← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరి vairi

Original — తెలుగు
  1. శత్రువు, "తన కోపమె తన శత్రువు".

  2. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు - ఆ ఆరును శత్రువులు - అరిషడ్వర్గము -

  3. "సీ. - - -

- - -

- - -

చిత్తంబు సమముగా జేయుము; మార్గంబు దప్పివర్తించు చిత్తంబు కంటె

తే. వైరులెవ్వరు, చిత్తంబు వైరి గాక

జిత్తమును నీకు వశముగా జేయవయ్య

- - -

- - -”

"ఉ. లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా

నీకము జిత్తమున్ గెలువనేరవు; నిన్ను నిబద్దు జేయు నీ

భీకర శత్రులార్వుర బ్రభినుల జేయుము, ప్రాణికోటిలో

నీకు విరోధి లేడొకడు, నేర్పున జూడుము, దానవేశ్వరా". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 266, 267)

  1. "కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్థ్యేనమిహ వైరిణం ||" (శ్రీమద్భగవద్గీత - 3 - 37)

"బలాదనర్థమార్గే (అ)స్మిన్ కామ ఏష ప్రవర్తకః |

సర్వానర్థ పరిప్రాప్తి నిమిత్తం శత్రురాత్మనః |

కేన చిత్ హేతునా కామః ప్రతిబద్థః స ఏవహి |

క్రోధః పరిణతో భాతి తస్మిన్ కామే నివారితే |

సర్వ శ్రేయః పరిప్రాప్తిః - - - ||". (గీతాభావప్రకాశము - 3 - 239)

(పురుషులకు అనర్థమార్గములలో ప్రవర్తింప చేయునది కామము, సమస్తమైన అనర్థములను కలుగ చేయునది కనుక ఆత్మకు కామము శత్రువు. ఏ కారణము చేతనైనను ఈ కామమునకు అడ్డు తగిలిన యడల క్రోధము క్రింద మారును. అందుచేత ఆ కామము నివారింపబడిన యడల అన్ని విధములైన శ్రేయస్సు కలుగును).

  1. "యః సర్వస్మిన్ జగతి స్వప్రాణారామం పరమాత్మానాం వ్యాప్తం పశ్యతి, యో జగత్ శ్రీకృష్ణమయమవలోకయతి, స కథః కం స్వవైరిణం మంతుం శక్నోతి?"

(తనలోనున్న తన ప్రాణారాముడైన పరమాత్మ ఈ జగత్తు అంతటిలోను వ్యాపించి యున్నాడు అనిన్నీ, జగత్తు అంతయు శ్రీకృష్ణమయమని ఎవడు భావించునో - తెలుసుకొనునో - అట్టివానికి ఏవడు తన వైరిగా కనబడును? - అనగా అట్టివానికి ఎవరును వైరి లేడు అని అర్థము -)

  1. "క. పగతుర చెరచితి ననియును

పగతురచే చెడితిననియు బాలుడు తలచెన్

పగ చెలుములులేవాత్మకు

పగచెలుమలకలు కర్మబంధముసుండీ ||". (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  1. "క. పరులెవ్వరు తామెవ్వరు

పరికింపంగ నేకమగుట భావింపరు త

త్పరమజ్ఞానము లేమిని

పరులుగు నేమనుచు దోచు బ్రాణులకెల్లన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 69)

Transliteration
  1. śatruvu, "tana kōpame tana śatruvu".

  2. kāma krōdha lōbha mōha mada mātsaryamulu - ā ārunu śatruvulu - ariṣaḍvargamu -

  3. "sī. - - -

- - -

- - -

cittaṃbu samamugā jēyumu; mārgaṃbu dappivartiṃcu cittaṃbu kaṃṭe

tē. vairulevvaru, cittaṃbu vairi gāka

jittamunu nīku vaśamugā jēyavayya

- - -

- - -”

"u. lōkamulanniyun gaḍiyalōna jayiṃcinavāḍa viṃdriyā

nīkamu jittamun geluvanēravu; ninnu nibaddu jēyu nī

bhīkara śatrulārvura brabhinula jēyumu, prāṇikōṭilō

nīku virōdhi lēḍokaḍu, nērpuna jūḍumu, dānavēśvarā". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 266, 267)

  1. "kāma ēṣa krōdha ēṣa rajōguṇasamudbhavaḥ |

mahāśanō mahāpāpmā vidthyēnamiha vairiṇaṃ ||" (śrīmadbhagavadgīta - 3 - 37)

"balādanarthamārgē (a)smin kāma ēṣa pravartakaḥ |

sarvānartha pariprāpti nimittaṃ śatrurātmanaḥ |

kēna cit hētunā kāmaḥ pratibadthaḥ sa ēvahi |

krōdhaḥ pariṇatō bhāti tasmin kāmē nivāritē |

sarva śrēyaḥ pariprāptiḥ - - - ||". (gītābhāvaprakāśamu - 3 - 239)

(puruṣulaku anarthamārgamulalō pravartiṃpa cēyunadi kāmamu, samastamaina anarthamulanu kaluga cēyunadi kanuka ātmaku kāmamu śatruvu. ē kāraṇamu cētanainanu ī kāmamunaku aḍḍu tagilina yaḍala krōdhamu kriṃda mārunu. aṃducēta ā kāmamu nivāriṃpabaḍina yaḍala anni vidhamulaina śrēyassu kalugunu).

  1. "yaḥ sarvasmin jagati svaprāṇārāmaṃ paramātmānāṃ vyāptaṃ paśyati, yō jagat śrīkṛṣṇamayamavalōkayati, sa kathaḥ kaṃ svavairiṇaṃ maṃtuṃ śaknōti?"

(tanalōnunna tana prāṇārāmuḍaina paramātma ī jagattu aṃtaṭilōnu vyāpiṃci yunnāḍu aninnī, jagattu aṃtayu śrīkṛṣṇamayamani evaḍu bhāviṃcunō - telusukonunō - aṭṭivāniki ēvaḍu tana vairigā kanabaḍunu? - anagā aṭṭivāniki evarunu vairi lēḍu ani arthamu -)

  1. "ka. pagatura ceraciti naniyunu

pagaturacē ceḍitinaniyu bāluḍu talacen

paga celumululēvātmaku

pagacelumalakalu karmabaṃdhamusuṃḍī ||". (śrīmadāṃdhramahābhāgavatamu -)

  1. "ka. parulevvaru tāmevvaru

parikiṃpaṃga nēkamaguṭa bhāviṃparu ta

tparamajñānamu lēmini

parulugu nēmanucu dōcu brāṇulakellan". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 69)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.