← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వారణాసి vāraṇāsi

Original — తెలుగు
  1. “సర్వాణీంద్రియకృతానిపాపాని వారయతి సావరణా భ్రూః; సర్వాణీంద్రియకృతాని పాపాని నాశయతి చ ఇతి; నాశీతి నాశీ నాసికా ఇతి వరణా నాశీతి”.

“నాసా భ్రువోర్జీవద్వారేశ్వరస్థానత్వ ధ్యానాత్ పాపవారకత్వమితి మంతన్యం స ఏష సంధిర్ద్యులోకస్య స్వర్గస్య పరస్యచ బ్రహ్మలోకస్య సంధిత్వేన ధ్యేయః.”

(ఇంద్రియములు చేయునట్టి సమస్త పాపములను వారించునది కనుక భ్రూః (భ్రూభాగము) వరణ యని చెప్పబడినది. ఇంద్రియములు చేయునట్టి సమస్త పాపములను నాశము చేయునది నాసి (నాసిక = ముక్కు). ఈ కనుబొమలకు ముక్కుకు మధ్యభాగము వారణాసి యని చెప్పబడినది.

(కనుబొమలకు, ముక్కునకు మధ్య ప్రదేశము ఈశ్వరుని స్థానము అని ధ్యానించుటచేత పాపములను పోగొట్టునది అని తలంచవలెను (తెలుసుకొనవలెను). ఈ రెండింటికి సంధ్య (మధ్యస్థానము) స్వర్గలోకమునకు బ్రహ్మలోకమునకు సంధియని భావించవలెను)

  1. య ఏషో అనంతో (అ)వ్యక్త ఆత్మాసో అవిముక్తే కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి సో (అ)విముక్తః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి, కా వై వరణా, కాచ నాశీతి? తత్రచే మామేవ వరణాం నాసాం చేతి సారుచ్య సర్వాణీంద్రియ కృతాని పాపాని వారయతి సావరణా, సర్వాణీంద్రియ కృతాని పాపాని నాశయతి చేతి సా నాశీతి, వరణాశీతి నిరుచ్య పునరప్యామనంతి - “కతమశ్చాస్య స్థానం భవతీతి, భృవోర్ఘ్రాణస్య చ యస్సంధిః స ఏష ద్యులోకస్య పరస్య చ సంధిర్భవతీతి -”

“య ఏషో (అ)నంతో - అవ్యక్తో దుర్విజ్ఞేయస్తం కథం జానీయా మీత్య త్రేః ప్రశ్నే యాజ్ఞవల్క్యస్సోత్తరం - స ఈశ్వరో అవిముక్తే కామాదిర్బద్ధే జీవే భేదకల్పనయా ప్రతిష్టితః, ఉపాస్యః. ఇమామేవ భ్రూసహితాం నాసికాం సర్వాణీంద్రియ కృతాన్ దోషాన్ వారయతీతి వారణా భ్రూః; తాన్ దోషాన్ నాశయతీతి నాసా, నాసికేతి నిర్వచనం. నాసా భ్రువోర్జీవ ద్వారేశ్వర స్థానత్వ ధ్యానాత్ పాపవారకత్వమితి మంతవ్యం. స ఏష సంధిర్ద్యులోకస్య స్వర్గస్య పరస్య చ బ్రహ్మలోకస్య సంధిత్వేన ధ్యేయః”.

(అనంతుడు, అవ్యక్తుడు అయిన అత్మ అవిముక్తమందు ప్రతిష్టింపబడి యున్నది. అని ముక్తము దేనియందు ప్రతిష్టిమబడియున్నది, వరణా అనగా ఏది; నాసి అనగా నేమి?.

ఇంద్రియములు చేయు సమస్త పాపములను హరించునది వరణా - ఇంద్రియములు చేయునట్టి సమస్త పాపములను నాశము చేయునది ‘నాశి’ అని చెప్పిన తర్వాత మరల ప్రశ్నింప బడుచున్నది - “దీని స్థానమేది?” కనుబొమలకు, నాసికకు మధ్యసంధి - అవి కలియుచోటు - అదియే ద్యులోకమునకు పరలోకమునకు సంధి).

(పరబ్రహ్మ అవిక్తమందు తెలుసుకొనుటకు కష్టము, అది యెట్లు తెలుసుకొననగును ? అను ప్రశ్నకు యాజ్ఞవల్క్యుని సమాధానము - ఆ ఈశ్వరుడు అవిముక్తమందు కామము మొదలగువాటిచేత బద్దుడైన జీవునియందు భేదకల్పన వలన ప్రతిష్టింపబడి యున్నాడని ఉపాసించవలెను - కనుబొమలతో కూడిన నాసిక (ముక్కు) ఇంద్రియములు చేయు దోషములను వారించునది కనుక వారణా. ఆ దోషములను నాశము చేయునది కనుక ముక్కు నాసి (నాసిక). ముక్కు, కనుబొమలు జీవుని ద్వారములని ఈశ్వరస్థానములని ధ్యానింపబడుటచేత పాపములను హరింపచేయునవి అని తలంచవలెను - ఈ రెండింటి సంధ్య - కనుబొమలకు, ముక్కునకును మధ్య ప్రదేశము ద్యులోకము యొక్క (స్వర్గలోకము యొక్క), పరలోకము యొక్క (బ్రహ్మలోకము యొక్క) సంధి (కలియుచోటు) అని ధ్యానించతగినది (చూడుము - 5).

  1. వరణాయాం నాస్యాంచ మధ్యే - (వరణం అనగా కనుబొమలు, నాసి యనగా ముక్కు, వీటిమధ్య ప్రదేశము భ్రూమధ్య ప్రదేశము - ఇది పురాణములలో అంతర వారణాసి యని చెప్పబడినది.

  2. “అంతర్విముక్త తీర్థమెయ్యెదియొ యనిన |

వారణయును ‘నసి’ యును నైన వారణాసి ||.”

“వ. భ్రూఘ్రాణంబులసంధి యవిముక్తస్థానంబు - అది అభ్యంతర తీర్థంబు” (శ్రీనాధుడు - కాశీఖండము)

  1. “సీ. ఏ విధంబున నాత్మనెఱుగుదు నేనంచు యాజ్ఞవల్క్యుని నత్రి యడిగె తొల్లి

యవిముక్తమున యందుపాస్యుడాత్ముడటంచు యాజ్ఞవల్క్యుండతి కానతిచ్చె

నా యవిముక్తమెం దాశ్రయించినని యంచడిగె గ్రమ్మఱ నత్రి యాజ్ఞవల్క్యు

నినుపారి వరణ యందును నసియందును నది యుండునని యత్రికానతిచ్చె

యాజ్ఞవల్క్యుండు భ్రూమధ్యమాస్థలంబు

వరణ సంసార దోషనివారణంబు

నాశి యింద్రియ దోష నివారణంబు

చేయుచుండుట యిట నిర్వచింప బడియె ||“. (శ్రీనాధుడు - కాశీఖండము -) (చూడుము - 2)

  1. కాశీ క్షేత్రము - “హరుండు జంతువులకున్ బ్రాణాంతకాలంబునం దోంకారాక్షర మంత్ర రాజము జెవిన్ యోజించు కాశీస్థలిన్ -”

(శ్రీనాధుడు - కాశీఖండము)

- కాశీ క్షేత్రము - బాహ్యవారణాసి

Transliteration
  1. “sarvāṇīṃdriyakṛtānipāpāni vārayati sāvaraṇā bhrūḥ; sarvāṇīṃdriyakṛtāni pāpāni nāśayati ca iti; nāśīti nāśī nāsikā iti varaṇā nāśīti”.

“nāsā bhruvōrjīvadvārēśvarasthānatva dhyānāt pāpavārakatvamiti maṃtanyaṃ sa ēṣa saṃdhirdyulōkasya svargasya parasyaca brahmalōkasya saṃdhitvēna dhyēyaḥ.”

(iṃdriyamulu cēyunaṭṭi samasta pāpamulanu vāriṃcunadi kanuka bhrūḥ (bhrūbhāgamu) varaṇa yani ceppabaḍinadi. iṃdriyamulu cēyunaṭṭi samasta pāpamulanu nāśamu cēyunadi nāsi (nāsika = mukku). ī kanubomalaku mukkuku madhyabhāgamu vāraṇāsi yani ceppabaḍinadi.

(kanubomalaku, mukkunaku madhya pradēśamu īśvaruni sthānamu ani dhyāniṃcuṭacēta pāpamulanu pōgoṭṭunadi ani talaṃcavalenu (telusukonavalenu). ī reṃḍiṃṭiki saṃdhya (madhyasthānamu) svargalōkamunaku brahmalōkamunaku saṃdhiyani bhāviṃcavalenu)

  1. ya ēṣō anaṃtō (a)vyakta ātmāsō avimuktē kasmin pratiṣṭhita iti sō (a)vimuktaḥ kasmin pratiṣṭhita iti, kā vai varaṇā, kāca nāśīti? tatracē māmēva varaṇāṃ nāsāṃ cēti sārucya sarvāṇīṃdriya kṛtāni pāpāni vārayati sāvaraṇā, sarvāṇīṃdriya kṛtāni pāpāni nāśayati cēti sā nāśīti, varaṇāśīti nirucya punarapyāmanaṃti - “katamaścāsya sthānaṃ bhavatīti, bhṛvōrghrāṇasya ca yassaṃdhiḥ sa ēṣa dyulōkasya parasya ca saṃdhirbhavatīti -”

“ya ēṣō (a)naṃtō - avyaktō durvijñēyastaṃ kathaṃ jānīyā mītya trēḥ praśnē yājñavalkyassōttaraṃ - sa īśvarō avimuktē kāmādirbaddhē jīvē bhēdakalpanayā pratiṣṭitaḥ, upāsyaḥ. imāmēva bhrūsahitāṃ nāsikāṃ sarvāṇīṃdriya kṛtān dōṣān vārayatīti vāraṇā bhrūḥ; tān dōṣān nāśayatīti nāsā, nāsikēti nirvacanaṃ. nāsā bhruvōrjīva dvārēśvara sthānatva dhyānāt pāpavārakatvamiti maṃtavyaṃ. sa ēṣa saṃdhirdyulōkasya svargasya parasya ca brahmalōkasya saṃdhitvēna dhyēyaḥ”.

(anaṃtuḍu, avyaktuḍu ayina atma avimuktamaṃdu pratiṣṭiṃpabaḍi yunnadi. ani muktamu dēniyaṃdu pratiṣṭimabaḍiyunnadi, varaṇā anagā ēdi; nāsi anagā nēmi?.

iṃdriyamulu cēyu samasta pāpamulanu hariṃcunadi varaṇā - iṃdriyamulu cēyunaṭṭi samasta pāpamulanu nāśamu cēyunadi ‘nāśi’ ani ceppina tarvāta marala praśniṃpa baḍucunnadi - “dīni sthānamēdi?” kanubomalaku, nāsikaku madhyasaṃdhi - avi kaliyucōṭu - adiyē dyulōkamunaku paralōkamunaku saṃdhi).

(parabrahma aviktamaṃdu telusukonuṭaku kaṣṭamu, adi yeṭlu telusukonanagunu ? anu praśnaku yājñavalkyuni samādhānamu - ā īśvaruḍu avimuktamaṃdu kāmamu modalaguvāṭicēta badduḍaina jīvuniyaṃdu bhēdakalpana valana pratiṣṭiṃpabaḍi yunnāḍani upāsiṃcavalenu - kanubomalatō kūḍina nāsika (mukku) iṃdriyamulu cēyu dōṣamulanu vāriṃcunadi kanuka vāraṇā. ā dōṣamulanu nāśamu cēyunadi kanuka mukku nāsi (nāsika). mukku, kanubomalu jīvuni dvāramulani īśvarasthānamulani dhyāniṃpabaḍuṭacēta pāpamulanu hariṃpacēyunavi ani talaṃcavalenu - ī reṃḍiṃṭi saṃdhya - kanubomalaku, mukkunakunu madhya pradēśamu dyulōkamu yokka (svargalōkamu yokka), paralōkamu yokka (brahmalōkamu yokka) saṃdhi (kaliyucōṭu) ani dhyāniṃcataginadi (cūḍumu - 5).

  1. varaṇāyāṃ nāsyāṃca madhyē - (varaṇaṃ anagā kanubomalu, nāsi yanagā mukku, vīṭimadhya pradēśamu bhrūmadhya pradēśamu - idi purāṇamulalō aṃtara vāraṇāsi yani ceppabaḍinadi.

  2. “aṃtarvimukta tīrthameyyediyo yanina |

vāraṇayunu ‘nasi’ yunu naina vāraṇāsi ||.”

“va. bhrūghrāṇaṃbulasaṃdhi yavimuktasthānaṃbu - adi abhyaṃtara tīrthaṃbu” (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

  1. “sī. ē vidhaṃbuna nātmaneṟugudu nēnaṃcu yājñavalkyuni natri yaḍige tolli

yavimuktamuna yaṃdupāsyuḍātmuḍaṭaṃcu yājñavalkyuṃḍati kānaticce

nā yavimuktameṃ dāśrayiṃcinani yaṃcaḍige grammaṟa natri yājñavalkyu

ninupāri varaṇa yaṃdunu nasiyaṃdunu nadi yuṃḍunani yatrikānaticce

yājñavalkyuṃḍu bhrūmadhyamāsthalaṃbu

varaṇa saṃsāra dōṣanivāraṇaṃbu

nāśi yiṃdriya dōṣa nivāraṇaṃbu

cēyucuṃḍuṭa yiṭa nirvaciṃpa baḍiye ||“. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu -) (cūḍumu - 2)

  1. kāśī kṣētramu - “haruṃḍu jaṃtuvulakun brāṇāṃtakālaṃbunaṃ dōṃkārākṣara maṃtra rājamu jevin yōjiṃcu kāśīsthalin -”

(śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

- kāśī kṣētramu - bāhyavāraṇāsi

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.