(‘వస’ అను ధాతువునకు ఆచ్ఛాదనమని యర్థము. ఇతని రూపము - భగవంతుని రూపము వాస్యం - ఆచ్ఛాదింపబడునది - భగవంతుని రూపము కనబడనిది - కప్పబడియున్నది - ప్రకృతి లేక మాయ యను దానిచేత కప్పబడి, ఉన్నట్లు పైకి కనబడకుండ నుండునది).
(ధరింపబడినది - ప్రకృతి చేత, దాని పరిణామములుచేత ధరింపబడి కప్పబడి యున్నది).
వస అను ధాతువునకు ఆచ్ఛాదించుటయని యర్థము. భగవంతుని చేత జగత్తు అంతయు ఆచ్ఛాదించబడినది. ప్రకృతి దాని పరిణామములు భగవంతుని రూపములే - “తదను ప్రవిశ్య సచ్చ, త్యచ్చా భవత్” (సృష్టించిన లోకములలో భగవంతుడు ప్రవేశించి అందులో సత్పదార్థము, అసత్పదార్థము - ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు తానే ఆయెను. అందుచేత సృష్టిలోని ప్రకృతి వస్తువులన్నియు భగవంతునిచేత ఆవేశింపబడియున్నవి, కప్పబడియున్నవి.)
(నివాసనీయము - నివసించియుండు వస్తువు - జగత్తు. పరబ్రహ్మకు తాను నివసించియుండుటకు జగత్తుకాక మఱియొక ఆధారము లేదు - అన్నింటికి ఆధారమైనవాడు భగవంతుడు. అన్నియు అతనిలో లీనమై యుండును - అందుచేత తనలో తాను నివసించి యుండును).
(‘vasa’ anu dhātuvunaku ācchādanamani yarthamu. itani rūpamu - bhagavaṃtuni rūpamu vāsyaṃ - ācchādiṃpabaḍunadi - bhagavaṃtuni rūpamu kanabaḍanidi - kappabaḍiyunnadi - prakṛti lēka māya yanu dānicēta kappabaḍi, unnaṭlu paiki kanabaḍakuṃḍa nuṃḍunadi).
(dhariṃpabaḍinadi - prakṛti cēta, dāni pariṇāmamulucēta dhariṃpabaḍi kappabaḍi yunnadi).
vasa anu dhātuvunaku ācchādiṃcuṭayani yarthamu. bhagavaṃtuni cēta jagattu aṃtayu ācchādiṃcabaḍinadi. prakṛti dāni pariṇāmamulu bhagavaṃtuni rūpamulē - “tadanu praviśya sacca, tyaccā bhavat” (sṛṣṭiṃcina lōkamulalō bhagavaṃtuḍu pravēśiṃci aṃdulō satpadārthamu, asatpadārthamu - ātma vastuvu, anātma vastuvu tānē āyenu. aṃducēta sṛṣṭilōni prakṛti vastuvulanniyu bhagavaṃtunicēta āvēśiṃpabaḍiyunnavi, kappabaḍiyunnavi.)
(nivāsanīyamu - nivasiṃciyuṃḍu vastuvu - jagattu. parabrahmaku tānu nivasiṃciyuṃḍuṭaku jagattukāka maṟiyoka ādhāramu lēdu - anniṃṭiki ādhāramainavāḍu bhagavaṃtuḍu. anniyu atanilō līnamai yuṃḍunu - aṃducēta tanalō tānu nivasiṃci yuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.