← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజాతీయ భేదః vijātīya bhēdaḥ

Original — తెలుగు
  1. లోకములో ఒకానొక వృక్షానకు పత్ర పుష్ప ఫలాదికమే స్వగత భేదమందురు. వృక్షాంతరమే స్వజాతీయ భేదమనంబడు - పాషాణాదికం విజాతీయ భేదము. (వివేక చింతామణి - పరమానందతీర్థ)

  2. ఒకజాతికి మఱియొక జాతిలో గల భేదము - గోవులకు, గుఱ్ఱములకు గల భేదము; చెట్టుకు ఱాయికి గల భేదము).

  3. “బ్రహ్మ రూప ప్రత్యక్ చైతన్యా ద్విలక్షణ జడ దృశ్య ప్రపంచః నిజాతీయః, నచేత్ సత్యః స్యాత్ బ్రహ్మాపి తదాపి విజాతీయ భేదసహితం స్యాత్. నతు ప్రపంచః సత్యః రజ్జ్వాదోపిత సర్పవత్ మిధ్యా ఏవ; యన్మిధ్యా న తదదిష్ఠా నాత్ అతి రిచ్యతే తస్మాత్ బ్రహ్మ విజాతీయ శూన్యం.”

(బ్రహ్మ రూపమైన ప్రత్యక్ చైతన్యము కంటె జడమైన యీ కనబడు ప్రపంచమంతయు విజాతీయము - మఱియొక జాతికి సంబంధించినది - ఆత్మలక్షణములు లేనిది - బ్రహ్మ సత్యమైనది - ఎల్లకాలమందుండునది. ప్రపంచము సత్యముకాదు, ఎల్లకాలముండునది కాదు. రాత్రివేళ త్రాడును చూచి పాము అనుకొనునట్లు మిధ్యయే. మిధ్య అయినది దాని అధిష్ఠానవస్తువుకంటె వేరుకాదు - పరబ్రహ్మకానిది మఱొకటిలేదు - అందుచేత విజాతీయరహితము).

Transliteration
  1. lōkamulō okānoka vṛkṣānaku patra puṣpa phalādikamē svagata bhēdamaṃduru. vṛkṣāṃtaramē svajātīya bhēdamanaṃbaḍu - pāṣāṇādikaṃ vijātīya bhēdamu. (vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. okajātiki maṟiyoka jātilō gala bhēdamu - gōvulaku, guṟṟamulaku gala bhēdamu; ceṭṭuku ṟāyiki gala bhēdamu).

  3. “brahma rūpa pratyak caitanyā dvilakṣaṇa jaḍa dṛśya prapaṃcaḥ nijātīyaḥ, nacēt satyaḥ syāt brahmāpi tadāpi vijātīya bhēdasahitaṃ syāt. natu prapaṃcaḥ satyaḥ rajjvādōpita sarpavat midhyā ēva; yanmidhyā na tadadiṣṭhā nāt ati ricyatē tasmāt brahma vijātīya śūnyaṃ.”

(brahma rūpamaina pratyak caitanyamu kaṃṭe jaḍamaina yī kanabaḍu prapaṃcamaṃtayu vijātīyamu - maṟiyoka jātiki saṃbaṃdhiṃcinadi - ātmalakṣaṇamulu lēnidi - brahma satyamainadi - ellakālamaṃduṃḍunadi. prapaṃcamu satyamukādu, ellakālamuṃḍunadi kādu. rātrivēḷa trāḍunu cūci pāmu anukonunaṭlu midhyayē. midhya ayinadi dāni adhiṣṭhānavastuvukaṃṭe vērukādu - parabrahmakānidi maṟokaṭilēdu - aṃducēta vijātīyarahitamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.