭirucyatē. itthaṃ bhūta prajāpatēḥ rētaḥ kāryaṃ vāgādyabhimāninō agnyādayō dēvāḥ saṃbhūtāḥ - dēvānāṃ rētō vṛṣṭiḥ varṣaṃ. vṛṣṭēḥ kāryaṃ vrīhyādyōṣa dhayaḥ - aōṣadhīnāṃ rētaḥ prasiddhaṃ annaṃ. puruṣa bhuktānnasya rētaḥ nṛbījaṃ rētaḥ kāryaṃ. strī yōni niṣikta rētasaḥ rētaḥ prajāḥ. ityanēna kramēṇa prajānāṃ sraṣṭutvāt prajāpati tvaṃ puruṣasya ityarthaḥ -

(karmajñānamulanadhikariṃci yuṃḍu prajāpatiyokka - caturmukha brahmayokka rētassuvalana sṛṣṭiyagucunnadani ceppabaḍinadi. vākku modalaguvāni abhimānadēvatalu - anagā, agni modalagunavi iṭuvaṃṭi prajāpati yokka rētassu, rētassu yokka kāryamulu, rētassuvalana puṭṭinavi. ā dēvatula rētassu varṣamu - varṣamu yokka kāryamu, varṣamuvalana kaliginavi, vrīhi modalagu ōṣadhulu, ōṣadhula rētassu annamu ani lōkamulō prasiddiyē. ī annamu tinina puruṣuni yokka rētassu narulu bījamu, rētassu yokka kāryamu.(rētassu valana kaliginadi, rētassu nuṃḍi pariṇamiṃcinadi. strī yōni yaṃduṃcabaḍina rētassuvalana prajalu kalugucunnāru. ī kramamugā sṛṣṭi cēyucuṃḍuṭavalana puruṣuḍu (bhagavaṃtuḍu) lēka, caturmukhabrahma prajāpati ceppabaḍucunnāḍu).

  1. “annabhāvamāpanna prajāpatērēva śukla śōṇitātmakaṃ prajōdbhūta kāraṇaṃ rētō bhavati. tasmāt rētasaḥ imāḥ manuṣyādilakṣaṇāḥ prajāḥ jāyaṃtē”.

(prajāpati yokka - caturmukhabrahmayokka - śuklaśōṇitamulu annamugā pariṇamiṃci (māri) prajalanu sṛṣṭiṃcuṭaku kāraṇamaina rētassu agucunnadi. aṃducēta rētassunuṃḍi manuṣyulu modalagu lakṣaṇamulugala prajalu - jaṃtujālamu, jīvakōṭi - puṭṭucunnāru -)

  1. “āpō rētō bhūtvā śiśnaṃ prāviśat” (aitarēyōpaniṣat)

(jalamu - nīru - rētassugāmāri śiśnamunu poṃdunu. sapta dhātuvulalō okadāninuṃḍi okaṭi kaliginapuḍu vāṭi rasamu jalamutō kalisiyuṃḍuṭacēta avi pariṇamiṃcuṭaku jalamē tōḍpaḍunu - jalamulō avi līnamai śarīramulōni āyā avayavamulaku vyāpiṃcunu. (channel of supply or circulation).

  1. paṃcātmakaṃgā kaliginavāru strīpuruṣulu - madhurāmla lavaṇa, tikta, kaṭukaṣāyamulacē ṣaḍrāsālavalla ṣaḍāśrayamainaṭuvaṃṭi bhakṣya, bhōjya, lēhya cōṣyaṃbulanē caturvidha bhōjya vastuvulanu bhujiṃcina strīpuruṣulaku viṣaya vaicitryamuvalla ā yannarasamē sapta divasālaku rētassāyenu - “annādrasaḥ, rasāccōṇitaṃ, śōṇitāt māṃsaḥ, māṃsānmēdiḥ, mēdasaḥ snāyuḥ, snāyubhyō asthīni, asthibhyō majjā, majjāyāḥ śuklaḥ” iti. ī yarthamaṃdu śruti - “rētassēva prāṇaṃ dadāti” sapta dhātuvulavalana kaligina rētassunaṃdu jīvamuṃḍunu. (brahmavidyāsudhārṇavamu - 2)

(annamunuṃḍi rasamu, rasamunuḍi raktamu, raktamunuṃḍi māṃsamu, māsamunuṃḍi mēdassu, snāyuvu, snāyuvunuṃḍi asti (yemukalu), astinuṃḍi majjā, majjānuṃḍi śuklamu” ī rītigā tinina annamē kramamugā mārpulu ceṃdunu - kanuka annamē rētassugā civaraku mārunu. dīnini guṟiṃci śruti ī prakāramugā ceppacunnadi - ” rētassē prāṇamu niccunadi.” paina ceppina ēḍu dhātuvulavalana kaligina rētassunaṃdu jīvamuṃḍunu - annamulōnuṃḍu jīvāṃśa, annamu enni mārpulu ceṃdinanu vāṭi anniṭilōnuṃḍi tudaku rētassulō sūkṣmarūpamulō jīvuḍai yuṃḍunu, jīvamu kaladi yanipiṃcukonunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.