← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణుః viṣṇuḥ

Original — తెలుగు
  1. దేవేష్టి వ్యాప్నోతి విశ్వం యః సః విష్ణుః -

(ప్రపంచమంతటిలోను, ప్రపంచములోనుండు అన్ని వస్తువులలోను వ్యాపించియుండువాడు - సర్వవ్యాపి)

  1. “వేనేషి సర్వం హగత్”

(జగత్తు అంతటిలోను వ్యాపించియుండువాడు)

  1. వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - దేశకాలపరిచ్ఛేద శూన్యః ఇత్యర్థః;” (శ్రీశంకరః)

(వ్యాపించియుండువాడు - ఈ దేశములో లేడు, ఈ కాలమందు లేడు, ఈ వస్తువులో లేడు అను మూడు విధముల పరిచ్ఛేదము లేకుండ అన్ని దేశములందు, అన్ని కాలములందు, అన్ని వస్తువులందు వ్యాపించియుండువాడు).

  1. విశతీతి విష్ణుః - “వివేశభూతాని చరాచరాణి” (తైత్తిరీయోపనిషత్)

(అన్నింటిలోను - ప్రవేశించువాడు కనుక విష్ణువు. “చరా చర భూతములన్నింటిలోను ప్రవేశించియుండువాడు” అని తైత్తిరీయోపనిషత్తు చెప్పుచున్నది.)

  1. “వ్యాప్య సర్వానిమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః |

తతశ్చ విష్ణునామాని, విశోర్థాతోః ప్రవేశనాత్ ||“. (హరివంశము)

(ఈ లోకములన్నింటిలోను అన్నిచోట్ల కేశవుడు వ్యాపించియున్నాడు - ‘విశ్’ అను ధాతువునకు ప్రవేశము అని అర్థము - అన్నింటిలోను ప్రవేశించి యుండుటచేత నీవు విష్ణువు అని పేరుపలిగియున్నావు. విష్ణువు అనుమాట ‘విశ్’ అని ధాతువునుండి కలిగినది)

  1. వేష్టి వ్యాప్నోతి విశ్వం, వేషతి సంజతి ఆప్యాయతే విశ్వమితి, విసతి సర్వభూతాని అత్ర ఇతి - విశధాతో ప్రవేశనాత్ -

(ప్రపంచమునంతటను వ్యాపించియుండువాడు, భూతములన్నింటిలోను ప్రవేశించియుండువాడు - ‘విశ్’ అను ధాతువునుండి ‘విష్ణు’ అను పదము పుట్టినది, ‘విశ్’ అను ధాతువునకు అర్థము ప్రవేశించుట).

  1. “యస్మాత్ విష్తమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనాం

తస్మాత్ విష్ణుఃరితిఖ్యాతో విశోర్థాతోః ప్రవేశనాత్“. (విష్ణుపురాణము)

(‘విశ్’ అను ధాతువునకు అర్థము ప్రవేశించుట. ఈ ప్రపంచమంతటిలోను తన శక్తితో ప్రవేశించి యున్నాడు కనుక విష్ణువని చెప్పబడుచున్నాడు)

  1. వ్యాపీ వ్యాపన శీలః వ్యాపకః -

(వ్యాపించియుండువాడు, వ్యాపించియుండుగుణము, శక్తి గలవాడు, వ్యాపించువాడు)

  1. సర్వవ్యాపనశీలతయా సర్వాంతర్యామీభూతః నారాయణః.

(అన్నింటిలోను వ్యాపించియుండు స్వభావముగలవాడు కనుక అన్నింటిలోను అంతర్యామిగానుండు నారాయణుడే విష్ణువు).

  1. “వ్యాప్తే మేరోదసీపార్థ క్రాంతిశ్చాభ్యిధికా స్థితా |

క్రమణం చాప్యహం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞితః“. || (మహాభారతము - శాంతి పర్వము)

(పార్థా, ఈ భూమికి అ, ఆకాశముమనకు మధ్యనుండు అంతరాళమును నేను వ్యాపించియున్నాను - అందుచేత విష్ణువని చెప్పబడుచున్నాను).

“ధ్యావా పృధివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వమైకేవ దిశశ్చ సర్వాః |” (శ్రీమద్భగవద్గీత - 11 - 20)

(భూనభోంతరములోను, అన్ని దిక్కులను నీవు వ్యాపించియున్నావు)

  1. అయంచ లోక్చోపరశ్చలోకః సర్వాణి భూతాని దేవాశ్చ దివ్యాని చ లోకాశ్చ లోకినశ్చ |

అలోకాశ్చ అలోకినశ్చ విష్ణావే ఓతాశ్చ ప్రోతాశ్చ్జ భవంతి

(ఈ లోకము,పరలోకము) సమస్త భూతంలు, దేవతలు దేవలోకములు, లోకములోనుండునవి, అలోకములు, అలోకములలోనుండువారు - ఇవన్నియు విష్ణువునందే, బట్టలోని పొడుగు, పేక దారములవలె అల్లుకొనబడియున్నవి).

  1. “ఓత ప్రోత సమస్త వస్తుని చయం” (శ్రీరామకర్ణామృతం - 2 - 50)

(నిలుదారములతోను, అడ్డు దారములతోను నేసిన బట్టవలె సమస్త వస్తువులలోను వ్యాపించియున్నవాడు - శ్రీమహావిష్ణువు)

  1. “యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మనః, సర్వాణి భూతని వ్యాప్నోతి వ్యాపయతి స్నేహోయధా పలుపిండం శాంతమూలం మోతం ప్రోతం అనువ్యాప్తం వ్యతిషిక్తో వ్యాప్యతే. తస్మాదుచ్యతే మహా విష్ణురితి.” (నృసింహతాపిన్యుపనిషత్)

(తన మహిమచే - శక్తిచే - సమస్త లోకములను, సమస్త దేవతలను, సమస్త ఆత్మలను, సమస్త భూతములను వ్యాపించియున్నాడు - స్నేహము మాంసపుముద్దను వ్యాపించియుండునట్లు - అందుచేత విష్ణువని చెప్పబడును -

  1. ‘తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్’ (మంత్రపుష్పము)

(దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను - సృష్టించిన ప్రతివస్తువులోను భగవంతుడు ప్రవేశించియున్నాడు

“ఇందుగలడందులేడని సందేహమువలదు, చక్రి సర్వోపగతుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

(Every particle of matter contains Energy). భగవంతుడు ప్రతి వస్తువులోను ఎట్లు ప్రవేశించియున్నాడో, అను విషయము ఈ క్రింద వివరింపబడినది : -

చైతన్యరూపం మాయా విశిష్టం కారణం ఓషధీభిః వ్రీహి యవాదిభిః ఉపలక్షితం అన్నం భూత్వా పురుషాన్, మనుష్యాన్ పశూన్శ్చ తదుపలక్షిత స్థావర జంగమాని శరీరాణి సర్వాణ్యపి వివేశ వృక్షాదిషు స్థావరేషు వృష్టి జలరూపేణ ప్రవేశః తేన చైతన్యేన సర్వం జగత్ పరివలితమితిభావః. ఓషధి పురుష పశ్వాది చరాచరాణి ఆత్మతయా ప్రవిష్టం ఇత్యర్థః.

(మాయా విశిష్టము, అన్నింటికీ కారణమైన చైతన్యము వ్రీహి యవలు మొదలగు ఓషధులరూపమైన అన్నముగా మారి పురుషులను, మనుష్యులను, పశువులను మొదలగు స్థావర జంగమములగు శరీరములన్నింటిలోను ప్రవేశించెను. వృక్షములు మొదలగు స్థావరములందు ఆ చైతన్యము జలరూపములో ప్రవేశించెను, ఆ చితన్యమే జగత్తు అంతటిని ప్రవేశించెను అని అర్థము - అనగా, ఓషధులలోను పురుషులలోను పశువులు మొదలగు చరాచరములను ఆత్మరూపముగా ప్రవేశించెను - అని భావము)

  1. గో జఠరగత వత్సవత్ సర్వవ్యాప్తస్య బ్రహ్మణః ప్రత్యేకం సర్వ వస్తుషు పుష్కల ప్రతీత్యర్థః - స్థితి విశేష ఏవ అను ప్రవేశః -

(ఆవు కడుపులోనుండు దూడవలె అన్నింటిలోను వ్యాపించియుండు బ్రహ్మ ప్రతివస్తువులోను ప్రత్యేకముగా పుష్కలముగా ఉండడమే భగవంతుడు అన్నింటిలోను ప్రవేశించియుండును అనుటకు అర్థము)

  1. అన్నమయాదంతరో అన్యో అంతర ఆత్మా ప్రాణమయః, తదంతర్మనోకయః, విజ్ఞానమయః ఇతి విజ్ఞాన గుహాయాం ప్రవేశితః. తత్ర చానందమయో విశిష్ట ఆత్మా ప్రదర్శితః. అతః పరమానందమయ లింగాధిగమన ద్వారేణ వికల్పాస్పదో నిర్వికల్పకో అస్యామేవ గుహాయాం అధిగంతవ్యః ఇతి తత్ప్రవేశః కల్ప్యతే. నహ్యన్యత్రోపలభ్యతే బ్రహ్మ. నిర్విశేషత్వాత్ విశేష సంబంధోహి ఉపలబ్ది హేతుః దృష్టః - యధారాహోః చంద్రార్క విశేష సంబంధః. ఏవం అంతఃకరణ గుహాత్మసంబంధో బ్రహ్మణః ఉపలబ్ది హేతుః సన్నికర్షాత్ అవభాసకత్వచ్చ అంతఃకరణస్య, యధా చ లోకవిశిష్ట ఘటాద్యుపలబ్దిః - ఏవం బుద్ధి ప్రత్యయా లోక విశిష్టాత్మోపలబ్ధిస్యాత్. తస్మాత్ ఉపలబ్ధిహేతౌ గుహాయాం నిహితమితి ప్రకృతమేవ. తదృత్తిస్థానీ యేత్విహ పునః స్తత్స్వష్ట్వా తదనుప్రవిష్టః ఇతి వా అంతర్గుహాయాం బుద్ధౌ దృష్టృ శ్రోతృ విజ్ఞాత్రిత్యేవం విశేషవదుపలభ్యతే - స ఏవ తస్య ప్రవేశః-

(ఆత్మ - అంతరాత్మ - అన్నమయకోశము, దానిలోపలనుండు ప్రాణమయకోశము, దానిలోపలనుండు విజ్ఞానమయకోశము, దీనిలో గుహవలె గుప్తమగుచోట ప్రవేశించెను - అచ్చట ఆనందమయుడైన విశిష్ట ఆత్మ ఉన్నట్లు ప్రదర్శింపబడినది. తత్ సృష్ట్వా, తదేవానుప్రావిశత్ (దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను) అనునపుడు ప్రవేశము పైన చెప్పిన ప్రకారమే జరుగును. అంతఃకరణము పరబ్రహ్మకు స్థానమగుటచేత - ఆ ప్రకారముగానే లోకములో విశిష్టాత్మ (జీవాత్మ) కు బుద్ధి ఉపలబ్దిస్థానము - అందుచేత “నిహితం గుహాయాం” (గుహవలె గుప్తముగానుండుదానిలో ఉన్న ఆత్మ అని చెప్పబడినది)

  1. “యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః” (మంత్రపుష్ఫము) (“హరిమయముకాని ద్రవ్యము పరమాణువులేదు-”)

(జగత్తు ఏకొంచెమైన కనబడుచున్నదో, అదికాక ఇంకా ఉన్నదని చూచినవారు చెప్పగా వింటున్నామో, అదియుకాక ఇంకా ఎంత ఉన్నదో, ఇదంతటిలోను - లోపల పైన - పూర్తిగా నారాయణుడు - విష్ణువు - వ్యాపించియున్నాడు)

  1. “విష్ణుః సర్వవ్యాపిత్వ ప్రవేశి త్వాదేః”

(ఆన్నింటిలోను వ్యాపించియుండుటవలనను, అన్నింటిలోను ప్రవేశించియుండుటవలనను విష్ణువని చెప్పబడుచున్నాడు).

  1. “విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటె వేఱేమియును లేదు, విశ్వముకను భవ వృద్ధిలయములా పరమేశు చే నగు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 65)

  1. “విష్ణుః పరమః” ఇతి శ్రుతిః - (తైత్తిరీయోపనిషత్ - 1 - 7 - 4)

(విష్ణువే పరతత్వము - ఉత్కృష్టమైనవాడు)

  1. “బ్రహ్మ శబ్ద పరే విష్ణౌ నాన్యత్రక్వచి దిష్యతే -”

(బ్రహ్మ అనగా విష్ణువే - ఇతరులందు ఈ పదము వర్తించదు)

  1. “ఆదిత్యానామహం విష్ణుః” (శ్రీమద్భగవద్గీత - 10 - 21)

“ద్వాదశాదిత్యానాం విష్ణుఃనామ ఆదిత్యః” (శ్రీశంకరః)

“ద్వాదశ సంఖ్యా సంఖ్యాతానాం ఆదిత్యానాం ద్వాదశోయః ఉత్కృష్టో విష్ణుర్నామాదిత్యో సః”. (శ్రీమాన్ రామానుజః)

(పన్నెండుమంది ఆదిత్యులలోను - (అదితి పుత్రులలోను) - ప్రకాశించువారలలో - ఉత్కృష్టుడు, విష్ణువు అను పేరుగల ఆదిత్యుడను నేనే - వామనావతారుడు అదితి కుమారుడే).

  1. “యజ్ఞో వైవిష్ణుః” ఇతి శృతేః -

(విష్ణువే యజ్ఞము - యజ్ఞభాగములు, యజ్ఞసాధనములు, యజ్ఞము చేయువాడు, యజ్ఞము చేయించువాడు, అగ్ని, అగ్నిలో హుతము చేయునది, యజ్ఞఫలమునిచ్చువాడు విష్ణువే).

  1. “అహంచ సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ” (శ్రీమద్భగవద్గీత - 9 - 24)

(యజ్ఞభోక్త, యజ్ఞప్రభువు శ్రీకృష్ణుడే - శ్రీమహావిష్ణువే)

“అహం విష్ణుః సమస్తానాం యజ్ఞనా మాశ్రయః ప్రభుః |

మత్స్వామికో యజ్ఞాస్తే యజ్ఞభోక్తా మహేశ్వరః ||“.

(అన్ని యజ్ఞములకు ఆశ్రియుడను, ప్రభువును, నేనే.)

  1. “జ్యోతీమ్షి విష్ణుర్భువనాని విష్ణుః వనాని విష్ణుర్గిరయో దిశశ్చ |

నద్యం సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి, యన్నాస్తి చ విప్రవర్య ||“. (విష్ణుపురాణము)

(తేజోరూపములైనవన్నియును, లోకములన్నియును,కొండలు, దిక్కులు, నదులు, సముద్రములు, ఉన్నవి, లేనివి - అన్నియు ఆ శ్రీమహావిష్ణువే - అవన్నియు అతని రూపములే).

  1. “విశ్వాత్మకం వ్యాపకం” (శ్రీరామకర్ణామృతం - 1 - 31)

(శ్రీరామచంద్ర పరబ్రహ్మ విశ్వమే ఆత్మగా - తన శరీరముగా గలవాడు, విశ్వమంతటను పూర్తిగా, లోపల పైన పూర్తిగా వ్యాపించియుండువాడు).

  1. “సర్వం విష్ణుమయం జగత్” (“హరిమయము విశ్వమంతయు”) (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  2. “హ్రస్వదీర్ఘ ఘ్లతైర్యత్తు కించిద్వస్త్వభిధీయతే |

యచ్చవాచామ విషయే తత్సర్వం విష్ణురవ్యయః - ||“. (విష్ణుపురాణము)

(పొట్టిది, పొడుగుది అనికాని, చిన్నది, పెద్దది యనికాని చెప్పబడు యేదైన వస్తువున్నయడల, అది వాక్కునకందరానిదైన యడల, - చెప్పుటకు వీలుకానిది అయినయడల (వాచామగోచరం) - అది అంతయు అవ్యయుడైన (నాశరహితుడైన) ఆ మహావిష్ణువే).

  1. “సీ. - - -

- -విష్ణుడనగ

నన్యుడొక్కడులేడు; యజ్ఞంబు, వేదంబు నతడె; భూదేవ క్రియాది మూల

మతడే; దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదారములకు మహాధారమతడె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 34)

  1. “అజ్ఞానాం జ్ఞాన వో విష్ణుః జ్ఞానినాం మోక్షదశ్చ సః |

ఆనందశ్చ ముక్తానాం స ఏవైకో జనార్థనః ||“.

(అజ్ఞానులకు జ్ఞానము నిచ్చువాడు, జ్ఞానులకు మోక్షము నిచ్చువాడు విష్ణువు, ముక్తులకు ఆనందము నిచ్చువాడు అతడొక్కడే).

  1. “వేదే రామాయణే చైవ పురాణే, భారతే తథా |

ఆదావంతే చ మధ్యేచ విష్ణుః సర్వత్రగీయతే ||“.

(వేదములలోను, పురాణములలోను, భారతములోను, మొదట, మధ్యను, అంతమందు - అంతటా అన్నిచోట్ల విష్ణువే గానము చేయబడుచున్నాడు, కీర్తింపబడుచున్నాడు, ప్రశంసింపబడుచున్నాడు)

  1. “యథా తరోః మూలావసేచనం స్కందానాంశాఖానాం అవశేచనం భవతి, తథా ఏవం ఆరాధనం విష్ణోః సర్వేషాం ఆత్మనశ్చహి”.

“క. మొదల జలమిడిన భూజము

తుది నడిమను చల్లదనము దొరకును మాడ్కిన్

మొదలను హరికి మ్రొక్కిన

ముదమందుదుము ఎల్లవేల్పుల మూకలు నేనున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 5 - 156)

  1. “మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం తత్ |

ప్రాహః పరమాత్మవపురేవ సదాశివో (అ)స్మిన్ |

తత్రేశ్వరస్తు స వికుంఠిపదస్త్వమేవ తత్వం పరర్భాజసి సత్యపదే త్రిభాగే ||“. (నారాణీయం - 90 - దశకం)

(బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు, ఈశ్వరుడు, సదాశివుడు అను పంచకమేది కలదో అదియే పరమాత్మరూపము - సదాశివుడని దేనిని చెప్పుచున్నారో ఆ ఈశ్వరుడను పరమపదమని చెప్పబడు వైకుంఠము థామముగా గలవాడు అగు ఆ పరతత్వము - నీవే (విష్ణువే).

  1. “ఆ మహత్తందు ఉత్తమ మధ్యమ కనిష్టోహం ||

అనెడి అహంకార త్రితయోత్పత్తి - - - అందులో “ఉత్తమోహం” అనెడి వైకారికాహంకారంవల్లనున్నూ, సత్వగుణంవల్లనున్నూ బ్రహ్మాండమనెడి స్థూలదేహుండై మోహన వికృతిభావంతో గూడి జ్ఞానశక్తుండై విరాట్పురుషుండై విష్ణుండనిపించుకొనును”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)

  1. సత్వగుణప్రథాన మాయా విశిష్ట చైతన్యము -

  2. “విశ్ ప్రవేశనే” (విశ్ అను ధాతువునుండి విష్ణు అను పదము పుట్టినది - ‘విశ్’ అనగా ప్రవేశించుట - అందుచేత విష్ణువనగా అన్నివస్తువులలోను ప్రవేశించియుండువాడు అని అర్థము - “విష్ వ్యాప్తౌ” వ్యాపించుట అని అర్థము. అన్ని వస్తువులలోను వ్యాపించియుండువాడు - గనుక విష్ణువు.

  3. “శ్రవణాత్ సర్వ పాపఘ్నం, మననాత్ పుణ్యవర్థనం |

స్వధ్యానాత్సిద్ధిదం విష్ణుం ప్రేక్షణాత్ మోక్షదం భజే ||“. (శ్రీవేంకటేశ్వరమాహాత్మ్యము - 3 - 6)

  1. జీవకణము (energy cell) యొక్క అసాధారణ లక్షణములు (ప్రత్యేక లక్షణములు) మూడు అని ఆధునిక శాస్త్రము (present day science) చెప్పుచున్నది –

(1) తినుట - (it eats its environment),

(2) వ్యాపించుట (growth)

(3) వృద్ధి పొందుట (multiply itself - i.e., dividing itself into similar cells, each one of its own size and capability to grow and expand). ఆత్మ యనగా తినునది (అత్తి) అని అర్థము - (చూడుము - ‘ఆత్మ’), సంహరించుట, జీవకణముయొక్క మొదటి లక్షణము కలది. విష్ణువు అనగా వ్యాపించువాడు - ఇది రెందవ లక్షణము - బ్రహ్మ అనగా పెద్దదిగా పెరుగుట - (బృంహణము) - ఇది మూడవ లక్షణము - ఈ ప్రకారము జీవకణము యొక్క మూడు లక్షణములు ఆత్మ, విష్ణు, బ్రహ్మ అను మూడు పదములచేత చెప్పబడినవి. ఈ జీవకణములు అను ఉపాధిలోనున్న భగవంతుడు ఈ మూడు లక్షణములు కలవాడు) -

Transliteration
  1. dēvēṣṭi vyāpnōti viśvaṃ yaḥ saḥ viṣṇuḥ -

(prapaṃcamaṃtaṭilōnu, prapaṃcamulōnuṃḍu anni vastuvulalōnu vyāpiṃciyuṃḍuvāḍu - sarvavyāpi)

  1. “vēnēṣi sarvaṃ hagat”

(jagattu aṃtaṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu)

  1. vēvēṣṭi vyāpnōtīti viṣṇuḥ - dēśakālaparicchēda śūnyaḥ ityarthaḥ;” (śrīśaṃkaraḥ)

(vyāpiṃciyuṃḍuvāḍu - ī dēśamulō lēḍu, ī kālamaṃdu lēḍu, ī vastuvulō lēḍu anu mūḍu vidhamula paricchēdamu lēkuṃḍa anni dēśamulaṃdu, anni kālamulaṃdu, anni vastuvulaṃdu vyāpiṃciyuṃḍuvāḍu).

  1. viśatīti viṣṇuḥ - “vivēśabhūtāni carācarāṇi” (taittirīyōpaniṣat)

(anniṃṭilōnu - pravēśiṃcuvāḍu kanuka viṣṇuvu. “carā cara bhūtamulanniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu” ani taittirīyōpaniṣattu ceppucunnadi.)

  1. “vyāpya sarvānimān lōkān sthitaḥ sarvatra kēśavaḥ |

tataśca viṣṇunāmāni, viśōrthātōḥ pravēśanāt ||“. (harivaṃśamu)

(ī lōkamulanniṃṭilōnu annicōṭla kēśavuḍu vyāpiṃciyunnāḍu - ‘viś’ anu dhātuvunaku pravēśamu ani arthamu - anniṃṭilōnu pravēśiṃci yuṃḍuṭacēta nīvu viṣṇuvu ani pērupaligiyunnāvu. viṣṇuvu anumāṭa ‘viś’ ani dhātuvunuṃḍi kaliginadi)

  1. vēṣṭi vyāpnōti viśvaṃ, vēṣati saṃjati āpyāyatē viśvamiti, visati sarvabhūtāni atra iti - viśadhātō pravēśanāt -

(prapaṃcamunaṃtaṭanu vyāpiṃciyuṃḍuvāḍu, bhūtamulanniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu - ‘viś’ anu dhātuvunuṃḍi ‘viṣṇu’ anu padamu puṭṭinadi, ‘viś’ anu dhātuvunaku arthamu pravēśiṃcuṭa).

  1. “yasmāt viṣtamidaṃ sarvaṃ tasya śaktyā mahātmanāṃ

tasmāt viṣṇuḥritikhyātō viśōrthātōḥ pravēśanāt”. (viṣṇupurāṇamu)

(‘viś’ anu dhātuvunaku arthamu pravēśiṃcuṭa. ī prapaṃcamaṃtaṭilōnu tana śaktitō pravēśiṃci yunnāḍu kanuka viṣṇuvani ceppabaḍucunnāḍu)

  1. vyāpī vyāpana śīlaḥ vyāpakaḥ -

(vyāpiṃciyuṃḍuvāḍu, vyāpiṃciyuṃḍuguṇamu, śakti galavāḍu, vyāpiṃcuvāḍu)

  1. sarvavyāpanaśīlatayā sarvāṃtaryāmībhūtaḥ nārāyaṇaḥ.

(anniṃṭilōnu vyāpiṃciyuṃḍu svabhāvamugalavāḍu kanuka anniṃṭilōnu aṃtaryāmigānuṃḍu nārāyaṇuḍē viṣṇuvu).

  1. “vyāptē mērōdasīpārtha krāṃtiścābhyidhikā sthitā |

kramaṇaṃ cāpyahaṃ pārtha viṣṇurityabhisaṃjñitaḥ”. || (mahābhāratamu - śāṃti parvamu)

(pārthā, ī bhūmiki a, ākāśamumanaku madhyanuṃḍu aṃtarāḷamunu nēnu vyāpiṃciyunnānu - aṃducēta viṣṇuvani ceppabaḍucunnānu).

“dhyāvā pṛdhivyōridamaṃtaraṃ hi vyāptaṃ tvamaikēva diśaśca sarvāḥ |” (śrīmadbhagavadgīta - 11 - 20)

(bhūnabhōṃtaramulōnu, anni dikkulanu nīvu vyāpiṃciyunnāvu)

  1. ayaṃca lōkcōparaścalōkaḥ sarvāṇi bhūtāni dēvāśca divyāni ca lōkāśca lōkinaśca |

alōkāśca alōkinaśca viṣṇāvē ōtāśca prōtāścja bhavaṃti

(ī lōkamu,paralōkamu) samasta bhūtaṃlu, dēvatalu dēvalōkamulu, lōkamulōnuṃḍunavi, alōkamulu, alōkamulalōnuṃḍuvāru - ivanniyu viṣṇuvunaṃdē, baṭṭalōni poḍugu, pēka dāramulavale allukonabaḍiyunnavi).

  1. “ōta prōta samasta vastuni cayaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

(niludāramulatōnu, aḍḍu dāramulatōnu nēsina baṭṭavale samasta vastuvulalōnu vyāpiṃciyunnavāḍu - śrīmahāviṣṇuvu)

  1. “yasmāt svamahimnā sarvān lōkān sarvān dēvān sarvānātmanaḥ, sarvāṇi bhūtani vyāpnōti vyāpayati snēhōyadhā palupiṃḍaṃ śāṃtamūlaṃ mōtaṃ prōtaṃ anuvyāptaṃ vyatiṣiktō vyāpyatē. tasmāducyatē mahā viṣṇuriti.” (nṛsiṃhatāpinyupaniṣat)

(tana mahimacē - śakticē - samasta lōkamulanu, samasta dēvatalanu, samasta ātmalanu, samasta bhūtamulanu vyāpiṃciyunnāḍu - snēhamu māṃsapumuddanu vyāpiṃciyuṃḍunaṭlu - aṃducēta viṣṇuvani ceppabaḍunu -

  1. ‘tatsṛṣṭvā tadēvānuprāviśat’ (maṃtrapuṣpamu)

(dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu - sṛṣṭiṃcina prativastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃciyunnāḍu

“iṃdugalaḍaṃdulēḍani saṃdēhamuvaladu, cakri sarvōpagatuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu -)

(Every particle of matter contains Energy). bhagavaṃtuḍu prati vastuvulōnu eṭlu pravēśiṃciyunnāḍō, anu viṣayamu ī kriṃda vivariṃpabaḍinadi : -

caitanyarūpaṃ māyā viśiṣṭaṃ kāraṇaṃ ōṣadhībhiḥ vrīhi yavādibhiḥ upalakṣitaṃ annaṃ bhūtvā puruṣān, manuṣyān paśūnśca tadupalakṣita sthāvara jaṃgamāni śarīrāṇi sarvāṇyapi vivēśa vṛkṣādiṣu sthāvarēṣu vṛṣṭi jalarūpēṇa pravēśaḥ tēna caitanyēna sarvaṃ jagat parivalitamitibhāvaḥ. ōṣadhi puruṣa paśvādi carācarāṇi ātmatayā praviṣṭaṃ ityarthaḥ.

(māyā viśiṣṭamu, anniṃṭikī kāraṇamaina caitanyamu vrīhi yavalu modalagu ōṣadhularūpamaina annamugā māri puruṣulanu, manuṣyulanu, paśuvulanu modalagu sthāvara jaṃgamamulagu śarīramulanniṃṭilōnu pravēśiṃcenu. vṛkṣamulu modalagu sthāvaramulaṃdu ā caitanyamu jalarūpamulō pravēśiṃcenu, ā citanyamē jagattu aṃtaṭini pravēśiṃcenu ani arthamu - anagā, ōṣadhulalōnu puruṣulalōnu paśuvulu modalagu carācaramulanu ātmarūpamugā pravēśiṃcenu - ani bhāvamu)

  1. gō jaṭharagata vatsavat sarvavyāptasya brahmaṇaḥ pratyēkaṃ sarva vastuṣu puṣkala pratītyarthaḥ - sthiti viśēṣa ēva anu pravēśaḥ -

(āvu kaḍupulōnuṃḍu dūḍavale anniṃṭilōnu vyāpiṃciyuṃḍu brahma prativastuvulōnu pratyēkamugā puṣkalamugā uṃḍaḍamē bhagavaṃtuḍu anniṃṭilōnu pravēśiṃciyuṃḍunu anuṭaku arthamu)

  1. annamayādaṃtarō anyō aṃtara ātmā prāṇamayaḥ, tadaṃtarmanōkayaḥ, vijñānamayaḥ iti vijñāna guhāyāṃ pravēśitaḥ. tatra cānaṃdamayō viśiṣṭa ātmā pradarśitaḥ. ataḥ paramānaṃdamaya liṃgādhigamana dvārēṇa vikalpāspadō nirvikalpakō asyāmēva guhāyāṃ adhigaṃtavyaḥ iti tatpravēśaḥ kalpyatē. nahyanyatrōpalabhyatē brahma. nirviśēṣatvāt viśēṣa saṃbaṃdhōhi upalabdi hētuḥ dṛṣṭaḥ - yadhārāhōḥ caṃdrārka viśēṣa saṃbaṃdhaḥ. ēvaṃ aṃtaḥkaraṇa guhātmasaṃbaṃdhō brahmaṇaḥ upalabdi hētuḥ sannikarṣāt avabhāsakatvacca aṃtaḥkaraṇasya, yadhā ca lōkaviśiṣṭa ghaṭādyupalabdiḥ - ēvaṃ buddhi pratyayā lōka viśiṣṭātmōpalabdhisyāt. tasmāt upalabdhihētau guhāyāṃ nihitamiti prakṛtamēva. tadṛttisthānī yētviha punaḥ statsvaṣṭvā tadanupraviṣṭaḥ iti vā aṃtarguhāyāṃ buddhau dṛṣṭṛ śrōtṛ vijñātrityēvaṃ viśēṣavadupalabhyatē - sa ēva tasya pravēśaḥ-

(ātma - aṃtarātma - annamayakōśamu, dānilōpalanuṃḍu prāṇamayakōśamu, dānilōpalanuṃḍu vijñānamayakōśamu, dīnilō guhavale guptamagucōṭa pravēśiṃcenu - accaṭa ānaṃdamayuḍaina viśiṣṭa ātma unnaṭlu pradarśiṃpabaḍinadi. tat sṛṣṭvā, tadēvānuprāviśat (dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu) anunapuḍu pravēśamu paina ceppina prakāramē jarugunu. aṃtaḥkaraṇamu parabrahmaku sthānamaguṭacēta - ā prakāramugānē lōkamulō viśiṣṭātma (jīvātma) ku buddhi upalabdisthānamu - aṃducēta “nihitaṃ guhāyāṃ” (guhavale guptamugānuṃḍudānilō unna ātma ani ceppabaḍinadi)

  1. “yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śrūyatē pivā aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇasthitaḥ” (maṃtrapuṣphamu) (“harimayamukāni dravyamu paramāṇuvulēdu-”)

(jagattu ēkoṃcemaina kanabaḍucunnadō, adikāka iṃkā unnadani cūcinavāru ceppagā viṃṭunnāmō, adiyukāka iṃkā eṃta unnadō, idaṃtaṭilōnu - lōpala paina - pūrtigā nārāyaṇuḍu - viṣṇuvu - vyāpiṃciyunnāḍu)

  1. “viṣṇuḥ sarvavyāpitva pravēśi tvādēḥ”

(ānniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭavalananu, anniṃṭilōnu pravēśiṃciyuṃḍuṭavalananu viṣṇuvani ceppabaḍucunnāḍu).

  1. “viṣṇuṃḍu viśvaṃbu, viṣṇunikaṃṭe vēṟēmiyunu lēdu, viśvamukanu bhava vṛddhilayamulā paramēśu cē nagu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 65)

  1. “viṣṇuḥ paramaḥ” iti śrutiḥ - (taittirīyōpaniṣat - 1 - 7 - 4)

(viṣṇuvē paratatvamu - utkṛṣṭamainavāḍu)

  1. “brahma śabda parē viṣṇau nānyatrakvaci diṣyatē -”

(brahma anagā viṣṇuvē - itarulaṃdu ī padamu vartiṃcadu)

  1. “ādityānāmahaṃ viṣṇuḥ” (śrīmadbhagavadgīta - 10 - 21)

“dvādaśādityānāṃ viṣṇuḥnāma ādityaḥ” (śrīśaṃkaraḥ)

“dvādaśa saṃkhyā saṃkhyātānāṃ ādityānāṃ dvādaśōyaḥ utkṛṣṭō viṣṇurnāmādityō saḥ”. (śrīmān rāmānujaḥ)

(panneṃḍumaṃdi ādityulalōnu - (aditi putrulalōnu) - prakāśiṃcuvāralalō - utkṛṣṭuḍu, viṣṇuvu anu pērugala ādityuḍanu nēnē - vāmanāvatāruḍu aditi kumāruḍē).

  1. “yajñō vaiviṣṇuḥ” iti śṛtēḥ -

(viṣṇuvē yajñamu - yajñabhāgamulu, yajñasādhanamulu, yajñamu cēyuvāḍu, yajñamu cēyiṃcuvāḍu, agni, agnilō hutamu cēyunadi, yajñaphalamuniccuvāḍu viṣṇuvē).

  1. “ahaṃca sarva yajñānāṃ bhōktā ca prabhurēva ca” (śrīmadbhagavadgīta - 9 - 24)

(yajñabhōkta, yajñaprabhuvu śrīkṛṣṇuḍē - śrīmahāviṣṇuvē)

“ahaṃ viṣṇuḥ samastānāṃ yajñanā māśrayaḥ prabhuḥ |

matsvāmikō yajñāstē yajñabhōktā mahēśvaraḥ ||“.

(anni yajñamulaku āśriyuḍanu, prabhuvunu, nēnē.)

  1. “jyōtīmṣi viṣṇurbhuvanāni viṣṇuḥ vanāni viṣṇurgirayō diśaśca |

nadyaṃ samudrāśca sa ēva sarvaṃ yadasti, yannāsti ca vipravarya ||“. (viṣṇupurāṇamu)

(tējōrūpamulainavanniyunu, lōkamulanniyunu,koṃḍalu, dikkulu, nadulu, samudramulu, unnavi, lēnivi - anniyu ā śrīmahāviṣṇuvē - avanniyu atani rūpamulē).

  1. “viśvātmakaṃ vyāpakaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 31)

(śrīrāmacaṃdra parabrahma viśvamē ātmagā - tana śarīramugā galavāḍu, viśvamaṃtaṭanu pūrtigā, lōpala paina pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu).

  1. “sarvaṃ viṣṇumayaṃ jagat” (“harimayamu viśvamaṃtayu”) (śrīmadāṃdhramahābhāgavatamu -)

  2. “hrasvadīrgha ghlatairyattu kiṃcidvastvabhidhīyatē |

yaccavācāma viṣayē tatsarvaṃ viṣṇuravyayaḥ - ||“. (viṣṇupurāṇamu)

(poṭṭidi, poḍugudi anikāni, cinnadi, peddadi yanikāni ceppabaḍu yēdaina vastuvunnayaḍala, adi vākkunakaṃdarānidaina yaḍala, - ceppuṭaku vīlukānidi ayinayaḍala (vācāmagōcaraṃ) - adi aṃtayu avyayuḍaina (nāśarahituḍaina) ā mahāviṣṇuvē).

  1. “sī. - - -

- -viṣṇuḍanaga

nanyuḍokkaḍulēḍu; yajñaṃbu, vēdaṃbu nataḍe; bhūdēva kriyādi mūla

mataḍē; dēvarṣi pitrādi lōkamulaku dharmādāramulaku mahādhāramataḍe” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 34)

  1. “ajñānāṃ jñāna vō viṣṇuḥ jñānināṃ mōkṣadaśca saḥ |

ānaṃdaśca muktānāṃ sa ēvaikō janārthanaḥ ||“.

(ajñānulaku jñānamu niccuvāḍu, jñānulaku mōkṣamu niccuvāḍu viṣṇuvu, muktulaku ānaṃdamu niccuvāḍu ataḍokkaḍē).

  1. “vēdē rāmāyaṇē caiva purāṇē, bhāratē tathā |

ādāvaṃtē ca madhyēca viṣṇuḥ sarvatragīyatē ||“.

(vēdamulalōnu, purāṇamulalōnu, bhāratamulōnu, modaṭa, madhyanu, aṃtamaṃdu - aṃtaṭā annicōṭla viṣṇuvē gānamu cēyabaḍucunnāḍu, kīrtiṃpabaḍucunnāḍu, praśaṃsiṃpabaḍucunnāḍu)

  1. “yathā tarōḥ mūlāvasēcanaṃ skaṃdānāṃśākhānāṃ avaśēcanaṃ bhavati, tathā ēvaṃ ārādhanaṃ viṣṇōḥ sarvēṣāṃ ātmanaścahi”.

“ka. modala jalamiḍina bhūjamu

tudi naḍimanu calladanamu dorakunu māḍkin

modalanu hariki mrokkina

mudamaṃdudumu ellavēlpula mūkalu nēnun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 5 - 156)

  1. “mūrtitrayēśvara sadāśiva paṃcakaṃ tat |

prāhaḥ paramātmavapurēva sadāśivō (a)smin |

tatrēśvarastu sa vikuṃṭhipadastvamēva tatvaṃ pararbhājasi satyapadē tribhāgē ||“. (nārāṇīyaṃ - 90 - daśakaṃ)

(brahma viṣṇu mahēśvarulanu trimūrtulu, īśvaruḍu, sadāśivuḍu anu paṃcakamēdi kaladō adiyē paramātmarūpamu - sadāśivuḍani dēnini ceppucunnārō ā īśvaruḍanu paramapadamani ceppabaḍu vaikuṃṭhamu thāmamugā galavāḍu agu ā paratatvamu - nīvē (viṣṇuvē).

  1. “ā mahattaṃdu uttama madhyama kaniṣṭōhaṃ ||

aneḍi ahaṃkāra tritayōtpatti - - - aṃdulō “uttamōhaṃ” aneḍi vaikārikāhaṃkāraṃvallanunnū, satvaguṇaṃvallanunnū brahmāṃḍamaneḍi sthūladēhuṃḍai mōhana vikṛtibhāvaṃtō gūḍi jñānaśaktuṃḍai virāṭpuruṣuṃḍai viṣṇuṃḍanipiṃcukonunu”

(brahmavidyāsudhārṇavamu - 1)

  1. satvaguṇaprathāna māyā viśiṣṭa caitanyamu -

  2. “viś pravēśanē” (viś anu dhātuvunuṃḍi viṣṇu anu padamu puṭṭinadi - ‘viś’ anagā pravēśiṃcuṭa - aṃducēta viṣṇuvanagā annivastuvulalōnu pravēśiṃciyuṃḍuvāḍu ani arthamu - “viṣ vyāptau” vyāpiṃcuṭa ani arthamu. anni vastuvulalōnu vyāpiṃciyuṃḍuvāḍu - ganuka viṣṇuvu.

  3. “śravaṇāt sarva pāpaghnaṃ, mananāt puṇyavarthanaṃ |

svadhyānātsiddhidaṃ viṣṇuṃ prēkṣaṇāt mōkṣadaṃ bhajē ||“. (śrīvēṃkaṭēśvaramāhātmyamu - 3 - 6)

  1. jīvakaṇamu (energy cell) yokka asādhāraṇa lakṣaṇamulu (pratyēka lakṣaṇamulu) mūḍu ani ādhunika śāstramu (present day science) ceppucunnadi –

(1) tinuṭa - (it eats its environment),

(2) vyāpiṃcuṭa (growth)

(3) vṛddhi poṃduṭa (multiply itself - i.e., dividing itself into similar cells, each one of its own size and capability to grow and expand). ātma yanagā tinunadi (atti) ani arthamu - (cūḍumu - ‘ātma’), saṃhariṃcuṭa, jīvakaṇamuyokka modaṭi lakṣaṇamu kaladi. viṣṇuvu anagā vyāpiṃcuvāḍu - idi reṃdava lakṣaṇamu - brahma anagā peddadigā peruguṭa - (bṛṃhaṇamu) - idi mūḍava lakṣaṇamu - ī prakāramu jīvakaṇamu yokka mūḍu lakṣaṇamulu ātma, viṣṇu, brahma anu mūḍu padamulacēta ceppabaḍinavi. ī jīvakaṇamulu anu upādhilōnunna bhagavaṃtuḍu ī mūḍu lakṣaṇamulu kalavāḍu) -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.