(ఏ గ్రంధములో వ్రాసిన విషయము - సిద్ధాంతము ఇతర గ్రంధములవలన ఖండింపబడియుండదో ఆ గ్రంధము ప్రమాణమగును).
“తాత్పర్యం వేదే మీమాంసా పరిశోధిత న్యాయా దేవావధార్యతే, లోకేతు ప్రకరణాదినా. తత్ర లౌకిక వాక్యానాం మానాంతరావగుతార్థాను వాదకత్వం. వేదేతు వాక్యార్థాస్యా పూర్వతయా ననువాదకత్వం. లోకే వేదేచ పరాణామిప సిద్ధార్థా నామపి ప్రామాణ్యం - పుత్రస్తేజాతః. ఇత్యాదిషు సిద్ధార్థే(అ)పి పదానాం సామర్ధ్యావ ధారణాత్. అత ఏవ వేదేంత వాక్యానాం బ్రహ్మణి ప్రామాణ్యం”.
(వేదములోని తాత్పర్యము మీమాంసా చేత శోషించబడిన న్యాయమువలననే తెలియనగును - లోకములో ప్రకరణము మొదలగువానిచేత, లౌకిక వాక్యములకు ఇతర ప్రమాణములలోని అర్థమును ననువదించియుండును. వేదమునకు ముందు ప్రమాణ గ్రంధములు లేనందున - వేదములో ఇతర గ్రంధములనుండి అనువాదము లేదు - వేదములోను, లోకములోను సిద్ధార్థములకు అవియే ప్రమాణము - అందుచేత వేదాంత వాక్యములే బ్రహ్మగుఱించి ప్రమాణము).
(వేదము స్వతస్సిద్ధముగానరె ప్రమాణమైనది - అపౌరుషేయమగుటవలన - ఒక ప్రాకృత పురుషుడు చేసినది కాకపోవుటవలన -. ఒక ప్రాకృత పురుషుడు వ్రాసిన గ్రంధము స్వార్ధము, తనస్మృతి, వాటి అనుభవమువలన కల్పించబడినందువలన అది ప్రమాణ గ్రంధమగును -.
- ఇత్యాది శ్రుతేః -
(వేదము నిత్యుడు, సర్వజ్ఞుడు అయిన ప్రణీతమగుటవలన ప్రమాణగ్రంధమని నైయాయికుల అభిప్రాయము - వేదము నిత్యమైనదగుటవలన (అందులోని విషయములు అన్ని కాలములకు వర్తించునవగుటచేత) ప్రాకృత పురుషులకు సంబంధించిన ఏ విధమైన దోషములు లేనిదగుటచేత ప్రమాణగ్రంధమని అధ్వర మీమాంసకుల మతము. మా అభిప్రాయమేమనగా వేదము నిత్యముకాదు - జన్మ (పుట్టుక) కలదగుటచేత - ఈ మహాభూతమగు పరబ్రహ్మ నిఃశ్వాసము వలన ఈ ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణవేదము మొదలగునవి కలిగినవి. - భగవంతుని నిఃశ్వాసమే వేదముగా ఉద్భవించెను - పరిణమించెను, మారెను.: అని ఉపనిషత్తు (బృహదారణ్యకోపనిషత్ - 2 - 4 - 10) చెప్పుచున్నది)
(ē graṃdhamulō vrāsina viṣayamu - siddhāṃtamu itara graṃdhamulavalana khaṃḍiṃpabaḍiyuṃḍadō ā graṃdhamu pramāṇamagunu).
“tātparyaṃ vēdē mīmāṃsā pariśōdhita nyāyā dēvāvadhāryatē, lōkētu prakaraṇādinā. tatra laukika vākyānāṃ mānāṃtarāvagutārthānu vādakatvaṃ. vēdētu vākyārthāsyā pūrvatayā nanuvādakatvaṃ. lōkē vēdēca parāṇāmipa siddhārthā nāmapi prāmāṇyaṃ - putrastējātaḥ. ityādiṣu siddhārthē(a)pi padānāṃ sāmardhyāva dhāraṇāt. ata ēva vēdēṃta vākyānāṃ brahmaṇi prāmāṇyaṃ”.
(vēdamulōni tātparyamu mīmāṃsā cēta śōṣiṃcabaḍina nyāyamuvalananē teliyanagunu - lōkamulō prakaraṇamu modalaguvānicēta, laukika vākyamulaku itara pramāṇamulalōni arthamunu nanuvadiṃciyuṃḍunu. vēdamunaku muṃdu pramāṇa graṃdhamulu lēnaṃduna - vēdamulō itara graṃdhamulanuṃḍi anuvādamu lēdu - vēdamulōnu, lōkamulōnu siddhārthamulaku aviyē pramāṇamu - aṃducēta vēdāṃta vākyamulē brahmaguṟiṃci pramāṇamu).
(vēdamu svatassiddhamugānare pramāṇamainadi - apauruṣēyamaguṭavalana - oka prākṛta puruṣuḍu cēsinadi kākapōvuṭavalana -. oka prākṛta puruṣuḍu vrāsina graṃdhamu svārdhamu, tanasmṛti, vāṭi anubhavamuvalana kalpiṃcabaḍinaṃduvalana adi pramāṇa graṃdhamagunu -.
- ityādi śrutēḥ -
(vēdamu nityuḍu, sarvajñuḍu ayina praṇītamaguṭavalana pramāṇagraṃdhamani naiyāyikula abhiprāyamu - vēdamu nityamainadaguṭavalana (aṃdulōni viṣayamulu anni kālamulaku vartiṃcunavaguṭacēta) prākṛta puruṣulaku saṃbaṃdhiṃcina ē vidhamaina dōṣamulu lēnidaguṭacēta pramāṇagraṃdhamani adhvara mīmāṃsakula matamu. mā abhiprāyamēmanagā vēdamu nityamukādu - janma (puṭṭuka) kaladaguṭacēta - ī mahābhūtamagu parabrahma niḥśvāsamu valana ī ṛgvēdamu, yajurvēdamu, adharvaṇavēdamu modalagunavi kaliginavi. - bhagavaṃtuni niḥśvāsamē vēdamugā udbhaviṃcenu - pariṇamiṃcenu, mārenu.: ani upaniṣattu (bṛhadāraṇyakōpaniṣat - 2 - 4 - 10) ceppucunnadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.