← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రూపము rūpamu

Original — తెలుగు
  1. రూప్యతే అనయా ఇతి రూపం - స్వరూపం -

(నిరూపించునది కనుక రూపము - స్వరూపము)

  1. లింగం; విగ్రహః; శరీరం.

(లింగము, ఆకారము, శరీరము, విగ్రహము).

  1. “చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణో రూపం; తచ్చ శుక్ల నీల పీత, రక్త, హరిత, కపిశ, చిత్రభేదాత్ సప్త విధం; పృధ్వీజల తేజోవృత్తిః తత్ర పృథివ్యాం సప్త విధం అభాస్వర శుక్లం, జలే, భాస్వరశుక్లం తేజసి - - -” (తర్కసంగ్రహే)

“చక్షుర్మాత్ర గ్రాహ్యత్వ విశిష్టగుణత్వం రూపస్య లక్షణం - - చక్షుర్మాత్ర గ్రాహ్యత్వం నామ చక్షుర్భిన్నేంద్రియాగ్రాహ్యత్వే సతి చక్షుర్గ్రాహ్యత్వం.” (న్యాయ బోధిని)

(సూక్ష్మరూపములోనున్న కంటిచేత గ్రహింపబడునది రూపము - ఇదే రూపముయొక్క లక్షణము. అనగా, కన్నుకాక ఇతర ఇంద్రియములచేత గ్రహించబడునదికాదు. ఈ రూపము శుక్ల, నీల, పీత, రక్త, హరిత, కపిశ, చిత్ర భేదములు అను ఏడు విధముల భేదము కలదు. ఇది పృధివి, జలము, తేజస్సు అను మూడింటివృత్తి కలది. అందులోను పృధివిలో ఏడు విధములు. జలమందు ప్రకాశములేని తెల్లదనము - తేజస్సులో (అగ్నిలో) ప్రకాశించు తెల్లదనము)

  1. ఇదం నీలం శుక్లాది ఇత్యాది -

(ఇది నీలముగానున్నది, ఇది తెల్లగా నున్నది అని మొదలగు రంగులు కలిగియుండుట).

  1. వ. దైవ ప్రేరితంబైన స్పర్శ తనుమాత్రగుణకంబగు వాయువువలన రూపంబును, దానివలన దేజంబునుం బుట్టె. రూపంబు నేత్రిందియగా వాకంబయ్యె. నేత్రగతంబయిన రూపంబునకు నుప లంబకత్వంబును, ద్రవ్యాకాశసమత్వంబును, ద్రవ్యంబునకు నుపసర్జినంగుబగుటయు, ద్రవ్యపరిణామ ప్రతీతియు, నివి రూపవృత్తులనంబడు - - -- రూప తన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబునొందు తేజస్సువలన రసతన్మాత్రంబు పుట్టె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)

  2. “అప్పు నిజాంశమే రసవిషయమాయెను - - అగ్నితో గూఢంగాను రూపవిషయమాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)

Transliteration
  1. rūpyatē anayā iti rūpaṃ - svarūpaṃ -

(nirūpiṃcunadi kanuka rūpamu - svarūpamu)

  1. liṃgaṃ; vigrahaḥ; śarīraṃ.

(liṃgamu, ākāramu, śarīramu, vigrahamu).

  1. “cakṣurmātra grāhyō guṇō rūpaṃ; tacca śukla nīla pīta, rakta, harita, kapiśa, citrabhēdāt sapta vidhaṃ; pṛdhvījala tējōvṛttiḥ tatra pṛthivyāṃ sapta vidhaṃ abhāsvara śuklaṃ, jalē, bhāsvaraśuklaṃ tējasi - - -” (tarkasaṃgrahē)

“cakṣurmātra grāhyatva viśiṣṭaguṇatvaṃ rūpasya lakṣaṇaṃ - - cakṣurmātra grāhyatvaṃ nāma cakṣurbhinnēṃdriyāgrāhyatvē sati cakṣurgrāhyatvaṃ.” (nyāya bōdhini)

(sūkṣmarūpamulōnunna kaṃṭicēta grahiṃpabaḍunadi rūpamu - idē rūpamuyokka lakṣaṇamu. anagā, kannukāka itara iṃdriyamulacēta grahiṃcabaḍunadikādu. ī rūpamu śukla, nīla, pīta, rakta, harita, kapiśa, citra bhēdamulu anu ēḍu vidhamula bhēdamu kaladu. idi pṛdhivi, jalamu, tējassu anu mūḍiṃṭivṛtti kaladi. aṃdulōnu pṛdhivilō ēḍu vidhamulu. jalamaṃdu prakāśamulēni telladanamu - tējassulō (agnilō) prakāśiṃcu telladanamu)

  1. idaṃ nīlaṃ śuklādi ityādi -

(idi nīlamugānunnadi, idi tellagā nunnadi ani modalagu raṃgulu kaligiyuṃḍuṭa).

  1. va. daiva prēritaṃbaina sparśa tanumātraguṇakaṃbagu vāyuvuvalana rūpaṃbunu, dānivalana dējaṃbunuṃ buṭṭe. rūpaṃbu nētriṃdiyagā vākaṃbayye. nētragataṃbayina rūpaṃbunaku nupa laṃbakatvaṃbunu, dravyākāśasamatvaṃbunu, dravyaṃbunaku nupasarjinaṃgubaguṭayu, dravyapariṇāma pratītiyu, nivi rūpavṛttulanaṃbaḍu - - -- rūpa tanmātraṃbuvalana daivacōditaṃbai vikāraṃbunoṃdu tējassuvalana rasatanmātraṃbu puṭṭe” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)

  2. “appu nijāṃśamē rasaviṣayamāyenu - - agnitō gūḍhaṃgānu rūpaviṣayamāyenu”. (brahmavidyāsudhārṇavamu - 1)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.