(“సః అయం దేవదత్తః” అను వాక్యములో ‘సః’ అను మాటకు ఆ దేవదత్తుడు - ఆ కాలమందలి దేవదత్తుడు, ఇదివరకు చెప్పబడిన, లేక చూడబడిన దేవదత్తుడు అని అర్థము - అయం దేవదత్తుడు అని వాక్యములో ‘అయం’ అనగా ఇప్పుడు చెప్పబడిన దేవదత్తుడు అని అర్థము - ఇదివరకు చూసిన ఆ దేవదత్తుడే యీ దేవదత్తుడు. ఆ దేవదత్తునుకి ఈ దేవదత్తునికి భేదము లేకపోవుటచేత విశేషణ విశేష్యభావము. ఆ ప్రకారముగా “తత్వమసి” (ఆ పరబ్రహ్మ నీవే అయితివి) యను వాక్యమునందు ‘తత్’ అను పదమునకు అర్థమగు పరోక్ష పరబ్రహ్మమునకు, ‘త్వం’ పదమునకు అర్థమైన అపరోక్షత్వము మొదలగు లక్షణములుగల విశిష్ట చైతన్యమగు జీవునకును భేదము లేనందున, ఇద్దరు ఒకటే కనుక విశేషణ విశేష్యభావము -).
(దేహేంద్రియాది విశిష్టమైన చైతన్యము ‘త్వం’ పదార్థము. ఇట్టి త్వం పదార్థము దేహేంద్రియాది సంబంధముచేత ఆధ్యాత్మికాది దుఃఖములు కలిగియున్నట్లు తెలియబడుచున్నది. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”, “విజ్ఞానమానందం బ్రహ్మ”, “ఏక మేవా ద్వితీయం” ఇత్యాది శ్రుతులచేత అద్వితీయ సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మమే తత్పదార్థము. ఇట్టి తత్పదార్థము అహం అని ప్రత్యక్షముగా ప్రకాశింపనందున, పరోక్షమైనట్లు తెలియచున్నది. ఇందులో ‘తత్వమసి’ అను వాక్యమునందు ‘త్వం’ పదార్థమునకు ‘తత్’ పదార్థము విశేషణము కాగానే త్వం పదార్థమునందు తోచబడుచున్న దుఃఖత్వము నివర్తించును, అనగా, పరమానందస్వరూపమైన పరబ్రహ్మము నీవే యనగా జీవునియందు దోచుచున్న దుఃఖాదులు వాస్తవముగావని తోచి నివర్తించును. ఈ ప్రకారముగా తత్పదార్థమునకు త్వం పదార్థము విశేషణముకాగానే త్వం పదార్థమునందు దోచుచున్న దుఃఖత్వము నివర్తించును. ఈ ప్రకారమే ‘తత్’ పదార్థమునకు త్వం పదార్థము విశేషణము కాగానే త్వం పదార్థమునందు దోచుచున్న పరోక్షత్వము (అనాత్మత్వము) నివర్తించును).
(బ్రహ్మ రూపము రెండు విధములుగా నున్నది - సాకారము, నిరాకారము. “సత్యస్య సత్యం” అని బ్రహ్మగుఱించి చెప్పబడినది. ఇచ్చట ప్రాణములు సత్యము - వాటికికూడ సత్యమైనది పరబ్రహ్మ. చేతనములైన ప్రాణములకన్న సత్యమైనది. విశ్వము - (ప్రపంచము) నకు పతి అయినవాడు - ఆత్మ అయినవాడు - ప్రపంచము తానే అయినందున ప్రపంచమే శరీరమైనవాడు, నిత్యములైనవాటికి నిత్యమైనవాడు, చేతన వస్తువులకు చేతనమైనవాడు ని శ్రుతులు చెప్పుచున్నవి. అహి అనినను కుండలము అనినను పాము అనే అర్థము. కాంతికి, కాంతిగలవస్తువునకు భేదములేనట్లు. ఒకటి విశేష్యము, రెండవది విశేషణము. ఆ ప్రకారమే పరబ్రహ్మకు జీవునికి విశేషణ విశేష్యభావము కలదు -).
(“saḥ ayaṃ dēvadattaḥ” anu vākyamulō ‘saḥ’ anu māṭaku ā dēvadattuḍu - ā kālamaṃdali dēvadattuḍu, idivaraku ceppabaḍina, lēka cūḍabaḍina dēvadattuḍu ani arthamu - ayaṃ dēvadattuḍu ani vākyamulō ‘ayaṃ’ anagā ippuḍu ceppabaḍina dēvadattuḍu ani arthamu - idivaraku cūsina ā dēvadattuḍē yī dēvadattuḍu. ā dēvadattunuki ī dēvadattuniki bhēdamu lēkapōvuṭacēta viśēṣaṇa viśēṣyabhāvamu. ā prakāramugā “tatvamasi” (ā parabrahma nīvē ayitivi) yanu vākyamunaṃdu ‘tat’ anu padamunaku arthamagu parōkṣa parabrahmamunaku, ‘tvaṃ’ padamunaku arthamaina aparōkṣatvamu modalagu lakṣaṇamulugala viśiṣṭa caitanyamagu jīvunakunu bhēdamu lēnaṃduna, iddaru okaṭē kanuka viśēṣaṇa viśēṣyabhāvamu -).
(dēhēṃdriyādi viśiṣṭamaina caitanyamu ‘tvaṃ’ padārthamu. iṭṭi tvaṃ padārthamu dēhēṃdriyādi saṃbaṃdhamucēta ādhyātmikādi duḥkhamulu kaligiyunnaṭlu teliyabaḍucunnadi. “satyaṃ jñānamanaṃtaṃ brahma”, “vijñānamānaṃdaṃ brahma”, “ēka mēvā dvitīyaṃ” ityādi śrutulacēta advitīya saccidānaṃda svarūpamaina parabrahmamē tatpadārthamu. iṭṭi tatpadārthamu ahaṃ ani pratyakṣamugā prakāśiṃpanaṃduna, parōkṣamainaṭlu teliyacunnadi. iṃdulō ‘tatvamasi’ anu vākyamunaṃdu ‘tvaṃ’ padārthamunaku ‘tat’ padārthamu viśēṣaṇamu kāgānē tvaṃ padārthamunaṃdu tōcabaḍucunna duḥkhatvamu nivartiṃcunu, anagā, paramānaṃdasvarūpamaina parabrahmamu nīvē yanagā jīvuniyaṃdu dōcucunna duḥkhādulu vāstavamugāvani tōci nivartiṃcunu. ī prakāramugā tatpadārthamunaku tvaṃ padārthamu viśēṣaṇamukāgānē tvaṃ padārthamunaṃdu dōcucunna duḥkhatvamu nivartiṃcunu. ī prakāramē ‘tat’ padārthamunaku tvaṃ padārthamu viśēṣaṇamu kāgānē tvaṃ padārthamunaṃdu dōcucunna parōkṣatvamu (anātmatvamu) nivartiṃcunu).
(brahma rūpamu reṃḍu vidhamulugā nunnadi - sākāramu, nirākāramu. “satyasya satyaṃ” ani brahmaguṟiṃci ceppabaḍinadi. iccaṭa prāṇamulu satyamu - vāṭikikūḍa satyamainadi parabrahma. cētanamulaina prāṇamulakanna satyamainadi. viśvamu - (prapaṃcamu) naku pati ayinavāḍu - ātma ayinavāḍu - prapaṃcamu tānē ayinaṃduna prapaṃcamē śarīramainavāḍu, nityamulainavāṭiki nityamainavāḍu, cētana vastuvulaku cētanamainavāḍu ni śrutulu ceppucunnavi. ahi aninanu kuṃḍalamu aninanu pāmu anē arthamu. kāṃtiki, kāṃtigalavastuvunaku bhēdamulēnaṭlu. okaṭi viśēṣyamu, reṃḍavadi viśēṣaṇamu. ā prakāramē parabrahmaku jīvuniki viśēṣaṇa viśēṣyabhāvamu kaladu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.