← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదములు vēdamulu

Original — తెలుగు
  1. వేద్యతే జ్ఞాయతే తత్ వేదం.

(తెలియచేయునది; బ్రహ్మజ్ఞానము కలుగచేయునది)

  1. విదంతి అనేన ఇతి వేదః -

(దీనివలన సర్వమును తెలుసుకొనుచున్నారు కనుక వేదమని చెప్పబడినది)

  1. వేదము అనుమాట ‘విద్’ (to know) అను ధాతువునుండి (root wordనుండి) కలిగినది. ఈ ధాతువునకర్థము తెలుసుకొనుట (to know). దీనివలన బ్రహ్మమును తెలుసుకొనవచ్చును -

  2. వేదయతీతి వేదః

(ఏ ప్రమాణము చేతనైనను తెలియబడని అగమ్యగోచరుడు (వాక్ దృక్ అలభ్యుడు) అయిన భగవంతుని తత్వమును తెలియ చేయునదగుటచేత వేదమని చెప్పబడినది. భగవంతుడు వేదముచేతనే తెలియబడువాడు - “వేదైక వేద్యః” (వేదము అను ఒక్కదాని మూలముననే తెలియబడువాడు).

  1. “ప్రత్యక్షేణాను మిత్యావా యస్తూపాయో న లభ్యతే |

ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదతా |”

“సర్వోప్యయం వేదః ప్రత్యక్షాను మానాభ్యాం, అనవగతేష్టానిష్ట ప్రాప్తి పరిహారఓపాయ ప్రకాశనపరః. సర్వ పురుషాణాం నిసర్గత ఏవ తత్ప్రాప్తి పరిహారయో రిష్టత్వాత్”.

(ప్రత్యక్ష ప్రమాణము, అనుమానప్రమాణము - వీటిద్వారా మనకు అవగాహన కానటువంటి విషయమైన బ్రహ్మము గుఱించి తెలుపునదిన్నీ, బ్రహ్మప్రాప్తికి ఉపాయము తెలుపునదిన్నీ, సమస్త దుఃఖములను నివారింపచేయునదిన్నీ, శ్రేయోమార్గమును చూపునదిన్నీ యగుటచేత వేదమని చెప్పబడినది. ఇష్టమైనది ప్రాప్తించుటకును, ఇష్టముకానిది నివృత్తియగుటకు ఉపాయమును తెలియచేయునది).

  1. వేదములు పరబ్రహ్మనుండి పుట్టినవి : -

    1. “అస్యముఖతో భూతస్య నిఃశ్వసితమే తత్ యత్ ఋగ్వేదో, యజుర్వేదస్సామవేదో(అ)ధర్వణాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదస్సూత్రాణి” (బృహదారణ్యకోపనిషత్ - 2 - 4 - 10)

(మహాభూతమని చెప్పబడు పరబ్రహ్మనుండి నిశ్వాసమువలె అనాయాసముగ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము; ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు, శిక్షా, వ్యాకరణము పుట్టినవి)

  1. “నిశ్వాసభూతా యే విష్ణోర్వేదా జాతస్సువిస్తరాః” (ముక్తికోపనిషత్)

(వేదములు విష్ణువుయొక్క నిశ్వాసమువలె - నిశ్వాసరూపముగా పుట్టి బాగా విస్తరించినవి)

  1. “వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్” (విష్ణుసహస్రనామములు)

(వేదములు, శాస్త్రములు, విజ్ఞానమంతయు శ్రీమహావిష్ణువువలనే పుట్టినవి.)

  1. “చ. అనఘచరిత్ర! మన్మఖమునందు జనించె హయాననాఖ్యతన్

వినుత సువర్ణ వర్ణుడును వేదమయుండాఖిలాంత రాత్మకుం

డనుపమ యజ్ఞ పూరుషుడు నై భగవంతుడు తత్సమస్త పా

వన మగు నాసికాశ్వనన వర్గములం దుదయించె వేదముల్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 140)

  1. “శాస్త్రయోనిత్వాత్” (బ్రహ్మసూత్రములు - 1 - 1 - 3)

(పరబ్రహ్మ ఎవరు? అని నిర్ణయించుటకు శ్రీవ్యాసమహర్షి బ్రహ్మసూత్రములను వ్రాసెను - అందులోని సూత్రము “శాస్త్రములను రచించినవాడు బ్రహ్మ” అని చెప్పెను - ఇచ్చట శాస్త్రములనగా వేదములు మొదలగునవి.

  1. “అనాది నిధనా నిత్యా వాగుసృష్టా స్వయంభువా |

ఆదౌ వేదమయీ దివ్యాయత స్సర్వా ప్రవృత్తయః ||“. (మనుస్మృతి)

(సృష్టి ప్రారంభములో ఆద్యంతములు లేనిది, దివ్యమైనది వేదమయమగు వాక్కు స్వయంభువునిచే వినబడినది - గ్రహింపబడీంది - అది ఆది లేనిదికనుక అనాది, అన్నికాలములందు ఉండునది,, కనుక నిత్యము) ప్రమాణము -

  1. “యో బ్రహ్మణం విదధాతి పూర్వం, యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై” ఇతిశ్రుతిః -

(సృష్టి ప్రారంభములో చతుర్ముఖబ్రహ్మను పుట్టించి అతనికి వేదములను స్ఫురింపచేసెను - అట్టి పరబ్రహ్మకు నమస్కారము).

  1. “యథా అధ్యే తా రః పూర్వక్రమం జ్ఞాత్వా వేదం కుర్వంతి, తథా విచిత్రగుణమాయా సహాయా అనావృతానంత స్వప్రకాశ చిద్రూపః పరమేశ్వరః స్వకృత పూర్వ కల్పీయ క్రమ సజాతీయ క్రమవంతం వేదరాశిం తదర్థాంశ్చ యుగప జ్ఞానాన్నేవ కరోతీతి న వేదస్య పౌరుషేయతా. యత్రహ్యర్థ జ్ఞాన పూర్వకం వాక్యజ్ఞానం వాక్యనృష్టౌ కారణం తత్ర పౌరుషేయతా. అత్రచ యోగపద్యాన్న సాంతో వేదకర్తా వేదమివ తదర్థమపి స్వసంబద్ధం నాంతరీకతయా జానాతీతి సర్వజ్ఞః”

(వేదమును అధ్యయనము చేయువాడు పూర్వమెట్లుచేసెనో తెలిసి అట్లే చేయునట్లు విచిత్రగుణములు - సత్వరజస్తమోగుణములు - గల మాయసహాయముగా గల అనంతుడు, స్వయంప్రకాశుడు, చైతన్యరూపుడు అగు పరమేశ్వరుడు పూర్వ కల్పమందు తను ఏ క్రమముననుసరించి వేదములను చేసినవాడో తెలిసిన వాడగుటచేత ఆ ప్రకారముగనే ప్రతికల్పమందు తానే వాటిని చేయుటవలన, - రూపొందించుటవలన వేదములు ఒక ప్రాకృత పురుషుడు (ప్రకృతికి సంబంధించిన పురుషుడు) చేసినవికావు - పౌరుషేయములుకావు - అపౌరుషేయములు - సాక్షాత్తు భగవంతుని నుండు ఆవిర్భవించినవి - అందుచేత అపౌరుషేయములు - ప్రమాణగ్రంధములు). (ఇతరులకు తెలియని విషయములు తాను తెలిసినవాడు కనుక సర్వజ్ఞుడు “యస్సర్వజ్ఞ యః సర్వ విద్యస్య జ్ఞానమయం తపః” (ముండకోపనిషత్). (అన్నియు తెలిసినవాడు - జ్ఞానమయుడు - చిన్మయుడు - కనుకనే - ఇంతటి సర్వజ్ఞత్వముగలవాడు ఇంకొకడు లేడు కనుకనే పరబ్రహ్మయే వేదకర్త)

  1. “ఆదియందు చతుర్ముఖుని హృదయంబున నొక నాదంబుద్భవించె, నది వృత్తినిరోధంబువలన మూర్తీభవించి వ్యక్తంబుగా గనుపట్టె, నట్టి నాదోపాసనవలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తినొందుదు రందు నోంకారంబు జనియించె, నదియె సర్వ మంత్రోపనిషన్మూల భూతయగు వేదమాత యని చెప్పంబడు, నా యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకార మకారంబులనెడు త్రివర్ణరూపంబై ప్రకాశించుచుండె, నంత భగవంతుండగు నజుండా ప్రణవంబువలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితంబగు నక్షర సమామ్నాయంబు వలన వేదచతుష్టయంబు గలుగుంజేసె, నంతని పుత్రులగు బ్రహ్మవాదులా వేదంబులందుపదిష్ట ప్రకారంబుగ నభ్యసించి యా క్రమంబున వారలు తమ శిష్యపరంపరలకు నుపదేశించిరి.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 30)

  2. “ఆ. అలసి సొలసి నిదుర నందిన పరమేష్టి

ముఖమునందు వెడలె మొదలి శ్రుతులు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 24 - 714)

  1. “చ. ఉడుగక పంకజాతభవు డొండొక దేహము దాల్చి ధైర్యమున్

విడువక సృష్టిపూర్వక సమవేతముగన్ సృజియించు నేర్పు దా

బొడమమి కాత్మలోన దలపోయుచునుండ జతుర్ముఖంబులన్

వెడలె ననూన రూపముల వేదము లంచిత ధర్మయుక్తితోన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 4 - 385)

  1. “కర్మబ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం” (శ్రీమద్భగవద్గీత - 3 - 15)

(చేయవలసిన కర్మ వేదములో చెప్పబడినది - వేదము పరబ్రహ్మనుండు పుట్టినది.)

“అహం - - పవిత్రమోంకారః ఋక్సామయ జురేవచ” (శ్రీమద్భగవద్గీత - 9 - 16)

(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు)

  1. “వేదాన్ పురాణ నినహానపి సర్వవిద్యాః కుర్వన్ నిజాననగళా చ్చతురాన నో(అ)సౌ ||”. (నారాయణీయం - 10 దశకం)
  1. “మంత్ర కృతో వృణీతే” ఇతాదిభిః వేదశబ్దెః తత్తత్కాండ సూక్త మంత్ర కృతాం ఋషీణాం ఆకృతి శక్త్యాదికం పరిమృశ్య తత్తదాకారాన్ తత్త్తచ్ఛక్తి యుక్తాంశ్చ సృష్ట్వా ప్రజాపతిః తానేవ తత్తన్మంత్రాది కరణే నియుంక్తే. తేపి ప్రజాపతినా ఆహిత శక్తయః తత్తదనుగుణం తపస్తప్త్వా నిత్య సిద్ధాన్ పూర్వ పూర్వ వశిష్టాది దృష్టాన్ తానేవ మంత్రాదీన్ అనధీత్త్యైవ స్వరతః వరతశ్చ అస్ఖలితాన్ పశ్యతి. అతశ్చ వేదానాం నిత్యత్వం, ఏషాంచ మంత్రకృత్త్వ ముపపద్యతే”

(“మంత్రకృతో వృణీ తే” అను మొదలగు వేదములలోని వాక్యములను బట్టి ఆయా వేదకాండలలో చెప్పబడిన మంత్రద్రష్టలగు ఋషులయొక్క ఆకృతి (ఆకారము) శక్తి మొదలగు వాటిని పరామర్శించి - పరిశీలించి - అటువంటి ఆకారము, శక్తి గలవారిని సృష్టించి ప్రజాపతి (బ్రహ్మ - సృష్టికర్త) వారినే ఆయా మంత్రద్రష్టలుగా నియమించెను - వారును ప్రజాపతివలన ఆహిత శక్తిగలవారలై వాటికి (అందు నిమిత్తము) అనుగుణమైన తపస్సు చేసి నిత్యసిద్ధము (ఏ కాలమందైనను, ఏ యుగమందైన నుండునవి) అయిన విన్నీ, పూర్వసృష్టిలో వసిష్టుడు మొదలగువారికి గోచరమైన మంత్రములు మొదలగువాటిని అధ్యయనము చేయనవసరము లేకనే (తప్పు లేకుండునట్లు, స్వరము, వర్ణము తప్పకుండ వారు చూచెదరు (తెలుసుకొనెదరు). అందుచేతనే వేదములు నిత్యములని మంత్రకృత్యములని చెప్పబడినది)

  1. “న నంత్యేవహి వేద భాగాః యత్ర పరమేశ్వరో నగీయతే” తథాహి స్రష్టృత్వేన పురుష సూక్తేషు విభూత్యా రుద్రేషు శబ్ద బ్రహ్మత్వేన మండల బ్రాహ్మణేషు ప్రపంచం పురస్కృత్య నిష్ప్రపంచ తయోప నిషత్సు యజ్ఞపురుషత్వేన మంత్ర విధిషు, దేహావిర్భా వైరుపాఖ్యానేషు ఉపాస్యత్వేనచ సర్వత్ర ఇతి. (న్యాయ కుసుమాంజలి)

పరమేశ్వరుని గుఱించి బోధించని వేదభాగము లేదు - వేదములో నంతతను పరమేశ్వరుడే భోధింపబడు చున్నాడు. అయినప్పటికీ పురుష సూక్తములందు సృష్టికర్తయని, రుద్రమంత్రములందు నమకములందు విభూతులుగలవానిగను, మండలబ్రాహ్మణమందు శబ్ద బ్రహ్మయనియు, ప్రపంచ విషయములోను, ఉపనిషత్తులలోను, నిష్ప్రపంచకుడనియు, మంత్రవిధులందు యజ్ఞపురుషుడని, ఉపాఖ్యానములందు అవతారములు దాల్చినవాడని ఉపాస్యుడుగను - ఈ ప్రకారముగా వేదమందంతటను భగవంతుడే ఏదో ఒక రీతిగా బోధింపబడుచున్నాడు, కనుక వేదములు వాసుదేవపరములు - “వాసుదేవపరాః వేదాః” -

“వేద, యాగ, యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)

  1. బ్రహ్మ జ్ఞానులైన ఋషులు వారి తపోమహిమచే వేదములు వారికి వినబడినవి - (direct revelation). అందుచేత వేదములు ‘శ్రుతులు’ అని చెప్పబడినవి. బ్రహ్మ ముఖమున పుట్టిన వేదములను ఋషులు, శ్రాత దర్సనులు - వినుటచే శ్రుతులని చెప్పబడినవి - వీటినే అమ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయమని చెప్పుదురు - సృష్టికి కారణమైన పరబ్రహ్మ ముఖమునుండి పుట్టి, పరబ్రహ్మ గుఱించియే చెప్పునవి కనుక బ్రహ్మ - శబ్ద బ్రహ్మ - అని కూడ చెప్పబడుచున్నవి - “సర్వే వేదాః యత్పదమామవంతి, సర్వవేదాః యత్రైకం భవంతి” - (వేదములన్నియు భగవత్పదమునే, భగవతత్త్వమునే ప్రతిపాదించుచున్నవి - అట్లు చెప్పుటలో ఏకమగుచున్నవి).

“యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః |

రేభిరేతపసా పూర్వమనుజ్ఞాతా స్స్వయంభువా ||“.

(యుగాంతకాలమున ఇతిహాసములతోసహా వేదములను చతుర్ముఖబ్రహ్మ యొక్క అనుజ్ఞవలన మహర్షులు తమ తపో బలముచే తెలుసుకొనిరి).

  1. నృణాం భూచరాణాం యత్రకుత్రాపి దత్తాని నిక్షిప్తాని పదాని భువి కధమయధా భవంతి, అదత్తాని భవంతి? అతో యథామృత్పాషాణేష్ట కాదిషు దత్తాని పదాని భువం నవ్యభి చరంతి, తథా యత్కిమపి వికారిజాతం వదంతో వేదాః పరమేశ్వరమేవ సర్వకారణం పరమార్థభూతం ప్రతిపాదయంతి -

(భూమిమీద సంచరించు నరులు వారి పాదములను ఎక్కడ పెట్టినను భూమిమీద పెట్టలేనట్లు ఎట్లుగును ? అట్లే మట్టిమీద, ఱాయిమీద పెట్టిన పాదములు కూడ ఎట్లు భూమిమీద పెట్టలేనట్లగును? ఆ ప్రకారముగానే భగవంతునిలోనుండి పుట్టిన సమస్త వస్తువులలో దేనిని గుఱించి వేదములు చెప్పినను అన్నింటికీ కారణమైనటువంటిన్నీ, పరమార్థరూపమైనటువంటిన్నీ పరమేశ్వరుని గుఱించి చెప్పినవే యగుచున్నవి. అన్ని వస్తువులు భగవంతుని రూపములే - “సర్వం సమాప్నోతి తతోపి సర్వః” (అన్నింటిలోను భగవంతుడు ప్రవేశించి పూర్తిగా వాటిలో వ్యాపించి యున్నాడు. అందుచేత అన్నివస్తువులు అతనే). “తదను ప్రవిశ్య సచ్చత్యచ్చా భవత్” (సృష్టించిన లోకములలో - లోకములలోని అన్నివస్తువులలోను ప్రవేశించి వాటిలో పూర్తిగా వ్యాపించియుండి సత్పదార్థము అసత్పదార్థము తానే ఆయెను). లోకములోని అన్నివస్తువులలోను సత్పదార్థము - అనగా భగవదంశ - చిచ్ఛక్తి - ప్రకృతియొక్క అంశ అను రెండు అంశలు కలిసియే యున్నవి). “అన్నీ నీవనుచు నంతరంగమున, తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్య” (త్యాగరాజు). అందుచేతనే సృష్టిలోని ఏ వస్తువైనను భగవంతుని రూపముగానే - భావించి పూజించుచున్నాము - అందుచేత వేదములు ఏ విషయము గుఱించి చెప్పినను అది భగవంతుని గుఱించి చెప్పినట్లే)

“వేదప్రమాణకం కర్మపూర్వస్యోత్సాదకం భవేత్ |

నను పాషాండ శాస్త్రాత్కిం వైలక్షణ్యం శృతేర్యతః |

శ్రుతి ప్రమాణకో ధర్మో నాన్యోస్తీతి శృణూత్తిరం |

ఆదిర్భావోపి వేదస్య హ్యక్షరాత్పరమాత్మనః |

తథా చా పౌరుషేయత్వాత్ నిరస్తాఖిల సంశయః |

అర్థేహ్యతీంద్రియే వేదః ప్రమాణం స్వత ఏవసః |

నతు ప్రమాది మాయాది దోష వద్రచితం హితత్ |

పాషాండ వాక్యం పామాణ్యజనకం స్యాదతీంద్రియే |

తస్మా త్సాక్షాత్పరబ్రహ్మ హేతుత్వా త్సర్వభాసకం |

అవినాశి చ వేదాఖ్యం బ్రహ్మ యజ్ఞే ప్రతిష్టితః |

అతోప్యతీంద్రియో ధర్మో (అ)నుష్టే యో వేదబోధితః |

త్యక్త్వా ప్రబోధితం పాషాండ బోధితం నరథా జనైః ||“. (గీతాభావప్రకాశము - 3 - 94 to 100)

  1. యథాపితా బాలం అగదం (ఔషధం) పాయయన్ ఖండ లడ్డుకాదిభిః ప్రలోభయన్ సాయయతి, దదాతిచ, తాని నైతావతాగదపానస్య తల్లాభః ప్రయోజనం, అపితు ఆరోగ్యం, తథా, వేదో (అ)పి అవాంతర ఫలైః ప్రలోభయన్ కర్మ మోక్షా యైవ కర్మాణి విధత్తే.

(అక్షరుడైన పరమాత్మునివలన వేదము పుట్టినది అందుచేత అపౌరుషేయము - అనగా, ఒక పురుషమాత్రుడు రచించినది కాదు - అపౌరుషేయమగుటవలన ఏ విధమైన సంశయము లేనిది. ఇంద్రియములకు గోచరముకాని విషయముల గుఱించి, అనగా, చూచుటచేత, వినుటచేత, మనసుద్వారా ఆలోచించుటచేత తెలుసుకొనలేని విషయముల గుఱించి వేదము స్వయముగానే ప్రమాణము. మాయ, తప్పులు మొదలగు దోషములతో కూడిన రచనలవంటివి కాదు - పరబ్రహ్మ వేదమునకు కారణమగుటవలన సర్వ ప్రకాశము - అనగా సమస్త విషయముల గుఱించి తెలియచేయునది, నాశము లేనిదిన్నీ. అందుచేతనే వేదమునకు బ్రహ్మ అని పేరు కలిగినది. వేదమను పేరుతో పరబ్రహ్మయే యజ్ఞమందు ప్రతిష్టితమైనది, అందుచేత ఇంద్రియములకగోచరమైన వేదములో చెప్పబడిన ధర్మము ననుష్టింపవలసినది, పాషాండ ధర్మము వదలిపెట్టవలసినది)

  1. “వేదో (అ)ఖిల ధర్మమూలం”

(వేదము అన్ని ధర్మములకు మూలము)

  1. “క. వేద ప్రణిహితమే యను

మోదంబుగ ధర్మమయ్యె మున్ను; తదన్యం

బేదియగు నది యధర్మం

బాదియు హరి రూపు వేద మన వినుకతనన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - 83)

  1. వేదములు నాలుగు - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము - ఋగ్వేదము - ఋక్కులు అనగా చందో బద్ధమై దేవతాస్తుతి ముఖ్యముగా గలవి. యజుర్వేదము = యజ్ఞము, యాగము మొదలగు కర్మలగుఱించి చెప్పునది - ‘యజ్’ అను ధాతువునుండి (root word) పుట్టినది. పూజ చేయునపుడు దేవతలకు హవిస్సును ఇచ్చునట్టి మంత్రమును ‘యజస్సు’ అందురు. “యాన గీతిర్నచ పాదబద్ధం తత్ ప్రశ్లిష్టపఠితం యజుః” (నృత్త గీతములు లేక యుక్తియుక్తములైన మంత్రములు గలది యజుర్వేదము. సామవేదము = “న్యతి పాపమితి సామ” (పాపమును పోగొట్టునది యని ఉత్పత్యర్థము. “యద్ధవై శివం శాంతం వాచస్త త్సామ” (మంగళకరమైనది, మనస్సునకానందము కలుగచేయునది సామము. “సర్వేషాం వా ఏష వేదానాం రసో యత్సామ” (వేదములన్నింటియొక్క రసము - సారము - సామవేదము అని వేదములలోనే చెప్పబడినది. “వేదానాం సామవేదోస్మి” (వేదములలో సామవేదము నేనే అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. (శ్రీమద్భగవద్గీత - 10 - 22)

  2. వేదములకు వ్యాసమహర్షి శాఖలు కల్పించెను –

“పరావరజ్ఞః స ఋషిః కాలేన అవ్యక్తరం హసా |

యుగధర్మ వ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే |

భౌతికానాం చ భావానాంచ శక్తి హ్రాసం చ తత్కృతం |

అశ్రద్ధ ధానాన్నిస్సత్వాన్ దుర్మేధాన్ హ్రసితాయుషః |

దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య మునిర్దివ్యేన చక్షుషా |

సర్వ వర్ణా శ్రమాణాం య దద్ధౌ హిత మమోఘ దృక్ |

చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికం |

వ్యద ధాద్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం |

ఋగ్యజుః సామా ధర్వఖ్యాః వేదాశ్చత్వార ఉద్ధృతాః |

ఇతిహాస పురాణాంచ పంచమో వేదముచ్యతే ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 16 to 20)

వ. తృతీయంబైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచర వస్తువు వీర్యంబున జన్మించి వాసవి నాదగు సత్యవతియందు బరాశరునికి హరి కళం జేసి విజ్ఞాని యైన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాడు బదరికాశ్రమంబున సరస్వతీ జలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై - - - అతీతనాగత వర్తమానుజ్ఞుండైన యా ఋషి - “వ్యక్తంబుగాని వేగంబుగల కాలంబునం జేసి యుగ ధర్మంబులకు భువి సాంకర్యంబు నొందు. యుగ యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు. పురుషులు నిస్సత్వులు. ధైర్య శూన్యులు, మంద ప్రజ్ఞులల్పాయువులు, దుర్బలులు నయ్యెదరు” అని దివ్య దృష్టింజూచి సర్వ వర్ణాశ్రమంబులకు హితంబు సేయందలంచి, నలువురు హాతలచేత నుష్టింప దిగి ప్రజలకు శుద్ధికరంబులయిన వైదికకర్మంబులగు యజ్ఞంబు లెడతెగకుండు కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుగు నామంబుల ఇభాగించి, యితిహస పురాణంబులన్నియు పంచమ వేదంబని పల్కె -

“సీ. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకునే, సామంబు జైమిని చదువుచుండె

యజువు వైశంపాయనాఖ్యుండు గైకొని, దుది నధర్వము సుమంతుడు పఠించె

నఖిల పురాణేతి హాసముల్ మా తండ్రి రోమ హర్షణుడు నిరూడిదాల్చె

దమ తమ వేదమా తపసులు భాగించి శిష్య సంఘములకు జెప్పిరంత

తే. శిష్యులెల్లరు నాత్మీయ శిష్య జనుల

కందు బహు మార్గముల ద్రుంచి యనుమతింప

బెక్కు శాఖలు గలిగి యీ పృధివిలోన

నిగమ మొప్పారె భూసుర నివహమందు.

వ. ఇట్లు మేధాహీనులైన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడుచున్నవి. మఱియు దీనవత్సలుండయిన వ్యాసుండు స్త్రీ శూద్రులకు ద్రైవర్ణికాధము లకు వేదంబులు విన నర్హంబులు గావు. గావున మూఢులకెల్ల మేలగునని భారతాఖ్యనంబు సేసి - - - ”

(శ్రీమహాభాగవతము - 1 - 4 - 81, 82)

  1. ఋగ్వేదమందు ఇరువదొకటి, యజుర్వేదమందు నూటతొమ్మిది, సామవేదమందు వేయి, అధర్వణవేదమందు యాభై శాఖలు గలవు.

వేదములు రెండుభాగములు - పూర్వభాగము, ఉత్తరభాగము - కర్మకాండ, ఉత్తరభాగము జ్ఞానకండయని చెప్పబడుచున్నది. జ్ఞానకాండయే ఉపనిత్తులు. పూర్వభాగము ధర్మమును బోధించును, అభ్యుదయమును బోధించును - రెండవది నిశ్రేయస్సాధనమైన జ్ఞానమును - భగవత్తత్త్వమును బోధించును -

  1. సీ. సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును, సనాత

నము, బూర్వ ఋషి సమ్మతము, జనార్థనమూలమును, నిత్యమును, శుద్ధమును శివంబు,

నార్యపథానుగంబగు వేదమును - - -. (శ్రీమధాంధ్ర మహాభాగవతము - 4 - 2 - 51)

  1. “సీ. భారతమిషమున పలికితి వేదార్థ భావమెల్ల” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 48)

(వేదముల సారము భాగవతము)

  1. “సత్యం సత్యం పునస్సత్యముద్ధృత్య భుజమిచ్యతే |

వేదాచ్ఛాస్తం పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||“.

(వేదము కంటె ఉత్కృష్టమైన శాస్త్రము లేదు - కేశవునికంటె - మహా విష్ణువు కంటె - ఉత్కృష్టమైన దైవము లేడు అని చేయి యెత్తి పెద్ద గొంతుకతో చెప్పుచున్నాను - ఇది ముమ్మాటికి నిజము)

  1. “త్రైగుణ్య విషయో వేదాః” (శ్రీమద్భగవద్గీత - 2 - 45)

(గుణానాం కర్మ సంసారస్త్రయాణాం కామ మూలకః |

స్వప్రకాశ్యతయా యేషాం విషయస్తా దృ శాస్త్రయః |

కర్మకాండాత్మకా వేదా స్తత్కత్కామానుసారతః |

బోధయంతి ఫలం - - - ||.) (గీతాభావప్రకాశము - 2 - 474 to 476)

(సత్వ రజస్తమములను త్రిగుణములు కామ మూలమైన సంసారమును కలుగచేయునవి, కర్మకాండను తెలియచేయునవి. వారివారి కోర్కెల ననుసరించి కర్మలు చేయుటవలన ఫలమును తెలియచేయునవి).

  1. “గావః పశ్యంతి గంధేన వేదైః పశ్యంతి చ ద్విజాః |

చారైః పశ్యంతి రాజ్మానశ్చక్షుభ్యామితరే జనాః ||“.

(ఆవులు గంధముచేత తెలుసుకొనగలవు, వేదములద్వారా వేదపండితులు ఇతరరీత్యా తెలుసుకొనజాలని విషయములను తెలుసుకొనగలరు; రాజులు తమ చారులవలన (spies) సమాచారము తెలుసుకొనగలరు; ఇతర జనులు వారిదృష్టికి గోచరించువాటినే తెలుసుకొనగలరు).

  1. ఇంద్రియములు తెలుసుకొనలేనిదానిని తెలుపునది వేదము. భగవంతుడు వాచమగోచరుడు, ఇంద్రియాతీతుడు - వేదముచేతనే తెలియబడువాడు. అందుచేతనే వేదైక వేద్యుడు - “వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” అన్ని వేదములచేతను తెలియబడువాడను నేనే - వేదములన్నియు నా గుఱించియే చెప్పుచున్నవి - నన్నే తెలియచేయుచున్నవి. అందుచేతనే భగవంతుని తెలుసుకొనుటకు వేదమే ప్రమాణము - దానిలో చెప్పబడిన విషయములకు వేదమే ప్రమాణము - అందుచేత అది శబ్ద ప్రమాణము - శబ్దబ్రహ్మ).

  2. “అదుఃఖమి తరత్ సర్వ జీవా ఏవతు దుఃఖినః |

తేషాం దుఃఖ ప్రహాణాయ శ్రుతి రేషా ప్రవర్తతే ||“.

(జీవులకే దుఃఖము కలుగుచుండును. వారు కామ క్రోధములు మొదలగువాటితో కర్మలు చేయుదురు - కనుక కర్మఫలము దుఃఖరూపముగా అనుభవింపవలసినవారు - భగవంతునుకి దుఃఖములేదు. జీవులు కానివాటికి దుఃఖము లేదు - అందుచేత జీవుల దుఃఖమును పోగొట్టునవియే వేదములు - వాటి ప్రయత్నమదియే).

  1. “యది విద్యాచ్చతుర్వేదాన్ సాంగోపనిషదాన్ ద్విజః |

న చేత్సురాణం సం విద్యాత్ నైవ స స్యాద్విచక్షణః ||“.

(నాలుగు వేదములను, వేదాంగములను, ఉపనిషత్తులను చదివినప్పటికీ, పురాణములను తెలియనివాడు - చదవనివాడు విచక్షణుడు కానేరడు).

  1. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహ యేత్

(ఇథిహాస పురాణములచతనే వేదార్థమును బాగుగా అన్వయించుకొనవలెను).

  1. “నిత్యాః వేదాః సమస్తాశ్చ శాశ్వతః విష్ణు బుద్ధిగాః”.

(వేదములు నిత్యములు - ఎప్పటికిని వర్తించునవి - అందుచేత నిత్యములు - శ్రీమహావిష్ణుని జ్ఞానమును బోధించునవి).

  1. వేదములు సంహితములు; బ్రాహ్మణములు - సంహితములు మంత్రములు, బ్రాహ్మణములు వీటి అర్థమును బోధించి వాడుకను తెలుపునవి. వేదములు శబ్దరూపమున వినబడుటవలనశ్రుతులని చెప్పబడుచున్నవి. అట్లు వాటిని వినువారు మంత్రద్రష్టలని చెప్పబడుచున్నారు - వేదమంత్రములను ఉదాత్తానుదాత్త స్వరితాది స్వరములతో నియమము ననుసరించి ఉచ్ఛరించవలెను –

  2. “వేదవేద్యే పరే పుంసీ జాతే దశరధాత్మజే |

వేదః - ప్రాచేతసా దాసీత్ సాక్షా ద్రామాయణాత్మనా” ||. (శ్రీరామకర్ణామృతం -)

(వేదము చేతనే తెలియబడు పరమాత్మ దశరధ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుడుగా భూలోకములో అవతరించగా వాల్మీకి మహర్షిద్వారా వేదము రామాయణరూపము చెందెను - వేదసారమే రామాయణము - వేదములో చెప్పబడిన పరబ్రహ్మ శ్రీరామచంద్రుడు రామాయణములోని అభ్యుదయ శ్రేయ స్సాధనములు రెండును రామాయణములోనే చెప్పబడినవి. రామాయణము కేవలము ఒక పురాణకధగాక పరమాత్మ తత్వమును తెలియచేయు గ్రంధము -

“శ్లో. అలం వివాదేన న మానుషోయం రామాత్మనా రాక్షసమర్థనాయ |

భుజంగశయ్యాం పరిముచ్య సాక్షాన్నారాయణో భూతలమాజ గామ ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 75)

(శ్రీరామచంద్రుడు పరబ్రహ్మమా, లేక మానవుడా అను విషయముగుఱించి వివాదము అవసరములేదు - ఈ వివాదము చాలును - రాక్షస సణారము కొఱకు శేషశయనము వదలిపెట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామావతారముతో భూమి మీదకు దిగి వచ్చెను).

  1. “గోభిర్విప్తైశ్చ వేదైశ్చ సతీభిస్సత్వవాదిభిః |

అ లుబ్దైర్దాన శీలైశ్చ సప్తభిర్థార్యతే మహీ ||” (మార్కండేయ పురాణము)

(ఆవులు, బ్రాహ్మణులు (వేదవిదులు), వేదములు, సతీమణులు, సత్వవాదులు, లోభులుకాని దాతలు - అడిగినదానినంతను లేదనక యిచ్చువారు - ఈ నలుగురుండుటవలననే భూమి నిలబడియున్నది) (పాప భూయిష్టమై సారములేక పంటలు పండించక - కుంగిపోక ఉన్నది).

  1. వేదమనగా జ్ఞానమని యర్థము - వేదము ధర్మమునే కాక ఆధునిక విజ్ఞాన శాస్త్రమును కూడ బోధించునది.
Transliteration
  1. vēdyatē jñāyatē tat vēdaṃ.

(teliyacēyunadi; brahmajñānamu kalugacēyunadi)

  1. vidaṃti anēna iti vēdaḥ -

(dīnivalana sarvamunu telusukonucunnāru kanuka vēdamani ceppabaḍinadi)

  1. vēdamu anumāṭa ‘vid’ (to know) anu dhātuvunuṃḍi (root wordnuṃḍi) kaliginadi. ī dhātuvunakarthamu telusukonuṭa (to know). dīnivalana brahmamunu telusukonavaccunu -

  2. vēdayatīti vēdaḥ

(ē pramāṇamu cētanainanu teliyabaḍani agamyagōcaruḍu (vāk dṛk alabhyuḍu) ayina bhagavaṃtuni tatvamunu teliya cēyunadaguṭacēta vēdamani ceppabaḍinadi. bhagavaṃtuḍu vēdamucētanē teliyabaḍuvāḍu - “vēdaika vēdyaḥ” (vēdamu anu okkadāni mūlamunanē teliyabaḍuvāḍu).

  1. “pratyakṣēṇānu mityāvā yastūpāyō na labhyatē |

ētaṃ vidaṃti vēdēna tasmāt vēdasya vēdatā |”

“sarvōpyayaṃ vēdaḥ pratyakṣānu mānābhyāṃ, anavagatēṣṭāniṣṭa prāpti parihāraōpāya prakāśanaparaḥ. sarva puruṣāṇāṃ nisargata ēva tatprāpti parihārayō riṣṭatvāt”.

(pratyakṣa pramāṇamu, anumānapramāṇamu - vīṭidvārā manaku avagāhana kānaṭuvaṃṭi viṣayamaina brahmamu guṟiṃci telupunadinnī, brahmaprāptiki upāyamu telupunadinnī, samasta duḥkhamulanu nivāriṃpacēyunadinnī, śrēyōmārgamunu cūpunadinnī yaguṭacēta vēdamani ceppabaḍinadi. iṣṭamainadi prāptiṃcuṭakunu, iṣṭamukānidi nivṛttiyaguṭaku upāyamunu teliyacēyunadi).

  1. vēdamulu parabrahmanuṃḍi puṭṭinavi : -

    1. “asyamukhatō bhūtasya niḥśvasitamē tat yat ṛgvēdō, yajurvēdassāmavēdō(a)dharvaṇāṃgirasa itihāsaḥ purāṇaṃ vidyā upaniṣadassūtrāṇi” (bṛhadāraṇyakōpaniṣat - 2 - 4 - 10)

(mahābhūtamani ceppabaḍu parabrahmanuṃḍi niśvāsamuvale anāyāsamuga ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu; itihāsamulu, purāṇamulu, upaniṣattulu, śikṣā, vyākaraṇamu puṭṭinavi)

  1. “niśvāsabhūtā yē viṣṇōrvēdā jātassuvistarāḥ” (muktikōpaniṣat)

(vēdamulu viṣṇuvuyokka niśvāsamuvale - niśvāsarūpamugā puṭṭi bāgā vistariṃcinavi)

  1. “vēdāḥ śāstrāṇi vijñānamē tatsarvaṃ janārdanāt” (viṣṇusahasranāmamulu)

(vēdamulu, śāstramulu, vijñānamaṃtayu śrīmahāviṣṇuvuvalanē puṭṭinavi.)

  1. “ca. anaghacaritra! manmakhamunaṃdu janiṃce hayānanākhyatan

vinuta suvarṇa varṇuḍunu vēdamayuṃḍākhilāṃta rātmakuṃ

ḍanupama yajña pūruṣuḍu nai bhagavaṃtuḍu tatsamasta pā

vana magu nāsikāśvanana vargamulaṃ dudayiṃce vēdamul “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 140)

  1. “śāstrayōnitvāt” (brahmasūtramulu - 1 - 1 - 3)

(parabrahma evaru? ani nirṇayiṃcuṭaku śrīvyāsamaharṣi brahmasūtramulanu vrāsenu - aṃdulōni sūtramu “śāstramulanu raciṃcinavāḍu brahma” ani ceppenu - iccaṭa śāstramulanagā vēdamulu modalagunavi.

  1. “anādi nidhanā nityā vāgusṛṣṭā svayaṃbhuvā |

ādau vēdamayī divyāyata ssarvā pravṛttayaḥ ||“. (manusmṛti)

(sṛṣṭi prāraṃbhamulō ādyaṃtamulu lēnidi, divyamainadi vēdamayamagu vākku svayaṃbhuvunicē vinabaḍinadi - grahiṃpabaḍīṃdi - adi ādi lēnidikanuka anādi, annikālamulaṃdu uṃḍunadi,, kanuka nityamu) pramāṇamu -

  1. “yō brahmaṇaṃ vidadhāti pūrvaṃ, yōvai vēdāṃśca prahiṇōti tasmai” itiśrutiḥ -

(sṛṣṭi prāraṃbhamulō caturmukhabrahmanu puṭṭiṃci ataniki vēdamulanu sphuriṃpacēsenu - aṭṭi parabrahmaku namaskāramu).

  1. “yathā adhyē tā raḥ pūrvakramaṃ jñātvā vēdaṃ kurvaṃti, tathā vicitraguṇamāyā sahāyā anāvṛtānaṃta svaprakāśa cidrūpaḥ paramēśvaraḥ svakṛta pūrva kalpīya krama sajātīya kramavaṃtaṃ vēdarāśiṃ tadarthāṃśca yugapa jñānānnēva karōtīti na vēdasya pauruṣēyatā. yatrahyartha jñāna pūrvakaṃ vākyajñānaṃ vākyanṛṣṭau kāraṇaṃ tatra pauruṣēyatā. atraca yōgapadyānna sāṃtō vēdakartā vēdamiva tadarthamapi svasaṃbaddhaṃ nāṃtarīkatayā jānātīti sarvajñaḥ”

(vēdamunu adhyayanamu cēyuvāḍu pūrvameṭlucēsenō telisi aṭlē cēyunaṭlu vicitraguṇamulu - satvarajastamōguṇamulu - gala māyasahāyamugā gala anaṃtuḍu, svayaṃprakāśuḍu, caitanyarūpuḍu agu paramēśvaruḍu pūrva kalpamaṃdu tanu ē kramamunanusariṃci vēdamulanu cēsinavāḍō telisina vāḍaguṭacēta ā prakāramuganē pratikalpamaṃdu tānē vāṭini cēyuṭavalana, - rūpoṃdiṃcuṭavalana vēdamulu oka prākṛta puruṣuḍu (prakṛtiki saṃbaṃdhiṃcina puruṣuḍu) cēsinavikāvu - pauruṣēyamulukāvu - apauruṣēyamulu - sākṣāttu bhagavaṃtuni nuṃḍu āvirbhaviṃcinavi - aṃducēta apauruṣēyamulu - pramāṇagraṃdhamulu). (itarulaku teliyani viṣayamulu tānu telisinavāḍu kanuka sarvajñuḍu “yassarvajña yaḥ sarva vidyasya jñānamayaṃ tapaḥ” (muṃḍakōpaniṣat). (anniyu telisinavāḍu - jñānamayuḍu - cinmayuḍu - kanukanē - iṃtaṭi sarvajñatvamugalavāḍu iṃkokaḍu lēḍu kanukanē parabrahmayē vēdakarta)

  1. “ādiyaṃdu caturmukhuni hṛdayaṃbuna noka nādaṃbudbhaviṃce, nadi vṛttinirōdhaṃbuvalana mūrtībhaviṃci vyaktaṃbugā ganupaṭṭe, naṭṭi nādōpāsanavalana yōgijanaṃbulu niṣpāpulai muktinoṃdudu raṃdu nōṃkāraṃbu janiyiṃce, nadiye sarva maṃtrōpaniṣanmūla bhūtayagu vēdamāta yani ceppaṃbaḍu, nā yōṃkāraṃbu triguṇātmakaṃbai yakārōkāra makāraṃbulaneḍu trivarṇarūpaṃbai prakāśiṃcucuṃḍe, naṃta bhagavaṃtuṃḍagu najuṃḍā praṇavaṃbuvalana svarasparśāṃtasthōṣmādi lakṣaṇa lakṣitaṃbagu nakṣara samāmnāyaṃbu valana vēdacatuṣṭayaṃbu galuguṃjēse, naṃtani putrulagu brahmavādulā vēdaṃbulaṃdupadiṣṭa prakāraṃbuga nabhyasiṃci yā kramaṃbuna vāralu tama śiṣyaparaṃparalaku nupadēśiṃciri.” (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 30)

  2. “ā. alasi solasi nidura naṃdina paramēṣṭi

mukhamunaṃdu veḍale modali śrutulu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 24 - 714)

  1. “ca. uḍugaka paṃkajātabhavu ḍoṃḍoka dēhamu dālci dhairyamun

viḍuvaka sṛṣṭipūrvaka samavētamugan sṛjiyiṃcu nērpu dā

boḍamami kātmalōna dalapōyucunuṃḍa jaturmukhaṃbulan

veḍale nanūna rūpamula vēdamu laṃcita dharmayuktitōn”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 4 - 385)

  1. “karmabrahmōdbhavaṃ viddhi, brahmākṣara samudbhavaṃ” (śrīmadbhagavadgīta - 3 - 15)

(cēyavalasina karma vēdamulō ceppabaḍinadi - vēdamu parabrahmanuṃḍu puṭṭinadi.)

“ahaṃ - - pavitramōṃkāraḥ ṛksāmaya jurēvaca” (śrīmadbhagavadgīta - 9 - 16)

(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu nēnē ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu)

  1. “vēdān purāṇa ninahānapi sarvavidyāḥ kurvan nijānanagaḷā ccaturāna nō(a)sau ||”. (nārāyaṇīyaṃ - 10 daśakaṃ)
  1. “maṃtra kṛtō vṛṇītē” itādibhiḥ vēdaśabdeḥ tattatkāṃḍa sūkta maṃtra kṛtāṃ ṛṣīṇāṃ ākṛti śaktyādikaṃ parimṛśya tattadākārān tatttacchakti yuktāṃśca sṛṣṭvā prajāpatiḥ tānēva tattanmaṃtrādi karaṇē niyuṃktē. tēpi prajāpatinā āhita śaktayaḥ tattadanuguṇaṃ tapastaptvā nitya siddhān pūrva pūrva vaśiṣṭādi dṛṣṭān tānēva maṃtrādīn anadhīttyaiva svarataḥ varataśca askhalitān paśyati. ataśca vēdānāṃ nityatvaṃ, ēṣāṃca maṃtrakṛttva mupapadyatē”

(“maṃtrakṛtō vṛṇī tē” anu modalagu vēdamulalōni vākyamulanu baṭṭi āyā vēdakāṃḍalalō ceppabaḍina maṃtradraṣṭalagu ṛṣulayokka ākṛti (ākāramu) śakti modalagu vāṭini parāmarśiṃci - pariśīliṃci - aṭuvaṃṭi ākāramu, śakti galavārini sṛṣṭiṃci prajāpati (brahma - sṛṣṭikarta) vārinē āyā maṃtradraṣṭalugā niyamiṃcenu - vārunu prajāpativalana āhita śaktigalavāralai vāṭiki (aṃdu nimittamu) anuguṇamaina tapassu cēsi nityasiddhamu (ē kālamaṃdainanu, ē yugamaṃdaina nuṃḍunavi) ayina vinnī, pūrvasṛṣṭilō vasiṣṭuḍu modalaguvāriki gōcaramaina maṃtramulu modalaguvāṭini adhyayanamu cēyanavasaramu lēkanē (tappu lēkuṃḍunaṭlu, svaramu, varṇamu tappakuṃḍa vāru cūcedaru (telusukonedaru). aṃducētanē vēdamulu nityamulani maṃtrakṛtyamulani ceppabaḍinadi)

  1. “na naṃtyēvahi vēda bhāgāḥ yatra paramēśvarō nagīyatē” tathāhi sraṣṭṛtvēna puruṣa sūktēṣu vibhūtyā rudrēṣu śabda brahmatvēna maṃḍala brāhmaṇēṣu prapaṃcaṃ puraskṛtya niṣprapaṃca tayōpa niṣatsu yajñapuruṣatvēna maṃtra vidhiṣu, dēhāvirbhā vairupākhyānēṣu upāsyatvēnaca sarvatra iti. (nyāya kusumāṃjali)

paramēśvaruni guṟiṃci bōdhiṃcani vēdabhāgamu lēdu - vēdamulō naṃtatanu paramēśvaruḍē bhōdhiṃpabaḍu cunnāḍu. ayinappaṭikī puruṣa sūktamulaṃdu sṛṣṭikartayani, rudramaṃtramulaṃdu namakamulaṃdu vibhūtulugalavāniganu, maṃḍalabrāhmaṇamaṃdu śabda brahmayaniyu, prapaṃca viṣayamulōnu, upaniṣattulalōnu, niṣprapaṃcakuḍaniyu, maṃtravidhulaṃdu yajñapuruṣuḍani, upākhyānamulaṃdu avatāramulu dālcinavāḍani upāsyuḍuganu - ī prakāramugā vēdamaṃdaṃtaṭanu bhagavaṃtuḍē ēdō oka rītigā bōdhiṃpabaḍucunnāḍu, kanuka vēdamulu vāsudēvaparamulu - “vāsudēvaparāḥ vēdāḥ” -

“vēda, yāga, yōga kriyā jñāna tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)

  1. brahma jñānulaina ṛṣulu vāri tapōmahimacē vēdamulu vāriki vinabaḍinavi - (direct revelation). aṃducēta vēdamulu ‘śrutulu’ ani ceppabaḍinavi. brahma mukhamuna puṭṭina vēdamulanu ṛṣulu, śrāta darsanulu - vinuṭacē śrutulani ceppabaḍinavi - vīṭinē amnāyamu, chaṃdassu, svādhyāyamani ceppuduru - sṛṣṭiki kāraṇamaina parabrahma mukhamunuṃḍi puṭṭi, parabrahma guṟiṃciyē ceppunavi kanuka brahma - śabda brahma - ani kūḍa ceppabaḍucunnavi - “sarvē vēdāḥ yatpadamāmavaṃti, sarvavēdāḥ yatraikaṃ bhavaṃti” - (vēdamulanniyu bhagavatpadamunē, bhagavatattvamunē pratipādiṃcucunnavi - aṭlu ceppuṭalō ēkamagucunnavi).

“yugāṃtē aṃtarhitān vēdān sētihāsān maharṣayaḥ |

rēbhirētapasā pūrvamanujñātā ssvayaṃbhuvā ||“.

(yugāṃtakālamuna itihāsamulatōsahā vēdamulanu caturmukhabrahma yokka anujñavalana maharṣulu tama tapō balamucē telusukoniri).

  1. nṛṇāṃ bhūcarāṇāṃ yatrakutrāpi dattāni nikṣiptāni padāni bhuvi kadhamayadhā bhavaṃti, adattāni bhavaṃti? atō yathāmṛtpāṣāṇēṣṭa kādiṣu dattāni padāni bhuvaṃ navyabhi caraṃti, tathā yatkimapi vikārijātaṃ vadaṃtō vēdāḥ paramēśvaramēva sarvakāraṇaṃ paramārthabhūtaṃ pratipādayaṃti -

(bhūmimīda saṃcariṃcu narulu vāri pādamulanu ekkaḍa peṭṭinanu bhūmimīda peṭṭalēnaṭlu eṭlugunu ? aṭlē maṭṭimīda, ṟāyimīda peṭṭina pādamulu kūḍa eṭlu bhūmimīda peṭṭalēnaṭlagunu? ā prakāramugānē bhagavaṃtunilōnuṃḍi puṭṭina samasta vastuvulalō dēnini guṟiṃci vēdamulu ceppinanu anniṃṭikī kāraṇamainaṭuvaṃṭinnī, paramārtharūpamainaṭuvaṃṭinnī paramēśvaruni guṟiṃci ceppinavē yagucunnavi. anni vastuvulu bhagavaṃtuni rūpamulē - “sarvaṃ samāpnōti tatōpi sarvaḥ” (anniṃṭilōnu bhagavaṃtuḍu pravēśiṃci pūrtigā vāṭilō vyāpiṃci yunnāḍu. aṃducēta annivastuvulu atanē). “tadanu praviśya saccatyaccā bhavat” (sṛṣṭiṃcina lōkamulalō - lōkamulalōni annivastuvulalōnu pravēśiṃci vāṭilō pūrtigā vyāpiṃciyuṃḍi satpadārthamu asatpadārthamu tānē āyenu). lōkamulōni annivastuvulalōnu satpadārthamu - anagā bhagavadaṃśa - cicchakti - prakṛtiyokka aṃśa anu reṃḍu aṃśalu kalisiyē yunnavi). “annī nīvanucu naṃtaraṃgamuna, tinnagā vetaki telusukoṃṭinayya” (tyāgarāju). aṃducētanē sṛṣṭilōni ē vastuvainanu bhagavaṃtuni rūpamugānē - bhāviṃci pūjiṃcucunnāmu - aṃducēta vēdamulu ē viṣayamu guṟiṃci ceppinanu adi bhagavaṃtuni guṟiṃci ceppinaṭlē)

“vēdapramāṇakaṃ karmapūrvasyōtsādakaṃ bhavēt |

nanu pāṣāṃḍa śāstrātkiṃ vailakṣaṇyaṃ śṛtēryataḥ |

śruti pramāṇakō dharmō nānyōstīti śṛṇūttiraṃ |

ādirbhāvōpi vēdasya hyakṣarātparamātmanaḥ |

tathā cā pauruṣēyatvāt nirastākhila saṃśayaḥ |

arthēhyatīṃdriyē vēdaḥ pramāṇaṃ svata ēvasaḥ |

natu pramādi māyādi dōṣa vadracitaṃ hitat |

pāṣāṃḍa vākyaṃ pāmāṇyajanakaṃ syādatīṃdriyē |

tasmā tsākṣātparabrahma hētutvā tsarvabhāsakaṃ |

avināśi ca vēdākhyaṃ brahma yajñē pratiṣṭitaḥ |

atōpyatīṃdriyō dharmō (a)nuṣṭē yō vēdabōdhitaḥ |

tyaktvā prabōdhitaṃ pāṣāṃḍa bōdhitaṃ narathā janaiḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 94 to 100)

  1. yathāpitā bālaṃ agadaṃ (auṣadhaṃ) pāyayan khaṃḍa laḍḍukādibhiḥ pralōbhayan sāyayati, dadātica, tāni naitāvatāgadapānasya tallābhaḥ prayōjanaṃ, apitu ārōgyaṃ, tathā, vēdō (a)pi avāṃtara phalaiḥ pralōbhayan karma mōkṣā yaiva karmāṇi vidhattē.

(akṣaruḍaina paramātmunivalana vēdamu puṭṭinadi aṃducēta apauruṣēyamu - anagā, oka puruṣamātruḍu raciṃcinadi kādu - apauruṣēyamaguṭavalana ē vidhamaina saṃśayamu lēnidi. iṃdriyamulaku gōcaramukāni viṣayamula guṟiṃci, anagā, cūcuṭacēta, vinuṭacēta, manasudvārā ālōciṃcuṭacēta telusukonalēni viṣayamula guṟiṃci vēdamu svayamugānē pramāṇamu. māya, tappulu modalagu dōṣamulatō kūḍina racanalavaṃṭivi kādu - parabrahma vēdamunaku kāraṇamaguṭavalana sarva prakāśamu - anagā samasta viṣayamula guṟiṃci teliyacēyunadi, nāśamu lēnidinnī. aṃducētanē vēdamunaku brahma ani pēru kaliginadi. vēdamanu pērutō parabrahmayē yajñamaṃdu pratiṣṭitamainadi, aṃducēta iṃdriyamulakagōcaramaina vēdamulō ceppabaḍina dharmamu nanuṣṭiṃpavalasinadi, pāṣāṃḍa dharmamu vadalipeṭṭavalasinadi)

  1. “vēdō (a)khila dharmamūlaṃ”

(vēdamu anni dharmamulaku mūlamu)

  1. “ka. vēda praṇihitamē yanu

mōdaṃbuga dharmamayye munnu; tadanyaṃ

bēdiyagu nadi yadharmaṃ

bādiyu hari rūpu vēda mana vinukatanan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - 83)

  1. vēdamulu nālugu - ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu - ṛgvēdamu - ṛkkulu anagā caṃdō baddhamai dēvatāstuti mukhyamugā galavi. yajurvēdamu = yajñamu, yāgamu modalagu karmalaguṟiṃci ceppunadi - ‘yaj’ anu dhātuvunuṃḍi (root word) puṭṭinadi. pūja cēyunapuḍu dēvatalaku havissunu iccunaṭṭi maṃtramunu ‘yajassu’ aṃduru. “yāna gītirnaca pādabaddhaṃ tat praśliṣṭapaṭhitaṃ yajuḥ” (nṛtta gītamulu lēka yuktiyuktamulaina maṃtramulu galadi yajurvēdamu. sāmavēdamu = “nyati pāpamiti sāma” (pāpamunu pōgoṭṭunadi yani utpatyarthamu. “yaddhavai śivaṃ śāṃtaṃ vācasta tsāma” (maṃgaḷakaramainadi, manassunakānaṃdamu kalugacēyunadi sāmamu. “sarvēṣāṃ vā ēṣa vēdānāṃ rasō yatsāma” (vēdamulanniṃṭiyokka rasamu - sāramu - sāmavēdamu ani vēdamulalōnē ceppabaḍinadi. “vēdānāṃ sāmavēdōsmi” (vēdamulalō sāmavēdamu nēnē ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. (śrīmadbhagavadgīta - 10 - 22)

  2. vēdamulaku vyāsamaharṣi śākhalu kalpiṃcenu –

“parāvarajñaḥ sa ṛṣiḥ kālēna avyaktaraṃ hasā |

yugadharma vyatikaraṃ prāptaṃ bhuvi yugē yugē |

bhautikānāṃ ca bhāvānāṃca śakti hrāsaṃ ca tatkṛtaṃ |

aśraddha dhānānnissatvān durmēdhān hrasitāyuṣaḥ |

durbhagāṃśca janān vīkṣya munirdivyēna cakṣuṣā |

sarva varṇā śramāṇāṃ ya daddhau hita mamōgha dṛk |

cāturhōtraṃ karma śuddhaṃ prajānāṃ vīkṣya vaidikaṃ |

vyada dhādyajña saṃtatyai vēdamēkaṃ caturvidhaṃ |

ṛgyajuḥ sāmā dharvakhyāḥ vēdāścatvāra uddhṛtāḥ |

itihāsa purāṇāṃca paṃcamō vēdamucyatē ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 16 to 20)

va. tṛtīyaṃbaina dvāparayugaṃbu dīṟu samayaṃbuna nuparicara vastuvu vīryaṃbuna janmiṃci vāsavi nādagu satyavatiyaṃdu barāśaruniki hari kaḷaṃ jēsi vijñāni yaina vēdavyāsuṃḍu janmiṃci yokkanāḍu badarikāśramaṃbuna sarasvatī jalaṃbula snānādi karmaṃbulaṃ dīrci śuciyai - - - atītanāgata vartamānujñuṃḍaina yā ṛṣi - “vyaktaṃbugāni vēgaṃbugala kālaṃbunaṃ jēsi yuga dharmaṃbulaku bhuvi sāṃkaryaṃbu noṃdu. yuga yugaṃbula bhautika śarīraṃbulaku śakti sannaṃbagu. puruṣulu nissatvulu. dhairya śūnyulu, maṃda prajñulalpāyuvulu, durbalulu nayyedaru” ani divya dṛṣṭiṃjūci sarva varṇāśramaṃbulaku hitaṃbu sēyaṃdalaṃci, naluvuru hātalacēta nuṣṭiṃpa digi prajalaku śuddhikaraṃbulayina vaidikakarmaṃbulagu yajñaṃbu leḍategakuṃḍu koṟaku nēkaṃbaina vēdaṃbu ṛgyajussāmādharvaṇaṃbulanu nālugu nāmaṃbula ibhāgiṃci, yitihasa purāṇaṃbulanniyu paṃcama vēdaṃbani palke -

“sī. pailuṃḍu ṛgvēda paṭhanaṃbu dorakunē, sāmaṃbu jaimini caduvucuṃḍe

yajuvu vaiśaṃpāyanākhyuṃḍu gaikoni, dudi nadharvamu sumaṃtuḍu paṭhiṃce

nakhila purāṇēti hāsamul mā taṃḍri rōma harṣaṇuḍu nirūḍidālce

dama tama vēdamā tapasulu bhāgiṃci śiṣya saṃghamulaku jeppiraṃta

tē. śiṣyulellaru nātmīya śiṣya janula

kaṃdu bahu mārgamula druṃci yanumatiṃpa

bekku śākhalu galigi yī pṛdhivilōna

nigama moppāre bhūsura nivahamaṃdu.

va. iṭlu mēdhāhīnulaina puruṣulacēta naṭṭi vēdaṃbulu dhariyiṃpabaḍucunnavi. maṟiyu dīnavatsaluṃḍayina vyāsuṃḍu strī śūdrulaku draivarṇikādhamu laku vēdaṃbulu vina narhaṃbulu gāvu. gāvuna mūḍhulakella mēlagunani bhāratākhyanaṃbu sēsi - - - ”

(śrīmahābhāgavatamu - 1 - 4 - 81, 82)

  1. ṛgvēdamaṃdu iruvadokaṭi, yajurvēdamaṃdu nūṭatommidi, sāmavēdamaṃdu vēyi, adharvaṇavēdamaṃdu yābhai śākhalu galavu.

vēdamulu reṃḍubhāgamulu - pūrvabhāgamu, uttarabhāgamu - karmakāṃḍa, uttarabhāgamu jñānakaṃḍayani ceppabaḍucunnadi. jñānakāṃḍayē upanittulu. pūrvabhāgamu dharmamunu bōdhiṃcunu, abhyudayamunu bōdhiṃcunu - reṃḍavadi niśrēyassādhanamaina jñānamunu - bhagavattattvamunu bōdhiṃcunu -

  1. sī. sakala varṇāśramācāra hētuvu lōkamunaku maṃgaḷa mārgamunu, sanāta

namu, būrva ṛṣi sammatamu, janārthanamūlamunu, nityamunu, śuddhamunu śivaṃbu,

nāryapathānugaṃbagu vēdamunu - - -. (śrīmadhāṃdhra mahābhāgavatamu - 4 - 2 - 51)

  1. “sī. bhāratamiṣamuna palikiti vēdārtha bhāvamella” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 48)

(vēdamula sāramu bhāgavatamu)

  1. “satyaṃ satyaṃ punassatyamuddhṛtya bhujamicyatē |

vēdācchāstaṃ paraṃ nāsti na daivaṃ kēśavātparaṃ ||“.

(vēdamu kaṃṭe utkṛṣṭamaina śāstramu lēdu - kēśavunikaṃṭe - mahā viṣṇuvu kaṃṭe - utkṛṣṭamaina daivamu lēḍu ani cēyi yetti pedda goṃtukatō ceppucunnānu - idi mummāṭiki nijamu)

  1. “traiguṇya viṣayō vēdāḥ” (śrīmadbhagavadgīta - 2 - 45)

(guṇānāṃ karma saṃsārastrayāṇāṃ kāma mūlakaḥ |

svaprakāśyatayā yēṣāṃ viṣayastā dṛ śāstrayaḥ |

karmakāṃḍātmakā vēdā statkatkāmānusārataḥ |

bōdhayaṃti phalaṃ - - - ||.) (gītābhāvaprakāśamu - 2 - 474 to 476)

(satva rajastamamulanu triguṇamulu kāma mūlamaina saṃsāramunu kalugacēyunavi, karmakāṃḍanu teliyacēyunavi. vārivāri kōrkela nanusariṃci karmalu cēyuṭavalana phalamunu teliyacēyunavi).

  1. “gāvaḥ paśyaṃti gaṃdhēna vēdaiḥ paśyaṃti ca dvijāḥ |

cāraiḥ paśyaṃti rājmānaścakṣubhyāmitarē janāḥ ||“.

(āvulu gaṃdhamucēta telusukonagalavu, vēdamuladvārā vēdapaṃḍitulu itararītyā telusukonajālani viṣayamulanu telusukonagalaru; rājulu tama cārulavalana (spies) samācāramu telusukonagalaru; itara janulu vāridṛṣṭiki gōcariṃcuvāṭinē telusukonagalaru).

  1. iṃdriyamulu telusukonalēnidānini telupunadi vēdamu. bhagavaṃtuḍu vācamagōcaruḍu, iṃdriyātītuḍu - vēdamucētanē teliyabaḍuvāḍu. aṃducētanē vēdaika vēdyuḍu - “vēdaiśca sarvairahamēva vēdyaḥ” anni vēdamulacētanu teliyabaḍuvāḍanu nēnē - vēdamulanniyu nā guṟiṃciyē ceppucunnavi - nannē teliyacēyucunnavi. aṃducētanē bhagavaṃtuni telusukonuṭaku vēdamē pramāṇamu - dānilō ceppabaḍina viṣayamulaku vēdamē pramāṇamu - aṃducēta adi śabda pramāṇamu - śabdabrahma).

  2. “aduḥkhami tarat sarva jīvā ēvatu duḥkhinaḥ |

tēṣāṃ duḥkha prahāṇāya śruti rēṣā pravartatē ||“.

(jīvulakē duḥkhamu kalugucuṃḍunu. vāru kāma krōdhamulu modalaguvāṭitō karmalu cēyuduru - kanuka karmaphalamu duḥkharūpamugā anubhaviṃpavalasinavāru - bhagavaṃtunuki duḥkhamulēdu. jīvulu kānivāṭiki duḥkhamu lēdu - aṃducēta jīvula duḥkhamunu pōgoṭṭunaviyē vēdamulu - vāṭi prayatnamadiyē).

  1. “yadi vidyāccaturvēdān sāṃgōpaniṣadān dvijaḥ |

na cētsurāṇaṃ saṃ vidyāt naiva sa syādvicakṣaṇaḥ ||“.

(nālugu vēdamulanu, vēdāṃgamulanu, upaniṣattulanu cadivinappaṭikī, purāṇamulanu teliyanivāḍu - cadavanivāḍu vicakṣaṇuḍu kānēraḍu).

  1. itihāsa purāṇābhyāṃ vēdaṃ samupabṛṃha yēt

(ithihāsa purāṇamulacatanē vēdārthamunu bāgugā anvayiṃcukonavalenu).

  1. “nityāḥ vēdāḥ samastāśca śāśvataḥ viṣṇu buddhigāḥ”.

(vēdamulu nityamulu - eppaṭikini vartiṃcunavi - aṃducēta nityamulu - śrīmahāviṣṇuni jñānamunu bōdhiṃcunavi).

  1. vēdamulu saṃhitamulu; brāhmaṇamulu - saṃhitamulu maṃtramulu, brāhmaṇamulu vīṭi arthamunu bōdhiṃci vāḍukanu telupunavi. vēdamulu śabdarūpamuna vinabaḍuṭavalanaśrutulani ceppabaḍucunnavi. aṭlu vāṭini vinuvāru maṃtradraṣṭalani ceppabaḍucunnāru - vēdamaṃtramulanu udāttānudātta svaritādi svaramulatō niyamamu nanusariṃci ucchariṃcavalenu –

  2. “vēdavēdyē parē puṃsī jātē daśaradhātmajē |

vēdaḥ - prācētasā dāsīt sākṣā drāmāyaṇātmanā” ||. (śrīrāmakarṇāmṛtaṃ -)

(vēdamu cētanē teliyabaḍu paramātma daśaradha mahārāju kumāruḍaina śrīrāmacaṃdruḍugā bhūlōkamulō avatariṃcagā vālmīki maharṣidvārā vēdamu rāmāyaṇarūpamu ceṃdenu - vēdasāramē rāmāyaṇamu - vēdamulō ceppabaḍina parabrahma śrīrāmacaṃdruḍu rāmāyaṇamulōni abhyudaya śrēya ssādhanamulu reṃḍunu rāmāyaṇamulōnē ceppabaḍinavi. rāmāyaṇamu kēvalamu oka purāṇakadhagāka paramātma tatvamunu teliyacēyu graṃdhamu -

“ślō. alaṃ vivādēna na mānuṣōyaṃ rāmātmanā rākṣasamarthanāya |

bhujaṃgaśayyāṃ parimucya sākṣānnārāyaṇō bhūtalamāja gāma ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 75)

(śrīrāmacaṃdruḍu parabrahmamā, lēka mānavuḍā anu viṣayamuguṟiṃci vivādamu avasaramulēdu - ī vivādamu cālunu - rākṣasa saṇāramu koṟaku śēṣaśayanamu vadalipeṭṭi sākṣāttu śrīmannārāyaṇuḍē śrīrāmāvatāramutō bhūmi mīdaku digi vaccenu).

  1. “gōbhirviptaiśca vēdaiśca satībhissatvavādibhiḥ |

a lubdairdāna śīlaiśca saptabhirthāryatē mahī ||” (mārkaṃḍēya purāṇamu)

(āvulu, brāhmaṇulu (vēdavidulu), vēdamulu, satīmaṇulu, satvavādulu, lōbhulukāni dātalu - aḍiginadāninaṃtanu lēdanaka yiccuvāru - ī naluguruṃḍuṭavalananē bhūmi nilabaḍiyunnadi) (pāpa bhūyiṣṭamai sāramulēka paṃṭalu paṃḍiṃcaka - kuṃgipōka unnadi).

  1. vēdamanagā jñānamani yarthamu - vēdamu dharmamunē kāka ādhunika vijñāna śāstramunu kūḍa bōdhiṃcunadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.