← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాచికయజ్ఞము vācikayajñamu

Original — తెలుగు

“అధాహం వాచికం యజ్ఞం వక్ష్యమి శ్రద్ధయా సహ |

పరాత్పరతరాదస్మా చ్ఛివా చైతన్య లక్షణాత్ |

స్వశక్తి సహితాదేవ, ద్విజాః జ్యోతిర్మయః పరః |

శబ్దః సూక్ష్మః స్వభావేన ప్రాదురాసీద ఖండితః |

స శబ్దః పునరాధారే ప్రాణినామా స్తికోత్తమాః |

పిండీ భూత తయా భాతి తప్త జాంబూనదః ప్రభః |

స పునర్బ్రహ్మనాడ్యాతు ప్రవిశ్య హృదయాం బుజం |

విభక్తః సూక్ష్మరూపేణ భాతి వహ్నిప్రభః స్వతః |

బ్రహ్మరంధ్రం పునః సాక్షాచ్ఛివస్య స్థానముత్తమం |

తత్రస్థో (అ)యం ద్విజాశ్శబ్దః సూక్ష్మై కాక్షరతామియాత్ |

తృతీయే పరమాధారే పూరకే పుణ్యభాజకే |

ఏకాక్షరత్వ మాప్నోతి స్వభావేనాక్షర ద్వయం |

అయమాద్యఃపరోమంత్రః సుప్రసిద్ధః స్వభావతః |

మనసా త్రాణ శూరత్వాన్మంత్ర ఇత్యభిశబ్దితః |

మాతృకా పరమాదేవీ మంత్రమాతా మహేశ్వరీ |

అస్మదాద్యా న్మహామంత్రాదాని ర్భూతా స్వభావతః |

అధో ముఖీ భవేదేకమేక మూర్థ్వముఖీ భవేత్ |

తస్మాచ్ఛ్రీమాతృకా శుద్ధాబాద్య మంత్రాత్మికా భవేత్ |

ఆద్యోయం పరమో మంత్రః సుప్రసిద్దోపి సుద్రతాః ||“. (సూతసంహితాయాం)

(వాచిక యజ్ఞం ప్రతిజ్ఞాయ ప్రథమం వాచ ఉత్పత్తిక్రమ మాహ |

పరాత్ మాయాశక్తి విశిష్టః చైతన్య జ్యోతిరూపః బిందుసదాభిధేయః ఈశ్వర ఉచ్యతే |

తస్మాత్ పరాత్పర తరః మాయా తీతః, నిష్కలః పరశివః; |

తస్మాత్ నిష్కలాత్ పరతరాత్ శివాత్ స్వపరాశక్తి సహితాత్ బిందు శబ్దాభిధేయః పర ఈశ్వరో జాతః |

మూలకారణస్య అభివ్యజ్యమానస్య బిందోస్సర్వగతత్వాత్ తదాత్మతయా సర్వత్రానుస్యూతః ఏషచ శబ్దః అఖండితః - స్వప్రకాశత్వాత్, సర్వగతత్వాత్, జగత్కారణ తాదాత్మ్యత్వాత్. తచ్చ శబ్ద బ్రహ్మేత్యుచ్యతే. బిందోస్తస్మాత్ భిద్యమానాత్ రవో అవ్యక్తాత్మకో భవేత్)

- (బిందువు ప్రేలినపుడు రవము - శబ్దము - కెలిగెను - అదియే శబ్ద బ్రహ్మము). తస్య సర్వగతస్యాపి ప్రాణినా మర్థవివక్షా హేతు ప్రయత్న జనిత పవన సంబంధి నిబంధనా మూలాధారలక్షణ ప్రదేశ విశేషే యా అభివ్యక్తిః సాపిండీభావః. తత్ర పిండీభావ దశోపహి తో మూలాధారస్థః స్వప్రకాశః నిష్సందశ్శబ్దః పరావాగిత్యుచ్యతే. స ఏవ మూలాధారా దానాభి విమర్శరూపేణ మనసా అభివ్యక్తో వైశాద్యతిశయ దశాపన్నస్సామాన్య స్పంద రూపః పశ్యంతీ వాగిత్యుచ్యతే. తస్యైవేదానీం నాభేర్హృదయం ప్రాప్తస్య నిశ్చయాత్మకయా బుద్ధ్యా విషయీ కృతస్య విశేష స్కందరూపస్య మధ్యమవాగ్రూపతాం ఆహ బ్రహ్మరంధ్రం శివస్య సాక్షాత్ స్థానం ఆపరోక్షస్థానం శివోహి పరమానందరూపో జగదుపాన దానతయా సర్వగతోపి బ్రహ్మరంధ్రే ఉపాస్య మానో(అ)చిరాదేవతరోకీ భవతి. హృదయ భృఊమధ్యాదిషు ఉపాసనస్థానాంతరేషు సంభవత్స్వపి అచిరాదనదా భివ్యక్త్యతిశయా దుత్తమ మిత్యుక్తం –

“మూర్థన్యా ధాయాత్మనః ప్రాణమాస్తితో యోగధారణం |

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |

యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||“. (శ్రీమద్భగవద్గీత - )

తత్రస్థో అయం ద్విజాః | శబ్దః సూక్ష్మాత్సూక్ష్మకాక్షర తామియాత్ ||.

(బ్రహ్మరంధ్రమును పొంది వాయువుతో కలిసి అక్షరరూపముగామారి ఏకాక్షరమైన ఓం కారముగా ఆవిర్భవించును).

“నాభేరుత్థితః ప్రాణః ఉరసి విస్తీర్ణః కంఠే పరివృతే మూర్థాన మాహృత్య పరివృత్తో వివిధాన్ శబ్దాన్ వ్యనక్తీతి.” అత్రచ ప్రాణస్య నాదాభివ్యంజకత్వం తదభివ్యక్తస్యతు నాదస్యైవ పరా పశ్యంతీ మధ్యమా రూపస్య వర్ణోపాదానతా ఉక్తం - “ప్రాణః శబ్దాన్ వ్యనక్తీతి - పశ్యంతీ మధ్యమా స్థాన నాభి హృదయాపేక్షయా ఉక్తాక్షర స్థానస్య బ్రహ్మరంధ్రస్య తృతీయత్వం”. (ఇదియే ప్రణవము, ఓంకారము, హంస మంత్రము - అక్షరద్వయం హం + సః = హంసః ఇతి చ అక్షరద్వయ ఏకాకారతా మాపన్నం. లీలయా పరిగృహీతార్థనారీశ్వరవ తరస్య పరశివస్య పుంభాగః. ‘అహం’ ఇత్యుచ్యతే, ప్రకృతి భాగః ‘స’ ఇతి సా చ ప్రకృతిః పుంసా అహమా తాదాత్మ్య మాత్మనో యదా అను సంధిత్తే తదా అజపాతః - సోహమితి పరమాత్మ మంత్రోజాతః. తత్ర సకార హకారయోః లోపే సంధౌ చ కృతే ప్రణవో జాతః - (“సో(అ)హం = సః + ఓ + హం”) - వీటిలోని ‘స’, ‘హ’ తీసివేసిన ఓ + o = ఓం మిగులును. ఇదియే ఓంకారము - ప్రణవము. ఈ ఓంకారము నుచ్చరించుటయే వాచిక యజ్ఞము).

(నేను వాచికయజ్ఞము గుఱించి చెప్పుచున్నాను - ముందుగా వాచకము (వాక్కు) పుట్టుక క్రమము గుఱించి చెప్పెదను. మాయాశక్తి విశిష్టుడు, చైతన్యము, తేజస్సు - ఈ రెండును రూపముగా గలవాడును, బిందువు అని చెప్పబడువాడును అయిన ఈశ్వరుడే పరుడు - ఉత్కౄష్టమైనవాడు, మాయాశక్తికి అతీతుడు, నిష్కలుడు అయినవాడు పరశివుడు - అతను పరాత్పరుడు, పరాశక్తితో కూడియున్నవాడు - అయిన శివునినుండి స్వభావముగనే బిందువు అను పేరుగల (చెప్పబడు) పరుడైన ఈశ్వరుడు జన్మించెను - కలిగెను. ఈ బిందువు ప్రేలి గొప్ప శబ్దము కలిగెను - బిందువు అన్నింటికిని మూలకారణమగుటవలన (కార్యకారణము లన్నింటికి మొదటి కారణమగుటవలన) యీ బిందువు - పర ఈశ్వరుడు, లేక, ఈశ్వరుని పరాశక్తి - చైతన్యశక్తి - చిచ్చక్తి - అన్నింటిలోను వ్యాపించియుండుటచేత ఈ శబ్దము ఈశ్వరాత్మగనే - ఈశ్వరశక్తి రూపముగనే - అంతటను, అన్నింటిలోను అనుస్యూతమై యున్నది. ఈ శబ్దము జ్యోతిర్మయము, స్వయంప్రకాశము గలదగుటచేతను, అన్నింటిలోను వ్యాపించియున్నదగుటచేతను, జగత్తునకు కారణమగుటచేతను అఖండితము - పూర్ణముగా నుండునది, పరిచ్ఛిన్నము కానిది - సూక్ష్మమైనది. ఆ శబ్దమే శబ్దబ్రహ్మ అని చెప్పబడుచున్నది - ” ఆ బిందువు ప్రేలినపుడు రవము అవ్యక్తాత్మకమైన శబ్దము కలిగెను - అదియే శబ్ద బ్రహ్మము“. (బిందువు అనునదియే ప్రకృతి (matter), భగవంతుని శక్తితో (ENERGYతో) మిళితమై యున్నది. దీనినే బ్రహ్మాత్మకమగుటవలన చతుర్ముఖబ్రహ్మ యనియు లేక బ్రహ్మాండము (అండాకారముగా నున్న బ్రహ్మ (Cosmic egg) అనియు చెప్పుదురు - దీనిలోని భగవంతుని శక్తి విజృంభించి, దాని పెంచిపెంచి బ్రద్దలగునట్లు చేసెను - (పేల్చివేసెను). ఈ ప్రేలుడే Big Bang అని ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఈ ప్రేలుడు ఫలితముగా ఆ బిందువు ముక్కలు ముక్కలుగా ఆకాశములో విరజిమ్ముకొనిపోయినవి. అవియే యిప్పటి ప్రపంచములు. ఆ ప్రేలుడువలన భగవచ్ఛక్తికూడ ఆ ముక్కలలో అంతర్గతమై సూక్ష్మరూపములో నుండెను - ఇందువలననే ఆ ముక్కలలోని ప్రతి అణువు అణువులోను భగవచ్ఛక్తి అంతర్గతమై సూక్ష్మరూపములోనున్నది. అందుచేతనే ప్రహ్లాదుని వచనములో

“క. ఇందుగలదందులేడని

సందేహము లేదు, చక్రి సర్వోపగతుం

డెందెందు వెతకి చూచిన

నందందేగలడు, దానవాగ్ర ణి, వింటే“.

అని చెప్పబడియున్నది. (Every particle of matter contains Energy). ఈ ప్రేలుడు మూలముగా కలిగినవే యీ లోకములను విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో నీ క్రింద విధముగా చెప్పబడియున్నది : -

వ. - - - అంత గాల కర్మస్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్యస్థితంబయిన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబుగావించి యట్టి యండంబు భేధించి నిర్గమించె, నెట్లంటేని: -

“క. భువనాత్మకు డా ఈశుడు

భువనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్

వివరముతో బదునాలుగు

వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86, 87)

పై విధముగా బీజము - లేక బ్రహ్మాండము పగిలిన కారణమువలన కలిగిన రవము (శబ్దము) మొదట శబ్దము - బీజము బ్రహ్మాత్మకముగనుక దాని వలన కలిగిన శబ్దము కూడ బ్రహ్మాత్మకమే కనుక ఆ శబ్దము ‘శబ్ద బ్రహ్మ’ అని చెప్పబడినది. కోటానుకోట్ల ప్రపంచములు పుట్టుటకు కారణమైన ఆ శబ్దమే ‘ఓం’ కారము. ప్రపంచములలో ప్రతి అణువులోను అంతర్గతమై యుండు ఈ శబ్దము ప్రాణుల శరీరములో కూడ నుండునదగుటచేత ఆ యా శరీరములలోని మూలాధార చక్రమను ప్రదేశములో వాయువుతో కలిసి పిండీకృతమై యున్నది. అది మరిగిన జంబూనదమువలె కాంతివంతముగ నుండును, ఆ శబ్దమే ‘పరావాక్’ అని చెప్పబడుచున్నది, అదియే మూలాధారమునుండి నాభివరకు వ్యాపించి అక్కడ ‘పశ్యంతీ వాక్కు’ అని చెప్పబడుచున్నది.నాభినుండి హృదయమువరకు వ్యాపించి అక్కడ ‘మధ్యమా వాక్కు’ అని చెప్పబడుచున్నది.శరీరములోని బ్రహ్మరంధ్రము శివుని యొక్క సాక్షాత్ స్థానము అపరోక్షస్థానము - అపరోక్షస్థానము. శివుడు పరమానందస్వరూపుడు, జగత్తునకుపాదానకారణముగుటవలన అన్నింటిలో నున్నవాడైనను బ్రహ్మరంధ్రమందు ఉండునని ఉపాసించుటచే వేదమే ప్రత్యక్షమగును కనుక బ్రహ్మరంధ్రము ఉపాసనకు ఉత్తమమైనది. ఈ విషయము శ్రీమద్భగవద్గీతలో ఈ క్రింద విధముగా చెప్పబడినది - “యోగాభ్యాసమువలన ప్రాణవాయువును మూర్థ్నమునకు తీసుకొనివచ్చి, ‘ఓం’ అను ఏకాక్షరమును జపించుచు, భగవంతుని స్మరించుచు చనిపోయినవారు భగవద్భావమును పొందుదురు. ఇందుకు సందేహము లేదు”. ఆ బ్రహ్మరంధ్రములో ఈ శబ్దము వాయువుతో కలిసి అక్షరరూపముగా మారి ఏకాక్షరమైన ‘ఓం’ కారముగా ఆవిర్భవించును - నాభిలో నున్న ప్రాణము (వాయువు) వక్షస్థలమును ప్రవేశించి, అక్కడనుండి కంఠమునకు వ్యాపించి, మూర్థన్యమును పొంది అనేకములైన శబ్దములను కలుగచేయును. “ప్రాణము - ప్రాణవాయువు - శబ్దములను కలుగచేయును” అని చెప్పబడియున్నది. అందువలన ప్రాణవాయువు శబ్దములను కలుగుచేయును. నాభి హృదయములందు పశ్యంతీ, మధ్యమా వాక్కులుగా మారును - ఈ శబ్దమే ఓంకారము (ప్రణవము). హంస మంత్రము - అహం + సః, లేక సోహం = సో + అహం = సః అహం - అతనే ఆ పరబ్రహ్మమే, నేను. ఇందులో ఈ రెండు అక్షరములు ఒకే అక్షరముగా మారును. లీలకొరకు అర్థనారీశ్వరుడైన శివునియొక్క పురుషభావము ‘అహం’ అని చెప్పబడినది. ‘సః’ అనునది ప్రకృతి భాగము - ఈ పురుష ప్రకృతులు రెండు కలిసి జపించుటకు ‘సోహం’ అను అజపా మంత్రమగును, ఈ మంత్రమునలోని సకారము, హకారము లోపించిన మిగిలిన ‘ఓ’ + ‘o’ = కలిపిన ఓంకారమగును. అది ఎట్లంటే - సో(అ)హం = స + ఓ + హ + ం = సో(అ)హం - ఈ నాలుగింటిలోను ‘స’, ‘హ’ - తీసివేసిన మిగిలినది ‘ఓ + o = ఓం’ అగును - ఇదియే ఓంకారము - ప్రణవము. ఈ ఓంకారము నుచ్చరించుటయే వాచికజపము).

Transliteration

“adhāhaṃ vācikaṃ yajñaṃ vakṣyami śraddhayā saha |

parātparatarādasmā cchivā caitanya lakṣaṇāt |

svaśakti sahitādēva, dvijāḥ jyōtirmayaḥ paraḥ |

śabdaḥ sūkṣmaḥ svabhāvēna prādurāsīda khaṃḍitaḥ |

sa śabdaḥ punarādhārē prāṇināmā stikōttamāḥ |

piṃḍī bhūta tayā bhāti tapta jāṃbūnadaḥ prabhaḥ |

sa punarbrahmanāḍyātu praviśya hṛdayāṃ bujaṃ |

vibhaktaḥ sūkṣmarūpēṇa bhāti vahniprabhaḥ svataḥ |

brahmaraṃdhraṃ punaḥ sākṣācchivasya sthānamuttamaṃ |

tatrasthō (a)yaṃ dvijāśśabdaḥ sūkṣmai kākṣaratāmiyāt |

tṛtīyē paramādhārē pūrakē puṇyabhājakē |

ēkākṣaratva māpnōti svabhāvēnākṣara dvayaṃ |

ayamādyaḥparōmaṃtraḥ suprasiddhaḥ svabhāvataḥ |

manasā trāṇa śūratvānmaṃtra ityabhiśabditaḥ |

mātṛkā paramādēvī maṃtramātā mahēśvarī |

asmadādyā nmahāmaṃtrādāni rbhūtā svabhāvataḥ |

adhō mukhī bhavēdēkamēka mūrthvamukhī bhavēt |

tasmācchrīmātṛkā śuddhābādya maṃtrātmikā bhavēt |

ādyōyaṃ paramō maṃtraḥ suprasiddōpi sudratāḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(vācika yajñaṃ pratijñāya prathamaṃ vāca utpattikrama māha |

parāt māyāśakti viśiṣṭaḥ caitanya jyōtirūpaḥ biṃdusadābhidhēyaḥ īśvara ucyatē |

tasmāt parātpara taraḥ māyā tītaḥ, niṣkalaḥ paraśivaḥ; |

tasmāt niṣkalāt paratarāt śivāt svaparāśakti sahitāt biṃdu śabdābhidhēyaḥ para īśvarō jātaḥ |

mūlakāraṇasya abhivyajyamānasya biṃdōssarvagatatvāt tadātmatayā sarvatrānusyūtaḥ ēṣaca śabdaḥ akhaṃḍitaḥ - svaprakāśatvāt, sarvagatatvāt, jagatkāraṇa tādātmyatvāt. tacca śabda brahmētyucyatē. biṃdōstasmāt bhidyamānāt ravō avyaktātmakō bhavēt)

- (biṃduvu prēlinapuḍu ravamu - śabdamu - keligenu - adiyē śabda brahmamu). tasya sarvagatasyāpi prāṇinā marthavivakṣā hētu prayatna janita pavana saṃbaṃdhi nibaṃdhanā mūlādhāralakṣaṇa pradēśa viśēṣē yā abhivyaktiḥ sāpiṃḍībhāvaḥ. tatra piṃḍībhāva daśōpahi tō mūlādhārasthaḥ svaprakāśaḥ niṣsaṃdaśśabdaḥ parāvāgityucyatē. sa ēva mūlādhārā dānābhi vimarśarūpēṇa manasā abhivyaktō vaiśādyatiśaya daśāpannassāmānya spaṃda rūpaḥ paśyaṃtī vāgityucyatē. tasyaivēdānīṃ nābhērhṛdayaṃ prāptasya niścayātmakayā buddhyā viṣayī kṛtasya viśēṣa skaṃdarūpasya madhyamavāgrūpatāṃ āha brahmaraṃdhraṃ śivasya sākṣāt sthānaṃ āparōkṣasthānaṃ śivōhi paramānaṃdarūpō jagadupāna dānatayā sarvagatōpi brahmaraṃdhrē upāsya mānō(a)cirādēvatarōkī bhavati. hṛdaya bhṛūmadhyādiṣu upāsanasthānāṃtarēṣu saṃbhavatsvapi acirādanadā bhivyaktyatiśayā duttama mityuktaṃ –

“mūrthanyā dhāyātmanaḥ prāṇamāstitō yōgadhāraṇaṃ |

ōmityēkākṣaraṃ brahma vyāharan māmanusmaran |

yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ||“. (śrīmadbhagavadgīta - )

tatrasthō ayaṃ dvijāḥ | śabdaḥ sūkṣmātsūkṣmakākṣara tāmiyāt ||.

(brahmaraṃdhramunu poṃdi vāyuvutō kalisi akṣararūpamugāmāri ēkākṣaramaina ōṃ kāramugā āvirbhaviṃcunu).

“nābhērutthitaḥ prāṇaḥ urasi vistīrṇaḥ kaṃṭhē parivṛtē mūrthāna māhṛtya parivṛttō vividhān śabdān vyanaktīti.” atraca prāṇasya nādābhivyaṃjakatvaṃ tadabhivyaktasyatu nādasyaiva parā paśyaṃtī madhyamā rūpasya varṇōpādānatā uktaṃ - “prāṇaḥ śabdān vyanaktīti - paśyaṃtī madhyamā sthāna nābhi hṛdayāpēkṣayā uktākṣara sthānasya brahmaraṃdhrasya tṛtīyatvaṃ”. (idiyē praṇavamu, ōṃkāramu, haṃsa maṃtramu - akṣaradvayaṃ haṃ + saḥ = haṃsaḥ iti ca akṣaradvaya ēkākāratā māpannaṃ. līlayā parigṛhītārthanārīśvarava tarasya paraśivasya puṃbhāgaḥ. ‘ahaṃ’ ityucyatē, prakṛti bhāgaḥ ‘sa’ iti sā ca prakṛtiḥ puṃsā ahamā tādātmya mātmanō yadā anu saṃdhittē tadā ajapātaḥ - sōhamiti paramātma maṃtrōjātaḥ. tatra sakāra hakārayōḥ lōpē saṃdhau ca kṛtē praṇavō jātaḥ - (“sō(a)haṃ = saḥ + ō + haṃ”) - vīṭilōni ‘sa’, ‘ha’ tīsivēsina ō + o = ōṃ migulunu. idiyē ōṃkāramu - praṇavamu. ī ōṃkāramu nuccariṃcuṭayē vācika yajñamu).

(nēnu vācikayajñamu guṟiṃci ceppucunnānu - muṃdugā vācakamu (vākku) puṭṭuka kramamu guṟiṃci ceppedanu. māyāśakti viśiṣṭuḍu, caitanyamu, tējassu - ī reṃḍunu rūpamugā galavāḍunu, biṃduvu ani ceppabaḍuvāḍunu ayina īśvaruḍē paruḍu - utkṝṣṭamainavāḍu, māyāśaktiki atītuḍu, niṣkaluḍu ayinavāḍu paraśivuḍu - atanu parātparuḍu, parāśaktitō kūḍiyunnavāḍu - ayina śivuninuṃḍi svabhāvamuganē biṃduvu anu pērugala (ceppabaḍu) paruḍaina īśvaruḍu janmiṃcenu - kaligenu. ī biṃduvu prēli goppa śabdamu kaligenu - biṃduvu anniṃṭikini mūlakāraṇamaguṭavalana (kāryakāraṇamu lanniṃṭiki modaṭi kāraṇamaguṭavalana) yī biṃduvu - para īśvaruḍu, lēka, īśvaruni parāśakti - caitanyaśakti - ciccakti - anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭacēta ī śabdamu īśvarātmaganē - īśvaraśakti rūpamuganē - aṃtaṭanu, anniṃṭilōnu anusyūtamai yunnadi. ī śabdamu jyōtirmayamu, svayaṃprakāśamu galadaguṭacētanu, anniṃṭilōnu vyāpiṃciyunnadaguṭacētanu, jagattunaku kāraṇamaguṭacētanu akhaṃḍitamu - pūrṇamugā nuṃḍunadi, paricchinnamu kānidi - sūkṣmamainadi. ā śabdamē śabdabrahma ani ceppabaḍucunnadi - ” ā biṃduvu prēlinapuḍu ravamu avyaktātmakamaina śabdamu kaligenu - adiyē śabda brahmamu”. (biṃduvu anunadiyē prakṛti (matter), bhagavaṃtuni śaktitō (ENERGYtō) miḷitamai yunnadi. dīninē brahmātmakamaguṭavalana caturmukhabrahma yaniyu lēka brahmāṃḍamu (aṃḍākāramugā nunna brahma (Cosmic egg) aniyu ceppuduru - dīnilōni bhagavaṃtuni śakti vijṛṃbhiṃci, dāni peṃcipeṃci braddalagunaṭlu cēsenu - (pēlcivēsenu). ī prēluḍē Big Bang ani ādhunika śāstrajñulu ceppucunnāru. ī prēluḍu phalitamugā ā biṃduvu mukkalu mukkalugā ākāśamulō virajimmukonipōyinavi. aviyē yippaṭi prapaṃcamulu. ā prēluḍuvalana bhagavacchaktikūḍa ā mukkalalō aṃtargatamai sūkṣmarūpamulō nuṃḍenu - iṃduvalananē ā mukkalalōni prati aṇuvu aṇuvulōnu bhagavacchakti aṃtargatamai sūkṣmarūpamulōnunnadi. aṃducētanē prahlāduni vacanamulō

“ka. iṃdugaladaṃdulēḍani

saṃdēhamu lēdu, cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vetaki cūcina

naṃdaṃdēgalaḍu, dānavāgra ṇi, viṃṭē”.

ani ceppabaḍiyunnadi. (Every particle of matter contains Energy). ī prēluḍu mūlamugā kaliginavē yī lōkamulanu viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō nī kriṃda vidhamugā ceppabaḍiyunnadi : -

va. - - - aṃta gāla karmasvabhāva prērakuṃḍaina paramēśvaruṃḍu jīvarūpaṃbuna mahāvaraṇa jalamadhyasthitaṃbayina brahmāṃḍaṃbulōnu socci savistāraṃbugāviṃci yaṭṭi yaṃḍaṃbu bhēdhiṃci nirgamiṃce, neṭlaṃṭēni: -

“ka. bhuvanātmaku ḍā īśuḍu

bhuvanākṛtitōḍa nuṃḍu brahmāṃḍaṃbun

vivaramutō badunālugu

vivaraṃbulugā nonarce viśadaṃbulugan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86, 87)

pai vidhamugā bījamu - lēka brahmāṃḍamu pagilina kāraṇamuvalana kaligina ravamu (śabdamu) modaṭa śabdamu - bījamu brahmātmakamuganuka dāni valana kaligina śabdamu kūḍa brahmātmakamē kanuka ā śabdamu ‘śabda brahma’ ani ceppabaḍinadi. kōṭānukōṭla prapaṃcamulu puṭṭuṭaku kāraṇamaina ā śabdamē ‘ōṃ’ kāramu. prapaṃcamulalō prati aṇuvulōnu aṃtargatamai yuṃḍu ī śabdamu prāṇula śarīramulō kūḍa nuṃḍunadaguṭacēta ā yā śarīramulalōni mūlādhāra cakramanu pradēśamulō vāyuvutō kalisi piṃḍīkṛtamai yunnadi. adi marigina jaṃbūnadamuvale kāṃtivaṃtamuga nuṃḍunu, ā śabdamē ‘parāvāk’ ani ceppabaḍucunnadi, adiyē mūlādhāramunuṃḍi nābhivaraku vyāpiṃci akkaḍa ‘paśyaṃtī vākku’ ani ceppabaḍucunnadi.nābhinuṃḍi hṛdayamuvaraku vyāpiṃci akkaḍa ‘madhyamā vākku’ ani ceppabaḍucunnadi.śarīramulōni brahmaraṃdhramu śivuni yokka sākṣāt sthānamu aparōkṣasthānamu - aparōkṣasthānamu. śivuḍu paramānaṃdasvarūpuḍu, jagattunakupādānakāraṇamuguṭavalana anniṃṭilō nunnavāḍainanu brahmaraṃdhramaṃdu uṃḍunani upāsiṃcuṭacē vēdamē pratyakṣamagunu kanuka brahmaraṃdhramu upāsanaku uttamamainadi. ī viṣayamu śrīmadbhagavadgītalō ī kriṃda vidhamugā ceppabaḍinadi - “yōgābhyāsamuvalana prāṇavāyuvunu mūrthnamunaku tīsukonivacci, ‘ōṃ’ anu ēkākṣaramunu japiṃcucu, bhagavaṃtuni smariṃcucu canipōyinavāru bhagavadbhāvamunu poṃduduru. iṃduku saṃdēhamu lēdu”. ā brahmaraṃdhramulō ī śabdamu vāyuvutō kalisi akṣararūpamugā māri ēkākṣaramaina ‘ōṃ’ kāramugā āvirbhaviṃcunu - nābhilō nunna prāṇamu (vāyuvu) vakṣasthalamunu pravēśiṃci, akkaḍanuṃḍi kaṃṭhamunaku vyāpiṃci, mūrthanyamunu poṃdi anēkamulaina śabdamulanu kalugacēyunu. “prāṇamu - prāṇavāyuvu - śabdamulanu kalugacēyunu” ani ceppabaḍiyunnadi. aṃduvalana prāṇavāyuvu śabdamulanu kalugucēyunu. nābhi hṛdayamulaṃdu paśyaṃtī, madhyamā vākkulugā mārunu - ī śabdamē ōṃkāramu (praṇavamu). haṃsa maṃtramu - ahaṃ + saḥ, lēka sōhaṃ = sō + ahaṃ = saḥ ahaṃ - atanē ā parabrahmamē, nēnu. iṃdulō ī reṃḍu akṣaramulu okē akṣaramugā mārunu. līlakoraku arthanārīśvaruḍaina śivuniyokka puruṣabhāvamu ‘ahaṃ’ ani ceppabaḍinadi. ‘saḥ’ anunadi prakṛti bhāgamu - ī puruṣa prakṛtulu reṃḍu kalisi japiṃcuṭaku ‘sōhaṃ’ anu ajapā maṃtramagunu, ī maṃtramunalōni sakāramu, hakāramu lōpiṃcina migilina ‘ō’ + ‘o’ = kalipina ōṃkāramagunu. adi eṭlaṃṭē - sō(a)haṃ = sa + ō + ha + ṃ = sō(a)haṃ - ī nālugiṃṭilōnu ‘sa’, ‘ha’ - tīsivēsina migilinadi ‘ō + o = ōṃ’ agunu - idiyē ōṃkāramu - praṇavamu. ī ōṃkāramu nuccariṃcuṭayē vācikajapamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.