← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభూతిస్నానము vibhūtisnānamu

Original — తెలుగు
  1. కృత్వాశౌచాదికం కర్మ స్నాత్వాతువిమలే జలే |

భస్మనోద్ధూలనం కార్యమాపాద తల మస్తకం |

కేవలం వారుణం స్నానం దేహే బాహ్యమలాపహం |

విభూతిస్నాన మనఘం బాహ్యాంతర మలాపహం |

త్యక్త్వాపివారుణం స్నానం తత్పరస్యాన్న సంశయః ||“. (దేవీభాగవతం -)

(శౌచము - శుచిగానుండుట - మొదలగు కర్మచేసి శుభ్రమైన నీటిలో స్నానము చేసి, పాదములు మొదలుకొన శిరస్సువరకు భస్మమును, విభూతిని పూసుకొనివలెను - నీటితో చేసిన స్నానము శరీరముపైన ఉన్న మలమును - దోషము ను, మురికిని - పోగొట్టును. పాపమును పోగుట్టునట్టి విభూతితో చేసిన స్నానము శరీరములోపల బైట యున్న మలమును పోగొట్టును. నీటిచే బాహ్యస్నానము చేయకపోయినను దాని కంటెను విభూతిస్నానము ఉత్కృష్టమైనది).

  1. యోగీ సర్వాంకం స్నానమాపాదతల మస్తకం |

త్రిసంధ్య మాచరే న్నిత్యమాపు యోగమవాప్ను యాత్ |

భస్మస్నానేన పురుషః కులస్సో ద్ధారకో భవేత్ |

భస్మస్నానా జలస్నానాత్ అ సుభ్యేయ గు ణాన్వితం |

సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం |

తత్ఫలం లభతే సర్వం భస్మ స్నానాత్ న సంశయః |

భస్మస్నానాత్పరం స్నానం పవిత్రం నైవ విద్యతే |

ఏవ ముక్తం శివేనాదౌ |

తదాస్నాతస్స్వయం శివః |

రక్షార్థం మంగ ళార్థంచ పవిత్రార్థం పురా సురైః |

భస్మ దృష్ట్వా మునే పూర్వం దత్తం దేవ్యైపి యేణతు ||“.

(యోగియగువాడు పాదములు మొదలు శిరస్సువరకు శరీరమంతటను మూడు సంధ్యలయందును స్నానము చేయవలెను - అట్లు చేసిన శీఘ్రముగా యోగము చేకూరును. భస్మముతో - విభూతితో - స్నానము చేసిన కులమునుద్ధరించిన వాడగును - నీటితో స్నానము చేసినకంటె భస్మముతో స్నానము చేయుట లెక్కచేయనన్నిరెట్లు అధికము గుణమును - ఫలమును - ఇచ్చును. టీర్థము లన్నింటిలోను ఏ పుణ్యమున్నదో, ఏమి ఫలము కలదో ఆ పుణ్యము, ఆ ఫలము విభూతి స్నానమువలన కలుగును - ఇందుకు సందేహము లేదు - భస్మ స్నానముకంటె ఉత్కృష్టమైనది, పవిత్రమైనదియగు స్నానము లేదు - ఈ విషయము పూర్వము శివుడే తాను భస్మస్నానము చేసి చెప్పియుండెను - రక్షణకొఱకు - మంగళము కొఱకు - శుభము కొఱకు - పవిత్రము నిమిత్తము ఈ భస్మమును శివుడు స్వయముగా పార్వతికి చెప్పెను)

Transliteration
  1. kṛtvāśaucādikaṃ karma snātvātuvimalē jalē |

bhasmanōddhūlanaṃ kāryamāpāda tala mastakaṃ |

kēvalaṃ vāruṇaṃ snānaṃ dēhē bāhyamalāpahaṃ |

vibhūtisnāna managhaṃ bāhyāṃtara malāpahaṃ |

tyaktvāpivāruṇaṃ snānaṃ tatparasyānna saṃśayaḥ ||“. (dēvībhāgavataṃ -)

(śaucamu - śucigānuṃḍuṭa - modalagu karmacēsi śubhramaina nīṭilō snānamu cēsi, pādamulu modalukona śirassuvaraku bhasmamunu, vibhūtini pūsukonivalenu - nīṭitō cēsina snānamu śarīramupaina unna malamunu - dōṣamu nu, murikini - pōgoṭṭunu. pāpamunu pōguṭṭunaṭṭi vibhūtitō cēsina snānamu śarīramulōpala baiṭa yunna malamunu pōgoṭṭunu. nīṭicē bāhyasnānamu cēyakapōyinanu dāni kaṃṭenu vibhūtisnānamu utkṛṣṭamainadi).

  1. yōgī sarvāṃkaṃ snānamāpādatala mastakaṃ |

trisaṃdhya mācarē nnityamāpu yōgamavāpnu yāt |

bhasmasnānēna puruṣaḥ kulassō ddhārakō bhavēt |

bhasmasnānā jalasnānāt a subhyēya gu ṇānvitaṃ |

sarvatīrthēṣu yatpuṇyaṃ sarvatīrthēṣu yatphalaṃ |

tatphalaṃ labhatē sarvaṃ bhasma snānāt na saṃśayaḥ |

bhasmasnānātparaṃ snānaṃ pavitraṃ naiva vidyatē |

ēva muktaṃ śivēnādau |

tadāsnātassvayaṃ śivaḥ |

rakṣārthaṃ maṃga ḷārthaṃca pavitrārthaṃ purā suraiḥ |

bhasma dṛṣṭvā munē pūrvaṃ dattaṃ dēvyaipi yēṇatu ||“.

(yōgiyaguvāḍu pādamulu modalu śirassuvaraku śarīramaṃtaṭanu mūḍu saṃdhyalayaṃdunu snānamu cēyavalenu - aṭlu cēsina śīghramugā yōgamu cēkūrunu. bhasmamutō - vibhūtitō - snānamu cēsina kulamunuddhariṃcina vāḍagunu - nīṭitō snānamu cēsinakaṃṭe bhasmamutō snānamu cēyuṭa lekkacēyanannireṭlu adhikamu guṇamunu - phalamunu - iccunu. ṭīrthamu lanniṃṭilōnu ē puṇyamunnadō, ēmi phalamu kaladō ā puṇyamu, ā phalamu vibhūti snānamuvalana kalugunu - iṃduku saṃdēhamu lēdu - bhasma snānamukaṃṭe utkṛṣṭamainadi, pavitramainadiyagu snānamu lēdu - ī viṣayamu pūrvamu śivuḍē tānu bhasmasnānamu cēsi ceppiyuṃḍenu - rakṣaṇakoṟaku - maṃgaḷamu koṟaku - śubhamu koṟaku - pavitramu nimittamu ī bhasmamunu śivuḍu svayamugā pārvatiki ceppenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.