బాహ్యార్థము లేదనియు, విజ్ఞానమాత్రమే స్వప్నము పగిది జాగ్రద్వ్యవహారమును సాగింపగలదనియు, విజ్ఞానము తప్ప వేరేమియు లేదనియు వీరి మతము - ఇది యోగాచారుని మతము. వీరి మతము ఈ లాగున నున్నది - “మనో వ్యాపరములు బుద్ధికి అధీనము - బుద్ధియొక్క పరిణామమే మనస్సు. క్షణిక విజ్ఞానరూపమైన బుద్ధియే ఆత్మ. సంపూర్ణ పదార్ధములు విజ్ఞానకార్యములు. ఆ విజ్ఞానము ప్రకాశరూపము. నదీ ప్రవాహ న్యాయమున విజ్ఞానముయొక్క ధార సర్వకాలము నడుచుచున్నది. మనస్సునకు కారణమైన ఏ బుద్ధి కలదో అదియే ఆత్మ.
ఈ మతము ఈ దిగువ చెప్పిన విధముగా ఖండింపబడినది : -
(1). అపంచీకృత భూతకార్యమైన యంతఃకరణము నిశ్చయవృత్తి వలన బుద్ధి యనియు, సంకల్ప వికల్ప వృత్తివలన మనస్సనియు చెప్పబడుచున్నది. బుద్ధి కార్యమై యుండుటవలన దేహేంద్రియ మనస్సులవలె అనాత్మగా నున్నది.
(2). నా బుద్ధి మందమయినది - నా బుద్ధి తీక్ష్ణమైనది అని అనుటలో బుద్ధి మమకారమునకు విషయముగా కనబడుచున్నది, కాని అహంకారమునకు విషయముగా కనబడదు - కనుక బుద్ధి ఆత్మకాదు“.
bāhyārthamu lēdaniyu, vijñānamātramē svapnamu pagidi jāgradvyavahāramunu sāgiṃpagaladaniyu, vijñānamu tappa vērēmiyu lēdaniyu vīri matamu - idi yōgācāruni matamu. vīri matamu ī lāguna nunnadi - “manō vyāparamulu buddhiki adhīnamu - buddhiyokka pariṇāmamē manassu. kṣaṇika vijñānarūpamaina buddhiyē ātma. saṃpūrṇa padārdhamulu vijñānakāryamulu. ā vijñānamu prakāśarūpamu. nadī pravāha nyāyamuna vijñānamuyokka dhāra sarvakālamu naḍucucunnadi. manassunaku kāraṇamaina ē buddhi kaladō adiyē ātma.
ī matamu ī diguva ceppina vidhamugā khaṃḍiṃpabaḍinadi : -
(1). apaṃcīkṛta bhūtakāryamaina yaṃtaḥkaraṇamu niścayavṛtti valana buddhi yaniyu, saṃkalpa vikalpa vṛttivalana manassaniyu ceppabaḍucunnadi. buddhi kāryamai yuṃḍuṭavalana dēhēṃdriya manassulavale anātmagā nunnadi.
(2). nā buddhi maṃdamayinadi - nā buddhi tīkṣṇamainadi ani anuṭalō buddhi mamakāramunaku viṣayamugā kanabaḍucunnadi, kāni ahaṃkāramunaku viṣayamugā kanabaḍadu - kanuka buddhi ātmakādu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.