సకల వర్గంబులకు సత్యంబును, దయయును, నుపవాసాది తపంబును, శౌచంబును, సైరణయును, సదసద్వివేకంబును, మనో నియమంబును, బహిరింద్రియ జయంబును, హింస లేమియును, బ్రహ్మచర్యంబును, దానంబును, యథోచిత జపంబును, సంతోషంబును, మార్థవంబును, సమదర్శనంబును, మహాజనసేవయు, గ్రామ్యంబులయిన కోరికలు మానుటయు, నిష్పల క్రియలు విడుచటయు, మితభాషిత్వంబును, దేహంకానిదన్ను వెదకి కొనుటయు, నన్నోదకంబులు ప్రాణులకుం బంచి యిచ్చుటయు, ప్రాణులందు దేవతా బుద్ధియు నాత్మబుద్ధిం జేయుటయు, శ్రీనారాయణ చరణ స్మరణ, కీర్తన, శ్రవణ సేవార్చన నమస్కార, దాస్యాత్మ సమర్పణ సఖ్యంబులనియెడి త్రింశల్లక్షణంబులు గలుగవలయు. అందు సత్కులాచారుండయి మంత్రవతంబులైన గర్భాదానాది సంస్కారంబుల విచ్ఛిన్నంబులుగా గలవాడు ద్విజుండు; ద్విజునకు యజన యాజనాధ్యయ నాధ్యాపన దాన ప్రతిగ్రహంబులును షట్కర్మంబులు విహితంబులు. రాజునకు బ్రతిగ్రహ వ్యతిరిక్తంబులయిన యజనాది కర్మంబులయిదును, బ్రజాపాలనంబును, బ్రాహ్మణులు గానివారివలన దండ శుల్కాదులు గొనుటయు విహిత కర్మంబులు, వైశ్యునికి గృషివాణిజ్య గోరక్షణాది కర్మంబులును, బ్రాహ్మణకులాను సరణంబును విహితంబులు. శూద్రునకు ద్వీజ శుశ్రూష సేయవలయు.)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 409)
sakala vargaṃbulaku satyaṃbunu, dayayunu, nupavāsādi tapaṃbunu, śaucaṃbunu, sairaṇayunu, sadasadvivēkaṃbunu, manō niyamaṃbunu, bahiriṃdriya jayaṃbunu, hiṃsa lēmiyunu, brahmacaryaṃbunu, dānaṃbunu, yathōcita japaṃbunu, saṃtōṣaṃbunu, mārthavaṃbunu, samadarśanaṃbunu, mahājanasēvayu, grāmyaṃbulayina kōrikalu mānuṭayu, niṣpala kriyalu viḍucaṭayu, mitabhāṣitvaṃbunu, dēhaṃkānidannu vedaki konuṭayu, nannōdakaṃbulu prāṇulakuṃ baṃci yiccuṭayu, prāṇulaṃdu dēvatā buddhiyu nātmabuddhiṃ jēyuṭayu, śrīnārāyaṇa caraṇa smaraṇa, kīrtana, śravaṇa sēvārcana namaskāra, dāsyātma samarpaṇa sakhyaṃbulaniyeḍi triṃśallakṣaṇaṃbulu galugavalayu. aṃdu satkulācāruṃḍayi maṃtravataṃbulaina garbhādānādi saṃskāraṃbula vicchinnaṃbulugā galavāḍu dvijuṃḍu; dvijunaku yajana yājanādhyaya nādhyāpana dāna pratigrahaṃbulunu ṣaṭkarmaṃbulu vihitaṃbulu. rājunaku bratigraha vyatiriktaṃbulayina yajanādi karmaṃbulayidunu, brajāpālanaṃbunu, brāhmaṇulu gānivārivalana daṃḍa śulkādulu gonuṭayu vihita karmaṃbulu, vaiśyuniki gṛṣivāṇijya gōrakṣaṇādi karmaṃbulunu, brāhmaṇakulānu saraṇaṃbunu vihitaṃbulu. śūdrunaku dvīja śuśrūṣa sēyavalayu.)
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 409)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.