(తన నిజరూపమును తెలుసుకొనలేక, తానే (జీవాత్మయే) పరమాత్మయను సత్యమును తెలుసుకొనలేక అజ్ఞానులైనవారు చనిపోయినతర్వాత మరల శరీరమును పొందుటకు - జన్మించుటకు - శుక్లము, రక్తము, బీజముతో కూడిన శరీరులై అనేక యోనులను ప్రవేశించుచున్నారు. మఱికొందఱు మూఢులు చనిపోయినతర్వాత చెట్టు మొదలగునవిగా పుట్టుచున్నారు - ఈ జన్మలో ఏ కర్మచేసి యేజ్ఞానము సంపాదించిరో దానికి అనురూపమైన - తగిన - శరీరములను (ఒక శరీరము తర్వాత నింకొక శరీరమును) పొందుచున్నారు - వారు సంపాదించిన జ్ఞానమును బట్టియే జన్మములు కలుగుచున్నవి, అని శ్రుతి చెప్పుచున్నది.
పుట్టినవానికి మరణము తప్పదు; మరణించినవానికి మరల జన్మ తప్పదు - ప్రాణులు పుట్టుచు, మరణించుచు, మరల పుట్టుచు మరల మరణించుచుందురు - ఇదియే జన్మ పరంపరం - ఒక జన్మ తర్వాత మఱియొక జన్మ, తర్వాత నింకొక జన్మ
“పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే - - - ||“. (భజగోవిందం)
(జన్మము, మరణము, మరల జన్మము మరల మరణము - ఈ ప్రకారముగా ప్రవాహ రూపముగా జననమరణములు కలుగుచుండును. దీనినే సంసారమందురు. ఈ జన్మలోనున్న శరీరము నశించినను, ఈ జన్మలో చేసిన కర్మల ఫలము అనుభవించవలె. ఇట్లు ఇదివరకు ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని కర్మలు చేసి యుండెనో, వాటిలో యెన్ని కర్మలఫలము ఇప్పటికి అనుభవించియుండెనో ఇంకను ఎన్ని కర్మలఫలము అనుభవించవలసి యున్నదో - దానిని అనుభవించుటకు జన్మ ఎత్తవలసియుండును. వర్తమాన జన్మలో గతజన్మ ఫలములనుభవించుచు మరల కర్మలు చేయుచునే యుండును. ఇట్లు తెరిపి లేకుండగ కర్మలు చేయుచు వాటి అనుభవము కొఱకు జన్మలెత్తుచునే యుండవలయును - కర్మఫలము అనుభవించిననే గాని తీరిపోది - కర్మఫలము స్థూలరూపముతోనే అనుభవించవలెను. చేసిన కర్మల బట్టియే కష్టసుఖములు కలుగును –
క. “కర్మమున పుట్టు జంతువు
కర్మమునను వృద్ధిపొందు కర్మమున చెడున్
కర్మమె కారణమంతకు
కర్మములె సుఖ దుఃఖములకు కారణమనఘా“.
(చోళ్ళు జల్లి ధాన్యము పండలేదనుకొనిన లాభమేమి -?) - (“As you sow so you reap”)
“సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత మనుగచ్చతి |”.
(మనిషి చనిపోయినతర్వాత అతని వెంట వెళ్ళునవి అతను చేసిన పాప పుణ్యములే - అవియే మరల జన్మ కలుగునట్లు చసి వాటి ఫలముననుభవింపచేయును-)
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 13)
(ఈ శరీరమందు దేహికి కౌమరము, యౌవనము, వార్థక్యము అనునవి ఏ ప్రకారముగా కలుగు చుండునో ఆ ప్రకారముగానే ఈ శరీరము తర్వాత మరియొక శరీరము, దాని తర్వాత మరియొక శరీరము కలుగుచుండును. దీనిని గుఱించి ధీరుడు అధైర్యము చెందకూడదు - జ్ఞాని యగువాడు మోహము చెందడు).
(tana nijarūpamunu telusukonalēka, tānē (jīvātmayē) paramātmayanu satyamunu telusukonalēka ajñānulainavāru canipōyinatarvāta marala śarīramunu poṃduṭaku - janmiṃcuṭaku - śuklamu, raktamu, bījamutō kūḍina śarīrulai anēka yōnulanu pravēśiṃcucunnāru. maṟikoṃdaṟu mūḍhulu canipōyinatarvāta ceṭṭu modalagunavigā puṭṭucunnāru - ī janmalō ē karmacēsi yējñānamu saṃpādiṃcirō dāniki anurūpamaina - tagina - śarīramulanu (oka śarīramu tarvāta niṃkoka śarīramunu) poṃducunnāru - vāru saṃpādiṃcina jñānamunu baṭṭiyē janmamulu kalugucunnavi, ani śruti ceppucunnadi.
puṭṭinavāniki maraṇamu tappadu; maraṇiṃcinavāniki marala janma tappadu - prāṇulu puṭṭucu, maraṇiṃcucu, marala puṭṭucu marala maraṇiṃcucuṃduru - idiyē janma paraṃparaṃ - oka janma tarvāta maṟiyoka janma, tarvāta niṃkoka janma
“punarapi jananaṃ, punarapi maraṇaṃ, punarapi jananī jaṭharē śayanaṃ |
iha saṃsārē - - - ||“. (bhajagōviṃdaṃ)
(janmamu, maraṇamu, marala janmamu marala maraṇamu - ī prakāramugā pravāha rūpamugā jananamaraṇamulu kalugucuṃḍunu. dīninē saṃsāramaṃduru. ī janmalōnunna śarīramu naśiṃcinanu, ī janmalō cēsina karmala phalamu anubhaviṃcavale. iṭlu idivaraku enni janmalu etti enni karmalu cēsi yuṃḍenō, vāṭilō yenni karmalaphalamu ippaṭiki anubhaviṃciyuṃḍenō iṃkanu enni karmalaphalamu anubhaviṃcavalasi yunnadō - dānini anubhaviṃcuṭaku janma ettavalasiyuṃḍunu. vartamāna janmalō gatajanma phalamulanubhaviṃcucu marala karmalu cēyucunē yuṃḍunu. iṭlu teripi lēkuṃḍaga karmalu cēyucu vāṭi anubhavamu koṟaku janmalettucunē yuṃḍavalayunu - karmaphalamu anubhaviṃcinanē gāni tīripōdi - karmaphalamu sthūlarūpamutōnē anubhaviṃcavalenu. cēsina karmala baṭṭiyē kaṣṭasukhamulu kalugunu –
ka. “karmamuna puṭṭu jaṃtuvu
karmamunanu vṛddhipoṃdu karmamuna ceḍun
karmame kāraṇamaṃtaku
karmamule sukha duḥkhamulaku kāraṇamanaghā”.
(cōḷḷu jalli dhānyamu paṃḍalēdanukonina lābhamēmi -?) - (“As you sow so you reap”)
“sukṛtaṃ duṣkṛtaṃ caiva gacchaṃta manugaccati |”.
(maniṣi canipōyinatarvāta atani veṃṭa veḷḷunavi atanu cēsina pāpa puṇyamulē - aviyē marala janma kalugunaṭlu casi vāṭi phalamunanubhaviṃpacēyunu-)
tathā dēhāṃtaraprāptirdhīrastatra na muhyati ||“. (śrīmadbhagavadgīta - 2 - 13)
(ī śarīramaṃdu dēhiki kaumaramu, yauvanamu, vārthakyamu anunavi ē prakāramugā kalugu cuṃḍunō ā prakāramugānē ī śarīramu tarvāta mariyoka śarīramu, dāni tarvāta mariyoka śarīramu kalugucuṃḍunu. dīnini guṟiṃci dhīruḍu adhairyamu ceṃdakūḍadu - jñāni yaguvāḍu mōhamu ceṃdaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.