← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంత విచారము vēdāṃta vicāramu

Original — తెలుగు
  1. ఉపనిషత్తులు ఏ విషయము గుఱించి చెప్పుచున్నవి, ఏమని చెప్పుచున్నవి అనునది విచారించవలయును - ఉపనిషత్తులను చదివి, వాటి యర్థమును యదార్థముగా తెలుసుకొనుటకు ప్రయత్నించుట.

  2. ముముక్షూణాం బ్రహ్మజ్ఞానాయ వేదాంతవిచారః కర్తవ్యః - బ్రహ్మాత్మైక్య జ్ఞానాదేవ ముక్తిరితి వస్తుగతిః - మతాంతరాశ్రయణే తద భావాన్ మోక్షా సిద్ధిః - కించ ఆత్మానాం అన్యదా జ్ఞత్వా తత్పాపేన సంసారాంధకూపేపతేత్ - “అంధః తమః ప్రవిశంతి యే కే చాత్మహనో జనాః” ఇతి శ్రుతేః - ” యో(అ)న్యథా సంతమాత్మానమన్యథా ప్రతిపద్యతే కింతేన న కృతం పాపం చోరేణాత్మాప హరేణేతి” ఇతివ చ నా చ్చ. అతః సర్వేషాం ముముక్షూణాం నిశ్రేయస లభాయ వేదాంత విచారః కర్తవ్యః.

(మోక్షము కోరువారు బ్రహ్మజ్ఞానము కొఱకు - బ్రహ్మను తెలుసుకొనుటకు - వేదాంత విచారము (ఉపనిషత్తులలో చెప్పబడినదానిని తెలుసుకొనుట) చేయవలసినది. ఎందుచేతననగా పరబ్రహ్మము - ఆత్మ - ఈ రెండునూ ఒకటే అను జ్ఞానము కలుటవలననే ముక్తి కలుగును, ఇంకొక రీతిగా ముక్తి కలుగదు - ఇంతేకాక ఆత్మను ఇతర విధముగా తెలుసుకొనిన ఆ పాపమువలన సంసారమను - జననమరణ పరంపర - అను అంధకూపములో (చీకటి నూతిలో) పడును. “ఆత్మహాని చేయు జనులు - ఆత్మకు హానిచేయువారు - చీకటియను తమస్సును ప్రవేశించుదురు - పొందుదురు” అని శ్రుతి వాక్యము కలదు. మఱియు - “ఆత్మను అన్యథా - ఇంకొక రీతిగా - తలచువాడు, అనగా పరబ్రహ్మకంటె వేఱు అని తలచువాడు ఆతాపహరణము చేయువాడు (ఆత్మకు హాని చేయువాడు) ఇంకను ఏమి పాపము చేయడు?. ఆత్మకు హానిచేయువాడు ఏ పాపమునైనను చేయువాడు అని అర్థము - అందుచేత మోక్షము కోరువారందరు నిశ్రేయసలాభము కొఱకు - మోక్షము లభించు కొఱకు వేదాంత విచారము చేయవలయును).

  1. జిజ్ఞాస్యం బ్రహ్మోక్తం; తత్కిం లోకప్రసిద్ధిమితరద్వా? యది యది లోకప్రసిద్ధిం నిస్సందేహం,తదాన జిజ్ఞాస్యం యది చా ప్రసిద్ధి మేతత్ తజ్జిజ్ఞాస్యం కథం? ఇతీహ నా శంక్యం సత్యం జ్ఞానమనంతం శ్రుతివచనేషూపలభ్యతేబ్రహ్మ. వైనాసికాది సమయేషు తథా భూతో నిరూప్యతే హ్యాత్మా. అతః ఉపపన్నం సంశయః. వేదాంత వాక్య నిచయైర్న్యాయోపేతై ర్విచారితే తత్వే వేదవాదో సచిత స్సందేహో నాశమేతి నిర్లేపం”

(శ్రీశంకరః)

(పరబ్రహ్మ గుఱించి తెలుసుకొనవలెను అని చెప్పబడియున్నది - అనగా, లోకములో ప్రసిద్ధమైనదనా ? లేక, ఇతరమైనదనియా? లోకములో ప్రసిద్ధముగా తెలియబడుచున్న బ్రహ్మ గుఱించి సందేహము లేకున్న ఇంక తెలుసుకొనవలసిన అవసరములేదు - లేక, అది అప్రసిద్ధమైనదైనయడల అది యెట్లు తెలుసుకొనతగును - అని సంకోచింపవలసిన అవసరములేదు. శ్రుతులు పరబ్రహ్మను “సత్యం జ్ఞానమనంతం” అని చెప్పుచున్నవి. వైనాసికాదుల ప్రకారము ఆత్మ మఱియొక రీతిగా చెప్పబడుచున్నది. అందుచేత సంశయము కలిగినది. న్యాయశాస్త్రముతో కూడ ఉపనిషత్తుల ద్వారా వేదవాదములవలన కలిగిన సందేహము పూర్తిగా నాశము అగును - అందుచేత వేదాంత విచారము చేయవలసినదే.

  1. “తద్విజిజ్ఞాసస్వ”; “సో అన్వేష్టవ్యః, విజిజ్ఞాసి తేవ్యః”, “ఆత్మనా అరేద్రష్టవ్యః, శ్రోతవ్యః ఇతి శ్రవణవిధి రుపలభ్యతే తస్యార్థః - అమృతత్వకామేనాద్వైతాత్మ విచార ఏవ వేదాంత వాక్యైః కర్తవ్యః ఇతి”.

(“ఆ బ్రహ్మను తెలుసుకొనుటకు కోరిక కలిగి యుండుము”; “ఆ పరమాత్మ అన్వేష్టింప తగినవాడు”; ఆ పరమాత్మను అన్వేష్టింపము, బాగుగా తెలుసుకొనుటకు కోరిక కలిగియుండుము - ప్రయత్నము చేయుటకు తగినవాడు; “పరమాత్మ దర్శింప తగినవాడు; పరమాత్మ సాక్షాత్కారము పొందవలసినది; పరమాత్మ గుఱించి వినవలసినది” అని శ్రుతి చెప్పుచున్నది. దీని యర్థమేమనగా - మోక్షము కోరువాడు అద్వయుడైన ఆత్మయొక్క తత్వమును ఉపనిషత్తులలో చెప్పిన వాక్యములద్వారా విచారించవలసినది).

  1. తద్య దేహ కర్మ చితో లోకః ఇతి శృత్యాయత్కృతకం తదనిత్యమితి న్యాయవత్యా “న జాయతే మ్రియతేనా విపశ్చిత్”; ” యోవై భూమా తదమృత మన్యదార్త” మిత్యాది శ్రుత్యా చ భూమాత్మ నిత్యస్తతో(అ)న్యద నిత్యమితి వివెకో లభ్యతే. కర్మణా కృత్యాదినా చితః సంపాదితః పస్యాదిర్లోకో భోగ్యం ఇత్యర్థః” పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమయాన్నాస్త్య కృతః కృతేన”, “ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి” ఇత్యాది శ్రుత్యా అనాత్మమాత్రే వైరాగ్యం లభ్యతే; పరీక్ష్య = అనిత్యత్వేన నిశ్చిత్య; అకృతో = మోక్షః; కృతేన = కర్మణా; నాస్తి ఇతి. ఇతి కర్మ తత్ఫలేభ్యః వైరాగ్యం ప్రాప్తవాన్. శాంతో దాంతః ఉపరితః తితిక్షః సమాహిత శ్శ్రద్ధా విత్తో భూత్వా, ఆత్మన్యేవాత్మానం పశ్యేదితి శ్రుత్యా శమాది షట్కం లభ్యతే. ఉపరతిః = సన్యాసః - న చ పునరావర్తతే ఇతి స్వయం జ్యోతిరానందాత్మక మోక్షస్య నిత్యత్వ శ్రుత్తా ముముక్షా లభ్యతే. తదాచ వివేకాది విశేషేణ వా నధికారీ ఇతి జ్ఞాతుం శక్యం. ప్రమాణం చాద్వైతాత్మని వేదాంతా ఏవ - “తంత్వాస నిషదం పురుషం”) “వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థాః” ఇతి చ శ్రుతిః. వేదాంతానాంచ ప్రత్యక్ బ్రహ్మైక్యం విషయః ఇతి శ్రుతేః. ఏవం విచార విధేః ఫలమపి జ్ఞానద్వారా ముక్తిః - “తరతి శోకమాత్మవిత్”; “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” ఇతి శ్రుతిః -.

(“కర్మచే సంపాదించిన లోకము” అను మొదలగు శ్రుతివాక్యములప్రకారము - కృతకం అనగా చేయబడినది, కార్యవస్తువు - అనిత్యమైనది, ఎల్లకాలమందు ఉండనిది - అను న్యాయము ప్రకారమున్నూ - “జననమరణములు లేనివాడు” అనిన్నీ - భూమ (పరమాత్మ) నిత్యమైనది, పరమాత్మకానిది అంతయు ఆర్తము అనిత్యమైనది అని మొదలగు శ్రుతివాక్యములచేత వివేకము కలుగును - కర్మచేత అనగా, కృషి మొదలగువాటిచేత సంపాదించబడిన సస్యము, ఆహారము మొదలగునవి భోగ్యవస్తువులు (అనుభవమునకు వచ్చునవి). కర్మచేత సంపాదింపబడిన లోకములు అనిత్యములని చూచి (తెలుసుకొని) విద్వాంసుడు వైరాగ్యమును పొందును. కర్మలచేత మోక్షము కలుగదు అని తెలుసుకొనుటచేత వైరాగ్యమును పొందును. వైరాగ్యము కలిగినమీదట శమదమాదులనభ్యసించి, సమాహితమైన మనస్సు కలవాడై సన్యసించి తనయందే ఆత్మను చూచును - ఆత్మ సాక్షాత్కారము పొందును, మరల జన్మ లేనివాడగును - అనగా, స్వయంజ్యోతి, ఆనందమయము, నిత్యము అయినది మోక్షము అని శ్రుతి ముముక్షువు - మోక్షము కోరువాడగును - దీనికి ప్రమాణము ఉపనిషద్వాక్యములే - “ఉపనిషత్తులలో వర్ణింపబడిన ఆ పరమపురుషుడు” అనిన్నీ, ఉపనిషత్తులను చదువుటవలన కలిగిన విజ్ఞానము చేత భగవంతుని గుఱించి నిశ్చయమైన అభిప్రాయము గలవాడై అనిన్నీ ఉపనిషత్తులు చెప్పుచున్నందున ఉపనిషత్తులు జీవ బ్రహ్మైక్యమునే చెప్పుచున్నవి. ఈ ప్రకారము ఉపనిషత్తులలోని అర్థమును గ్రహించుటవలన కలుగు ఫలము బ్రహ్మజ్ఞానము కలిగి దానిద్వారా ముక్తి కలుగునని తెలియవచ్చుచున్నది. ఈ విషయము శ్రుతి యిట్లు చెప్పుచున్నది - “బ్రహ్మజ్ఞానము కలవాడు శోకము పోగొట్టుకొనును; సంసారమును వదలి ముక్తినొందును” అనిన్నీ, “బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును” అని.)

  1. “ఆసుప్తేరామామృతేః కాలం నయే ద్వేదాంతచింతయా”

(చనిపోవునంతవరకు వేదాంతచింతనతోనే కాలము గడపవలెను)

Transliteration
  1. upaniṣattulu ē viṣayamu guṟiṃci ceppucunnavi, ēmani ceppucunnavi anunadi vicāriṃcavalayunu - upaniṣattulanu cadivi, vāṭi yarthamunu yadārthamugā telusukonuṭaku prayatniṃcuṭa.

  2. mumukṣūṇāṃ brahmajñānāya vēdāṃtavicāraḥ kartavyaḥ - brahmātmaikya jñānādēva muktiriti vastugatiḥ - matāṃtarāśrayaṇē tada bhāvān mōkṣā siddhiḥ - kiṃca ātmānāṃ anyadā jñatvā tatpāpēna saṃsārāṃdhakūpēpatēt - “aṃdhaḥ tamaḥ praviśaṃti yē kē cātmahanō janāḥ” iti śrutēḥ - ” yō(a)nyathā saṃtamātmānamanyathā pratipadyatē kiṃtēna na kṛtaṃ pāpaṃ cōrēṇātmāpa harēṇēti” itiva ca nā cca. ataḥ sarvēṣāṃ mumukṣūṇāṃ niśrēyasa labhāya vēdāṃta vicāraḥ kartavyaḥ.

(mōkṣamu kōruvāru brahmajñānamu koṟaku - brahmanu telusukonuṭaku - vēdāṃta vicāramu (upaniṣattulalō ceppabaḍinadānini telusukonuṭa) cēyavalasinadi. eṃducētananagā parabrahmamu - ātma - ī reṃḍunū okaṭē anu jñānamu kaluṭavalananē mukti kalugunu, iṃkoka rītigā mukti kalugadu - iṃtēkāka ātmanu itara vidhamugā telusukonina ā pāpamuvalana saṃsāramanu - jananamaraṇa paraṃpara - anu aṃdhakūpamulō (cīkaṭi nūtilō) paḍunu. “ātmahāni cēyu janulu - ātmaku hānicēyuvāru - cīkaṭiyanu tamassunu pravēśiṃcuduru - poṃduduru” ani śruti vākyamu kaladu. maṟiyu - “ātmanu anyathā - iṃkoka rītigā - talacuvāḍu, anagā parabrahmakaṃṭe vēṟu ani talacuvāḍu ātāpaharaṇamu cēyuvāḍu (ātmaku hāni cēyuvāḍu) iṃkanu ēmi pāpamu cēyaḍu?. ātmaku hānicēyuvāḍu ē pāpamunainanu cēyuvāḍu ani arthamu - aṃducēta mōkṣamu kōruvāraṃdaru niśrēyasalābhamu koṟaku - mōkṣamu labhiṃcu koṟaku vēdāṃta vicāramu cēyavalayunu).

  1. jijñāsyaṃ brahmōktaṃ; tatkiṃ lōkaprasiddhimitaradvā? yadi yadi lōkaprasiddhiṃ nissaṃdēhaṃ,tadāna jijñāsyaṃ yadi cā prasiddhi mētat tajjijñāsyaṃ kathaṃ? itīha nā śaṃkyaṃ satyaṃ jñānamanaṃtaṃ śrutivacanēṣūpalabhyatēbrahma. vaināsikādi samayēṣu tathā bhūtō nirūpyatē hyātmā. ataḥ upapannaṃ saṃśayaḥ. vēdāṃta vākya nicayairnyāyōpētai rvicāritē tatvē vēdavādō sacita ssaṃdēhō nāśamēti nirlēpaṃ”

(śrīśaṃkaraḥ)

(parabrahma guṟiṃci telusukonavalenu ani ceppabaḍiyunnadi - anagā, lōkamulō prasiddhamainadanā ? lēka, itaramainadaniyā? lōkamulō prasiddhamugā teliyabaḍucunna brahma guṟiṃci saṃdēhamu lēkunna iṃka telusukonavalasina avasaramulēdu - lēka, adi aprasiddhamainadainayaḍala adi yeṭlu telusukonatagunu - ani saṃkōciṃpavalasina avasaramulēdu. śrutulu parabrahmanu “satyaṃ jñānamanaṃtaṃ” ani ceppucunnavi. vaināsikādula prakāramu ātma maṟiyoka rītigā ceppabaḍucunnadi. aṃducēta saṃśayamu kaliginadi. nyāyaśāstramutō kūḍa upaniṣattula dvārā vēdavādamulavalana kaligina saṃdēhamu pūrtigā nāśamu agunu - aṃducēta vēdāṃta vicāramu cēyavalasinadē.

  1. “tadvijijñāsasva”; “sō anvēṣṭavyaḥ, vijijñāsi tēvyaḥ”, “ātmanā arēdraṣṭavyaḥ, śrōtavyaḥ iti śravaṇavidhi rupalabhyatē tasyārthaḥ - amṛtatvakāmēnādvaitātma vicāra ēva vēdāṃta vākyaiḥ kartavyaḥ iti”.

(“ā brahmanu telusukonuṭaku kōrika kaligi yuṃḍumu”; “ā paramātma anvēṣṭiṃpa taginavāḍu”; ā paramātmanu anvēṣṭiṃpamu, bāgugā telusukonuṭaku kōrika kaligiyuṃḍumu - prayatnamu cēyuṭaku taginavāḍu; “paramātma darśiṃpa taginavāḍu; paramātma sākṣātkāramu poṃdavalasinadi; paramātma guṟiṃci vinavalasinadi” ani śruti ceppucunnadi. dīni yarthamēmanagā - mōkṣamu kōruvāḍu advayuḍaina ātmayokka tatvamunu upaniṣattulalō ceppina vākyamuladvārā vicāriṃcavalasinadi).

  1. tadya dēha karma citō lōkaḥ iti śṛtyāyatkṛtakaṃ tadanityamiti nyāyavatyā “na jāyatē mriyatēnā vipaścit”; ” yōvai bhūmā tadamṛta manyadārta” mityādi śrutyā ca bhūmātma nityastatō(a)nyada nityamiti vivekō labhyatē. karmaṇā kṛtyādinā citaḥ saṃpāditaḥ pasyādirlōkō bhōgyaṃ ityarthaḥ” parīkṣyalōkān karmacitān brāhmaṇō nirvēdamayānnāstya kṛtaḥ kṛtēna”, “ātmanastu kāmāya sarvaṃ priyaṃ bhavati” ityādi śrutyā anātmamātrē vairāgyaṃ labhyatē; parīkṣya = anityatvēna niścitya; akṛtō = mōkṣaḥ; kṛtēna = karmaṇā; nāsti iti. iti karma tatphalēbhyaḥ vairāgyaṃ prāptavān. śāṃtō dāṃtaḥ uparitaḥ titikṣaḥ samāhita śśraddhā vittō bhūtvā, ātmanyēvātmānaṃ paśyēditi śrutyā śamādi ṣaṭkaṃ labhyatē. uparatiḥ = sanyāsaḥ - na ca punarāvartatē iti svayaṃ jyōtirānaṃdātmaka mōkṣasya nityatva śruttā mumukṣā labhyatē. tadāca vivēkādi viśēṣēṇa vā nadhikārī iti jñātuṃ śakyaṃ. pramāṇaṃ cādvaitātmani vēdāṃtā ēva - “taṃtvāsa niṣadaṃ puruṣaṃ”) “vēdāṃta vijñāna viniścitārthāḥ” iti ca śrutiḥ. vēdāṃtānāṃca pratyak brahmaikyaṃ viṣayaḥ iti śrutēḥ. ēvaṃ vicāra vidhēḥ phalamapi jñānadvārā muktiḥ - “tarati śōkamātmavit”; “brahmavid brahmaiva bhavati” iti śrutiḥ -.

(“karmacē saṃpādiṃcina lōkamu” anu modalagu śrutivākyamulaprakāramu - kṛtakaṃ anagā cēyabaḍinadi, kāryavastuvu - anityamainadi, ellakālamaṃdu uṃḍanidi - anu nyāyamu prakāramunnū - “jananamaraṇamulu lēnivāḍu” aninnī - bhūma (paramātma) nityamainadi, paramātmakānidi aṃtayu ārtamu anityamainadi ani modalagu śrutivākyamulacēta vivēkamu kalugunu - karmacēta anagā, kṛṣi modalaguvāṭicēta saṃpādiṃcabaḍina sasyamu, āhāramu modalagunavi bhōgyavastuvulu (anubhavamunaku vaccunavi). karmacēta saṃpādiṃpabaḍina lōkamulu anityamulani cūci (telusukoni) vidvāṃsuḍu vairāgyamunu poṃdunu. karmalacēta mōkṣamu kalugadu ani telusukonuṭacēta vairāgyamunu poṃdunu. vairāgyamu kaliginamīdaṭa śamadamādulanabhyasiṃci, samāhitamaina manassu kalavāḍai sanyasiṃci tanayaṃdē ātmanu cūcunu - ātma sākṣātkāramu poṃdunu, marala janma lēnivāḍagunu - anagā, svayaṃjyōti, ānaṃdamayamu, nityamu ayinadi mōkṣamu ani śruti mumukṣuvu - mōkṣamu kōruvāḍagunu - dīniki pramāṇamu upaniṣadvākyamulē - “upaniṣattulalō varṇiṃpabaḍina ā paramapuruṣuḍu” aninnī, upaniṣattulanu caduvuṭavalana kaligina vijñānamu cēta bhagavaṃtuni guṟiṃci niścayamaina abhiprāyamu galavāḍai aninnī upaniṣattulu ceppucunnaṃduna upaniṣattulu jīva brahmaikyamunē ceppucunnavi. ī prakāramu upaniṣattulalōni arthamunu grahiṃcuṭavalana kalugu phalamu brahmajñānamu kaligi dānidvārā mukti kalugunani teliyavaccucunnadi. ī viṣayamu śruti yiṭlu ceppucunnadi - “brahmajñānamu kalavāḍu śōkamu pōgoṭṭukonunu; saṃsāramunu vadali muktinoṃdunu” aninnī, “brahmajñānamu kalavāḍu brahmamē yagunu” ani.)

  1. “āsuptērāmāmṛtēḥ kālaṃ nayē dvēdāṃtaciṃtayā”

(canipōvunaṃtavaraku vēdāṃtaciṃtanatōnē kālamu gaḍapavalenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.