విషమభావము; పక్షపాతము, భేదము.
"కాంశ్చిత్ తిర్యగాదీన్ అత్యంత దుఃఖినః ఉత్పాదయతి, కాంశ్చిత్ మనుష్యాదీన్ సుఖదుఃఖ సాధారణాత్, కాంశ్చిద్దేవాదీన్నత్యంత సుఖీనః ఇతి వైషమ్యం". (బ్రహ్మసూత్ర భాష్యే - బ్రహ్మ సూత్ర ప్రకాశికా - 2 - 1 - 34)
(కొన్ని తిర్యగ్జంతువులు మొదలగు వాటిని మిక్కిలి దుఃఖము గలవిగాను, కొందఱు మనుష్యులు మొదలగువారిని సుఖ దుఃఖములు సాధారణములుగా గలవారినిగా, కొందఱు దేవతలు మొదలగువారిని మిక్కిలి సుఖముగలవారినిగను భగవంతుడు సృష్టించెను - ఇట్లు చేయుట వైషమ్యము; కాని, భగవంతునికి ఈ విషయములో వైషమ్యము లేదు. ఎందుచేతననగా - :వైషమ్య నైర్ఘృణ్యేన న సాపేక్షత్వాత్, తథాహి దర్శయతి) (బ్రహ్మసూత్రములు - 2 - 1 - 34)
వైషమ్యమనగా పైన చెప్పిన ప్రకారముగా జీవుల యడల పక్షపాత వైఖరి - నైర్ఘృణ్యమనగా దయా దాక్షిణ్యములు లేక జీవులనందఱిని సహరించుట. ఇవి రెండును భగవంతునికి లేవు - భగవంతుడు ఇట్లు సృష్టి చేయుటలో ఆపేక్ష ఏమీ లేదు - "న బ్రహ్మణః వైషమ్య నైర్ఘృణ్యే సాతాం". కస్మాత్ ? సాపేక్షత్వాత్, ప్రాణి కర్మా సాపేక్షత్వాత్. కర్మా నపేక్షత్వే హి వైషమ్యాది దోషః స్యాత్ - స చ సాపేక్షత్వే (అ)నీశ్వర ప్రసంగః - భృత్యాది సేవానుసారేణ ఫలదాతూ రాజ్ఞో రాజత్వగ దర్శనాత్. ననుకస్మాత్ బ్రహ్మణః కర్మ సాపేక్షత్వం "న మే ద్వేష్యోస్తి, న ప్రియః" ఇతి స్మృతిః. (శ్రీమద్భగవద్గీత - 9 - 29)
(పరబ్రహ్మకు వైషమ్యముగాని, నైర్ఘృణ్యముకాని, ఎందుకు లేవనగా, ఈ రెండును జీవులు చేసిన కర్మఫకము ననుభవింప చేయుటయే అతని అపేక్ష. జీవులు తాము చేసిన కర్మల ఫలముగా జన్మములెత్తి నశించుచుండినచో పరబ్రహ్మయే ఈ చరాచర ప్రపంచమును సృజించుట పొసగదు అనిన యడల దానికి సమాధానము ఏమనిన - భృత్యులు రాజునకు చేయు సేవలోని తారతమ్యమును బట్టి వారికి ఫలము నిచ్చుచున్నాడు. అట్లే పరబ్రహ్మకూడా జీవులకు విషమ జన్మములను వారి వారి కర్మలఫలముగా అనుభవింప చేయుచున్నాడు. అందుచేత బ్రహ్మకు కర్మసాపేక్షము లేదు - ఈ విషయము స్మృతిలో ఈ విధముగా చెప్పబడినది. నాకు ద్వేషించవలసినవాడుకాని ప్రియుడుగాని ఎవరూ లేరు - "సమోహం సర్వభూతేషు" (సమస్త భూతముల యడల నేను సమముగానే యున్నాను) సూర్య రశ్మి అందఱికి కలుగుచున్నట్లు నాకు వైషమ్యము లేదు - నేను అందఱిలోను అంతరాత్మగానున్నాను - "సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరః“. - "ఏషహ్యేవ సాదు కర్మ కారయతి తం యమేభ్యః లోకేభ్యః ఉన్నినీషతే. ఏష ఉవా అసాదుకర్మ కారయతి తం యమధో నినీషతే" (కౌ - ఉ. 3 - 8)
(పరబ్రహ్మ ఎవరిని ఊర్థ్వలోకములను పొందింప తలచునో వారిచే సాదుకర్మ - సత్కర్మ; పుణ్యకర్మ చేయించును - ఎవరిని అధోలోకములను పొందింపతలచునో వారిచే అసాదుకర్మ - పాపము - చేయించును -) అని స్మృతి చెప్పుచున్నది. స్మృతి ఇంకొక విధముగ కూడ చెప్పుచున్నది –
"యే యథా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (శ్రీమద్భగవద్గీత - 4 - 11)
(ఎవరు నను ఏ విధముగా నారాధింతురో - ఉపాసింతురో - వారికి నేను దానికి తగిన ఫలమునే అందించెదను - ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని - ఈ నలుగురులోను ఎవరు ఏమి కావలసిన నన్ను ఆరాధించిన దానినే అతనికి నేను ప్రసాదించెదను - ఈ శృతి స్మృతి వాక్యములవలన పరబ్రహ్మకు విషమసృష్టిలో పక్షపాతము లేదు. జన్మలు వారి వారి కర్మలను బట్టియే కలుగును).
(జీవుల జన్మలు కర్మవలన కలుగునని చెప్పబడినది. సృష్టి ప్రారంభములో కర్మలు లేవుకదా అదెట్లు పొసగును - అనిన దానికి సమాధానమేమనిన –
"న కర్మ విభాగాదితి చేన్న అనాదిత్వత్ " (బ్రహ్మసూత్రములు - 2 -1 - 35)
సృష్టికి పూర్వము బ్రహ్మ ఒకడే ఉండెను కదా ? జీవులే లేరు, వారి కర్మలు లేవు –
"స దేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం" (ఛాందోగ్యోపనిషత్ - 6 - 2 - 1)
జనన మరణ రూపమైన సంసారము పరబ్రహ్మవలెనే అనాది. క్రిందటి సృష్టిలోని జీవుల పాప పుణ్యములు సూక్ష్మరూపములో జీవుని ఆశ్రయించియుండి తరువాత సృష్టిలో ఫలమిచ్చును -)
(ఈ సంసారమందు దేవమే ఆత్మ యను అభిమానముగల దేవతులకు మనుష్యులకు - ‘నేను’, ‘నాది’ అను వైషమ్యము కలుగుచున్నది, ‘ఇది నాకు నింద’, ‘నేను నిందింపబడితిని’ అను అభిమానము కల వైషమ్యము కలుగుచున్నది. ఇటువంటి అభిమానము కలిగియుండుటచేత కఠినముగా నుండుట, దండించుటవలన హింస చేయుట యగును. ఈ దండ పారుష్యములు ఇతరులవలన కలిగినవి. ఇవి దేహమునకు సంబంధించినవైనను - శరీరమునకు, మనస్సునకు బాధ కలిగించునవైనను - దేహమే ఆత్మ యను అభిమానము గలవాడు వీటిని ఆత్మకు సంబంధించినవే యనుకొనుటవలన ఇతరులకు హాని చేయును. ఇట్లు దేహాత్మాభిమానముగలవారు ఈ దండపారుష్యములు దేహము ఆత్మ అను రెండింటికి తారతమ్యము తెలియని వారగుటచేత ఇవి దేహమునకు సంబంధించినవేకాని ఆత్మకు సంబంధించినవికావు అని తలెంచదరు - ఆ ప్రకారముగానే హింసింపబడినవారు కూడ ఈ హింస దేహమునకు సంబంధించినదే కాని ఆత్మకు కాదు అని తలచెదరు - దేహమే ఆత్మయను అభిమానము కలిగియుండుటచేత ‘నాకు ఈ హింస కలిగినది’ అను అభిమానము ఇట్లు సూచించడమైనది. ఈ విధమైన వైషమ్యము దేహమే ఆత్మ యను అభిమానము పరబ్రహ్మకు లేదు - కారణమేమనగా పరబ్రహ్మ అఖిలాత్మ - సర్వాత్మ, సర్వ జగత్తునకు తానే ఆత్మయగుటవలన అభిమానము లేదు).
viṣamabhāvamu; pakṣapātamu, bhēdamu.
"kāṃścit tiryagādīn atyaṃta duḥkhinaḥ utpādayati, kāṃścit manuṣyādīn sukhaduḥkha sādhāraṇāt, kāṃściddēvādīnnatyaṃta sukhīnaḥ iti vaiṣamyaṃ". (brahmasūtra bhāṣyē - brahma sūtra prakāśikā - 2 - 1 - 34)
(konni tiryagjaṃtuvulu modalagu vāṭini mikkili duḥkhamu galavigānu, koṃdaṟu manuṣyulu modalaguvārini sukha duḥkhamulu sādhāraṇamulugā galavārinigā, koṃdaṟu dēvatalu modalaguvārini mikkili sukhamugalavāriniganu bhagavaṃtuḍu sṛṣṭiṃcenu - iṭlu cēyuṭa vaiṣamyamu; kāni, bhagavaṃtuniki ī viṣayamulō vaiṣamyamu lēdu. eṃducētananagā - :vaiṣamya nairghṛṇyēna na sāpēkṣatvāt, tathāhi darśayati) (brahmasūtramulu - 2 - 1 - 34)
vaiṣamyamanagā paina ceppina prakāramugā jīvula yaḍala pakṣapāta vaikhari - nairghṛṇyamanagā dayā dākṣiṇyamulu lēka jīvulanaṃdaṟini sahariṃcuṭa. ivi reṃḍunu bhagavaṃtuniki lēvu - bhagavaṃtuḍu iṭlu sṛṣṭi cēyuṭalō āpēkṣa ēmī lēdu - "na brahmaṇaḥ vaiṣamya nairghṛṇyē sātāṃ". kasmāt ? sāpēkṣatvāt, prāṇi karmā sāpēkṣatvāt. karmā napēkṣatvē hi vaiṣamyādi dōṣaḥ syāt - sa ca sāpēkṣatvē (a)nīśvara prasaṃgaḥ - bhṛtyādi sēvānusārēṇa phaladātū rājñō rājatvaga darśanāt. nanukasmāt brahmaṇaḥ karma sāpēkṣatvaṃ "na mē dvēṣyōsti, na priyaḥ" iti smṛtiḥ. (śrīmadbhagavadgīta - 9 - 29)
(parabrahmaku vaiṣamyamugāni, nairghṛṇyamukāni, eṃduku lēvanagā, ī reṃḍunu jīvulu cēsina karmaphakamu nanubhaviṃpa cēyuṭayē atani apēkṣa. jīvulu tāmu cēsina karmala phalamugā janmamuletti naśiṃcucuṃḍinacō parabrahmayē ī carācara prapaṃcamunu sṛjiṃcuṭa posagadu anina yaḍala dāniki samādhānamu ēmanina - bhṛtyulu rājunaku cēyu sēvalōni tāratamyamunu baṭṭi vāriki phalamu niccucunnāḍu. aṭlē parabrahmakūḍā jīvulaku viṣama janmamulanu vāri vāri karmalaphalamugā anubhaviṃpa cēyucunnāḍu. aṃducēta brahmaku karmasāpēkṣamu lēdu - ī viṣayamu smṛtilō ī vidhamugā ceppabaḍinadi. nāku dvēṣiṃcavalasinavāḍukāni priyuḍugāni evarū lēru - "samōhaṃ sarvabhūtēṣu" (samasta bhūtamula yaḍala nēnu samamugānē yunnānu) sūrya raśmi aṃdaṟiki kalugucunnaṭlu nāku vaiṣamyamu lēdu - nēnu aṃdaṟilōnu aṃtarātmagānunnānu - "samaṃ sarvēṣu bhūtēṣu tiṣṭaṃtaṃ paramēśvaraḥ”. - "ēṣahyēva sādu karma kārayati taṃ yamēbhyaḥ lōkēbhyaḥ unninīṣatē. ēṣa uvā asādukarma kārayati taṃ yamadhō ninīṣatē" (kau - u. 3 - 8)
(parabrahma evarini ūrthvalōkamulanu poṃdiṃpa talacunō vāricē sādukarma - satkarma; puṇyakarma cēyiṃcunu - evarini adhōlōkamulanu poṃdiṃpatalacunō vāricē asādukarma - pāpamu - cēyiṃcunu -) ani smṛti ceppucunnadi. smṛti iṃkoka vidhamuga kūḍa ceppucunnadi –
"yē yathā māṃ prapadyaṃtē tāṃstadhaiva bhajāmyahaṃ" (śrīmadbhagavadgīta - 4 - 11)
(evaru nanu ē vidhamugā nārādhiṃturō - upāsiṃturō - vāriki nēnu dāniki tagina phalamunē aṃdiṃcedanu - ārtuḍu, jijñāsuvu, arthārthi, jñāni - ī nalugurulōnu evaru ēmi kāvalasina nannu ārādhiṃcina dāninē ataniki nēnu prasādiṃcedanu - ī śṛti smṛti vākyamulavalana parabrahmaku viṣamasṛṣṭilō pakṣapātamu lēdu. janmalu vāri vāri karmalanu baṭṭiyē kalugunu).
(jīvula janmalu karmavalana kalugunani ceppabaḍinadi. sṛṣṭi prāraṃbhamulō karmalu lēvukadā adeṭlu posagunu - anina dāniki samādhānamēmanina –
"na karma vibhāgāditi cēnna anāditvat " (brahmasūtramulu - 2 -1 - 35)
sṛṣṭiki pūrvamu brahma okaḍē uṃḍenu kadā ? jīvulē lēru, vāri karmalu lēvu –
"sa dēva sōmyēdamagra āsīt ēkamēvā dvitīyaṃ" (chāṃdōgyōpaniṣat - 6 - 2 - 1)
janana maraṇa rūpamaina saṃsāramu parabrahmavalenē anādi. kriṃdaṭi sṛṣṭilōni jīvula pāpa puṇyamulu sūkṣmarūpamulō jīvuni āśrayiṃciyuṃḍi taruvāta sṛṣṭilō phalamiccunu -)
(ī saṃsāramaṃdu dēvamē ātma yanu abhimānamugala dēvatulaku manuṣyulaku - ‘nēnu’, ‘nādi’ anu vaiṣamyamu kalugucunnadi, ‘idi nāku niṃda’, ‘nēnu niṃdiṃpabaḍitini’ anu abhimānamu kala vaiṣamyamu kalugucunnadi. iṭuvaṃṭi abhimānamu kaligiyuṃḍuṭacēta kaṭhinamugā nuṃḍuṭa, daṃḍiṃcuṭavalana hiṃsa cēyuṭa yagunu. ī daṃḍa pāruṣyamulu itarulavalana kaliginavi. ivi dēhamunaku saṃbaṃdhiṃcinavainanu - śarīramunaku, manassunaku bādha kaligiṃcunavainanu - dēhamē ātma yanu abhimānamu galavāḍu vīṭini ātmaku saṃbaṃdhiṃcinavē yanukonuṭavalana itarulaku hāni cēyunu. iṭlu dēhātmābhimānamugalavāru ī daṃḍapāruṣyamulu dēhamu ātma anu reṃḍiṃṭiki tāratamyamu teliyani vāraguṭacēta ivi dēhamunaku saṃbaṃdhiṃcinavēkāni ātmaku saṃbaṃdhiṃcinavikāvu ani taleṃcadaru - ā prakāramugānē hiṃsiṃpabaḍinavāru kūḍa ī hiṃsa dēhamunaku saṃbaṃdhiṃcinadē kāni ātmaku kādu ani talacedaru - dēhamē ātmayanu abhimānamu kaligiyuṃḍuṭacēta ‘nāku ī hiṃsa kaliginadi’ anu abhimānamu iṭlu sūciṃcaḍamainadi. ī vidhamaina vaiṣamyamu dēhamē ātma yanu abhimānamu parabrahmaku lēdu - kāraṇamēmanagā parabrahma akhilātma - sarvātma, sarva jagattunaku tānē ātmayaguṭavalana abhimānamu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.