← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరాట్ virāṭ

Original — తెలుగు
  1. వివిధం రాజతే, అనేక థా ప్రకాశతే ఇతి విరాట్.

(అనేక విధములుగా - అనేకములుగా ప్రకాశించువాడు - భగవంతుడొకడే అయినను అనేక రూపములతో, అనేకవస్తువులుగా తానే అయినవాడు).

  1. విస్పష్టం రాజతే ఇతి విరాట్; బ్రహ్మాండ దేహః పురుషః; విశిష్య రాజతే ఇతి విరాట్.

(బ్రహ్మాండము దేహముగా కలిగి స్పష్టముగా, విశేషముగా ప్రకాశించువాడు. సూక్ష్మాతి సూక్ష్ముడైనను ప్రకృతి నధిష్టించి యుండుటచే స్పష్టము తెలియబడువాడు).

  1. యో వివిధం నామ చరాచరం జగద్రా జయతి, ప్రకాశయతి స విరాట్ -

(అనేక విధములుగా అనేక రూపములలో - చరాచర రూపములలో - స్థావర జంగమ రూపములలో నిండియుండు ఈ ప్రపంచమును ప్రకాశింప చేయువాడు - తాను తేజోమూర్తి, చైతన్యఘనము అగుటచేత అన్నింటిని తేజోవంతములుగా - చైతన్యవంతములుగా - చేయువాడు - అన్నింటిని ప్రకాశింపచేయువాడు).

  1. నిత్యాభివ్యక్త రూపః -

(ఎల్లపుడు కనబడు రూపముగలవాడు - ప్రకాశమే రూపముగా గలవాడు)

  1. పంచీకృత భూతానాం యత్కార్యం విరాడ్దేహో భవతి సవిరాడ్దేహః పరమేశ్వరస్య స్థూల దేహో భవతి.

(పంచీకృతమైన స్థూల పంచభూతములయొక్క కార్యము. అట్టి స్థూల భూతములలోనుండి పుట్టిన చరాచర రూపమైన జగత్తుయొక్క సమష్టిరూపము - అదియే పరమేశ్వరుని యొక్క స్థూలశరీరము)

  1. సమష్టి స్థూల ప్రపంచ సహిత చేతనస్య విరాట్ ఇతి నామ -

(స్థూలప్రపంచముయొక్క సమష్టి రూపములోనుండు చైతన్యము - భగవంతుని యొక్క చిచ్ఛక్తి).

  1. బ్రహ్మాండ దేహః పురుషః.

(అండరూపముగా నుండు - గుడ్డు అకారముగా నుండు బ్రహ్మ - భగవంతుని చైతన్య శక్తి ప్రకృతితో కలిసి అండాకారముగా నేర్పడినప్పుడు అదియే దేహముగాగల పురుషుడు - విరాట్).

  1. సమష్టి పురుషో బ్రహ్మా.

(ప్రపంచములోని వస్తువులలో నుండు సమష్టి ఆత్మ చైతన్యము అగు చతుర్ముఖబ్రహ్మ విరాట్పురుషుడు అని చెప్పబడును).

  1. స్థూల దేహాభిమానీ.

(స్థూలదేహము నభిమానించి - నధిష్టించి - యుండువాడు).

  1. సకలప్రాణి శరీరేషు ‘అహం’ ఇత్యభిమాన కరణాత్ ఈశ్వరో వైశ్యానరః ఇతి కథ్యతే. స ఏవ వైశ్యానరః, విరాట్ ఇత్యభిధీయతే.

(అందఱి జీవుల శరీరములలోనుండి ‘నేను’ అను అభిమానము కలిగియుండుటచేత వాటిలోనుండు జీవుడే (ఈశ్వరుడే) వైశ్యానరుడని చెప్పబడుచున్నాడు - ఆ వైశ్యానరుడే విరాట్ అని చెప్పబడుచున్నాడు).

  1. కార్య కారణ సంఘాత మవష్టభ్య విశ్వాత్మనా రాజతే ఇతి విరాట్ -

(కారణవస్తువులు, కార్య వస్తువులు అన్నియు కలిసియున్న దానిని అధిష్టించియుండి వాటి అన్నింటికి అంతరాత్మగానుండి ప్రకాశించువాడు)

  1. పంచీకృత పంచమహాభూతాని తత్కార్యం సర్వం విరాడిత్యుచ్యతే -

(పంచీకరణము చేయబడిన పంచమహా భూతములు, వాటి కార్యములు - వాటి సమ్మేళనమువలన కలిగిన సమస్త వస్తువులు - అన్నియు కలిసి విరాట్ అని చెప్పబడుచున్నది).

  1. “పృధి వ్యప్తేజో వాయురాకాశ చంద్రసూర్యాత్మలనెడి అష్టమూర్తులె ఈశ్వరునియొక్క విరాడ్రూపమైన స్థూలశరీరము.”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “ఏ తత్వంబున నేనియు చరాచరలోక పుంజంబులు నిండియుండు నా హిరణ్యంబైన విరాడ్వి గ్రహంబు నొందిన పురుషుండు సర్వ జీవ సమేతుండై యుండి - - - ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 6 -
  2. “ఈశ్వరాధిష్టితంబైన ప్రకృతి యంశంబున మహత్తత్వంబగు; మహత్తత్వాంశంబున నహంకారంబగు, అహంకారాంశంబున శబ్ద తన్మాత్రంబగు శబ్ద తన్మాత్రాంశంబున సమీరణంబగు; సమీరణాంశంబున రూపతన్మాత్రంబగు; రూపతన్మాత్రాంబువలన తేజంబగు; తేజోంశంబున రసతన్మాత్రంబగు; రసతన్మాత్రాంశంబువలన జలంబగు, జలాంశంబున గంధతన్మాత్రంబగు; గంధతన్మాత్రాంశంబున పృధివియగు; వాని మేళంబున చతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూ పంబగు, ఆ రూపంబునకు అండకటాహంబు ప్రథమావరణంబైన పృధ్వియగు - ఆయావరణంబు మీద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులుండు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)

  1. “పృధివ్యప్తేజో వాయురాకాశ చంద్ర సూర్యాత్మలనెడి అష్టమూర్తులే ఈశ్వరునియొక్క విరాడ్రూపమైన స్థూలరూపము”.

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

Transliteration
  1. vividhaṃ rājatē, anēka thā prakāśatē iti virāṭ.

(anēka vidhamulugā - anēkamulugā prakāśiṃcuvāḍu - bhagavaṃtuḍokaḍē ayinanu anēka rūpamulatō, anēkavastuvulugā tānē ayinavāḍu).

  1. vispaṣṭaṃ rājatē iti virāṭ; brahmāṃḍa dēhaḥ puruṣaḥ; viśiṣya rājatē iti virāṭ.

(brahmāṃḍamu dēhamugā kaligi spaṣṭamugā, viśēṣamugā prakāśiṃcuvāḍu. sūkṣmāti sūkṣmuḍainanu prakṛti nadhiṣṭiṃci yuṃḍuṭacē spaṣṭamu teliyabaḍuvāḍu).

  1. yō vividhaṃ nāma carācaraṃ jagadrā jayati, prakāśayati sa virāṭ -

(anēka vidhamulugā anēka rūpamulalō - carācara rūpamulalō - sthāvara jaṃgama rūpamulalō niṃḍiyuṃḍu ī prapaṃcamunu prakāśiṃpa cēyuvāḍu - tānu tējōmūrti, caitanyaghanamu aguṭacēta anniṃṭini tējōvaṃtamulugā - caitanyavaṃtamulugā - cēyuvāḍu - anniṃṭini prakāśiṃpacēyuvāḍu).

  1. nityābhivyakta rūpaḥ -

(ellapuḍu kanabaḍu rūpamugalavāḍu - prakāśamē rūpamugā galavāḍu)

  1. paṃcīkṛta bhūtānāṃ yatkāryaṃ virāḍdēhō bhavati savirāḍdēhaḥ paramēśvarasya sthūla dēhō bhavati.

(paṃcīkṛtamaina sthūla paṃcabhūtamulayokka kāryamu. aṭṭi sthūla bhūtamulalōnuṃḍi puṭṭina carācara rūpamaina jagattuyokka samaṣṭirūpamu - adiyē paramēśvaruni yokka sthūlaśarīramu)

  1. samaṣṭi sthūla prapaṃca sahita cētanasya virāṭ iti nāma -

(sthūlaprapaṃcamuyokka samaṣṭi rūpamulōnuṃḍu caitanyamu - bhagavaṃtuni yokka cicchakti).

  1. brahmāṃḍa dēhaḥ puruṣaḥ.

(aṃḍarūpamugā nuṃḍu - guḍḍu akāramugā nuṃḍu brahma - bhagavaṃtuni caitanya śakti prakṛtitō kalisi aṃḍākāramugā nērpaḍinappuḍu adiyē dēhamugāgala puruṣuḍu - virāṭ).

  1. samaṣṭi puruṣō brahmā.

(prapaṃcamulōni vastuvulalō nuṃḍu samaṣṭi ātma caitanyamu agu caturmukhabrahma virāṭpuruṣuḍu ani ceppabaḍunu).

  1. sthūla dēhābhimānī.

(sthūladēhamu nabhimāniṃci - nadhiṣṭiṃci - yuṃḍuvāḍu).

  1. sakalaprāṇi śarīrēṣu ‘ahaṃ’ ityabhimāna karaṇāt īśvarō vaiśyānaraḥ iti kathyatē. sa ēva vaiśyānaraḥ, virāṭ ityabhidhīyatē.

(aṃdaṟi jīvula śarīramulalōnuṃḍi ‘nēnu’ anu abhimānamu kaligiyuṃḍuṭacēta vāṭilōnuṃḍu jīvuḍē (īśvaruḍē) vaiśyānaruḍani ceppabaḍucunnāḍu - ā vaiśyānaruḍē virāṭ ani ceppabaḍucunnāḍu).

  1. kārya kāraṇa saṃghāta mavaṣṭabhya viśvātmanā rājatē iti virāṭ -

(kāraṇavastuvulu, kārya vastuvulu anniyu kalisiyunna dānini adhiṣṭiṃciyuṃḍi vāṭi anniṃṭiki aṃtarātmagānuṃḍi prakāśiṃcuvāḍu)

  1. paṃcīkṛta paṃcamahābhūtāni tatkāryaṃ sarvaṃ virāḍityucyatē -

(paṃcīkaraṇamu cēyabaḍina paṃcamahā bhūtamulu, vāṭi kāryamulu - vāṭi sammēḷanamuvalana kaligina samasta vastuvulu - anniyu kalisi virāṭ ani ceppabaḍucunnadi).

  1. “pṛdhi vyaptējō vāyurākāśa caṃdrasūryātmalaneḍi aṣṭamūrtule īśvaruniyokka virāḍrūpamaina sthūlaśarīramu.”

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “ē tatvaṃbuna nēniyu carācaralōka puṃjaṃbulu niṃḍiyuṃḍu nā hiraṇyaṃbaina virāḍvi grahaṃbu noṃdina puruṣuṃḍu sarva jīva samētuṃḍai yuṃḍi - - - ||”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 6 -
  2. “īśvarādhiṣṭitaṃbaina prakṛti yaṃśaṃbuna mahattatvaṃbagu; mahattatvāṃśaṃbuna nahaṃkāraṃbagu, ahaṃkārāṃśaṃbuna śabda tanmātraṃbagu śabda tanmātrāṃśaṃbuna samīraṇaṃbagu; samīraṇāṃśaṃbuna rūpatanmātraṃbagu; rūpatanmātrāṃbuvalana tējaṃbagu; tējōṃśaṃbuna rasatanmātraṃbagu; rasatanmātrāṃśaṃbuvalana jalaṃbagu, jalāṃśaṃbuna gaṃdhatanmātraṃbagu; gaṃdhatanmātrāṃśaṃbuna pṛdhiviyagu; vāni mēḷaṃbuna caturdaśa bhuvanātmakaṃbaina virāḍrū paṃbagu, ā rūpaṃbunaku aṃḍakaṭāhaṃbu prathamāvaraṇaṃbaina pṛdhviyagu - āyāvaraṇaṃbu mīda salila tējassamīra gaganāhaṃkāra mahattattvaṃbu laniyeḍi yāvaraṇaṃbuluṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)

  1. “pṛdhivyaptējō vāyurākāśa caṃdra sūryātmalaneḍi aṣṭamūrtulē īśvaruniyokka virāḍrūpamaina sthūlarūpamu”.

(brahmavidyāsudhārṇavamu - 6)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.