← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రుద్రుడు rudruḍu

Original — తెలుగు
  1. “రుర్దుఃఖం దుఃఖహేతుం వా తత్ ద్రావయతి యః ప్రభుః |

రుద్ర ఇత్యుచ్యతే తస్మాచ్ఛివః పరమ కారణం ||“.

ఇతి శివపురాణవచనాత్ - ఇతి లింగపురాణ వచనాత్ చ. (వాయవీయ సమ్హితాయాం)

(రుః = దుఃఖము; దుఃఖమును లేక దుఃఖకారణమును పోగుట్టువాడు - అన్నింటికి కారణమైనవాడు).

  1. స్వా జ్ఞానరుజం ద్రావయతి, నాశయతీతి రుద్రః, పరమేశ్వరః -

(తన నిజస్థితిని - తానే పరమాత్మయని తెలుసుకొనుట - తెలియకపోవుట యను అజ్ఞానమును, లేక, సంసారమును నశింపచేయువాడు, రోగములను పోగొట్టువాడు - పరమేశ్వరుడు)

  1. దుఃఖం, తన్మూలే రాగద్వేషౌ, తన్మూలా జ్ఞానంచ ద్రావతీతి రుద్రః - అజ్ఞాన సమ్హార సమర్థ జ్ఞానాకారః ఇత్యర్థః -

(దుఃఖమునకు, దానికి మూలమైన రాగద్వేషములను, వాటికి మూలమైన అజ్ఞానమును నశింపచేయువాడు. అజ్ఞానమును పోగొట్టుటకు సమర్థమైన జ్ఞానమే ఆకారముగాగలవాడు).

  1. సంసార రుజం ద్రావ యతీతి రుద్రః -

(సంసారమను దుఃఖమును పోగొట్టువాడు)

  1. రుత్యా వేదరూపయా ధర్మాదీన్ ద్రావయతి, బోధయతి, ప్రసయతి ఇతి వా రుద్రః.

(వేదమూలముగా ధర్మములను బోధించువాడు, ప్రతిపాదించువాడు).

  1. రుత్యా వా గ్రూపయా వాచ్యం బోధయతి ప్రతిపాదయ తీతి వా రుద్రః.

(వాగ్రూపములో చెప్పతగినది బోధించువాడు).

  1. రుతం శబ్దం వేదాత్మకం బ్రహ్మణే కల్పాదౌ ద దాతీతివా రుద్రః - తథా శ్రుతిః -: “యో బ్రహ్మణం విదధాతి పూర్వం, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై” ఇతి.

(రుతమనగా శబ్దము - వేదము - వేదమును కల్ప ప్రారంభములో బ్రహ్మకు ఇచ్చిన వాడు శ్రుతి. ఈ విషయమిట్లు చెప్పుచున్నది - “ఎవడు బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను చెప్పెనో అతనికి నమస్కారము).

  1. “స్వాత్మ విద్యా ప్రథానేన సంసారాన్మోచయతీతివా రుద్రః”

“స్వాత్మ విద్యా ప్రదానేన స దా సంసారమోచికం |

రుద్రం పరమ కారుణ్యాత్ సర్వప్రాణి హితే రతం ||. (సూతసంహితాయాం)

(స్వాత్మవిద్యా ప్రథానముచేత సంసారమునుండి మోక్షము నిచ్చువాడు - పరమ కారుణ్యము గలవాడగుటచేత సమస్త ప్రాణములందు హితము కలిగి యుండువాడు)

  1. సంహారకాలే ప్రజాఃసంహరన్ రోదయతీతి రుద్రః -

(సంహారకాలమందు ప్రజలను సంహరించుచు, ఏడ్పించువాడు)

  1. రుదందాతి దదాతి ఇతి ఇతివా -

(దుఃఖము నొసగువాడు)

  1. తమోగుణప్రథానమాయా విశిష్ట చైతన్యము.

  2. పదునొకండు రుద్రులు - (ఏకాదశరుద్రులు) : -

1.హరుడు, 2.బహురూపుడు, 3.త్యంబకుడు, 4.అపరాజితుడు, 5.వృషాకపి, 6.శంభువు, 7.కపర్ది, 8.రైవతుడు, 9.మృగవ్యాధుడు, 10.శర్వుడు, 11.కపాలి.

  1. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః” (మంత్రపుష్పము - 27)

(యజ్ఞము, వషట్కారము, ఇంద్రుడు రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతివి నీవే).

  1. స్వాతిరిక్తాస్తి తారుజం ద్రావయతి నాశయతీతి రుద్రః - స్వాతిరిక్తత్వేన పరాగ్భావ మాపన్న స్వావిద్యాపద తత్కార్య భూత రుజం ద్రావయతీతి రుద్రః -

(పరబ్రహ్మకంటె ఇతర వస్తువు కలదు అను దుఃఖమును - అజ్ఞానమును నశింపచేయువాడు).

  1. “రోదనా ద్రావణాత్ వాపి రుద్ర ఇత్యుచ్యతే.”

(రోదనము చేయుటచేత రుద్రుడు –

మ. జననం బందిన నీల లోహితుడు గంజాతాసను చూచి యి

ట్లను - “నోదేవ! మదాఖ్యలెట్టివి? మదీయా వాసముల్ వీకనా

కనయంబున్నెఱింగింపవే ” యనుడు నయ్యంబోజ గర్భుండు లా

లనముం దోప, ‘గుమార’, నీ జనన వేళన్ రోదనం బిచ్చుటన్.

తే. రుద్రనామంబునీకు నిరూఢమయ్యె

జంద్ర సూర్యానలానిల సలిలగగన

పృధివి, ప్రాణ, తపో హృదింద్రియములనగ

గలుగు నేకాశస్థానముల వసింపు

వ. అని వెండియు మన్యు, మను మహాకాల మహచ్ఛివ ఋతద్వజోరు రేతోభవ, కాల వామదేవ ధృతవ్రతులను నేకాదశనామంబులు గలిగి, ధీవృత్యశనో మా నియుత్సర్సి రిలాంబికా రేవతీ సుధా దీక్షానామ పత్నీసమేతుండై పూర్వయుక్తంబులయిన నామంబులం దత్తన్నివాసంబుల వసియించి ప్రజలం గల్పింపుమని నిర్దేశించిన - - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 368 to 370)

Transliteration
  1. “rurduḥkhaṃ duḥkhahētuṃ vā tat drāvayati yaḥ prabhuḥ |

rudra ityucyatē tasmācchivaḥ parama kāraṇaṃ ||“.

iti śivapurāṇavacanāt - iti liṃgapurāṇa vacanāt ca. (vāyavīya samhitāyāṃ)

(ruḥ = duḥkhamu; duḥkhamunu lēka duḥkhakāraṇamunu pōguṭṭuvāḍu - anniṃṭiki kāraṇamainavāḍu).

  1. svā jñānarujaṃ drāvayati, nāśayatīti rudraḥ, paramēśvaraḥ -

(tana nijasthitini - tānē paramātmayani telusukonuṭa - teliyakapōvuṭa yanu ajñānamunu, lēka, saṃsāramunu naśiṃpacēyuvāḍu, rōgamulanu pōgoṭṭuvāḍu - paramēśvaruḍu)

  1. duḥkhaṃ, tanmūlē rāgadvēṣau, tanmūlā jñānaṃca drāvatīti rudraḥ - ajñāna samhāra samartha jñānākāraḥ ityarthaḥ -

(duḥkhamunaku, dāniki mūlamaina rāgadvēṣamulanu, vāṭiki mūlamaina ajñānamunu naśiṃpacēyuvāḍu. ajñānamunu pōgoṭṭuṭaku samarthamaina jñānamē ākāramugāgalavāḍu).

  1. saṃsāra rujaṃ drāva yatīti rudraḥ -

(saṃsāramanu duḥkhamunu pōgoṭṭuvāḍu)

  1. rutyā vēdarūpayā dharmādīn drāvayati, bōdhayati, prasayati iti vā rudraḥ.

(vēdamūlamugā dharmamulanu bōdhiṃcuvāḍu, pratipādiṃcuvāḍu).

  1. rutyā vā grūpayā vācyaṃ bōdhayati pratipādaya tīti vā rudraḥ.

(vāgrūpamulō ceppataginadi bōdhiṃcuvāḍu).

  1. rutaṃ śabdaṃ vēdātmakaṃ brahmaṇē kalpādau da dātītivā rudraḥ - tathā śrutiḥ -: “yō brahmaṇaṃ vidadhāti pūrvaṃ, yō vai vēdāṃśca prahiṇōti tasmai” iti.

(rutamanagā śabdamu - vēdamu - vēdamunu kalpa prāraṃbhamulō brahmaku iccina vāḍu śruti. ī viṣayamiṭlu ceppucunnadi - “evaḍu brahmanu sṛṣṭiṃci ataniki vēdamulanu ceppenō ataniki namaskāramu).

  1. “svātma vidyā prathānēna saṃsārānmōcayatītivā rudraḥ”

“svātma vidyā pradānēna sa dā saṃsāramōcikaṃ |

rudraṃ parama kāruṇyāt sarvaprāṇi hitē rataṃ ||. (sūtasaṃhitāyāṃ)

(svātmavidyā prathānamucēta saṃsāramunuṃḍi mōkṣamu niccuvāḍu - parama kāruṇyamu galavāḍaguṭacēta samasta prāṇamulaṃdu hitamu kaligi yuṃḍuvāḍu)

  1. saṃhārakālē prajāḥsaṃharan rōdayatīti rudraḥ -

(saṃhārakālamaṃdu prajalanu saṃhariṃcucu, ēḍpiṃcuvāḍu)

  1. rudaṃdāti dadāti iti itivā -

(duḥkhamu nosaguvāḍu)

  1. tamōguṇaprathānamāyā viśiṣṭa caitanyamu.

  2. padunokaṃḍu rudrulu - (ēkādaśarudrulu) : -

1.haruḍu, 2.bahurūpuḍu, 3.tyaṃbakuḍu, 4.aparājituḍu, 5.vṛṣākapi, 6.śaṃbhuvu, 7.kapardi, 8.raivatuḍu, 9.mṛgavyādhuḍu, 10.śarvuḍu, 11.kapāli.

  1. tvaṃ yajñastvaṃ vaṣaṭkārastva miṃdrastvaṃ rudrastvaṃ viṣṇustvaṃ brahmatvaṃ prajāpatiḥ” (maṃtrapuṣpamu - 27)

(yajñamu, vaṣaṭkāramu, iṃdruḍu rudruḍu, viṣṇuvu, brahma, prajāpativi nīvē).

  1. svātiriktāsti tārujaṃ drāvayati nāśayatīti rudraḥ - svātiriktatvēna parāgbhāva māpanna svāvidyāpada tatkārya bhūta rujaṃ drāvayatīti rudraḥ -

(parabrahmakaṃṭe itara vastuvu kaladu anu duḥkhamunu - ajñānamunu naśiṃpacēyuvāḍu).

  1. “rōdanā drāvaṇāt vāpi rudra ityucyatē.”

(rōdanamu cēyuṭacēta rudruḍu –

ma. jananaṃ baṃdina nīla lōhituḍu gaṃjātāsanu cūci yi

ṭlanu - “nōdēva! madākhyaleṭṭivi? madīyā vāsamul vīkanā

kanayaṃbunneṟiṃgiṃpavē ” yanuḍu nayyaṃbōja garbhuṃḍu lā

lanamuṃ dōpa, ‘gumāra’, nī janana vēḷan rōdanaṃ biccuṭan.

tē. rudranāmaṃbunīku nirūḍhamayye

jaṃdra sūryānalānila salilagagana

pṛdhivi, prāṇa, tapō hṛdiṃdriyamulanaga

galugu nēkāśasthānamula vasiṃpu

va. ani veṃḍiyu manyu, manu mahākāla mahacchiva ṛtadvajōru rētōbhava, kāla vāmadēva dhṛtavratulanu nēkādaśanāmaṃbulu galigi, dhīvṛtyaśanō mā niyutsarsi rilāṃbikā rēvatī sudhā dīkṣānāma patnīsamētuṃḍai pūrvayuktaṃbulayina nāmaṃbulaṃ dattannivāsaṃbula vasiyiṃci prajalaṃ galpiṃpumani nirdēśiṃcina - - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 368 to 370)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.