← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వస్తు పరిచ్ఛేదము vastu paricchēdamu

Original — తెలుగు

ఒకవస్తువు తానై యుండి మఱియొక వస్తువు తానుగాకుండుట - బ్రహ్మ యీ ప్రపంచకమందలి అన్ని రూపములు తానే అయి యున్నాడు - ఈ వస్తువులో పరబ్రహ్మయున్నాడు - ఈ వస్తువు తానే అయి యున్నాడు - ఆ వస్తువులో పరబ్రహ్మ లేడు, ఆ వస్తువు పరబ్రహ్మకాడు అనుట వస్తు పరుచ్ఛేదము - పరబ్రహ్మ అన్ని వస్తువులలోనున్నాడు - అందుచేత బ్రహ్మ వస్తు పర్ఫిచ్ఛేద రహితుడు -

“క. ఇందుగలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచి

నందందే కలడు దానవాగ్రణ, వింటే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 275)

Transliteration

okavastuvu tānai yuṃḍi maṟiyoka vastuvu tānugākuṃḍuṭa - brahma yī prapaṃcakamaṃdali anni rūpamulu tānē ayi yunnāḍu - ī vastuvulō parabrahmayunnāḍu - ī vastuvu tānē ayi yunnāḍu - ā vastuvulō parabrahma lēḍu, ā vastuvu parabrahmakāḍu anuṭa vastu parucchēdamu - parabrahma anni vastuvulalōnunnāḍu - aṃducēta brahma vastu parphicchēda rahituḍu -

“ka. iṃdugalaḍaṃdu lēḍani

saṃdēhamu valadu cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vedaki cūci

naṃdaṃdē kalaḍu dānavāgraṇa, viṃṭē “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 275)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.