← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విద్వాన్ vidvān

Original — తెలుగు
  1. విద్వంసుడు

  2. వేత్తీతి విద్వాన్, అభిజ్ఞః -

(తెలుసుకొనినవాడు - అంతయు తెలిసినవాడు)

  1. వివేకీ; తత్వవిత్.

(వివేకము కలవాడు, - మంచి చెడ్డలను, ఆత్మ అనాత్మలను తెలిసినవాడు - ఆత్మ తత్వమును, పరమార్థతత్వమును తెలిసినవాడు)

  1. ఆత్మవిత్, తత్వజ్ఞానవాన్ -

(ఆత్మజ్ఞానము కలవాడు; తత్వమును తెలిసినవాడు, ఆత్మతత్వమును తెలిసినవాడు)

  1. జ్ఞాని శ్రేష్టః - (జ్ఞానులలో శ్రేష్టుడు)

  2. సారాసార విచార చతురః - జ్ఞానవా నిత్యర్థః -

(సారము గలది, సారము లేనిది; ఆత్మ, అనాత్మ అను విచారము చేయుటలో నిపుణుడు - అట్టి జ్ఞానము కలవాడు).

  1. “సర్వాంతరస్థ స్వ సంవిద్రూపవిద్, విద్వాన్” (నిరాలంబనోపనిషత్)

(బ్రహ్మ మొదలు గడ్డిపోచవరకు గల అన్నింటిలోపల నుండు సంవిద్రూపుడైన భగవంతుని తెలుసుకొనినవాడు. భగవంతుడు సర్వాంతర్యామి యను జ్ఞానము కలవాడు)

  1. ప్రకృతి పురుషేశ్వర యాధాత్మ్యవిత్.

(ప్రకౄతి, పురుషుడు, ఈశ్వరుడు అను ఈ మూడు తత్వముల (తత్వత్రయము) యాధాత్మ్యమును - యధార్థమును తెలిసినవాడు).

  1. భగవత్ప్రసాదలబ్ద సర్వార్ధ సాక్షాత్కార శాలీ.

(భగవంతుని దయవలన కలిగిన సర్వార్థములను సాక్షాత్కరించుకో కలిగిన స్వభావము కలవాడు).

  1. ఆత్మ విదుడై సంసార నాశము తలచినవాడె విద్వాంసుడు (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - )

  2. యస్తు సర్వజ్ఞోపి మూఢ మానీ భవతి, స ఏవ విద్వానితి వివేకః.

(అన్నియు తెలిసినవాడైనను ఏమియు తెలియనివానివలె - మూఢునివలె - నుండువాడు)

  1. న శిల్పాది జ్ఞాన యుక్తే విద్వచ్ఛబ్దోభి జాయతే |

మోక్షైక హేతుర్విద్వావాన్ యస్స విద్వాని తీర్యతే ||.

(శిల్పము మొదలగు వాటి గుఱించి అయిన జ్ఞానము గలవాడు విద్వాంసుడుకాడు. మోక్షమునకు ఒకే కారణమైన విద్యగలవాడు - బ్రహ్మ విద్య గలవాడు - బ్రహ్మజ్ఞానము గలవాడు విద్వాన్సుడని చెప్పబడుచున్నాడు)

  1. “సక్తాః కర్మణ్య విద్వాంసో యధా కుర్వంతి భారత |

కుర్యాద్విద్వాం స్తథా (అ)సక్తశ్చి కూర్షుర్లోక సంగ్రహః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 25)

(అజ్ఞానులు కర్మలందాసక్తి కలిగి వాటిని ఎట్లు చేయుదురో విద్వాంసులు వాటియందాసక్తిలేక లోకసంగ్రహము నిమిత్తము వాటిని చేయ వలయును).

  1. “స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః |

స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే ||“.

(మూర్ఖుడు తన యింటిలోనే పూజింపబడును - ప్రభువు తన గ్రామములోనే పూజింపబడును - కాని విద్వాన్సుడు ఏ దేశమేగినను ఎక్కడనున్నను పూజింపబడును - గౌరవించబడును).

Transliteration
  1. vidvaṃsuḍu

  2. vēttīti vidvān, abhijñaḥ -

(telusukoninavāḍu - aṃtayu telisinavāḍu)

  1. vivēkī; tatvavit.

(vivēkamu kalavāḍu, - maṃci ceḍḍalanu, ātma anātmalanu telisinavāḍu - ātma tatvamunu, paramārthatatvamunu telisinavāḍu)

  1. ātmavit, tatvajñānavān -

(ātmajñānamu kalavāḍu; tatvamunu telisinavāḍu, ātmatatvamunu telisinavāḍu)

  1. jñāni śrēṣṭaḥ - (jñānulalō śrēṣṭuḍu)

  2. sārāsāra vicāra caturaḥ - jñānavā nityarthaḥ -

(sāramu galadi, sāramu lēnidi; ātma, anātma anu vicāramu cēyuṭalō nipuṇuḍu - aṭṭi jñānamu kalavāḍu).

  1. “sarvāṃtarastha sva saṃvidrūpavid, vidvān” (nirālaṃbanōpaniṣat)

(brahma modalu gaḍḍipōcavaraku gala anniṃṭilōpala nuṃḍu saṃvidrūpuḍaina bhagavaṃtuni telusukoninavāḍu. bhagavaṃtuḍu sarvāṃtaryāmi yanu jñānamu kalavāḍu)

  1. prakṛti puruṣēśvara yādhātmyavit.

(prakṝti, puruṣuḍu, īśvaruḍu anu ī mūḍu tatvamula (tatvatrayamu) yādhātmyamunu - yadhārthamunu telisinavāḍu).

  1. bhagavatprasādalabda sarvārdha sākṣātkāra śālī.

(bhagavaṃtuni dayavalana kaligina sarvārthamulanu sākṣātkariṃcukō kaligina svabhāvamu kalavāḍu).

  1. ātma viduḍai saṃsāra nāśamu talacinavāḍe vidvāṃsuḍu (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - )

  2. yastu sarvajñōpi mūḍha mānī bhavati, sa ēva vidvāniti vivēkaḥ.

(anniyu telisinavāḍainanu ēmiyu teliyanivānivale - mūḍhunivale - nuṃḍuvāḍu)

  1. na śilpādi jñāna yuktē vidvacchabdōbhi jāyatē |

mōkṣaika hēturvidvāvān yassa vidvāni tīryatē ||.

(śilpamu modalagu vāṭi guṟiṃci ayina jñānamu galavāḍu vidvāṃsuḍukāḍu. mōkṣamunaku okē kāraṇamaina vidyagalavāḍu - brahma vidya galavāḍu - brahmajñānamu galavāḍu vidvānsuḍani ceppabaḍucunnāḍu)

  1. “saktāḥ karmaṇya vidvāṃsō yadhā kurvaṃti bhārata |

kuryādvidvāṃ stathā (a)saktaści kūrṣurlōka saṃgrahaḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 25)

(ajñānulu karmalaṃdāsakti kaligi vāṭini eṭlu cēyudurō vidvāṃsulu vāṭiyaṃdāsaktilēka lōkasaṃgrahamu nimittamu vāṭini cēya valayunu).

  1. “svagṛhē pūjyatē mūrkhaḥ svagrāmē pūjyatē prabhuḥ |

svadēśē pūjyatē rājā vidvān sarvatra pūjyatē ||“.

(mūrkhuḍu tana yiṃṭilōnē pūjiṃpabaḍunu - prabhuvu tana grāmamulōnē pūjiṃpabaḍunu - kāni vidvānsuḍu ē dēśamēginanu ekkaḍanunnanu pūjiṃpabaḍunu - gauraviṃcabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.