“క. అగుణుండగు పరమేశుడు
జగములు కల్పించుకొఱకు జతురత మాయా
సగుణుణ్డగు, గావున హరి
భగవంతుడనగబరగె, భవ్య చరిత్రా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)
కావున ప్రారంభ స్థితిలో సాధనకు దేవాలయములు, విగ్రహారాధనలు అత్యావశ్యకములు.
” వ. సంసార ప్రవిష్టుండైనవానికి దపో యోగదులైన మోక్షమార్గంబులు పెక్కు గలవు - అందు భక్తిమార్గంబుకంటె సులభంబు లేదు“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)
భక్తి మార్గమునకు భగవంతుని సగుణరూపమును ధ్యానించవలెను.
“మ. విను మంభోజ భవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మారు నె
మ్మనమందుం దలపోసి యంతయు బరామర్శించి మోక్షంబు ద
క్కిన మార్గంబున లేదటంచు భక్తిం జింతసేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వికారుడగుచున్ దన్మార్గ నిర్ణేతయై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 35)
వ్వారును లేరు, తండ్రి; భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళులు దాత్తమతిం గొనియాడకుండినన్
జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 211)
(నిర్గుణ బ్రహ్మోపాసన చేయుట యందధికారము లేనివారు ఎల్లపుడు సగుణ బ్రహ్మను మనసులో ధ్యానించవలెను).
“సగుణ బ్రహ్మ ధ్యానాసక్తానాం అశక్తి తారతమ్యేన ప్రథమం ప్రతిమాదౌ బాహ్యే భగవత్ ధ్యానాభ్యాసః తదశక్తే భాగవత ధర్మానుష్ఠానం, తదశక్తే సర్వకర్మఫల త్యాగః ఇతిత్రీణి సాధనాని విదత్తే”
(సగుణ బ్రహ్మోపాసన చేయలేనివారికి వారి వారి అశక్తి తారతమ్యమును బట్టి - హెచ్చు తగ్గులను బట్టి - మొదట బాహ్యముగా - పైకి - భగవంతుని ప్రతిమయందు - విగ్రహమందు - ధ్యానము చేయుట అభ్యాసము చేసుకోవలయును. అందుకు శక్తి లేనియడల భాగవత ధర్మములను - భగవద్భక్తుల ధర్మములను - పాటించవలెను. అది కూడ చేయుటకు శక్తి లేనివారికి వారు చేయు అన్ని కర్మల ఫలమును వదలివేయుట - అను నీ మూడు సాధనములు విధించబడినవి.)
“వ. చరాచరంబైన విశ్వమంతయు విష్ణుమయం బగుటం జేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రయని పలుకుదురు - - - అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండపాదపంబునకు నారాయణుండు మూలంబు - - - ఋషి నర తిర్యగమర శరీరంబులు పురంబులు. వానియందు తారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడైన హరి వర్తించుటం జేసి పురుషుండన ప్రసిద్ధుండయ్యె. అందు తిర్యగ్జాతులకంటె నధికత్వంబు పురుషునియందు విలసిల్లుటం జేసి పురుషుండు పాత్రంబు. పురుషులలోని హరి తనువైన వేదంబు నుద్ధరింపుచు సంతోష విద్యా గరిష్టుండైన యోగి ముఖ్య పాత్రంబని పలుకుదురు. పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకు బూజనార్థంబు త్రేతాయుగంబునందు హరి ప్రతిమలు గల్పింబ బడియె. కొందఱు ప్రతిమార్చనంబు జేయుదురు. పురుషద్వేషులైనవారలకు నట్టి ప్రతిమార్చనంబు పురుషార్థంబగు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 453)
(పామరులైనవారికి, బ్రహ్మజ్ఞానము లేనివారికి నిర్గుణోపాసన ఆవశ్యకముగావున వారికి సగుణోపాసనయైన విగ్రహారాధన చెప్పబడియున్నది.)
“ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” (శ్రీమద్భాగవతము -)
పూజా విగ్రహములు చూచువారికి శిల్ప విన్యాస సుందరమనోహరముగ కన్పట్టినను, భావించు వారికి సృష్టితత్వ ప్రతిపాదకమై యొప్పును. అన్వేషించువారికి హృదయ గుహాంతర్వర్తియగు పరమాత్మ దర్శనమబ్బును.
మనోమయీ మణిమయీ ప్రతిమాష్ట నిధాః స్మృతాః||“.
(భగవంతుని విగ్రహములు - ప్రతిమలు - ఱాయితోనైనను, కఱ్ఱతోనైనను, లోహముతోనైనను మట్టితోనైనను, దేనిమీదైనను చెక్కినదైనను, వ్రాసినదైనను, ఇసుకతోనైనను మణులతోనైనను మనసులోనైనను చేసుకొనవచ్చును - ఉపాసకుని యిచ్చ ననుసరించియు, ధనసంపదను బట్టియు, అభిరుచిని బట్టియు విగ్రహములను చేయించుకొనవచ్చును –
“యస్త్వవ్యః కర్మ యోగ స్తవ భజన మయస్తత్ర చాభీష్ట మూర్తిం |
హృద్యాం సత్వైకరూపాం దృషది హృది మృదిక్వాపి వా భావయిత్వా |
పుష్పై ర్గంధైర్నివేద్యై రపి చ విరచితై శ్శక్తితో భక్తి పూతైర్నిత్యం వర్యాం స పర్యాం |
విదధ దయి విభోత్వత్ప్రసాదం భజేయం ||” (నారాయణీయము - 92)
(నీ భజన రూపమే అయిన కర్మయోగముననుసరించి నా కిష్టమైన నీ సత్వరూపమును, నా హృదయమందు భావించుకొని, అదిమట్టితో చేసినదైనను, దానిని యధా శక్తి భక్తితోను, పుష్పములతోను, గంధములతోను, నైవేద్యముతోను, నిత్యము సేవ చేసుకొనుచుందును - నీ కరుణ సంపాదించుకొనెదను)
(పల్లెలలో అమ్మవారి గుడిలో ఱాయితోగాని, కర్రతోగాని చేసిన విగ్రహముండును - పిల్లలు కర్రతోను, ఱాయితోను భగవంతుని విగ్రహమును ఆటలాడుచు సేవించెదరు - ధనవంతులు వారివారి శక్తిని బట్టి విగ్రహములను లోహముతో బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, రాగితోను చేయించుకొనెదరు - వినాయక చవితినాడు వినాయకుని విగ్రహము మొదలగువాటిని మట్తితో చేయుటయు, రామేశ్వరములో యిసుకతో విగ్రహము చేయుటయు కలదు. వస్తువేదైనను దానితో చేసిన పరమాత్మ రూపమునే భజించెదరు గాని ఆ వస్తువును, బంగారమునుకాని, వెండినికాని, భజించరు - అందుచేత అట్లు భజనచేయు విగ్రహమందు భక్తి సలుపుదురుగాన ఆ వస్తువు దేనితో చేయించబడినదను విషయము ముఖ్యముకాదు. అది భగవంతుని రూపము. ప్రతిమ భగవంతునికి ప్రతిగా, మారుగా, బదులుగా వాడుచున్నామన్న భావన ఉండవలెను. కొన్ని కొన్ని వస్తువులలోను, వ్యక్తులలోను పరమాత్మ విశేషముగ వ్యక్తుండగును - ఈ విషయమే శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో విభూతి యోగములో చెప్పియున్నాడు –
“అధవా బహు నైతేన కిం జ్ఞాతేన తవార్జున |”
“యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా |
తత్త దేవావగచ్ఛత్వం మము తేజోంశ సంభవం ||“. (శ్రీమద్భగవద్గీత -10-41)
(నావిభూతులైన పదార్థములలో దేనిలో విశేషముగా నా శక్తి యున్నదో దానిని నా తేజస్సు యొక్క అంశయే యని తెలుసుకొనుము - అన్నింటిలోను భగవదంశ యున్నను అది వ్యక్తముకాదు - కొన్నింటిలో విశేషముగా నున్నట్లు స్పష్టపడును –
“అఖిల భూతములందు ఆత్మ రూపంబున ఈశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు |
బుద్ధ్యాది లక్షణంబుల గానబడును - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 36)
“మరుగేలరా, ఓ రాఘవ, మరుగేల చరాచర రూప - - -
అన్ని నీవనుచు నంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్య - - - ” (త్యాగరాజు)
దేవతా ప్రతిమలను ఆయా మంత్ర, యంత్ర విధానములతో ప్రతిష్ఠా తంత్రము నడపబడి, మూర్తియందు దైవశక్తి నిక్షేపింపబడుచున్నది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క యంత్రము, మంత్రము, నియమితమై యుండును. శిల్పాచార్యుడు ఈ యంత్రమును యజమానుని శక్తిని బట్టి బంగారు మున్నగు వానియందు చెక్కి నియమిత మంత్రముతో సుదీక్షుతుడై జపము సలిపి యంత్రమును ఆ విగ్రహముక్రింద స్థాపించి, దానిపై విగ్రహమును ప్రతిష్టింపవలయును. పవిత్ర వైదిక విధానముతో దృష్టినిడి ప్రాణప్రతిష్ట చేసినయడల ఆ విగ్రహము అఖండ శక్తియుక్తమై ఆరాధికుల కామితార్థములను సంపాదించును“.
“భారతీయుల అక్షర సమామ్నాయము అర్థవంతమును, మహిమోపేతమును అయినది. ప్రకృతిలోని శక్తులను పరమేశ్వరునిలోని మహిమలను కైవశము చేసుకొనుటకు తగిన బీజాక్షరములను మహర్షులు కనిపెట్టి శాస్త్ర పేటికలో భద్రపఱచినారు - - - ఆ బీజముల సంపుటీకరణముతో ఏర్పడిన మంత్రజాలమును అట్టిదే - - - దేవాలయమునందలి మూర్తుల ఉపాసనలో శబ్దతత్వము - మంత్రతత్వము, రూపమహిమ, రెండునూ ఐక్యమందినవి -”
“స్థాపకస్య తపో యోగాత్ పూజాయాశ్చాతి శాయనాత్ |
ఆభిరూప్యాచ్చ బింబస్య సదా సన్నిహితో స్మ్యహం ||“. (బ్రహ్మాండపురాణము)
(విగ్రహమును ప్రతిష్ట చేసిన మహానుభావుని తపశ్సక్తివలనను, ఆ దేవాలయముగా శాస్త్రోక్తముగా జరుగు పూజల అతిశయము చేతను, శిల్ప లక్షణ సమన్వితంబైన విగ్రహ సౌందర్యముచేతను భగవంతుడా విగ్రహములో సాన్నిధ్యం చేసి భక్తుల కోరికలను తీర్చుచుండును అని భగవంతుని వచనము).
ఆలస్యాఖ్యం చతుర్థంచ నిద్రారూపం తు పంచమం |
షష్టతు విరతిర్భ్రాంతిః సప్తమం పరికీర్తితం |
విషమం చాష్టమం చైవ అనాఖ్యం నవమం స్మృతం |
అలబ్దిర్యోగ తత్వస్య దశమం ప్రోచ్యతే బుధైః |
ఇత్యేతద్విఘ్నదశకం విచారేణ త్యజేత్ బుధః ||“.
(విఘ్నము, సంశయము, ప్రమత్తతి, ఆలస్యము, నిద్ర, విరతి, భ్రాంతి, విషయము, అనాఖ్యము, అలబ్ది - ఈ పదియును యోగమునకు విఘ్నములు. వీటిని యోగియగువాడు విడిచి పెట్టవలెను -).
“ka. aguṇuṃḍagu paramēśuḍu
jagamulu kalpiṃcukoṟaku jaturata māyā
saguṇuṇḍagu, gāvuna hari
bhagavaṃtuḍanagabarage, bhavya caritrā” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)
kāvuna prāraṃbha sthitilō sādhanaku dēvālayamulu, vigrahārādhanalu atyāvaśyakamulu.
” va. saṃsāra praviṣṭuṃḍainavāniki dapō yōgadulaina mōkṣamārgaṃbulu pekku galavu - aṃdu bhaktimārgaṃbukaṃṭe sulabhaṃbu lēdu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)
bhakti mārgamunaku bhagavaṃtuni saguṇarūpamunu dhyāniṃcavalenu.
“ma. vinu maṃbhōja bhavuṃḍu munnu madilō vēdaṃbu mummāru ne
mmanamaṃduṃ dalapōsi yaṃtayu barāmarśiṃci mōkṣaṃbu da
kkina mārgaṃbuna lēdaṭaṃcu bhaktiṃ jiṃtasēsen janā
rdanu nātmākṛti nirvikāruḍagucun danmārga nirṇētayai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 35)
vvārunu lēru, taṃḍri; bhagavaṃtu nanaṃtuni viśvabhāvanō
dāruni sadguṇāvaḷulu dāttamatiṃ goniyāḍakuṃḍinan
jēravu cittamul prakṛti ceṃdani nirguṇamaina brahmamun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 211)
(nirguṇa brahmōpāsana cēyuṭa yaṃdadhikāramu lēnivāru ellapuḍu saguṇa brahmanu manasulō dhyāniṃcavalenu).
“saguṇa brahma dhyānāsaktānāṃ aśakti tāratamyēna prathamaṃ pratimādau bāhyē bhagavat dhyānābhyāsaḥ tadaśaktē bhāgavata dharmānuṣṭhānaṃ, tadaśaktē sarvakarmaphala tyāgaḥ ititrīṇi sādhanāni vidattē”
(saguṇa brahmōpāsana cēyalēnivāriki vāri vāri aśakti tāratamyamunu baṭṭi - heccu taggulanu baṭṭi - modaṭa bāhyamugā - paiki - bhagavaṃtuni pratimayaṃdu - vigrahamaṃdu - dhyānamu cēyuṭa abhyāsamu cēsukōvalayunu. aṃduku śakti lēniyaḍala bhāgavata dharmamulanu - bhagavadbhaktula dharmamulanu - pāṭiṃcavalenu. adi kūḍa cēyuṭaku śakti lēnivāriki vāru cēyu anni karmala phalamunu vadalivēyuṭa - anu nī mūḍu sādhanamulu vidhiṃcabaḍinavi.)
“va. carācaraṃbaina viśvamaṃtayu viṣṇumayaṃ baguṭaṃ jēsi pātra nirṇaya nipuṇulaina vidvāṃsulu nārāyaṇuṃḍu mukhyapātrayani palukuduru - - - anēka jaṃtu saṃghāta saṃkīrṇaṃbaina brahmāṃḍapādapaṃbunaku nārāyaṇuṃḍu mūlaṃbu - - - ṛṣi nara tiryagamara śarīraṃbulu puraṃbulu. vāniyaṃdu tāratamyaṃbulatōḍa jīvarūpaṃbuna bhagavaṃtuḍaina hari vartiṃcuṭaṃ jēsi puruṣuṃḍana prasiddhuṃḍayye. aṃdu tiryagjātulakaṃṭe nadhikatvaṃbu puruṣuniyaṃdu vilasilluṭaṃ jēsi puruṣuṃḍu pātraṃbu. puruṣulalōni hari tanuvaina vēdaṃbu nuddhariṃpucu saṃtōṣa vidyā gariṣṭuṃḍaina yōgi mukhya pātraṃbani palukuduru. paraspara pātraṃbulaku sahiṃpani manuṣyulaku būjanārthaṃbu trētāyugaṃbunaṃdu hari pratimalu galpiṃba baḍiye. koṃdaṟu pratimārcanaṃbu jēyuduru. puruṣadvēṣulainavāralaku naṭṭi pratimārcanaṃbu puruṣārthaṃbagu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 453)
(pāmarulainavāriki, brahmajñānamu lēnivāriki nirguṇōpāsana āvaśyakamugāvuna vāriki saguṇōpāsanayaina vigrahārādhana ceppabaḍiyunnadi.)
“ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu” (śrīmadbhāgavatamu -)
pūjā vigrahamulu cūcuvāriki śilpa vinyāsa suṃdaramanōharamuga kanpaṭṭinanu, bhāviṃcu vāriki sṛṣṭitatva pratipādakamai yoppunu. anvēṣiṃcuvāriki hṛdaya guhāṃtarvartiyagu paramātma darśanamabbunu.
manōmayī maṇimayī pratimāṣṭa nidhāḥ smṛtāḥ||“.
(bhagavaṃtuni vigrahamulu - pratimalu - ṟāyitōnainanu, kaṟṟatōnainanu, lōhamutōnainanu maṭṭitōnainanu, dēnimīdainanu cekkinadainanu, vrāsinadainanu, isukatōnainanu maṇulatōnainanu manasulōnainanu cēsukonavaccunu - upāsakuni yicca nanusariṃciyu, dhanasaṃpadanu baṭṭiyu, abhirucini baṭṭiyu vigrahamulanu cēyiṃcukonavaccunu –
“yastvavyaḥ karma yōga stava bhajana mayastatra cābhīṣṭa mūrtiṃ |
hṛdyāṃ satvaikarūpāṃ dṛṣadi hṛdi mṛdikvāpi vā bhāvayitvā |
puṣpai rgaṃdhairnivēdyai rapi ca viracitai śśaktitō bhakti pūtairnityaṃ varyāṃ sa paryāṃ |
vidadha dayi vibhōtvatprasādaṃ bhajēyaṃ ||” (nārāyaṇīyamu - 92)
(nī bhajana rūpamē ayina karmayōgamunanusariṃci nā kiṣṭamaina nī satvarūpamunu, nā hṛdayamaṃdu bhāviṃcukoni, adimaṭṭitō cēsinadainanu, dānini yadhā śakti bhaktitōnu, puṣpamulatōnu, gaṃdhamulatōnu, naivēdyamutōnu, nityamu sēva cēsukonucuṃdunu - nī karuṇa saṃpādiṃcukonedanu)
(pallelalō ammavāri guḍilō ṟāyitōgāni, karratōgāni cēsina vigrahamuṃḍunu - pillalu karratōnu, ṟāyitōnu bhagavaṃtuni vigrahamunu āṭalāḍucu sēviṃcedaru - dhanavaṃtulu vārivāri śaktini baṭṭi vigrahamulanu lōhamutō baṃgāramutōnu, veṃḍitōnu, ittaḍitōnu, rāgitōnu cēyiṃcukonedaru - vināyaka cavitināḍu vināyakuni vigrahamu modalaguvāṭini maṭtitō cēyuṭayu, rāmēśvaramulō yisukatō vigrahamu cēyuṭayu kaladu. vastuvēdainanu dānitō cēsina paramātma rūpamunē bhajiṃcedaru gāni ā vastuvunu, baṃgāramunukāni, veṃḍinikāni, bhajiṃcaru - aṃducēta aṭlu bhajanacēyu vigrahamaṃdu bhakti salupudurugāna ā vastuvu dēnitō cēyiṃcabaḍinadanu viṣayamu mukhyamukādu. adi bhagavaṃtuni rūpamu. pratima bhagavaṃtuniki pratigā, mārugā, badulugā vāḍucunnāmanna bhāvana uṃḍavalenu. konni konni vastuvulalōnu, vyaktulalōnu paramātma viśēṣamuga vyaktuṃḍagunu - ī viṣayamē śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō vibhūti yōgamulō ceppiyunnāḍu –
“adhavā bahu naitēna kiṃ jñātēna tavārjuna |”
“yadyadvibhūti matsatvaṃ śrīmadūrjitamēvavā |
tatta dēvāvagacchatvaṃ mamu tējōṃśa saṃbhavaṃ ||“. (śrīmadbhagavadgīta -10-41)
(nāvibhūtulaina padārthamulalō dēnilō viśēṣamugā nā śakti yunnadō dānini nā tējassu yokka aṃśayē yani telusukonumu - anniṃṭilōnu bhagavadaṃśa yunnanu adi vyaktamukādu - konniṃṭilō viśēṣamugā nunnaṭlu spaṣṭapaḍunu –
“akhila bhūtamulaṃdu ātma rūpaṃbuna īśuṃḍu hari yuṃḍu nella proddu |
buddhyādi lakṣaṇaṃbula gānabaḍunu - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 36)
“marugēlarā, ō rāghava, marugēla carācara rūpa - - -
anni nīvanucu naṃtaraṃgamuna tinnagā vetaki telusukoṃṭinayya - - - ” (tyāgarāju)
dēvatā pratimalanu āyā maṃtra, yaṃtra vidhānamulatō pratiṣṭhā taṃtramu naḍapabaḍi, mūrtiyaṃdu daivaśakti nikṣēpiṃpabaḍucunnadi. okkokka dēvataku okkokka yaṃtramu, maṃtramu, niyamitamai yuṃḍunu. śilpācāryuḍu ī yaṃtramunu yajamānuni śaktini baṭṭi baṃgāru munnagu vāniyaṃdu cekki niyamita maṃtramutō sudīkṣutuḍai japamu salipi yaṃtramunu ā vigrahamukriṃda sthāpiṃci, dānipai vigrahamunu pratiṣṭiṃpavalayunu. pavitra vaidika vidhānamutō dṛṣṭiniḍi prāṇapratiṣṭa cēsinayaḍala ā vigrahamu akhaṃḍa śaktiyuktamai ārādhikula kāmitārthamulanu saṃpādiṃcunu”.
“bhāratīyula akṣara samāmnāyamu arthavaṃtamunu, mahimōpētamunu ayinadi. prakṛtilōni śaktulanu paramēśvarunilōni mahimalanu kaivaśamu cēsukonuṭaku tagina bījākṣaramulanu maharṣulu kanipeṭṭi śāstra pēṭikalō bhadrapaṟacināru - - - ā bījamula saṃpuṭīkaraṇamutō ērpaḍina maṃtrajālamunu aṭṭidē - - - dēvālayamunaṃdali mūrtula upāsanalō śabdatatvamu - maṃtratatvamu, rūpamahima, reṃḍunū aikyamaṃdinavi -”
“sthāpakasya tapō yōgāt pūjāyāścāti śāyanāt |
ābhirūpyācca biṃbasya sadā sannihitō smyahaṃ ||“. (brahmāṃḍapurāṇamu)
(vigrahamunu pratiṣṭa cēsina mahānubhāvuni tapaśsaktivalananu, ā dēvālayamugā śāstrōktamugā jarugu pūjala atiśayamu cētanu, śilpa lakṣaṇa samanvitaṃbaina vigraha sauṃdaryamucētanu bhagavaṃtuḍā vigrahamulō sānnidhyaṃ cēsi bhaktula kōrikalanu tīrcucuṃḍunu ani bhagavaṃtuni vacanamu).
ālasyākhyaṃ caturthaṃca nidrārūpaṃ tu paṃcamaṃ |
ṣaṣṭatu viratirbhrāṃtiḥ saptamaṃ parikīrtitaṃ |
viṣamaṃ cāṣṭamaṃ caiva anākhyaṃ navamaṃ smṛtaṃ |
alabdiryōga tatvasya daśamaṃ prōcyatē budhaiḥ |
ityētadvighnadaśakaṃ vicārēṇa tyajēt budhaḥ ||“.
(vighnamu, saṃśayamu, pramattati, ālasyamu, nidra, virati, bhrāṃti, viṣayamu, anākhyamu, alabdi - ī padiyunu yōgamunaku vighnamulu. vīṭini yōgiyaguvāḍu viḍici peṭṭavalenu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.