← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశుద్ధ కమలము viśuddha kamalamu

Original — తెలుగు
  1. జీవస్య హంసస్య పరమాత్మనః అవలోకనాత్ జీవం యస్మాత్ విశుద్ధం తనుతే తతః విశుద్ధం ఇత్యన్వయః -

(జీవుడు పరమాత్మను చూచుటవలన జీవుడు విశుద్ధమైనవాడు - ఈ నాడీ చక్రము జీవునకుండుచోట కమలాకారముగానుండి దళములతో నుండు నాడీ చక్రము. ఈ నాడీ చక్రమే కమలాకారముగా నుండుటచేత విశుద్ధకమలము అని చెప్పబడినది) (ఇచట జీవుడు పరమాత్మను చూడగలుగుటచేత విశుద్ధుడైనాడు - ఈ నాడీ కమలము (చక్రము) విశుద్ధకమలము ( విశుద్ధ చక్రము) ఆయెను).

  1. సాధకుడు శుద్ధ స్పటికాకృతిగా తన్ను ధ్యానించు చోటగుటచేత విశుద్ధము -

  2. కంఠ స్థానమున నుండునది. “కర్ణంబులకు కలయిక కనుక ఆకర్ణంబులకు విషయంబులైన ఆకారాది షోడశ స్వరరూప శబ్దంబులే షోడశ దళములు కలది. ఆకారము మొదలగు పదియారు అచ్చులు రూపముగా గల పదియారు దళములు (రేకులు)గా కలిగి పద్మాకారముగానుండు నాడీ చక్రము.

  3. సాక్షాత్ షోడశదివ్యపత్రకమలే జీవాత్మ సంస్థాపితే |

రుద్రగ్రంధిమయే మనోన్మనిపథే జాలాంధ్ర పీఠాంతరే |

శుభ్రజ్యోతిమయం శరీరసహితం సుస్థం సుధాశీతలం |

శబ్దబ్రహ్మ నివాసభూతవదనం రామం భజే తారకం |“. (శ్రీరామ కర్ణామృతం - 2 - 57)

(మనోన్మని - ఉన్మనీ అవస్థ) పథములో జాలంధర పీఠమందు రుద్రగ్రంధి స్వరూపమైనదిన్నీ, విశుద్ధమైన (శుభ్రమైన) తేజస్సు గలదిన్నీ జీవాత్మకు నివాసస్థానమైనదిన్నీ, దైవాంశ కలిగి, దివ్యశక్తి గలిగియుండి కంఠమను పేరుగలదిన్నీ, ఆకారము మొదలు పదియారు అక్షరములే కంఠములని పేరుగల అచ్చులే దళములుగా గలిగి కమలాకారముగానుండు నాడీ చక్రము శబ్దబ్రహ్మకు (వేదమునకు, అక్షర సమామ్నాయమునకు) నివాసభూతమైన వదనమునందు - కంఠస్థానమునందుండు తారకరాముని భజించెదను)

Transliteration
  1. jīvasya haṃsasya paramātmanaḥ avalōkanāt jīvaṃ yasmāt viśuddhaṃ tanutē tataḥ viśuddhaṃ ityanvayaḥ -

(jīvuḍu paramātmanu cūcuṭavalana jīvuḍu viśuddhamainavāḍu - ī nāḍī cakramu jīvunakuṃḍucōṭa kamalākāramugānuṃḍi daḷamulatō nuṃḍu nāḍī cakramu. ī nāḍī cakramē kamalākāramugā nuṃḍuṭacēta viśuddhakamalamu ani ceppabaḍinadi) (icaṭa jīvuḍu paramātmanu cūḍagaluguṭacēta viśuddhuḍaināḍu - ī nāḍī kamalamu (cakramu) viśuddhakamalamu ( viśuddha cakramu) āyenu).

  1. sādhakuḍu śuddha spaṭikākṛtigā tannu dhyāniṃcu cōṭaguṭacēta viśuddhamu -

  2. kaṃṭha sthānamuna nuṃḍunadi. “karṇaṃbulaku kalayika kanuka ākarṇaṃbulaku viṣayaṃbulaina ākārādi ṣōḍaśa svararūpa śabdaṃbulē ṣōḍaśa daḷamulu kaladi. ākāramu modalagu padiyāru acculu rūpamugā gala padiyāru daḷamulu (rēkulu)gā kaligi padmākāramugānuṃḍu nāḍī cakramu.

  3. sākṣāt ṣōḍaśadivyapatrakamalē jīvātma saṃsthāpitē |

rudragraṃdhimayē manōnmanipathē jālāṃdhra pīṭhāṃtarē |

śubhrajyōtimayaṃ śarīrasahitaṃ susthaṃ sudhāśītalaṃ |

śabdabrahma nivāsabhūtavadanaṃ rāmaṃ bhajē tārakaṃ |“. (śrīrāma karṇāmṛtaṃ - 2 - 57)

(manōnmani - unmanī avastha) pathamulō jālaṃdhara pīṭhamaṃdu rudragraṃdhi svarūpamainadinnī, viśuddhamaina (śubhramaina) tējassu galadinnī jīvātmaku nivāsasthānamainadinnī, daivāṃśa kaligi, divyaśakti galigiyuṃḍi kaṃṭhamanu pērugaladinnī, ākāramu modalu padiyāru akṣaramulē kaṃṭhamulani pērugala acculē daḷamulugā galigi kamalākāramugānuṃḍu nāḍī cakramu śabdabrahmaku (vēdamunaku, akṣara samāmnāyamunaku) nivāsabhūtamaina vadanamunaṃdu - kaṃṭhasthānamunaṃduṃḍu tārakarāmuni bhajiṃcedanu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.