← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వః viśvaḥ

Original — తెలుగు
  1. విశ్వుడు; విశ్వము తానే అయినవాడు - అన్నీ తానే అయినవాడు; విశ్వరూపుడు; విష్ణువు.

  2. “విశంతి ప్రవిష్ఠాని సర్వాణ్యాకాశాదీని భూతాని యస్మిన్ యోవా ఆకాశాదిషు జాతేషు ప్రవిష్టః స విశ్వః, ఈశ్వరః”.

(ఆకాశము మొదలగు భూతములన్నియు ఎవనియందు ప్రవేశించి నివసించియున్నవో, లేక, తనయందే పుట్టినటువంటి ఆకాశము మొదలగు భూతములందు ఎవడు నివసించియున్నాడో అతనే విశ్వుడు, ఈశ్వరుడు).

  1. పరమాత్మనః నభిన్నమిదం విశ్వం పరమార్థతః, తేన విశ్వమిత్యభిధీయతే బ్రహ్మ, తద్భిన్నం నకించి పరమార్థతః సదస్తి. అధవా, విశతీతి విశ్వం బ్రహ్మ -“తత్ సృష్ట్వా తదేవానుప్రవిశత్” ఇతి శ్రుతేః, యద్వా, సంహృతౌ విశంతి విశ్వాని భూతని బ్రహ్మణి - “యత్ప్రయంత్యభి సంవిశంతి” ఇతి శ్రుతేః -

(పరమార్థతయా - యథార్థముగా - నిజము చెప్పవలెనన్న - ఈ విశ్వమంతయు - ఈ ప్రపంచమంతయు పరమాత్మకంటె (పరబ్రహ్మకంటె) వేరైనది కాదు. అందుచేత పరబ్రహ్మ విశ్వుడు అని చెప్పబడుచున్నాడు, అతనికంటె వేరైన దేదియు యధార్థముగా సద్వస్తువేదియును లేదు - లేక, - దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను, సృష్టించిన ప్రతివస్తువులోను పరబ్రహ్మ ప్రవేశించియున్నాడు. దీనివలన ప్రవేశించువాడు విశ్వుడు అని అర్థము - అన్నింటిలోను ప్రవేశించియుండువాడు కనుక బరబ్రహ్మ విశ్వుడు అని చెప్పబడుచున్నాడు, లేక, - “సంహారకాలమందు సమస్త భూతములు చనిపోయి ఇతని యందే ప్రవేశించుచున్నవి” అని శ్రుతి చెప్పుచున్నది. సంహారకాలమందు - ప్రళయకాలమందు భూతములన్నియు భగవంతునిలో ప్రవేశించుచున్నవి, లీనమగుచున్నవి, కనుక పరబ్రహ్మ విశ్వుడు అని చెప్పబడుచున్నాడు).

  1. విశ్వస్య జగతః కారణత్వేన విశ్వం ఇత్యుచ్యతే బ్రహ్మ.

(కార్యరూపమైన విశ్వమునకు - జగత్తునకు కారణమైనవాడగుట చేత పరబ్రహ్మ విశ్వుడు అని చెప్పబడుచున్నాడు).

  1. పురుషాదుత్పన్నం ఇదం విశ్వం పురుష ఏవ, నహి పురుషాదన్యత్ విశ్వమస్తి, పురుషాదన్యస్య వాచారంభణమాత్రత్వాత్ - “వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవిసత్యం” ఇతి శ్రుతేః - “కస్మిన్ భగవో వా జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” పురుషే విజ్ఞాతే తత్కార్యభూత ప్రాణాది రసాంత విశ్వమిదం పురుష ఏవేతి విజ్ఞాతం భవతి, ఇతః అన్యదపి యత్ పురుషాతిరిక్తత్వేన విభాతి, తత్సర్వం పురుషకార్యం, కార్యస్య కారిణ మాత్రత్వాత్ కార్యస్య నిరూపిత కారణా యాః కార్య సాపేక్షత్వాత్ కార్యకారణ విరలం బ్రహ్మ.

(పురుషునివలన - పరమపురుషునివలన పరబ్రహ్మవలన పుట్టిన ఈ విశ్వము - ప్రపంచము - పరమపురుషుడే. పురుషుని కంటె వేరైన విశ్వమనునది లేదు. పురుషునికంటె వేరైనది వాచారంభణమే - చెప్పబడుటకే కాని (పేరునకేగాని) యథార్థముగా లేదు - “మట్టితో చేయబడిన కుండ, మూకుడు మొదలగునవి వేరు వేరు పేర్లతో చెప్పబడినవేకాని అన్నియు మట్టియే - అవన్నియు మట్టియే యని చెప్పుటయే సత్యము, నిజము” అని శ్రుతి చెప్పుచున్నది. “దేనిని తెలుసుకొనిన ఇదంతయు - ఈ విశ్వమంతయు - తెలుసుకొనినదగునో” అను ప్రశ్నకు జబాబుగా పరమపురుషుని - పరబ్రహ్మను తెలుసుకొనినచో అతని కార్యమైన - అతనిచేత చేయబడిన ప్రాణులు మొదలు రసములు వరకు గల యీ విశ్వమంతయు ఆ పరమపురుషుడే - పరబ్రహ్మయే తెలుసుకోనగును - పురుషుడుకంటె ఇతరమైనది ఉన్నదనుకొనినను అది అంతయు పరమపురుషుని కార్యమే, పరబ్రహ్మచేసినదే - ఎందుచేతననగా కర్యవస్తువు కారణమాత్రమే, కారణముయొక్క సాపేక్షత కార్యవస్తువులో నిరూపించబడి యుండుటచేత. ఇందుచేత కారణములు కార్యములు - ఈ విశ్వమంతయు తానే అయినదగుట చేత పరబ్రహ్మ విశ్వుడని చెప్పబడుచున్నాడు -

  1. “విశ్వమితి కార్యశబ్దేన కారనం గ్రహనం” (శ్రీశంకరః)

(విశ్వము - ప్రపంచము - కార్యము - అది కార్యవస్తువగుటచేత దానికి కారణమైన పరబ్రహ్మ విశ్వమనే (విశ్వుడనే) గ్రహించవలెను.)

  1. “పరస్తాత్ పురుషాత్ న భిన్నమిదం విశ్వం పరమార్థతః; తేన విశ్వమిత్యభిదీయతే బ్రహ్మ”. (శ్రీశంకరః)

(యథార్థమునకు ఈ విశ్వమంతయు - ఈ ప్రపంచమంతయు - పరబ్రహ్మకంటె వేరైనదికాదు. అందుచేతపరబ్రహ్మ విశ్వుడు అని చెప్పబడుచున్నాడు.)

  1. “బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం”. (ముండకోపనిషత్తు)

“విశ్వం నారాయణం దేవం”.

(ఈ విశ్వమంతయు పరబ్రహ్మమే. అందుచేత విశ్వమనగా పరబ్రహ్మమే).

  1. “పురుష ఏ వేదం విశ్వం” (ముండకోపనిషత్)

(ఈ విశ్వమంతయు - ప్రపంచమంతయు పురుషుడే.(పురమందు శయనించుటవలన పురుషుడు) - పరబ్రహ్మమే.

  1. జగదాత్మకః; సర్వాత్మకత్వాత్ విశ్వత్వం -

(జగత్తు అంతటికి ఆత్మ అయినవాడు, జగత్తే శరీరముగా గలవాడు. అన్నింటికి తానే ఆత్మ అయినవాడు - ఆన్నింటి శరీరములు తానే అయినవాడు అందుచేత పరబ్రహ్మ విశ్వము (విశ్వుడు) అని చెప్పబడుచున్నాడు.)

  1. విశ్వశరీరకం -

(విశ్వమే - ప్రపంచమే శరీరముగా గలవాడు)

  1. విశ్వరూపం

(విశ్వమే - ప్రపంచమే రూపముగా గలవాడు, ప్రపంచములోనున్న రూపములన్నియు తన రూపములే - అవన్నియు కలిసి ఒకే రూపముగానుండు విశ్వమే - ప్రపంచమే పెద్ద రూపముగా గలవాడు).

  1. “దేహాః మనుష్యాః పశవః పక్షి వృక్ష సారీసృపాః |

రూపమే తదనంతస్య వివిష్ణోర్భిన్నమివ స్థితం |

ఏ తద్వి జ్ఞానతా సర్వం జగత్ స్థావర జంగమం |

ద్రష్టవ్య మాత్మన ద్విష్ణుః యతో యం విశ్వరూపదృక్ |“.

(దేహములు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షములు, నదులు, ఇవన్నియుగల ఈ విశ్వము అంతములేని రూపములుగల శ్రీమహావిష్ణువుయొక్క రూపము - ఈ చిన్న చిన్న రూపములు, అవన్నియు గలసి ఒకే రూపముగా వ్యవహరింపబడు ప్రపంచము - విశ్వము - అను పెద్దరూపము - అన్నింటికంటె పెద్దవిభూతి - ఇవన్నియు అతని రూపములే - అతనికంటె వేరుగానున్నట్లు కనుపించుచున్నవి. ఇట్లు తెలుసుకొనిన స్థావరములు జంగమములు (చరాచరములు) గల ఈ విశ్వము శ్రీమహావిష్ణువు యొక్క శరీరముగానే తలంచవలెను - విశ్వము అనగా అనేకము - విశ్వరూపమనగా అనేకమైన చిన్న చిన్న రూపములు కలిసిన ఒకే ఒక పెద్దరూపము).

  1. “వ. భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబునందు భూత భవిష్యద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగు - ధరణీ సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్త్వంబులనియెడు సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు (విరాట్పురుషుడు) దేజరిల్లు. అమ్మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు, పార్షిణ భాగపాదాగ్ర భాగంబులు రసాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, జంఘలు తలాతలంబు, జానుద్వయంబు సుతలంబు, నూరువులు వితలాతలంబు, జఘనంబులు మహీతలంబు, నాభీవివరంబు నభస్తలంబు, వక్షంబు గ్రహతారకా ముఖర జ్యోతిస్సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు, గ్రీవము మహర్లోకంబు, ముఖంబు జనలోకంబు, లలాటంబు తపోలోకంబు, శీర్షంబులు సత్యలోకంబు, బాహుదండంబింద్రాదులు, కర్ణంబులు దిశలు, శ్రవణేంద్రియంబు శబ్దంబు, నాసాగ్రకంబులశ్వనీ దేవతలు, ఘ్రాణేంద్రియంబు గంధంబు, వదనంబు వహ్ని, నేత్రంబు లంతరిక్షంబు, చక్షురింద్రియంబు సూర్యుండు, రేయింబగళ్ళు ఱెప్పలు, భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మ పదంబు, తాలువులు జలంబు, జిహ్వేంద్రియంబు రసంబు, భాషణంబులు సకలవేదంబులు, దమ్ష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాది స్నేహకళులు, నగవులు జనోన్మాదికారిణియగు మాయ, కటాకంబులు దురంత సంసర్గంబులు, పెదవులు వ్రీడాలోభంబులు, స్తనంబులు ధర్మంబు, వెన్న ధర్మమార్గంబు, మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు మిత్రావరుణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు, నాడీ నివహంబులు నదులు, తనూరుహంబులు తరువులు, నిశ్వాసంబులు వాయువులు, కాలంబు గమనంబు (అనంతవీర్యస్య కాలః తస్య గమనం = ప్రాయంబు నిరవధికంబైన కాలంబు), కాలంబు గమనంబు, కర్మంబులు నానావిధజంతుసన్నివహ సంసృత సంసరణంబులు, శిరోజంబులు మేఘంబులు, కట్టు పుట్టంబులు సంధ్యలు, హృదయంబు ప్రథానంబు, సర్వవికారంబులకు నాశ్రయభూతంబైన మనము చంద్రుండు, చిత్తంబు మహత్తత్త్వంబు, అహంకారంబు రుద్రుండు, అశ్వాశ్వతర్యుష్ట్రగజంబులు నఖంబులు, కటి ప్రదేశంబు పశుమృగాదులు, విచిత్రంబులైన యాలాపనైపుణంబులు పక్షులు, బుద్ధి మనువు, నివాసంబు పురుషుండు, షడ్జాదులయిన సర్వ విశేషంబులు గంధర్వ విద్యాధర సిద్ధ చరణాక్సరస్సమూహంబులు, స్మృతి ప్రహ్లాద ప్రముఖులు, వీర్యంబు దైత్యదానవానీకంబై యుండు. మఱియు, నమ్మహావిభునకు ముఖంబు బ్రాహ్మణులు, భుజంబులు క్షత్రియులు, ఊరులు వైశ్యులు, చరణంబులు శూద్రులు, నాహంబులు ననావిధంబులైన వసురుద్రాది దేహాభిదానంబులు, ద్రవ్యంబులు హవిర్భాగంబులు, కర్మంబులు యజ్ఞప్రయాగంబులు, ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబున ముముక్షుండైనవాడు మనస్సంధానంబు సేయవలయు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 16)

  1. “సీ. విష్ణుండు విశ్వంబు; విష్ణునికంటెను వేఱేమియును లేదు. విశ్వమునకు,

భవ వృద్ధి లయములా పరమేశు చేనగు - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 65)

  1. “సహస్తా సహస్తాది రూపంబైన విశ్వమనతయు నీశ్వరుడుగా తెలియుము - అతనికి వేఱులేదు.” (శ్రీమదాంధ్రమహాభగవతము - 1 - 13 - 288).

  2. “క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)

  1. “క. విశ్వాత్ముడు విశ్వేశుడు

విశ్వమయుండఖిలనేతవష్ణుడజుండీ

విశ్వములో దానుండును

విశ్వము దనలోన చాల వెలుగుచుండున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -2 - 6 - 100)

  1. విశ్వేన ఆత్మతయా ఉపజీవ్యతయా విశ్వత్వం. నతు స్వరూపేణేత్యభిప్రాయః -

(ప్రపంచములోనుండు అన్నింటికీ ఆత్మ యగుటవలనను, వాటిని జీవింప చేయుచుండుటవలనను, పరబ్రహ్మ విశ్వమని చెప్పబడుచున్నాడు - తన రూపమే - తనయథార్థరూపమే విశ్వమగుటవలనకాదు).

  1. “జగతాత్మకం ఆరోపితస్య జగతః అధిష్ఠాన వ్యతిరేకేణ వాస్తవరూపా భావాత్, సర్వాత్మకత్వాత్ విశ్వం”.

(జగత్తునకు అధిష్ఠానమని ఆరోపించబడినది ఇంకొకటి లేనందున, వాస్తవమైన్మ రూపము లేనందున, అన్నింటికి తానే ఆత్మ అయి యుండుటచేతను, జగత్తునకు ఆత్మ అయినందున, లేక జగత్తు శరీరముగా గలదగుటచేత, పరబ్రహ్మ విశ్వమని చెప్పబడుచున్నాడు)

  1. “విశతీతి విశ్వం బ్రహ్మ” (శ్రీశంకరః)

(అన్నింటిలోను ప్రవేశించియుండువాడు కనుక పరబ్రహ్మ విశ్వము అని చెప్పబడుచున్నాడు).

  1. విశేషేణ వర్థతే.

(విశేషముగావృద్ధి పొందువాడు - వామనమూర్తివలె).

  1. విశేషేణ శ్వమతి - (విశేషముగా వ్యాపించువాడు)

  2. విశ్వసనీయత్వాత్ విశ్వం.

(విశ్వసించతగినవాడు కనుక విశ్వము - భక్తసులభుడని, మోక్షదాతయని భక్తులు విశ్వసించ తగినవాడు)

  1. “విశ్ ప్రవేశనే” అనుధాత్వర్దమువలన అన్నింటిలోను ప్రవేశించి ప్రతిదానిలోను పూర్తిగా వ్యాపించియున్నాడు) (చూడుము - 21 to 23 above)

  2. “విశ్వపదం శ్రీసహస్రనామ భాష్యే స్వరూప రూపగుణవిభవైః సర్వంవిశతి ఇతి పరిపూర్ణః ఇతి యేగిక ముక్తం -”

(శ్రీ విష్ణుసహస్రనామముల భాష్యములో విశ్వం అను పదము నకర్థము - తన స్వరూపముతోను, గుణములు మొదలగు వైభవములతో, ప్రతి వస్తువులోను ప్రవేశించియుండువాడు అని అందుచేత పూర్తిగా వ్యాపించియుండువాడు - అని పూర్ణుడు అని చెప్పబడినది).

  1. “విశ్వం విష్ణుర్వషట్కారో” అని శ్రీవిష్ణుసహస్రనామములనొకటి - మొదటిదే - విశ్వము అనగా - ప్రపంచమనునది విష్ణువే అని అతని నామములలో మొదటిదిగా చెప్పబడినది).

  2. “విష్టభ్యాహమిదం కృత్స్న యేకాంశేన స్థితో జగత్” - (శ్రీమద్భగవద్గీత - 10 - 42)

(ఇదంతయు - ఈ విశ్వమంతయు - ఈ ప్రపంచమంతయు నా యొక్క ఒకే అంశచేత వ్యాపించబడియున్నది. ఈ విశ్వమంతటిలోను - లోపల, పైన పూర్తిగా వ్యాపించియున్నది. నా యొక్క ఒకే అంశ - (only one Energy pervades and permeats all things in the entire creation)

Transliteration
  1. viśvuḍu; viśvamu tānē ayinavāḍu - annī tānē ayinavāḍu; viśvarūpuḍu; viṣṇuvu.

  2. “viśaṃti praviṣṭhāni sarvāṇyākāśādīni bhūtāni yasmin yōvā ākāśādiṣu jātēṣu praviṣṭaḥ sa viśvaḥ, īśvaraḥ”.

(ākāśamu modalagu bhūtamulanniyu evaniyaṃdu pravēśiṃci nivasiṃciyunnavō, lēka, tanayaṃdē puṭṭinaṭuvaṃṭi ākāśamu modalagu bhūtamulaṃdu evaḍu nivasiṃciyunnāḍō atanē viśvuḍu, īśvaruḍu).

  1. paramātmanaḥ nabhinnamidaṃ viśvaṃ paramārthataḥ, tēna viśvamityabhidhīyatē brahma, tadbhinnaṃ nakiṃci paramārthataḥ sadasti. adhavā, viśatīti viśvaṃ brahma -“tat sṛṣṭvā tadēvānupraviśat” iti śrutēḥ, yadvā, saṃhṛtau viśaṃti viśvāni bhūtani brahmaṇi - “yatprayaṃtyabhi saṃviśaṃti” iti śrutēḥ -

(paramārthatayā - yathārthamugā - nijamu ceppavalenanna - ī viśvamaṃtayu - ī prapaṃcamaṃtayu paramātmakaṃṭe (parabrahmakaṃṭe) vērainadi kādu. aṃducēta parabrahma viśvuḍu ani ceppabaḍucunnāḍu, atanikaṃṭe vēraina dēdiyu yadhārthamugā sadvastuvēdiyunu lēdu - lēka, - dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu, sṛṣṭiṃcina prativastuvulōnu parabrahma pravēśiṃciyunnāḍu. dīnivalana pravēśiṃcuvāḍu viśvuḍu ani arthamu - anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu kanuka barabrahma viśvuḍu ani ceppabaḍucunnāḍu, lēka, - “saṃhārakālamaṃdu samasta bhūtamulu canipōyi itani yaṃdē pravēśiṃcucunnavi” ani śruti ceppucunnadi. saṃhārakālamaṃdu - praḷayakālamaṃdu bhūtamulanniyu bhagavaṃtunilō pravēśiṃcucunnavi, līnamagucunnavi, kanuka parabrahma viśvuḍu ani ceppabaḍucunnāḍu).

  1. viśvasya jagataḥ kāraṇatvēna viśvaṃ ityucyatē brahma.

(kāryarūpamaina viśvamunaku - jagattunaku kāraṇamainavāḍaguṭa cēta parabrahma viśvuḍu ani ceppabaḍucunnāḍu).

  1. puruṣādutpannaṃ idaṃ viśvaṃ puruṣa ēva, nahi puruṣādanyat viśvamasti, puruṣādanyasya vācāraṃbhaṇamātratvāt - “vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ, mṛttikētyēvisatyaṃ” iti śrutēḥ - “kasmin bhagavō vā jñātē sarvamidaṃ vijñātaṃ bhavati” puruṣē vijñātē tatkāryabhūta prāṇādi rasāṃta viśvamidaṃ puruṣa ēvēti vijñātaṃ bhavati, itaḥ anyadapi yat puruṣātiriktatvēna vibhāti, tatsarvaṃ puruṣakāryaṃ, kāryasya kāriṇa mātratvāt kāryasya nirūpita kāraṇā yāḥ kārya sāpēkṣatvāt kāryakāraṇa viralaṃ brahma.

(puruṣunivalana - paramapuruṣunivalana parabrahmavalana puṭṭina ī viśvamu - prapaṃcamu - paramapuruṣuḍē. puruṣuni kaṃṭe vēraina viśvamanunadi lēdu. puruṣunikaṃṭe vērainadi vācāraṃbhaṇamē - ceppabaḍuṭakē kāni (pērunakēgāni) yathārthamugā lēdu - “maṭṭitō cēyabaḍina kuṃḍa, mūkuḍu modalagunavi vēru vēru pērlatō ceppabaḍinavēkāni anniyu maṭṭiyē - avanniyu maṭṭiyē yani ceppuṭayē satyamu, nijamu” ani śruti ceppucunnadi. “dēnini telusukonina idaṃtayu - ī viśvamaṃtayu - telusukoninadagunō” anu praśnaku jabābugā paramapuruṣuni - parabrahmanu telusukoninacō atani kāryamaina - atanicēta cēyabaḍina prāṇulu modalu rasamulu varaku gala yī viśvamaṃtayu ā paramapuruṣuḍē - parabrahmayē telusukōnagunu - puruṣuḍukaṃṭe itaramainadi unnadanukoninanu adi aṃtayu paramapuruṣuni kāryamē, parabrahmacēsinadē - eṃducētananagā karyavastuvu kāraṇamātramē, kāraṇamuyokka sāpēkṣata kāryavastuvulō nirūpiṃcabaḍi yuṃḍuṭacēta. iṃducēta kāraṇamulu kāryamulu - ī viśvamaṃtayu tānē ayinadaguṭa cēta parabrahma viśvuḍani ceppabaḍucunnāḍu -

  1. “viśvamiti kāryaśabdēna kāranaṃ grahanaṃ” (śrīśaṃkaraḥ)

(viśvamu - prapaṃcamu - kāryamu - adi kāryavastuvaguṭacēta dāniki kāraṇamaina parabrahma viśvamanē (viśvuḍanē) grahiṃcavalenu.)

  1. “parastāt puruṣāt na bhinnamidaṃ viśvaṃ paramārthataḥ; tēna viśvamityabhidīyatē brahma”. (śrīśaṃkaraḥ)

(yathārthamunaku ī viśvamaṃtayu - ī prapaṃcamaṃtayu - parabrahmakaṃṭe vērainadikādu. aṃducētaparabrahma viśvuḍu ani ceppabaḍucunnāḍu.)

  1. “brahmai vēdaṃ viśvamidaṃ variṣṭaṃ”. (muṃḍakōpaniṣattu)

“viśvaṃ nārāyaṇaṃ dēvaṃ”.

(ī viśvamaṃtayu parabrahmamē. aṃducēta viśvamanagā parabrahmamē).

  1. “puruṣa ē vēdaṃ viśvaṃ” (muṃḍakōpaniṣat)

(ī viśvamaṃtayu - prapaṃcamaṃtayu puruṣuḍē.(puramaṃdu śayaniṃcuṭavalana puruṣuḍu) - parabrahmamē.

  1. jagadātmakaḥ; sarvātmakatvāt viśvatvaṃ -

(jagattu aṃtaṭiki ātma ayinavāḍu, jagattē śarīramugā galavāḍu. anniṃṭiki tānē ātma ayinavāḍu - ānniṃṭi śarīramulu tānē ayinavāḍu aṃducēta parabrahma viśvamu (viśvuḍu) ani ceppabaḍucunnāḍu.)

  1. viśvaśarīrakaṃ -

(viśvamē - prapaṃcamē śarīramugā galavāḍu)

  1. viśvarūpaṃ

(viśvamē - prapaṃcamē rūpamugā galavāḍu, prapaṃcamulōnunna rūpamulanniyu tana rūpamulē - avanniyu kalisi okē rūpamugānuṃḍu viśvamē - prapaṃcamē pedda rūpamugā galavāḍu).

  1. “dēhāḥ manuṣyāḥ paśavaḥ pakṣi vṛkṣa sārīsṛpāḥ |

rūpamē tadanaṃtasya viviṣṇōrbhinnamiva sthitaṃ |

ē tadvi jñānatā sarvaṃ jagat sthāvara jaṃgamaṃ |

draṣṭavya mātmana dviṣṇuḥ yatō yaṃ viśvarūpadṛk |“.

(dēhamulu, manuṣyulu, paśuvulu, pakṣulu, vṛkṣamulu, nadulu, ivanniyugala ī viśvamu aṃtamulēni rūpamulugala śrīmahāviṣṇuvuyokka rūpamu - ī cinna cinna rūpamulu, avanniyu galasi okē rūpamugā vyavahariṃpabaḍu prapaṃcamu - viśvamu - anu peddarūpamu - anniṃṭikaṃṭe peddavibhūti - ivanniyu atani rūpamulē - atanikaṃṭe vērugānunnaṭlu kanupiṃcucunnavi. iṭlu telusukonina sthāvaramulu jaṃgamamulu (carācaramulu) gala ī viśvamu śrīmahāviṣṇuvu yokka śarīramugānē talaṃcavalenu - viśvamu anagā anēkamu - viśvarūpamanagā anēkamaina cinna cinna rūpamulu kalisina okē oka peddarūpamu).

  1. “va. bhagavaṃtuṃḍaina hari virāḍvigrahaṃbunaṃdu bhūta bhaviṣyadvartamānaṃbaina viśvaṃbu vilōkyamānaṃbagu - dharaṇī salila tējassamīraṇa gaganāhaṃkāra mahattattvaṃbulaniyeḍu saptāvaraṇaṃbulacēta nāvṛtaṃbagu mahāṃḍakōśaṃbaina śarīraṃbunaṃdu dhāraṇāśrayaṃbaina vairāja puruṣuṃḍu (virāṭpuruṣuḍu) dējarillu. ammahātmuniki pādamūlaṃbu pātāḷaṃbu, pārṣiṇa bhāgapādāgra bhāgaṃbulu rasātalaṃbu, gulphaṃbulu mahātalaṃbu, jaṃghalu talātalaṃbu, jānudvayaṃbu sutalaṃbu, nūruvulu vitalātalaṃbu, jaghanaṃbulu mahītalaṃbu, nābhīvivaraṃbu nabhastalaṃbu, vakṣaṃbu grahatārakā mukhara jyōtissamūha samētaṃbagu nakṣatralōkaṃbu, grīvamu maharlōkaṃbu, mukhaṃbu janalōkaṃbu, lalāṭaṃbu tapōlōkaṃbu, śīrṣaṃbulu satyalōkaṃbu, bāhudaṃḍaṃbiṃdrādulu, karṇaṃbulu diśalu, śravaṇēṃdriyaṃbu śabdaṃbu, nāsāgrakaṃbulaśvanī dēvatalu, ghrāṇēṃdriyaṃbu gaṃdhaṃbu, vadanaṃbu vahni, nētraṃbu laṃtarikṣaṃbu, cakṣuriṃdriyaṃbu sūryuṃḍu, rēyiṃbagaḷḷu ṟeppalu, bhrūyugma vijṛṃbhaṇaṃbu brahma padaṃbu, tāluvulu jalaṃbu, jihvēṃdriyaṃbu rasaṃbu, bhāṣaṇaṃbulu sakalavēdaṃbulu, damṣṭralu daṃḍadharuṃḍu, daṃtaṃbulu putrādi snēhakaḷulu, nagavulu janōnmādikāriṇiyagu māya, kaṭākaṃbulu duraṃta saṃsargaṃbulu, pedavulu vrīḍālōbhaṃbulu, stanaṃbulu dharmaṃbu, venna dharmamārgaṃbu, mēḍhraṃbu prajāpati vṛṣaṇaṃbulu mitrāvaruṇulu, jaṭharaṃbu samudraṃbulu, śalyasaṃghaṃbulu girulu, nāḍī nivahaṃbulu nadulu, tanūruhaṃbulu taruvulu, niśvāsaṃbulu vāyuvulu, kālaṃbu gamanaṃbu (anaṃtavīryasya kālaḥ tasya gamanaṃ = prāyaṃbu niravadhikaṃbaina kālaṃbu), kālaṃbu gamanaṃbu, karmaṃbulu nānāvidhajaṃtusannivaha saṃsṛta saṃsaraṇaṃbulu, śirōjaṃbulu mēghaṃbulu, kaṭṭu puṭṭaṃbulu saṃdhyalu, hṛdayaṃbu prathānaṃbu, sarvavikāraṃbulaku nāśrayabhūtaṃbaina manamu caṃdruṃḍu, cittaṃbu mahattattvaṃbu, ahaṃkāraṃbu rudruṃḍu, aśvāśvataryuṣṭragajaṃbulu nakhaṃbulu, kaṭi pradēśaṃbu paśumṛgādulu, vicitraṃbulaina yālāpanaipuṇaṃbulu pakṣulu, buddhi manuvu, nivāsaṃbu puruṣuṃḍu, ṣaḍjādulayina sarva viśēṣaṃbulu gaṃdharva vidyādhara siddha caraṇāksarassamūhaṃbulu, smṛti prahlāda pramukhulu, vīryaṃbu daityadānavānīkaṃbai yuṃḍu. maṟiyu, nammahāvibhunaku mukhaṃbu brāhmaṇulu, bhujaṃbulu kṣatriyulu, ūrulu vaiśyulu, caraṇaṃbulu śūdrulu, nāhaṃbulu nanāvidhaṃbulaina vasurudrādi dēhābhidānaṃbulu, dravyaṃbulu havirbhāgaṃbulu, karmaṃbulu yajñaprayāgaṃbulu, iṭṭi sarvamayuṃḍaina paramēśvaruni vigrahaṃbuna mumukṣuṃḍainavāḍu manassaṃdhānaṃbu sēyavalayu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 16)

  1. “sī. viṣṇuṃḍu viśvaṃbu; viṣṇunikaṃṭenu vēṟēmiyunu lēdu. viśvamunaku,

bhava vṛddhi layamulā paramēśu cēnagu - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 65)

  1. “sahastā sahastādi rūpaṃbaina viśvamanatayu nīśvaruḍugā teliyumu - ataniki vēṟulēdu.” (śrīmadāṃdhramahābhagavatamu - 1 - 13 - 288).

  2. “ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃśayamu panilēdā

harimayamugāni dravyamu paramāṇuvu lēdu - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)

  1. “ka. viśvātmuḍu viśvēśuḍu

viśvamayuṃḍakhilanētavaṣṇuḍajuṃḍī

viśvamulō dānuṃḍunu

viśvamu danalōna cāla velugucuṃḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu -2 - 6 - 100)

  1. viśvēna ātmatayā upajīvyatayā viśvatvaṃ. natu svarūpēṇētyabhiprāyaḥ -

(prapaṃcamulōnuṃḍu anniṃṭikī ātma yaguṭavalananu, vāṭini jīviṃpa cēyucuṃḍuṭavalananu, parabrahma viśvamani ceppabaḍucunnāḍu - tana rūpamē - tanayathārtharūpamē viśvamaguṭavalanakādu).

  1. “jagatātmakaṃ ārōpitasya jagataḥ adhiṣṭhāna vyatirēkēṇa vāstavarūpā bhāvāt, sarvātmakatvāt viśvaṃ”.

(jagattunaku adhiṣṭhānamani ārōpiṃcabaḍinadi iṃkokaṭi lēnaṃduna, vāstavamainma rūpamu lēnaṃduna, anniṃṭiki tānē ātma ayi yuṃḍuṭacētanu, jagattunaku ātma ayinaṃduna, lēka jagattu śarīramugā galadaguṭacēta, parabrahma viśvamani ceppabaḍucunnāḍu)

  1. “viśatīti viśvaṃ brahma” (śrīśaṃkaraḥ)

(anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu kanuka parabrahma viśvamu ani ceppabaḍucunnāḍu).

  1. viśēṣēṇa varthatē.

(viśēṣamugāvṛddhi poṃduvāḍu - vāmanamūrtivale).

  1. viśēṣēṇa śvamati - (viśēṣamugā vyāpiṃcuvāḍu)

  2. viśvasanīyatvāt viśvaṃ.

(viśvasiṃcataginavāḍu kanuka viśvamu - bhaktasulabhuḍani, mōkṣadātayani bhaktulu viśvasiṃca taginavāḍu)

  1. “viś pravēśanē” anudhātvardamuvalana anniṃṭilōnu pravēśiṃci pratidānilōnu pūrtigā vyāpiṃciyunnāḍu) (cūḍumu - 21 to 23 above)

  2. “viśvapadaṃ śrīsahasranāma bhāṣyē svarūpa rūpaguṇavibhavaiḥ sarvaṃviśati iti paripūrṇaḥ iti yēgika muktaṃ -”

(śrī viṣṇusahasranāmamula bhāṣyamulō viśvaṃ anu padamu nakarthamu - tana svarūpamutōnu, guṇamulu modalagu vaibhavamulatō, prati vastuvulōnu pravēśiṃciyuṃḍuvāḍu ani aṃducēta pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu - ani pūrṇuḍu ani ceppabaḍinadi).

  1. “viśvaṃ viṣṇurvaṣaṭkārō” ani śrīviṣṇusahasranāmamulanokaṭi - modaṭidē - viśvamu anagā - prapaṃcamanunadi viṣṇuvē ani atani nāmamulalō modaṭidigā ceppabaḍinadi).

  2. “viṣṭabhyāhamidaṃ kṛtsna yēkāṃśēna sthitō jagat” - (śrīmadbhagavadgīta - 10 - 42)

(idaṃtayu - ī viśvamaṃtayu - ī prapaṃcamaṃtayu nā yokka okē aṃśacēta vyāpiṃcabaḍiyunnadi. ī viśvamaṃtaṭilōnu - lōpala, paina pūrtigā vyāpiṃciyunnadi. nā yokka okē aṃśa - (only one Energy pervades and permeats all things in the entire creation)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.