పరమపదము -
విష్ణోః వ్యాపన శీలస్య పరమాత్మనః పదం స్వరూపం.
(అన్నింటిలోను ప్రవేశించి వ్యాపించి యుండువాడున్నూ, పరమాత్మ అయినటునటువంటిన్నీ, విష్ణుని యొక్క పదము, స్థానము, స్వరూపము)
(నిరాకార పరబ్రహ్మ అయిన విష్ణువు యొక్క ఉత్కృష్టమైన పదమును - స్థానమును, లోకమును - వైకుంఠమును సూరి జనులు (పండితులు - జ్ఞానులు - బ్రహ్మజ్ఞానము కలవారు) ఎల్లపుడు చూచుచుందురు. పరమ పదమనునది, వైకుంఠమనునది ఒకటి యున్నదని దీనివలన స్పష్టమగుచున్నది. లేని వస్తువును ఎవరును చూడలేరుకదా!). పరమపదమనునదే మోక్షము.
“వ. నిజకాంతి చేతం త్రిలోకంబులం బ్రకాశింప జేయుచు, నిర్దయాగమ్యంబును, శాంతులు, సమదర్శనులు, శుద్ధులు, సర్వభూతానురంజనులును, నచ్యుత భక్త బాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి, గంభీర వేగంబు, ననిమిషంబునగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధియందుం బోలె నెందు బరిభ్రమించుచుండునట్టి యచ్యుత పదంబునుం బొంది విష్ణు పరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 12 -
“వ. ఏ పదంబునేని సూరిజనంబులు సర్వోత్తమమని పొందుదురు, దేని చంద్రదివాకర గ్రహ నక్షత్ర తారకా గణంబులు ప్రదక్షిణంబుగా దిరుగుచుండు, మఱియు నీదు పితరులచేతను నన్యుల చేతను ననధిష్టితంబును జగద్వంద్యంబును, భక్త జనాతి దుర్జయంబును, నయిన విష్ణు పదంబుం బొందుదువు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 12 - 374)
వ్యాప్య సాపేక్ష వ్యాపన శీలస్య, వ్యాప్య సాపేక్ష వ్యాపకతా(అ)భావే యద్వ్యాప్యనాపక కలనా విరలమవశిష్యతే, తదేవ పరమ నిష్పత్తియోగిక నిర్విశేషం తన్మాత్రతయా, పద్యతే ఇతి పదం - వి కలేబర కైవల్యమిత్యర్థః.
(తను ఒకడే అయినను అన్నింటిలోను వ్యాపించియుండు స్వభావము, సక్తి గల నిర్విశేషము, నిర్గుణము, నిరాకారము అగు పరబ్రహ్మము ఏది కలదో అట్టిది, ఇతర వస్తువుతో - ప్రకృతి సంబంధమైన ఇతర వస్తువుతో - కలసి యుండనిది - అట్టి పదము - భగవంతుని అట్టి స్థితి, శరీరములేకుండ పొందదగిన స్థానము - లేక భగవంతిని కేవలస్థితి - కైవల్యము).
(ఓంకారములోని తురీయ తురీయమే సత్యమగు పరబ్రహ్మ. తనకంటె వేరైన ఇతర వస్తువుయొక్క సత్తా - చైతన్యశక్తి - లేనిది, కనుక అదియే పరబ్రహ్మము - విష్ణుపదము, విష్ణువును పొందదగిన స్థానము - కేవల సత్తామాత్రుడు - ప్రకృతితో యేమాత్రమును కలిసియుండనివాడు - అదియే పరమపదము - విష్ణువే పరమపదము, విష్ణువే వైకుంఠము - వైకుంఠమే విష్ణువు, రెండింటికి భేదము లేదు.” (చూడుము - ‘పరమ పదము’)
paramapadamu -
viṣṇōḥ vyāpana śīlasya paramātmanaḥ padaṃ svarūpaṃ.
(anniṃṭilōnu pravēśiṃci vyāpiṃci yuṃḍuvāḍunnū, paramātma ayinaṭunaṭuvaṃṭinnī, viṣṇuni yokka padamu, sthānamu, svarūpamu)
(nirākāra parabrahma ayina viṣṇuvu yokka utkṛṣṭamaina padamunu - sthānamunu, lōkamunu - vaikuṃṭhamunu sūri janulu (paṃḍitulu - jñānulu - brahmajñānamu kalavāru) ellapuḍu cūcucuṃduru. parama padamanunadi, vaikuṃṭhamanunadi okaṭi yunnadani dīnivalana spaṣṭamagucunnadi. lēni vastuvunu evarunu cūḍalērukadā!). paramapadamanunadē mōkṣamu.
“va. nijakāṃti cētaṃ trilōkaṃbulaṃ brakāśiṃpa jēyucu, nirdayāgamyaṃbunu, śāṃtulu, samadarśanulu, śuddhulu, sarvabhūtānuraṃjanulunu, nacyuta bhakta bāṃdhavulu nayina bhadrācārulaku sugamyaṃbunu nayi, gaṃbhīra vēgaṃbu, nanimiṣaṃbunagu jyōtiścakraṃbu samāhitaṃbai gōgaṇaṃbu mēdhiyaṃduṃ bōle neṃdu baribhramiṃcucuṃḍunaṭṭi yacyuta padaṃbunuṃ boṃdi viṣṇu parāyaṇuṃḍaina dhruvuṃḍu trilōkacūḍāmaṇiyai yoppucuṃḍe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 12 -
“va. ē padaṃbunēni sūrijanaṃbulu sarvōttamamani poṃduduru, dēni caṃdradivākara graha nakṣatra tārakā gaṇaṃbulu pradakṣiṇaṃbugā dirugucuṃḍu, maṟiyu nīdu pitarulacētanu nanyula cētanu nanadhiṣṭitaṃbunu jagadvaṃdyaṃbunu, bhakta janāti durjayaṃbunu, nayina viṣṇu padaṃbuṃ boṃduduvu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 12 - 374)
vyāpya sāpēkṣa vyāpana śīlasya, vyāpya sāpēkṣa vyāpakatā(a)bhāvē yadvyāpyanāpaka kalanā viralamavaśiṣyatē, tadēva parama niṣpattiyōgika nirviśēṣaṃ tanmātratayā, padyatē iti padaṃ - vi kalēbara kaivalyamityarthaḥ.
(tanu okaḍē ayinanu anniṃṭilōnu vyāpiṃciyuṃḍu svabhāvamu, sakti gala nirviśēṣamu, nirguṇamu, nirākāramu agu parabrahmamu ēdi kaladō aṭṭidi, itara vastuvutō - prakṛti saṃbaṃdhamaina itara vastuvutō - kalasi yuṃḍanidi - aṭṭi padamu - bhagavaṃtuni aṭṭi sthiti, śarīramulēkuṃḍa poṃdadagina sthānamu - lēka bhagavaṃtini kēvalasthiti - kaivalyamu).
(ōṃkāramulōni turīya turīyamē satyamagu parabrahma. tanakaṃṭe vēraina itara vastuvuyokka sattā - caitanyaśakti - lēnidi, kanuka adiyē parabrahmamu - viṣṇupadamu, viṣṇuvunu poṃdadagina sthānamu - kēvala sattāmātruḍu - prakṛtitō yēmātramunu kalisiyuṃḍanivāḍu - adiyē paramapadamu - viṣṇuvē paramapadamu, viṣṇuvē vaikuṃṭhamu - vaikuṃṭhamē viṣṇuvu, reṃḍiṃṭiki bhēdamu lēdu.” (cūḍumu - ‘parama padamu’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.