← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాయుగుణములు vāyuguṇamulu

Original — తెలుగు
  1. వాయువునకు వ్యూహనము లక్షణము.

  2. “శబ్దస్స్పర్శాదానితి వాయుగుణౌ”.

(శబ్దము, స్పర్శము వాయువు యొక్క గుణములు - “వాయువునకు శబ్ద స్పర్శంబులును గుణంబులైయుండు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - )

  1. “ఏక లక్షణమాకాశః - ద్విలక్షణో వాయుః”.

(అకాశము శబ్దము అను ఒకే గుణము గలది, వాయువు శబ్దము, స్పర్శము అను రెండుగుణములుగలది - వాయువు ఆకాశములో నుండి పుట్టినది కనుక అకాశముయొక్క గుణమైన శబ్దము తన అసాధారణ గుణమైన స్పర్శము అను రెండు గుణములు గలది).

  1. చలనం వల్లనం లంఘాస్థాపనంచ నిరోధనం |

వాయోః పంచగుణాప్రోక్తా స్సమాంశాః పరికీర్తితాః ||.

(వాయువునకు అయిదు గుణములు చెప్పబడినవి. చాలనం వృక్షశాఖాదేః, వ్యూహనం మేళనం తృణాదేః విభగకరణం, ప్రాప్రిః సం యోజకత్వం, ద్రవ్య శబ్దయోర్నేతృత్వం, ద్రవ్యనేతృత్వం శబ్ద నేతృత్వంచ - తత్ర ద్రవ్యనేతృత్వం ద్రవ్యస్య గంధవతో ఘ్రాణం ప్రతి; శబ్ద నేతృత్వం దూరస్థ శబ్దస్య శ్రోత్ర గ్రాహ్యత్వకరణం; సర్వేంద్రియాణాం ఆత్మత్వం ధారత్వం ఉపోద్బలకత్వం - వాయోః కర్మైవ అభిలక్షణం||.

(చాలనము అనగా చలింపచేయుట - కదల్చుట - (చెట్ల కొమ్మలను మొదలగువాటిని కదల్చుట వ్యూహనము. వ్యూహనమనగా గడ్డి మొదలగువాటిని కలుపుట; విడదీయుట; ప్రాప్తి - సం యోజకత్వము - కలుపుట, ద్రవ్యములను, శబ్దమును ఒకచోటనుండి ఇంకొక చోటికి తీసుకొని వెళ్ళుట, గంధమును - వాసనను ముక్కున కందింపచేయుట ద్రవ్య నేత్రత్వము. దూరముగా అయిన శబ్దమును చెవికి అందింపచేయుట. శబ్దనేతృత్వము; ఇంద్రియములన్నింటికి ఆత్మగా నుండుట - అనగా, వాటిలో నుండి, వాటిని ధరించి వాటి వాటి పనులు చేయునట్లు ప్రోద్బలము చేయుట).

Transliteration
  1. vāyuvunaku vyūhanamu lakṣaṇamu.

  2. “śabdassparśādāniti vāyuguṇau”.

(śabdamu, sparśamu vāyuvu yokka guṇamulu - “vāyuvunaku śabda sparśaṃbulunu guṇaṃbulaiyuṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - )

  1. “ēka lakṣaṇamākāśaḥ - dvilakṣaṇō vāyuḥ”.

(akāśamu śabdamu anu okē guṇamu galadi, vāyuvu śabdamu, sparśamu anu reṃḍuguṇamulugaladi - vāyuvu ākāśamulō nuṃḍi puṭṭinadi kanuka akāśamuyokka guṇamaina śabdamu tana asādhāraṇa guṇamaina sparśamu anu reṃḍu guṇamulu galadi).

  1. calanaṃ vallanaṃ laṃghāsthāpanaṃca nirōdhanaṃ |

vāyōḥ paṃcaguṇāprōktā ssamāṃśāḥ parikīrtitāḥ ||.

(vāyuvunaku ayidu guṇamulu ceppabaḍinavi. cālanaṃ vṛkṣaśākhādēḥ, vyūhanaṃ mēḷanaṃ tṛṇādēḥ vibhagakaraṇaṃ, prāpriḥ saṃ yōjakatvaṃ, dravya śabdayōrnētṛtvaṃ, dravyanētṛtvaṃ śabda nētṛtvaṃca - tatra dravyanētṛtvaṃ dravyasya gaṃdhavatō ghrāṇaṃ prati; śabda nētṛtvaṃ dūrastha śabdasya śrōtra grāhyatvakaraṇaṃ; sarvēṃdriyāṇāṃ ātmatvaṃ dhāratvaṃ upōdbalakatvaṃ - vāyōḥ karmaiva abhilakṣaṇaṃ||.

(cālanamu anagā caliṃpacēyuṭa - kadalcuṭa - (ceṭla kommalanu modalaguvāṭini kadalcuṭa vyūhanamu. vyūhanamanagā gaḍḍi modalaguvāṭini kalupuṭa; viḍadīyuṭa; prāpti - saṃ yōjakatvamu - kalupuṭa, dravyamulanu, śabdamunu okacōṭanuṃḍi iṃkoka cōṭiki tīsukoni veḷḷuṭa, gaṃdhamunu - vāsananu mukkuna kaṃdiṃpacēyuṭa dravya nētratvamu. dūramugā ayina śabdamunu ceviki aṃdiṃpacēyuṭa. śabdanētṛtvamu; iṃdriyamulanniṃṭiki ātmagā nuṃḍuṭa - anagā, vāṭilō nuṃḍi, vāṭini dhariṃci vāṭi vāṭi panulu cēyunaṭlu prōdbalamu cēyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.