← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శరీర త్యాగము śarīra tyāgamu

Original — తెలుగు

“సీ. ఆసన్న మరణార్థియైన యతీశుడు గాల దేశములను గాచికొనడు

తనవు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణ పవను

మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే బంధించి బుద్ధి దెచ్చి

క్షేత్రజ్ఞతో గూర్చి, క్షేత్రజ్ఞ నాత్మలోపల జేర్చి, యాత్మను బ్రహ్మమందు

తే. గలిపి, యొక్కటి గావించి, గారవమున

శాంతి తోడ నిరూఢుడై సకల కార్య

నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము

వలయునని చూచు నటమీద, వసుమతీశ”.

“వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమంబు” అని సత్పురుషులు దెలియుదురు - ఇవ్విధంబున విజ్ఞాన దృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయ వాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున

“సీ. అంఘ్రిమూలమున మూలాధారచక్రంబు పీడించి, ప్రాణంబు బిగియబట్టి

నాభితలము జేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికెగయబట్టి

యటమీద నురమందు హత్తించి, క్రమ్మఱ దాలుమూలమునకు దఱిమి నిలిపి

మమతతో భ్రూయుగమధ్యంబు జేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి

తే. యిచ్చలేని యోగి యెలమి ముహూర్తార్థ

మింద్రియాను షంగమింతలేక

ప్రాణములను వంచి, బ్రహ్మరంధ్రము చించి

బ్రహ్మమందు గలయు బౌరవేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 29)

Transliteration

“sī. āsanna maraṇārthiyaina yatīśuḍu gāla dēśamulanu gācikonaḍu

tanavu visarjiṃcu talapu janiṃcina bhadrāsanasthuḍai prāṇa pavanu

manasu cēta jayiṃci mānasa vēgaṃbu buddhicē baṃdhiṃci buddhi decci

kṣētrajñatō gūrci, kṣētrajña nātmalōpala jērci, yātmanu brahmamaṃdu

tē. galipi, yokkaṭi gāviṃci, gāravamuna

śāṃti tōḍa nirūḍhuḍai sakala kārya

nivaha mellanu diganāḍi nityasukhamu

valayunani cūcu naṭamīda, vasumatīśa”.

“vaiṣṇavaṃbaina paramapadaṃbu sarvōttamaṃbu” ani satpuruṣulu deliyuduru - ivvidhaṃbuna vijñāna dṛgvīrya jvalanaṃbuna nirdagdha viṣaya vāsanuṃḍai kramaṃbuna nirapēkṣatvaṃbuna

“sī. aṃghrimūlamuna mūlādhāracakraṃbu pīḍiṃci, prāṇaṃbu bigiyabaṭṭi

nābhitalamu jērci nayamutō mellana hṛtsarōjamu mīdikegayabaṭṭi

yaṭamīda nuramaṃdu hattiṃci, krammaṟa dālumūlamunaku daṟimi nilipi

mamatatō bhrūyugamadhyaṃbu jērci dṛkkarṇa nāsāsya mārgamulu mūsi

tē. yiccalēni yōgi yelami muhūrtārtha

miṃdriyānu ṣaṃgamiṃtalēka

prāṇamulanu vaṃci, brahmaraṃdhramu ciṃci

brahmamaṃdu galayu bauravēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 29)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.