← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదవేద్యః vēdavēdyaḥ

Original — తెలుగు
  1. వేదైక వేద్యం జ్ఞేయం.

(వేదములద్వారానే తెలియబడువాడు -)

  1. ఉపనిషత్సు “ద్వేవిద్యే వేదితవ్యే” ఇత్యాదిషు వేదితవ్య తయా నిర్దిష్టం పరమం బ్రహ్మ (శ్రీ శంకరః)

(తెలుసుకో తగిన విద్యలు రెండు అని ఉపనిషత్తులలో చెప్పబడియుండుటవలన తెలుసుకో తగినదని చెప్పబడినవి - నిర్దిష్టముగా చెప్పబడినవి - చెప్పబడినది పరబ్రహ్మమే - అందుచేత అతను వేదైక వేద్యుడు)

  1. “వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” (శ్రీమద్భగవద్గీత - 15 - 15)

“సర్వైః వేదైః అహమేవ వేద్యః; అతో అగ్ని సూర్యవాయుసోమేంద్రాదీనాం మదంతిర్యాత్మకత్వాత్ తత్ప్రతిపాదిన పరైరపి సర్వైః వేదైః అహమేవ వేద్యః - దేవ మనుష్యాదిశబ్దైః జీవాత్మ ఇవ”.

(వేదములన్నింటిచేతను తెలియబడువాడను - తెలియబడు విషయము - నేనే - (పరబ్రహ్మమే). అగ్ని, సూర్యుడు, వాయువు, సోముడు, ఇంద్రుడు మొదలగు దేవతులందరు నేనే, అంతరాత్మగా గలవారు - వారందఱిలోను అంతరాత్మగా నున్నవాడను నేనే. అందుచేత ఆయా దేవతల ఆరాధన గుఱించి ప్రతిపాదించు వేదములన్నింటిచేతను తెలియబడువాడను నేనే - దేవతలు, మనుష్యులు మొదలగుమాటలచేత వాటిలోనున్న జీవాత్మ చెప్పబడినట్లే).

  1. వేదనస్యానంతరమభిదీయ మానత్వాత్ పవిత్రత్వ సామర్థ్యాత్ వేదవేద్యం -

(వేదమును తెలుసుకొనిన తర్వాత అట్లు తెలుసుకొనబడినయతడెవడో చెప్పుటకు వీలు కలుగుట చేతనున్నూ, పవిత్రత కలిగియుండుటచేతనున్నూ, వేదముద్వారానే తెలియతగినవాడని చెప్పబడెను -)

  1. వేదే రామాయణే పుణ్యే భారతే భరతర్షభ ఆదౌ తథా చాంతే విష్ణుః సర్వత్ర గీయతే. (మహాభారతము)

(వేదమందు, పుణ్యగ్రంధమగు రామాయణమందు, భారతమందు, వీటిలో మొదట, ఆఖరున (అంతమందు), అంతటా విష్ణువే గానము చేయబడుచున్నాడు - చెప్పబడుచున్నాడు - పొగడబడుచున్నాడు, స్తోత్రము చేయబడుచున్నాడు. దీని వలన తెలియబడువాడు భగవంతుడైన - పరమాత్మయైన - శ్రీమహావిష్ణువే).

  1. “ముముక్షుభిః జ్ఞాతవ్యం”

(మోక్షముకోరువారిచేత తెలియ తగినవాడు)

వేదవ్యాసః - చూడుము - “వ్యాసః”.

Transliteration
  1. vēdaika vēdyaṃ jñēyaṃ.

(vēdamuladvārānē teliyabaḍuvāḍu -)

  1. upaniṣatsu “dvēvidyē vēditavyē” ityādiṣu vēditavya tayā nirdiṣṭaṃ paramaṃ brahma (śrī śaṃkaraḥ)

(telusukō tagina vidyalu reṃḍu ani upaniṣattulalō ceppabaḍiyuṃḍuṭavalana telusukō taginadani ceppabaḍinavi - nirdiṣṭamugā ceppabaḍinavi - ceppabaḍinadi parabrahmamē - aṃducēta atanu vēdaika vēdyuḍu)

  1. “vēdaiśca sarvairahamēva vēdyaḥ” (śrīmadbhagavadgīta - 15 - 15)

“sarvaiḥ vēdaiḥ ahamēva vēdyaḥ; atō agni sūryavāyusōmēṃdrādīnāṃ madaṃtiryātmakatvāt tatpratipādina parairapi sarvaiḥ vēdaiḥ ahamēva vēdyaḥ - dēva manuṣyādiśabdaiḥ jīvātma iva”.

(vēdamulanniṃṭicētanu teliyabaḍuvāḍanu - teliyabaḍu viṣayamu - nēnē - (parabrahmamē). agni, sūryuḍu, vāyuvu, sōmuḍu, iṃdruḍu modalagu dēvatulaṃdaru nēnē, aṃtarātmagā galavāru - vāraṃdaṟilōnu aṃtarātmagā nunnavāḍanu nēnē. aṃducēta āyā dēvatala ārādhana guṟiṃci pratipādiṃcu vēdamulanniṃṭicētanu teliyabaḍuvāḍanu nēnē - dēvatalu, manuṣyulu modalagumāṭalacēta vāṭilōnunna jīvātma ceppabaḍinaṭlē).

  1. vēdanasyānaṃtaramabhidīya mānatvāt pavitratva sāmarthyāt vēdavēdyaṃ -

(vēdamunu telusukonina tarvāta aṭlu telusukonabaḍinayataḍevaḍō ceppuṭaku vīlu kaluguṭa cētanunnū, pavitrata kaligiyuṃḍuṭacētanunnū, vēdamudvārānē teliyataginavāḍani ceppabaḍenu -)

  1. vēdē rāmāyaṇē puṇyē bhāratē bharatarṣabha ādau tathā cāṃtē viṣṇuḥ sarvatra gīyatē. (mahābhāratamu)

(vēdamaṃdu, puṇyagraṃdhamagu rāmāyaṇamaṃdu, bhāratamaṃdu, vīṭilō modaṭa, ākharuna (aṃtamaṃdu), aṃtaṭā viṣṇuvē gānamu cēyabaḍucunnāḍu - ceppabaḍucunnāḍu - pogaḍabaḍucunnāḍu, stōtramu cēyabaḍucunnāḍu. dīni valana teliyabaḍuvāḍu bhagavaṃtuḍaina - paramātmayaina - śrīmahāviṣṇuvē).

  1. “mumukṣubhiḥ jñātavyaṃ”

(mōkṣamukōruvāricēta teliya taginavāḍu)

vēdavyāsaḥ - cūḍumu - “vyāsaḥ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.