“ఎచ్చట ‘నేను’ అను బుద్ధి కలుగునో అదియే ఆత్మ. ‘నేను’ అను బుద్ధి స్థూలదేహమందు కలుగును -”నేను మనుష్యుడను“,”నేను బ్రాహ్మణుడను“, అనుట అందఱి అనుభవములో నున్నదియే,” మనుష్యుడను, “బ్రాహ్మణుడను” అను ధర్మములు, స్థూల శరీరమునకు సంబంధించినవి. అందుచేత ‘నేను’ అను బుద్ధికి విషయమైన స్థూలదేహమే ఆత్మ - లేక, ఎచ్చట ముఖ్య ప్రీతి - దేనియందు ముఖ్య ప్రేమ - యుండునో అదియే ఆత్మ. భార్యా పుత్రులు, ధనము, పశుసంపద స్థూలదేహమునకుపరించునవి కనుక వాటియందు ముఖ్యప్రీతి కలుగును. అందుచేత స్థూలదేహమే ఆత్మ. అందుచేత వస్త్రములు, ఆభరణములు అన్నపానాదులు మొదలగు ఉపకరణములచేత, శరీరమును అలంకరించుకొని దానిని పోషించుటయే పరమ పురుషార్థము అని యీ విధముగ రాక్షసరాజు అయిన విరోచనుని సిద్ధాంతము).
దేహమే యాత్మయను వాదము.
నాస్తీక మతము
“eccaṭa ‘nēnu’ anu buddhi kalugunō adiyē ātma. ‘nēnu’ anu buddhi sthūladēhamaṃdu kalugunu -”nēnu manuṣyuḍanu”, “nēnu brāhmaṇuḍanu”, anuṭa aṃdaṟi anubhavamulō nunnadiyē,” manuṣyuḍanu, “brāhmaṇuḍanu” anu dharmamulu, sthūla śarīramunaku saṃbaṃdhiṃcinavi. aṃducēta ‘nēnu’ anu buddhiki viṣayamaina sthūladēhamē ātma - lēka, eccaṭa mukhya prīti - dēniyaṃdu mukhya prēma - yuṃḍunō adiyē ātma. bhāryā putrulu, dhanamu, paśusaṃpada sthūladēhamunakupariṃcunavi kanuka vāṭiyaṃdu mukhyaprīti kalugunu. aṃducēta sthūladēhamē ātma. aṃducēta vastramulu, ābharaṇamulu annapānādulu modalagu upakaraṇamulacēta, śarīramunu alaṃkariṃcukoni dānini pōṣiṃcuṭayē parama puruṣārthamu ani yī vidhamuga rākṣasarāju ayina virōcanuni siddhāṃtamu).
dēhamē yātmayanu vādamu.
nāstīka matamu
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.