← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విదేహ ముక్తి vidēha mukti

Original — తెలుగు
  1. విదేహ ముక్తి లక్షణం ప్రపంచ ప్రతీతి శూన్యత్యేసతి ప్రత్యక్చైతన్యాత్మనా వర్తనం -

(ప్రపంచమనునది లేక, తాను ప్రత్యక్చైతన్యమే అని అట్లు భావించుట.)

  1. ఉపాధి నిర్ముక్త ఘటాకాశవ త్ప్రారబ్ద క్షయాత్ విదేహ ముక్తిః (ముక్తికోపనిషత్)

(కుండలోనుండు ఆకాశము కుండ చితికిపోయిన తర్వాత ఉపాధి లేనిదై - తానుండుటకు వస్తువు లేనిదై - మహాకాశములో కలియును - అట్లే ప్రారబ్ద కర్మ - ఫలమునిచ్చుటకు ప్రారంభించిన కర్మ - క్షీణించగనే - ఇవ్వవలసిన ఫలము పూర్తిగా నిచ్చిన తర్వాత - విదేహముక్తి కలుగును).

  1. దేహములేని స్థితి. స్థూలదేహము లేకపోవుటచేత కర్మానుభవములేని స్థితి.

  2. ఇకమీదట దేహము పొందుట లేదు - జన్మించుట ఉండదు అను స్థితి.

  3. దేహము పడిపోయినతర్వాత - దేహము నశించిన తర్వాత పరబ్రహ్మతో కలుగు ఐక్యము -

  4. జీవునకు - భగవదంశకు - దేహము అను ఉపాధి లేక - లేకుండునట్లు చేసుకొని - నిరాకార పరబ్రహ్మతో ఐక్యమగుట -

  5. దేహమే తాని అను అజ్ఞానము విడిచియుండుటే విదేహ ముక్తి.

  6. అధికార పురుషాణాం ఉత్పన్న తత్వ జ్ఞానానాం ఇంద్రాదీనాం దేహధారణానుపపత్తిమా శంక్య అదికారాపాదక ప్రారబ్ద కర్మ సమాప్త్యనంతరం విదేహ కైవల్యమితి సిద్ధాంతి తం - తదుక్తమాచార్య వాచస్పతి మిశ్రే –

“ఉపాసనాది సంసిద్ధతోషి తేశ్వర బోధితం |

అధికారం సమాప్యైతే ప్రవిశంతి పరం పదం ||“.

(బ్రహ్మజ్ఞానమునకు అధికారులై, తత్వజ్ఞానమును పొందినవారైన ఇంద్రుడు మొదలగువారికి దేహము కలదా లేదా అను శంక లేకుండుటకై ప్రారబ్ద కర్మ సమాప్తి అయిన తర్వాతనే - ఫలమునిచ్చుట కారంభముచేసిన కర్మ తాను అనిభవింప చేయవలసిన ఫలము పూర్తిగా అనుభవింప చేసిన తర్వాతనే విదేహముక్తి అని సిద్ధాంతము చేయబడినది).

  1. జ్ఞాన విజ్ఞాన శబ్దాభ్యాం తత్ఫలం ముక్తిరుచ్యతే |

సాద్విధాస్తి సదేహో, విదేహాన్యేతి తత్రచ |

ఉత్పన్నే తత్వ విజ్ఞానే సాక్షాత్కారా పరాభిధా |

అవశ్యం స భవేన్ముక్తో దేహ పాతా దనంతరం |. (గీతాభావప్రకాశము - 3 - 292; 293)

(జ్ఞాన విజ్ఞానములవలన ముక్తియని చెప్పబడినది. ముక్తి రెండు విధములు - దేహముతో ముక్తి (కట్టెతో కైలాసము), దేహము లేకుండ ముక్తి - బ్రహ్మసాక్షాత్కారము పొందుటే యగు తత్వజ్ఞానము కలుగగనే, దేహము నశించుగనే ముక్తి కలుగును -).

  1. “నిష్కామ కర్మ నిష్ఠాదౌ సత్వశుద్ధిస్తతః పరం |

తతశ్చ కర్మ సన్యాసో వైరాగ్యాది పురస్సరః |

తతో వేదాంత వాక్యానాం విచారసహితా సహితా పరా |

భగవద్భక్తి నిష్ఠాస్యాత్పురుషార్థైక జన్మభూః |

తతస్త త్వైక్య విజ్ఞాన నిష్ఠా తస్యాః పరం ఫలం |

అవిద్యాది నివృత్త్యాస్యా జ్జీవన్ముక్తి ర్నిరంకుశా |

ప్రారబ్ద భోగ పర్యంతా సమతా ద్యైరలంకృతా |

తదుతేస్యా ద్విదేహాఖ్యా ముక్తిర్వా చామగోచరా ||“. (గీతాభావప్రకాశము - 1 - 51 to 54)

(విదేహముక్తి కలుగు క్రమము ఈ క్రింద చెప్పబడినది - మొదట నిష్కామకర్మనిష్ఠ, దాని తర్వాత సత్వ శుద్ధి, దాని తర్వాత వైరాగ్యము మొదలగు వానితో ప్రారంభించిన కర్మ సన్యాసము. అటు తర్వాత పురుషార్థములకు జన్మభూమి అయినటువంటిన్నీ, ఉపనిషద్వాక్యముల విచారణతో కూడియున్న భగవద్భక్తి నిష్ఠ, దాని తర్వాత తత్వజ్ఞాననిష్ఠా, అవిద్య మొదలగునవి తొలగిపోవుటచేత ఈ జ్ఞాననిష్ఠయొక్క ఉత్కృష్టమైన ఫలము నిరంకుశమైన జీవన్ముక్తి. ఇది సమత్వము మొదలగు వాటితోకూడియుండి, ప్రారబ్దకర్మఫలము ననుభవించుట పూర్తియగువరకు ఉండును. ఈ జీవన్ముక్తి అంతమందు మాటలచేత చెప్పనలవికాని విదేహముక్తి కలుగును).

Transliteration
  1. vidēha mukti lakṣaṇaṃ prapaṃca pratīti śūnyatyēsati pratyakcaitanyātmanā vartanaṃ -

(prapaṃcamanunadi lēka, tānu pratyakcaitanyamē ani aṭlu bhāviṃcuṭa.)

  1. upādhi nirmukta ghaṭākāśava tprārabda kṣayāt vidēha muktiḥ (muktikōpaniṣat)

(kuṃḍalōnuṃḍu ākāśamu kuṃḍa citikipōyina tarvāta upādhi lēnidai - tānuṃḍuṭaku vastuvu lēnidai - mahākāśamulō kaliyunu - aṭlē prārabda karma - phalamuniccuṭaku prāraṃbhiṃcina karma - kṣīṇiṃcaganē - ivvavalasina phalamu pūrtigā niccina tarvāta - vidēhamukti kalugunu).

  1. dēhamulēni sthiti. sthūladēhamu lēkapōvuṭacēta karmānubhavamulēni sthiti.

  2. ikamīdaṭa dēhamu poṃduṭa lēdu - janmiṃcuṭa uṃḍadu anu sthiti.

  3. dēhamu paḍipōyinatarvāta - dēhamu naśiṃcina tarvāta parabrahmatō kalugu aikyamu -

  4. jīvunaku - bhagavadaṃśaku - dēhamu anu upādhi lēka - lēkuṃḍunaṭlu cēsukoni - nirākāra parabrahmatō aikyamaguṭa -

  5. dēhamē tāni anu ajñānamu viḍiciyuṃḍuṭē vidēha mukti.

  6. adhikāra puruṣāṇāṃ utpanna tatva jñānānāṃ iṃdrādīnāṃ dēhadhāraṇānupapattimā śaṃkya adikārāpādaka prārabda karma samāptyanaṃtaraṃ vidēha kaivalyamiti siddhāṃti taṃ - taduktamācārya vācaspati miśrē –

“upāsanādi saṃsiddhatōṣi tēśvara bōdhitaṃ |

adhikāraṃ samāpyaitē praviśaṃti paraṃ padaṃ ||“.

(brahmajñānamunaku adhikārulai, tatvajñānamunu poṃdinavāraina iṃdruḍu modalaguvāriki dēhamu kaladā lēdā anu śaṃka lēkuṃḍuṭakai prārabda karma samāpti ayina tarvātanē - phalamuniccuṭa kāraṃbhamucēsina karma tānu anibhaviṃpa cēyavalasina phalamu pūrtigā anubhaviṃpa cēsina tarvātanē vidēhamukti ani siddhāṃtamu cēyabaḍinadi).

  1. jñāna vijñāna śabdābhyāṃ tatphalaṃ muktirucyatē |

sādvidhāsti sadēhō, vidēhānyēti tatraca |

utpannē tatva vijñānē sākṣātkārā parābhidhā |

avaśyaṃ sa bhavēnmuktō dēha pātā danaṃtaraṃ |. (gītābhāvaprakāśamu - 3 - 292; 293)

(jñāna vijñānamulavalana muktiyani ceppabaḍinadi. mukti reṃḍu vidhamulu - dēhamutō mukti (kaṭṭetō kailāsamu), dēhamu lēkuṃḍa mukti - brahmasākṣātkāramu poṃduṭē yagu tatvajñānamu kalugaganē, dēhamu naśiṃcuganē mukti kalugunu -).

  1. “niṣkāma karma niṣṭhādau satvaśuddhistataḥ paraṃ |

tataśca karma sanyāsō vairāgyādi purassaraḥ |

tatō vēdāṃta vākyānāṃ vicārasahitā sahitā parā |

bhagavadbhakti niṣṭhāsyātpuruṣārthaika janmabhūḥ |

tatasta tvaikya vijñāna niṣṭhā tasyāḥ paraṃ phalaṃ |

avidyādi nivṛttyāsyā jjīvanmukti rniraṃkuśā |

prārabda bhōga paryaṃtā samatā dyairalaṃkṛtā |

tadutēsyā dvidēhākhyā muktirvā cāmagōcarā ||“. (gītābhāvaprakāśamu - 1 - 51 to 54)

(vidēhamukti kalugu kramamu ī kriṃda ceppabaḍinadi - modaṭa niṣkāmakarmaniṣṭha, dāni tarvāta satva śuddhi, dāni tarvāta vairāgyamu modalagu vānitō prāraṃbhiṃcina karma sanyāsamu. aṭu tarvāta puruṣārthamulaku janmabhūmi ayinaṭuvaṃṭinnī, upaniṣadvākyamula vicāraṇatō kūḍiyunna bhagavadbhakti niṣṭha, dāni tarvāta tatvajñānaniṣṭhā, avidya modalagunavi tolagipōvuṭacēta ī jñānaniṣṭhayokka utkṛṣṭamaina phalamu niraṃkuśamaina jīvanmukti. idi samatvamu modalagu vāṭitōkūḍiyuṃḍi, prārabdakarmaphalamu nanubhaviṃcuṭa pūrtiyaguvaraku uṃḍunu. ī jīvanmukti aṃtamaṃdu māṭalacēta ceppanalavikāni vidēhamukti kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.