← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణుమాయ viṣṇumāya

Original — తెలుగు
  1. విష్ణు సంబంధమైన మాయ.

  2. యోగమాయ.

  3. త్రిగుణాత్మకమైన, అనగా, సత్వరజస్తమోగుణములుగల మూల ప్రకృతి.

  4. “వ. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబునందు తనకు, విపర్యయంబుగా జననంబయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడు, బరమేశ్వరుండట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చితుండై యుండు - - - త్రివిధంబగు మాయయు నాత్మయందు లీనంబగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)

  5. “కృష్ణుండు - - - యోగమాయాదేవికిట్లనియె –

క. నానావిధ సంపదలకు

దానకమై సర్వకామ దాయినిన్

మానవులు భక్తి గొలుతురు

కానుకలును బలులు నిచ్చి కల్యాణమయీ

వ. మఱియు నిన్ను మానవులు దుర్గ, భద్ర, కాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదురయ్యై స్థానంబుల యందని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహా ప్రసాదంబని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి - - - “.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 58, 60, 61)

  1. మ. జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనిస్థానంబులెచ్చోట సం

జననం బెయ్యది, మేనలేకొలది, సంసారంబులే రూపముల్

వినుమా యింతయు విష్ణుమాయ, దలపన్ వేఱేమియున్ లేదు, మో

హ నిబంధంబు నిదాన మింతటికి. - - - . (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 475)

  1. “తే. రూఢి నామాయ గామినీ రూపమునను

బురుషులకునెల్ల మోహంబు బొందజేయు,

గాన, పురుషులు సతుల సంగంబుమాని

యోగవృత్తి చరించుచు నుండవలయు

- - -

క. హరిమాయా విరచితమై

తరుణీరూపంబుదాల్చి ధర బర్విన బం

దుర తృణ పరివృత కూపము

కరణి నదియు మృత్యురూపకంబగు మఱియున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 3 - 1005 to 1007)

  1. “ఆ. ఏ మహాత్ము మాయ నీ విశ్వమంతయు

మోహితాత్మకమయి మునిగి యుండు

నట్టి విష్ణుమాయ - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 483)

Transliteration
  1. viṣṇu saṃbaṃdhamaina māya.

  2. yōgamāya.

  3. triguṇātmakamaina, anagā, satvarajastamōguṇamulugala mūla prakṛti.

  4. “va. avyakta nirguṇa parabrahmaṃbunaṃdu tanaku, viparyayaṃbugā jananaṃbayina jñānaṃbe viṣṇumāya yanaṃbaḍu, baramēśvaruṃḍaṭṭi māyacēta jagaṃbu nirmiṃci niścituṃḍai yuṃḍu - - - trividhaṃbagu māyayu nātmayaṃdu līnaṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)

  5. “kṛṣṇuṃḍu - - - yōgamāyādēvikiṭlaniye –

ka. nānāvidha saṃpadalaku

dānakamai sarvakāma dāyinin

mānavulu bhakti goluturu

kānukalunu balulu nicci kalyāṇamayī

va. maṟiyu ninnu mānavulu durga, bhadra, kāḷi, vijaya, vaiṣṇavi, kumuda, caṃḍika, kṛṣṇa, mādhavi, kanyaka, māya, nārāyaṇi, īśāni, śārada, yaṃbika yanu padunālugu nāmaṃbulaṃ goniyāḍudurayyai sthānaṃbula yaṃdani yeṟiṃgiṃci sarvēśvaruṃḍagu hari pommani yānaticcina mahā prasādaṃbani yayyōganidra yiyyakoni mrokki - - - “.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 58, 60, 61)

  1. ma. janakuṃḍevvaḍu, jātuḍevvaḍu, janisthānaṃbuleccōṭa saṃ

jananaṃ beyyadi, mēnalēkoladi, saṃsāraṃbulē rūpamul

vinumā yiṃtayu viṣṇumāya, dalapan vēṟēmiyun lēdu, mō

ha nibaṃdhaṃbu nidāna miṃtaṭiki. - - - . (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 475)

  1. “tē. rūḍhi nāmāya gāminī rūpamunanu

buruṣulakunella mōhaṃbu boṃdajēyu,

gāna, puruṣulu satula saṃgaṃbumāni

yōgavṛtti cariṃcucu nuṃḍavalayu

- - -

ka. harimāyā viracitamai

taruṇīrūpaṃbudālci dhara barvina baṃ

dura tṛṇa parivṛta kūpamu

karaṇi nadiyu mṛtyurūpakaṃbagu maṟiyun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 3 - 1005 to 1007)

  1. “ā. ē mahātmu māya nī viśvamaṃtayu

mōhitātmakamayi munigi yuṃḍu

naṭṭi viṣṇumāya - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 483)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.