← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విసర్గః visargaḥ

Original — తెలుగు
  1. వివిధః సర్గః; సృష్టిః -

(అనేక విధములుగా విసర్జించుట - సృష్టి)

  1. చరాచర సర్గః (చరములను, అచరములను సృష్టించుట.)

  2. “భూతానాం జీవానాం భావానాం జడపదార్థానాం చ ఉద్భవకరీ ఈశ్వర క్రియాచ విసర్గః - విశేషేణ సర్జనం ఇత్యర్థః -” (శ్రీ ఆనందతీర్థః)

(భూతములను, జీవులను, జడపదార్థములను సృష్టించు భగవంతుని క్రియ విసర్గము - విశేషముగా విసర్జించుట విసర్గము).

  1. “క. సరసిజగర్భుండు విరా

ట్పురుషుని వలనం జనించి భూరితర చరా

చర భూత సృష్టిచేయుట

బరువడిని విసర్గమండ్రు భరతకులేశా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 261)

  1. పుత్రాది రూపో సర్గః సంసార బుద్ధిః -

(పుత్రుడు మొదలగువారలను పుట్టించుట)

  1. పుణ్య పాపాది లక్షణం కర్మ.

(పుణ్యము, పాపము మొదలగు లక్షణములు గల కర్మ)

  1. సంసార బంధః - (సంసారమను బంధము)

  2. “సర్వభూతని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజమ్యహం ||

ప్రకృతిం స్వామనష్టభ్య విసృజామి పునః పునః |

భూతగ్రామ మమం కృత్స్నమదశం ప్రకృతేర్వశాత్ ||“. (శ్రీమద్భగవద్గీత - ??)

(కల్పాంతమందు సమస్త భూతములు నా ప్రకృతిని పొందుచున్నవి - నా ప్రకృతిలో లీనమగుచున్నవి. తిరిగి తర్వాత కల్ప ప్రారంభమున నేను వాటిని విడిచిపెట్టుచున్నాను - సృష్టించుచున్నాను - సృష్టించబడినట్లు చేయుచున్నాను. ప్రకృతిలో నేనుండి నా చైతన్యశక్తి దానికిచ్చి దానిలోనుండి సమస్త భూతములను సృష్టిచేయబడినట్లు వదలివేయుచున్నాను - భూతములు ప్రకృతి వశములో నుండుటవలన స్వతంత్రించలేవు).

  1. “విసర్గః విసర్జనం దేవతోద్దేశేన చ పురోడాశాదేః ద్రవ్యస్య పరిత్యాగః స ఏవ విసర్గలక్షణో యజ్ఞః కర్మ సంజ్ఞితః కర్మ శబ్దితః ఇత్యేతత్”

(శ్రీశంకరః)

(ఒక దేవత నుద్దేశించి విసర్జన చేయుట. పురోడాశము మొదలగు ద్రవ్యమును విడుచుట. అదియే విసర్గమను లక్షణముగల యజ్ఞము - ఒక కర్మ)

Transliteration
  1. vividhaḥ sargaḥ; sṛṣṭiḥ -

(anēka vidhamulugā visarjiṃcuṭa - sṛṣṭi)

  1. carācara sargaḥ (caramulanu, acaramulanu sṛṣṭiṃcuṭa.)

  2. “bhūtānāṃ jīvānāṃ bhāvānāṃ jaḍapadārthānāṃ ca udbhavakarī īśvara kriyāca visargaḥ - viśēṣēṇa sarjanaṃ ityarthaḥ -” (śrī ānaṃdatīrthaḥ)

(bhūtamulanu, jīvulanu, jaḍapadārthamulanu sṛṣṭiṃcu bhagavaṃtuni kriya visargamu - viśēṣamugā visarjiṃcuṭa visargamu).

  1. “ka. sarasijagarbhuṃḍu virā

ṭpuruṣuni valanaṃ janiṃci bhūritara carā

cara bhūta sṛṣṭicēyuṭa

baruvaḍini visargamaṃḍru bharatakulēśā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 261)

  1. putrādi rūpō sargaḥ saṃsāra buddhiḥ -

(putruḍu modalaguvāralanu puṭṭiṃcuṭa)

  1. puṇya pāpādi lakṣaṇaṃ karma.

(puṇyamu, pāpamu modalagu lakṣaṇamulu gala karma)

  1. saṃsāra baṃdhaḥ - (saṃsāramanu baṃdhamu)

  2. “sarvabhūtani kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |

kalpakṣayē punastāni kalpādau visṛjamyahaṃ ||

prakṛtiṃ svāmanaṣṭabhya visṛjāmi punaḥ punaḥ |

bhūtagrāma mamaṃ kṛtsnamadaśaṃ prakṛtērvaśāt ||“. (śrīmadbhagavadgīta - ??)

(kalpāṃtamaṃdu samasta bhūtamulu nā prakṛtini poṃducunnavi - nā prakṛtilō līnamagucunnavi. tirigi tarvāta kalpa prāraṃbhamuna nēnu vāṭini viḍicipeṭṭucunnānu - sṛṣṭiṃcucunnānu - sṛṣṭiṃcabaḍinaṭlu cēyucunnānu. prakṛtilō nēnuṃḍi nā caitanyaśakti dānikicci dānilōnuṃḍi samasta bhūtamulanu sṛṣṭicēyabaḍinaṭlu vadalivēyucunnānu - bhūtamulu prakṛti vaśamulō nuṃḍuṭavalana svataṃtriṃcalēvu).

  1. “visargaḥ visarjanaṃ dēvatōddēśēna ca purōḍāśādēḥ dravyasya parityāgaḥ sa ēva visargalakṣaṇō yajñaḥ karma saṃjñitaḥ karma śabditaḥ ityētat”

(śrīśaṃkaraḥ)

(oka dēvata nuddēśiṃci visarjana cēyuṭa. purōḍāśamu modalagu dravyamunu viḍucuṭa. adiyē visargamanu lakṣaṇamugala yajñamu - oka karma)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.