“ఆదిత్యః సంస్తనామిదం తతస్తాప వశా దహం |
వర్షం పూర్వరసం భూమే రాకర్షామ్యర్క రిశ్మభిః |
కైశ్చ దుష్ణాను మాసేషు వృష్ట్యా భూమౌ క్షిపామ్యహం ||“. (గీతాభావప్రకాశము - 9 - 128 to 130)
(నేను - భగవంతుడు - సూర్యరూపముతో ఈ లోకమును తపింప చేయుదును. (వేడిమిని కలుగ చేయుదును). ఈ రీతిగా తపింప చేయుటవలన సూర్యరశ్మి చేత ఈ భూమి యొక్క పూర్వ రసమైన వర్షమును ఎనిమిది నెలలు ఆకర్షించుదును. ఇట్లాకర్షించిన వర్షమును (రసమును) తిరిగి నాలుగు మాసములలో వర్షరూపముగా భూమి మీద విడిచి పెట్టుదును -
యజ్ఞాత్ భవతి పర్జన్యో - - - ||“. (శ్రీమద్భగవద్గీత - 3 -14)
(“శుక్లశోణిత రూపేణ హ్యన్నా త్పరిణ తాత్కిల |
శరీరాణి ప్రజాయంతే వృష్టేరన్నస్య జన్మ చ |
యజ్ఞా ద్థర్మాదపూర్వాఖ్యాత్ జాయతే వృష్టి రర్కతః |
అగ్నౌ ప్రాప్తా హుతిః సమ్యగాదిత్య ముపతిష్టతే |
ఆదిత్యా జ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః |
సూక్ష్మో ధర్మః స యజ్ఞాఖ్య ఋత్వుగేదేశ్చ కర్మణః |
అపూర్వాఖ్యస్య యజ్ఞస్య విహితం కర్మకారణం ||” (గీతాభావప్రకాశము - 7 - 91 to 94)
(తినిన అన్నము శుక్రశోణితములుగా మారి శరీరమును కలిగించును. వర్షము కురియుటవలన అన్నము కలుగును. యజ్ఞము చేయునపుడు అగ్నిలో ఆహుతి చేయబడినవి ఒక అపూర్వమైన - కారణమునకు సామాన్యముగా మనకి కనబడనిదైన - ధర్మము (fine natural law) వలన సూర్యుని చెందును - సూర్యుడు అందువలన సముద్రజలము నాకర్షించి మరల భూమి మీద వర్షించును. ఇట్లు కురిసిన వర్షమువలన సస్యములు పండును (అన్నము కలుగును). వాటిని తిని ప్రజలు బ్రతుకుచున్నారు - ఆ అన్నము శుక్రశోణితములుగా మారినందున వారి శరీరములు కలుగుచున్నవి. కర్మఫలము ఏ విధముగా ఎప్పుడు ఎక్కడ నెవరిద్వారా (ఎవరి నిమిత్తముగా) ఫలించునో (అనగా కర్మగతి) తెలియనట్లే, యజ్ఞము చేయుటవలన సూర్యరశ్మిలో ఒక విశేషమైన శక్తిని కలిగించి అకాలములో కూడ (వర్షాభావము వలన కలుగు కరువు,కాటకము మొదలగు సమయములలో వర్షము కలిగింపచేయుటకు అవకాశమున్నదని దీని ఆశయము. ఇట్లు చేయు శక్తి - ధర్మము - natural law - అత్యంతము సూక్ష్మమగుటచేత అది యెట్లు జరుగునో అవగాహన యగుట కష్టము. అందుచేతనే ఆ ధర్మము అపూర్వము - పూర్వములేని, కారణము కనబడనిది అని చెప్పబడినది).
“ādityaḥ saṃstanāmidaṃ tatastāpa vaśā dahaṃ |
varṣaṃ pūrvarasaṃ bhūmē rākarṣāmyarka riśmabhiḥ |
kaiśca duṣṇānu māsēṣu vṛṣṭyā bhūmau kṣipāmyahaṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 128 to 130)
(nēnu - bhagavaṃtuḍu - sūryarūpamutō ī lōkamunu tapiṃpa cēyudunu. (vēḍimini kaluga cēyudunu). ī rītigā tapiṃpa cēyuṭavalana sūryaraśmi cēta ī bhūmi yokka pūrva rasamaina varṣamunu enimidi nelalu ākarṣiṃcudunu. iṭlākarṣiṃcina varṣamunu (rasamunu) tirigi nālugu māsamulalō varṣarūpamugā bhūmi mīda viḍici peṭṭudunu -
yajñāt bhavati parjanyō - - - ||“. (śrīmadbhagavadgīta - 3 -14)
(“śuklaśōṇita rūpēṇa hyannā tpariṇa tātkila |
śarīrāṇi prajāyaṃtē vṛṣṭērannasya janma ca |
yajñā dtharmādapūrvākhyāt jāyatē vṛṣṭi rarkataḥ |
agnau prāptā hutiḥ samyagāditya mupatiṣṭatē |
ādityā jjāyatē vṛṣṭirvṛṣṭērannaṃ tataḥ prajāḥ |
sūkṣmō dharmaḥ sa yajñākhya ṛtvugēdēśca karmaṇaḥ |
apūrvākhyasya yajñasya vihitaṃ karmakāraṇaṃ ||” (gītābhāvaprakāśamu - 7 - 91 to 94)
(tinina annamu śukraśōṇitamulugā māri śarīramunu kaligiṃcunu. varṣamu kuriyuṭavalana annamu kalugunu. yajñamu cēyunapuḍu agnilō āhuti cēyabaḍinavi oka apūrvamaina - kāraṇamunaku sāmānyamugā manaki kanabaḍanidaina - dharmamu (fine natural law) valana sūryuni ceṃdunu - sūryuḍu aṃduvalana samudrajalamu nākarṣiṃci marala bhūmi mīda varṣiṃcunu. iṭlu kurisina varṣamuvalana sasyamulu paṃḍunu (annamu kalugunu). vāṭini tini prajalu bratukucunnāru - ā annamu śukraśōṇitamulugā mārinaṃduna vāri śarīramulu kalugucunnavi. karmaphalamu ē vidhamugā eppuḍu ekkaḍa nevaridvārā (evari nimittamugā) phaliṃcunō (anagā karmagati) teliyanaṭlē, yajñamu cēyuṭavalana sūryaraśmilō oka viśēṣamaina śaktini kaligiṃci akālamulō kūḍa (varṣābhāvamu valana kalugu karuvu,kāṭakamu modalagu samayamulalō varṣamu kaligiṃpacēyuṭaku avakāśamunnadani dīni āśayamu. iṭlu cēyu śakti - dharmamu - natural law - atyaṃtamu sūkṣmamaguṭacēta adi yeṭlu jarugunō avagāhana yaguṭa kaṣṭamu. aṃducētanē ā dharmamu apūrvamu - pūrvamulēni, kāraṇamu kanabaḍanidi ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.