← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరాట్పురుషుడు virāṭpuruṣuḍu

Original — తెలుగు
  1. వివిధం రాజత ఇతి విరాట్, వారాట్చాసౌ పురుషశ్చ విరాట్పురుషః -

(అనేక విధములుగ, అనేక రూపములుగ ప్రకాశించువాడు విరాట్, విరాట్టున్నూ, పురుషుడున్నూ అయినవాడు విరాట్పురుషుడు.)

  1. భగవంతుడైన హరి విరాడ్విగ్రహంబునందు భూత భవిష్యద్వర్త మానంబైన విశ్వంబు విలోక్యమానంబగు ధరణి సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబులనియెడి సప్తావరణంబులచేత నా వృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు దేజరిల్లు.” (శ్రీమదంధ్రమహాభాగవతము - 2 - 1 - 16)

  2. “ఉత్తమో(అ)హం” అనెడి వైకారికాహంకారం వల్లనున్నూ, సత్వగుణం వల్లనున్నూ, బ్రహ్మాండమనెడి స్థూలదేహుండై మోహన వికృత బావంతో గూడి జ్ఞానశక్తుండై విరాట్పురుషుండై విష్ణువనిపించుకొనును. “సర్వం విష్ణుమయం జగత్” అని కలదు కనుక కల్పిత పురుషుండే సత్వం గుణం వల్ల వారాట్పురుషుండే విష్ణువు, జ్ఞానేంద్రియ బీజభూతుండు” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)

  3. “ఆ ఈశ్వరుండు విరాట్పురుషుండు, హిరణ్యగర్భుండు, అంతర్యామి అని యీ విధంబున త్రివిధంబై యుండు. అందు స్థూలశరీర సమష్ట్యభిమాని వైశ్యానరుడు, అను మొదలైనవి విరాట్పురుష పర్యాయనామంబులు - - -” (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  4. “విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులనెడి ఈశ్వర మాయోపాధి శరీరాలకు సాక్షి స్వరూపమైనదే మూల ప్రకృతి”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “హిరణ్యగర్భాధిష్టిత విక్షేప శక్తితః తమోద్రిక్తా హలకారభిదా స్థూలశక్తిరాసీత్, తత్ప్రతిబింబితం యత్ తత్ విరాట్ చైతన్య మాసీత్ ||”.

(పైంగలోపనిషత్)

(హిరణ్యగర్భునిచే నధిష్టింపబడిన విక్షేపశక్తి - మహత్తు - నుండి తమోగుణముచేత నుద్రేకింపబడిన - తమోగుణప్రథానమగు అహంకారమను పేరుగల స్థూలశక్తి కలిగెను. ఆ అహంకారమందు ప్రతిబింబించిన బ్రహ్మము విరాట్టును చైతన్యమై యుండెను - (స్థూలదేహముతో కూడిన తెలివి, జ్ఞానము చైతన్యము)

  1. విరాట్పురుషో వ్యూహాదిః.

(ఈ విరాట్పురుషుడే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణములను వాలుగు వ్యూహములలో మొదటిది - వాటికి మూలమైనది, కారణమైనది).

  1. “అమ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శ్రీర్షాయుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాదిపురుషరూపంబగు. అందు కాలస్వభావంబులను శక్తులుదయించె. అందు కార్య కారణ రూపంబైన ప్రకృతి జనియించె. ప్రకృతివలన మహత్తత్త్వంబును, దానివలన నహంకారత్రయంబును పుట్టె. అందు రాజసా హంకారమువలన నింద్రియంబులును, సాత్వికాహంకారంబువలన నింద్రియగుణప్రథానంబులైన యధి దేవతలును, తామసాహంకారంబువలన భూతకారణంబులైన శబ్ద, స్పర్శ రూప రస, గంధ తన్మాత్రంబులును బొడమె. పంచ తన్మాత్రంబులవలన గగనానిల వహ్ని సలిల ధరాదికంబైన భూత ప్రపంచకంబు గలిగె. అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులును, కర్మేంద్రియంబులైన వాక్పాణిపాద పాయూపస్థంబు లును మనంబును జనించె - అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె - అతని వలన స్వయం ప్రకాశుండైన స్వరాట్టు సంభవించె-”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)

  1. ఈ ఏడు తత్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి కాలాదృష్ట సత్వాదులంగూడి జగత్కారణుండును, ద్రైగుణ్య విశిష్టిండును నశేషనియామకుండును నిరంజనాకారుండును నగు సర్వేశ్వరుండందు బ్రవేశించె. అంత నన్యోన్య క్షుభితంబులై మిళితంబులైన మహదాదులవలన నధిష్టాతృ చేతన రహితంబగు నొక యండంబు పుట్టె. అందు - “సీ. గురుశక్తియే విరాట్పురుషుండు సంభవం బయ్యె”.

  2. “అట్టి విరాట్పురుషుని శీర్షంబున స్వర్గంబును, జరణంబుల వసుమతియు, నాభియందు గగనంబునుం గలిగె. సత్వాది గుణపరిణామంబుల నమరులైరి. ఊర్జిత సత్వగుణంబున నద్దేవతలు త్రిదినంబును బొందిరి. రజోగుణంబున మనుజులును, గవాదులును, ధరణిం బొందిరి తామసంబున భూతాదులైన రుద్ర పారిషదులు ద్యావాపృధివ్యంతరంబగు వియత్తలంబునుం బొందిరి. ముఖంబువలన నామ్నాయంబులుత్పన్నంబు లయ్యె”.

  3. “సీ. ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి మహదాదుల నితరేతరానుషంగ

ముగ జేసి వానియందొగి విరాడ్దేహంబు పుట్టించి యందు జేపట్టి తాను వసియించు - - - “.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 7 - 246)

  1. “శ్లో ||. కాల కర్మ స్వభావస్థో జీవో జీవమ జీవయత్ |

స ఏవ పురుషః తస్మాదండం నిర్భిద్య నిర్గతః |

సహస్రోర్వంఘ్రి బాహ్వక్షి సహస్రానన శీర్షవాన్ |

యస్యే హా వయవైః లోకాన్ కల్పయతి మలీషిణః |

కట్యాది భిరధస్సప్త సప్తో ర్థ్వం జఘనాదిభిః |“. (శ్రీమద్భాగవతం)

“సీ. మహదహంకార తన్మాత్ర సం యుక్తుడై, చారు షోడశ కళా సహితు డగుచు

పంచమహా భూతభాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతాశాయి యగుచు

చరణోరు భుజ ముఖ శ్రవణాక్షినాసా శిరములు నానా సహస్రములు వెలుగ

నంబర కేయూర విహార కుండల కిరీటాదులు పెక్కు వేలమరుచుండ

తే. పురుష రూపంబు ధరియించి పరుడనంతు

డఖిల భువనైక నర్తన యత్నమమర

మానితోదార జలరాశి మధ్యమునను

యోగనిద్రావిలాసియై యొప్పుచుండు

వ. అది సకలావతారంబులకు మొదలిగని యైన శ్రీమన్నారాయణదేవుని విరాజమానంబైన దివ్యరూపంబు దానిని పరమ యోగీంద్రులు దర్శింతురు. అప్పరమేశ్వరు నాభి కమలంబువలన సృష్టి కర్తలలోన శ్రేష్టుండైన బ్రహ్మ యుదయించె“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 25)

(కాలకర్మ స్వభావములు అను మూడు శక్తులు గల జీవుడు - పరమాత్మ - జీవలోకమును సజీవముగా - చైతన్యవంతముగా - చేసెను. అతనే పురుషుడు - (పురమను ప్రకృతి యను ఉపధిలో శయనించి యుండువాడు, నివసించి యుండువాడు కనుక పురుషుడు - “పురుశయనాత్ పురుషః” - ఆ పురుషుడు అండాకారముగానున్న బ్రహ్మ వస్తువును (Cosmic egg) - సూక్ష్మాకారములోనుండి పెద్దదిగా (బృంహణము) పెరిగి విస్తరిల్లుటకు శక్తి అవకాశములుగల ప్రకృతి పురుష మిశ్రమమగు బ్రహ్మాండమను దానిని - భేదించి (Big Bang) పైకి వచ్చును. అతను వేలకొలది చరణములు, తొడలు, భుజములు, శ్రవణములు, కండ్లు, ముక్కులు, శిరస్సులు మొదలగు అవయవములు కలిగి, అంబరములు, కేయూరములు, హారములు, కుండలములు, కిరీటములు పెక్కువేలు కలిగి యుండెను - ఇట్లు అనేక రూపములుగా, అనేక విధములుగా ప్రకాశించువాడగుటచేత ఆ పురుషుని విరాట్పురుషుడు - “వివిధం రాజతే ఇతి విరాట్” (అనేక విధములుగా, అనేక రూపములతో ప్రకాశించువాడు) కనుక విరాట్పురుషుడని చెప్పుచున్నారు).

  1. “సీ. పరమాత్మ మర్త్య సుసర్వ తిర్యఙ్మృగదితిజ సరీసృపద్విజ గణాది

సంవ్యాప్తమును, సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబు

నైన విరాడ్విగ్రహంబు నేనెఱుగుదు - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 9 - 286)

  1. “సమష్టి స్థూల శరీరుడు”.
Transliteration
  1. vividhaṃ rājata iti virāṭ, vārāṭcāsau puruṣaśca virāṭpuruṣaḥ -

(anēka vidhamuluga, anēka rūpamuluga prakāśiṃcuvāḍu virāṭ, virāṭṭunnū, puruṣuḍunnū ayinavāḍu virāṭpuruṣuḍu.)

  1. bhagavaṃtuḍaina hari virāḍvigrahaṃbunaṃdu bhūta bhaviṣyadvarta mānaṃbaina viśvaṃbu vilōkyamānaṃbagu dharaṇi salila tējassamīraṇa gaganāhaṃkāra mahattatvaṃbulaniyeḍi saptāvaraṇaṃbulacēta nā vṛtaṃbagu mahāṃḍakōśaṃbaina śarīraṃbunaṃdu dhāraṇāśrayaṃbaina vairāja puruṣuṃḍu dējarillu.” (śrīmadaṃdhramahābhāgavatamu - 2 - 1 - 16)

  2. “uttamō(a)haṃ” aneḍi vaikārikāhaṃkāraṃ vallanunnū, satvaguṇaṃ vallanunnū, brahmāṃḍamaneḍi sthūladēhuṃḍai mōhana vikṛta bāvaṃtō gūḍi jñānaśaktuṃḍai virāṭpuruṣuṃḍai viṣṇuvanipiṃcukonunu. “sarvaṃ viṣṇumayaṃ jagat” ani kaladu kanuka kalpita puruṣuṃḍē satvaṃ guṇaṃ valla vārāṭpuruṣuṃḍē viṣṇuvu, jñānēṃdriya bījabhūtuṃḍu” (brahmavidyāsudhārṇavamu - 1)

  3. “ā īśvaruṃḍu virāṭpuruṣuṃḍu, hiraṇyagarbhuṃḍu, aṃtaryāmi ani yī vidhaṃbuna trividhaṃbai yuṃḍu. aṃdu sthūlaśarīra samaṣṭyabhimāni vaiśyānaruḍu, anu modalainavi virāṭpuruṣa paryāyanāmaṃbulu - - -” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  4. “virāṭ hiraṇyagarbha avyākṛtulaneḍi īśvara māyōpādhi śarīrālaku sākṣi svarūpamainadē mūla prakṛti”

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “hiraṇyagarbhādhiṣṭita vikṣēpa śaktitaḥ tamōdriktā halakārabhidā sthūlaśaktirāsīt, tatpratibiṃbitaṃ yat tat virāṭ caitanya māsīt ||”.

(paiṃgalōpaniṣat)

(hiraṇyagarbhunicē nadhiṣṭiṃpabaḍina vikṣēpaśakti - mahattu - nuṃḍi tamōguṇamucēta nudrēkiṃpabaḍina - tamōguṇaprathānamagu ahaṃkāramanu pērugala sthūlaśakti kaligenu. ā ahaṃkāramaṃdu pratibiṃbiṃcina brahmamu virāṭṭunu caitanyamai yuṃḍenu - (sthūladēhamutō kūḍina telivi, jñānamu caitanyamu)

  1. virāṭpuruṣō vyūhādiḥ.

(ī virāṭpuruṣuḍē vāsudēva, pradyumna, aniruddha, saṃkarṣaṇamulanu vālugu vyūhamulalō modaṭidi - vāṭiki mūlamainadi, kāraṇamainadi).

  1. “ammahanīya tējōnidhi modali yavatāraṃbu sahasra śrīrṣāyuktaṃbayi prakṛti pravartakaṃbagu nādipuruṣarūpaṃbagu. aṃdu kālasvabhāvaṃbulanu śaktuludayiṃce. aṃdu kārya kāraṇa rūpaṃbaina prakṛti janiyiṃce. prakṛtivalana mahattattvaṃbunu, dānivalana nahaṃkāratrayaṃbunu puṭṭe. aṃdu rājasā haṃkāramuvalana niṃdriyaṃbulunu, sātvikāhaṃkāraṃbuvalana niṃdriyaguṇaprathānaṃbulaina yadhi dēvatalunu, tāmasāhaṃkāraṃbuvalana bhūtakāraṇaṃbulaina śabda, sparśa rūpa rasa, gaṃdha tanmātraṃbulunu boḍame. paṃca tanmātraṃbulavalana gaganānila vahni salila dharādikaṃbaina bhūta prapaṃcakaṃbu galige. aṃdu jñānēṃdriyaṃbulaina tvak cakṣuśrōtra jihvāghrāṇaṃbulunu, karmēṃdriyaṃbulaina vākpāṇipāda pāyūpasthaṃbu lunu manaṃbunu janiṃce - anniṃṭi saṃghātaṃbuna viśvarūpuṃḍaina virāṭpuruṣuṃḍu puṭṭe - atani valana svayaṃ prakāśuṃḍaina svarāṭṭu saṃbhaviṃce-”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)

  1. ī ēḍu tatvaṃbulu paraspara miḷitaṃbulai bhōgāyatanaṃbagu puruṣuniṃ galpiṃpa samarthaṃbulai yunnaṃ jūci kālādṛṣṭa satvādulaṃgūḍi jagatkāraṇuṃḍunu, draiguṇya viśiṣṭiṃḍunu naśēṣaniyāmakuṃḍunu niraṃjanākāruṃḍunu nagu sarvēśvaruṃḍaṃdu bravēśiṃce. aṃta nanyōnya kṣubhitaṃbulai miḷitaṃbulaina mahadādulavalana nadhiṣṭātṛ cētana rahitaṃbagu noka yaṃḍaṃbu puṭṭe. aṃdu - “sī. guruśaktiyē virāṭpuruṣuṃḍu saṃbhavaṃ bayye”.

  2. “aṭṭi virāṭpuruṣuni śīrṣaṃbuna svargaṃbunu, jaraṇaṃbula vasumatiyu, nābhiyaṃdu gaganaṃbunuṃ galige. satvādi guṇapariṇāmaṃbula namarulairi. ūrjita satvaguṇaṃbuna naddēvatalu tridinaṃbunu boṃdiri. rajōguṇaṃbuna manujulunu, gavādulunu, dharaṇiṃ boṃdiri tāmasaṃbuna bhūtādulaina rudra pāriṣadulu dyāvāpṛdhivyaṃtaraṃbagu viyattalaṃbunuṃ boṃdiri. mukhaṃbuvalana nāmnāyaṃbulutpannaṃbu layye”.

  3. “sī. iṃdriyaṃbulatōḍa nelami noppeḍi mahadādula nitarētarānuṣaṃga

muga jēsi vāniyaṃdogi virāḍdēhaṃbu puṭṭiṃci yaṃdu jēpaṭṭi tānu vasiyiṃcu - - - “.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 7 - 246)

  1. “ślō ||. kāla karma svabhāvasthō jīvō jīvama jīvayat |

sa ēva puruṣaḥ tasmādaṃḍaṃ nirbhidya nirgataḥ |

sahasrōrvaṃghri bāhvakṣi sahasrānana śīrṣavān |

yasyē hā vayavaiḥ lōkān kalpayati malīṣiṇaḥ |

kaṭyādi bhiradhassapta saptō rthvaṃ jaghanādibhiḥ |“. (śrīmadbhāgavataṃ)

“sī. mahadahaṃkāra tanmātra saṃ yuktuḍai, cāru ṣōḍaśa kaḷā sahitu ḍagucu

paṃcamahā bhūtabhāsituṃḍai śuddha satvuḍai sarvātāśāyi yagucu

caraṇōru bhuja mukha śravaṇākṣināsā śiramulu nānā sahasramulu veluga

naṃbara kēyūra vihāra kuṃḍala kirīṭādulu pekku vēlamarucuṃḍa

tē. puruṣa rūpaṃbu dhariyiṃci paruḍanaṃtu

ḍakhila bhuvanaika nartana yatnamamara

mānitōdāra jalarāśi madhyamunanu

yōganidrāvilāsiyai yoppucuṃḍu

va. adi sakalāvatāraṃbulaku modaligani yaina śrīmannārāyaṇadēvuni virājamānaṃbaina divyarūpaṃbu dānini parama yōgīṃdrulu darśiṃturu. apparamēśvaru nābhi kamalaṃbuvalana sṛṣṭi kartalalōna śrēṣṭuṃḍaina brahma yudayiṃce”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 25)

(kālakarma svabhāvamulu anu mūḍu śaktulu gala jīvuḍu - paramātma - jīvalōkamunu sajīvamugā - caitanyavaṃtamugā - cēsenu. atanē puruṣuḍu - (puramanu prakṛti yanu upadhilō śayaniṃci yuṃḍuvāḍu, nivasiṃci yuṃḍuvāḍu kanuka puruṣuḍu - “puruśayanāt puruṣaḥ” - ā puruṣuḍu aṃḍākāramugānunna brahma vastuvunu (Cosmic egg) - sūkṣmākāramulōnuṃḍi peddadigā (bṛṃhaṇamu) perigi vistarilluṭaku śakti avakāśamulugala prakṛti puruṣa miśramamagu brahmāṃḍamanu dānini - bhēdiṃci (Big Bang) paiki vaccunu. atanu vēlakoladi caraṇamulu, toḍalu, bhujamulu, śravaṇamulu, kaṃḍlu, mukkulu, śirassulu modalagu avayavamulu kaligi, aṃbaramulu, kēyūramulu, hāramulu, kuṃḍalamulu, kirīṭamulu pekkuvēlu kaligi yuṃḍenu - iṭlu anēka rūpamulugā, anēka vidhamulugā prakāśiṃcuvāḍaguṭacēta ā puruṣuni virāṭpuruṣuḍu - “vividhaṃ rājatē iti virāṭ” (anēka vidhamulugā, anēka rūpamulatō prakāśiṃcuvāḍu) kanuka virāṭpuruṣuḍani ceppucunnāru).

  1. “sī. paramātma martya susarva tiryaṅmṛgaditija sarīsṛpadvija gaṇādi

saṃvyāptamunu, sadasadviśēṣaṃbunu gaikoni mahadādi kāraṇaṃbu

naina virāḍvigrahaṃbu nēneṟugudu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 9 - 286)

  1. “samaṣṭi sthūla śarīruḍu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.