← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాక్యత్రయం vākyatrayaṃ

Original — తెలుగు

“నాహం, కోహం, సోహం” అనునవి వక్యత్రయము - ‘కోహం’ అనగా నేనెవ్వడను ‘అనుట’. ‘నాహం’ అనే పదంవల్ల తనయందు వేరైనటువంటి అహంకారాది దేహాంత ప్రపంచమును తృణీకరించి, సమిత్పాణియై కృతార్థతవల్లను, గురువందు నుపన్నుండై “కోయాత్మేతి వయ ముపాస్మహే” అని కలదు కనుక “కోహం” అనే అతండు వాచ్యపరంగా చూస్తే జడాజడాభిమానులు రెండున్నూ ‘నాహం’ అనే పదంవల్ల ‘నేతి’ ముఖానంద్రోసి నిరాలంబచైతన్య స్వరూపమని తెలుసును. గురు మహావాక్యార్థం బోధకంవల్ల తెలిసి ఆ యర్థ నిశ్చయాత్మకుడై ‘నాహం’ అని నిలుచును. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 6)

Transliteration

“nāhaṃ, kōhaṃ, sōhaṃ” anunavi vakyatrayamu - ‘kōhaṃ’ anagā nēnevvaḍanu ‘anuṭa’. ‘nāhaṃ’ anē padaṃvalla tanayaṃdu vērainaṭuvaṃṭi ahaṃkārādi dēhāṃta prapaṃcamunu tṛṇīkariṃci, samitpāṇiyai kṛtārthatavallanu, guruvaṃdu nupannuṃḍai “kōyātmēti vaya mupāsmahē” ani kaladu kanuka “kōhaṃ” anē ataṃḍu vācyaparaṃgā cūstē jaḍājaḍābhimānulu reṃḍunnū ‘nāhaṃ’ anē padaṃvalla ‘nēti’ mukhānaṃdrōsi nirālaṃbacaitanya svarūpamani telusunu. guru mahāvākyārthaṃ bōdhakaṃvalla telisi ā yartha niścayātmakuḍai ‘nāhaṃ’ ani nilucunu. (brahmavidyā sudhārṇavamu - 6)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.