← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విహితకర్మ vihitakarma

Original — తెలుగు
  1. వేదచోదితం కర్మ.

(చేయవలసినదని వేదములో చెప్పబడిన కర్మ)

  1. శ్రుతి స్మృతి విహితం కర్మ.

(శ్రుతులలోను - వేదములలోను - పురాణ ఇతిహాసములలోను చేయవలసినదని విధించబడిన కర్మ - యజ్ఞయాగాదులు).

  1. పురుష ప్రవృత్తిం అధికృత్య యత్ వేదేన విధీయతే తద్విహితం. విహితం కర్మ చతుర్విధం - నిత్యం, నైమిత్తికం, కామ్యం, ప్రాయశ్చిత్తం చ ఇతి.

(పురుషుని ప్రవృత్తి నిమిత్తము వేదముచేత భోధించినది విహితము - విహితకర్మ నాలుగు విధములు - నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యము, ప్రాయశ్చిత్తము).

  1. “వ. - - - ద్విజునకు యజన యాజనాధ్యయనా ధ్యాసన దాన ప్రతిగ్రహములు అను షట్కర్మంబులు విహితంబులు; రాజునకు ప్రతిగ్రహ వ్యతిరిక్తంబులయిన యజనాది కర్మంబులైనను, ప్రజాపాలనంబును, బ్రాహ్మణులుగానివారివలన దండశుల్కాదులు గొనుటయి విహితకర్మంబులు. వైశ్యునికి కృషి వాణిజ్య గో రక్షణాది కర్మంబులు, బ్రాహ్మణకులానుసరణంబును విహితంబులు, శూద్రునకు ద్విజ సుశ్రూష సేయవలయు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 409)

  2. సత్యమాడుట, ఇంద్రియములను జయించుట, దైవభక్తి కలిగియుండుట, పరులకు మేలొనర్చుట మున్నగునవి విహితకర్మలు –

  3. “ఆ. వ్రతము మానదగదు వడుగు గుఱ్ఱనికిని

గ్రియలు మానదగదు గృహగతునికి

దపసికూర నుండ దగదు; సన్యాసికి

దరుణితోడి పొత్తు తగద్య్ తగదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 463)

Transliteration
  1. vēdacōditaṃ karma.

(cēyavalasinadani vēdamulō ceppabaḍina karma)

  1. śruti smṛti vihitaṃ karma.

(śrutulalōnu - vēdamulalōnu - purāṇa itihāsamulalōnu cēyavalasinadani vidhiṃcabaḍina karma - yajñayāgādulu).

  1. puruṣa pravṛttiṃ adhikṛtya yat vēdēna vidhīyatē tadvihitaṃ. vihitaṃ karma caturvidhaṃ - nityaṃ, naimittikaṃ, kāmyaṃ, prāyaścittaṃ ca iti.

(puruṣuni pravṛtti nimittamu vēdamucēta bhōdhiṃcinadi vihitamu - vihitakarma nālugu vidhamulu - nityakarma, naimittika karma, kāmyamu, prāyaścittamu).

  1. “va. - - - dvijunaku yajana yājanādhyayanā dhyāsana dāna pratigrahamulu anu ṣaṭkarmaṃbulu vihitaṃbulu; rājunaku pratigraha vyatiriktaṃbulayina yajanādi karmaṃbulainanu, prajāpālanaṃbunu, brāhmaṇulugānivārivalana daṃḍaśulkādulu gonuṭayi vihitakarmaṃbulu. vaiśyuniki kṛṣi vāṇijya gō rakṣaṇādi karmaṃbulu, brāhmaṇakulānusaraṇaṃbunu vihitaṃbulu, śūdrunaku dvija suśrūṣa sēyavalayu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 409)

  2. satyamāḍuṭa, iṃdriyamulanu jayiṃcuṭa, daivabhakti kaligiyuṃḍuṭa, parulaku mēlonarcuṭa munnagunavi vihitakarmalu –

  3. “ā. vratamu mānadagadu vaḍugu guṟṟanikini

griyalu mānadagadu gṛhagatuniki

dapasikūra nuṃḍa dagadu; sanyāsiki

daruṇitōḍi pottu tagady tagadu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 463)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.