← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాసనా క్షయము vāsanā kṣayamu

Original — తెలుగు
  1. “క్రియా నాశాద్భవేచ్చింతా, నాశో(అ)స్మాద్వాసనా క్షయః |

వాసనా ప్రక్షయో మోక్షః స జీవన్ముక్తిరిష్యతే ||“.

(కర్మ నాశము వలన వలన చింత నశించును, చింత నశించిన వాసన నశించును. వాసన పూర్తిగా నశించిన అదియే మోక్షము, అదియే జీవన్న్ముక్తియని చెప్పబడినది.)

  1. “సర్వత్ర సర్వ తస్సర్వ బ్రహ్మమాత్రావలోకనం |

సద్భావ భావనా దార్ఢ్యాద్వాసనా లయ మశ్నుతే ||“. (ఆధ్యాత్మోపనిషత్)

(అన్ని చోట్ల, అంతయు బ్రహ్మమనే ధృఢమైన సద్భావము కలిగియుండుట వలన వాసన క్షీణించును)

  1. “యావద్విలీనం న మనో తావ ద్వాసనా క్షయః |

నక్షీణా వాసనా యావత్తవచ్చిత్తం న శామ్యతి ||“.

(మనసు లయము కానంతకాలము వాసన క్షీణించదు. వాసన క్షీణించనంతకాలము మనచ్చాంతి కలుగదు)

  1. వాసన అనాది, బహుజన్మ పరంపరాభ్యస్తము - ఈ అనాది జన్మవాసన చేతనే చింత - సంకల్పము - కలుగుచున్నది. ఆ చింత చేతనే క్రియ - పని జరుపబడుచున్నది. క్రియయే పునః పునః సంసారబంధ హేతువగుచున్నది. కావున క్రియ నశింపవలయుననిన తన్మూలమగు చింత - సంకల్పము - వశింపవలయును. చింత నశింపవలయుననిన తత్కారణమగు వాసన నశింపవలయును - - - కార్యమగు క్రియనే మొదట విడువ వలయును. శరీర సంబంధియగు బాహ్య క్రియను విడిచినను క్రియా సంకల్పము మనస్సు నాశ్రయించియే యుండును - కావున, పిదప నా సంకల్పమును త్యజింపవలయును - ఏతచ్చింతా పరిత్యాగము చిత్తవృత్తి నిరోధము (యోగము) చేతనే సాధ్యమగును).
Transliteration
  1. “kriyā nāśādbhavēcciṃtā, nāśō(a)smādvāsanā kṣayaḥ |

vāsanā prakṣayō mōkṣaḥ sa jīvanmuktiriṣyatē ||“.

(karma nāśamu valana valana ciṃta naśiṃcunu, ciṃta naśiṃcina vāsana naśiṃcunu. vāsana pūrtigā naśiṃcina adiyē mōkṣamu, adiyē jīvannmuktiyani ceppabaḍinadi.)

  1. “sarvatra sarva tassarva brahmamātrāvalōkanaṃ |

sadbhāva bhāvanā dārḍhyādvāsanā laya maśnutē ||“. (ādhyātmōpaniṣat)

(anni cōṭla, aṃtayu brahmamanē dhṛḍhamaina sadbhāvamu kaligiyuṃḍuṭa valana vāsana kṣīṇiṃcunu)

  1. “yāvadvilīnaṃ na manō tāva dvāsanā kṣayaḥ |

nakṣīṇā vāsanā yāvattavaccittaṃ na śāmyati ||“.

(manasu layamu kānaṃtakālamu vāsana kṣīṇiṃcadu. vāsana kṣīṇiṃcanaṃtakālamu manaccāṃti kalugadu)

  1. vāsana anādi, bahujanma paraṃparābhyastamu - ī anādi janmavāsana cētanē ciṃta - saṃkalpamu - kalugucunnadi. ā ciṃta cētanē kriya - pani jarupabaḍucunnadi. kriyayē punaḥ punaḥ saṃsārabaṃdha hētuvagucunnadi. kāvuna kriya naśiṃpavalayunanina tanmūlamagu ciṃta - saṃkalpamu - vaśiṃpavalayunu. ciṃta naśiṃpavalayunanina tatkāraṇamagu vāsana naśiṃpavalayunu - - - kāryamagu kriyanē modaṭa viḍuva valayunu. śarīra saṃbaṃdhiyagu bāhya kriyanu viḍicinanu kriyā saṃkalpamu manassu nāśrayiṃciyē yuṃḍunu - kāvuna, pidapa nā saṃkalpamunu tyajiṃpavalayunu - ētacciṃtā parityāgamu cittavṛtti nirōdhamu (yōgamu) cētanē sādhyamagunu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.