ప్రపంచమంతటను నిండియుండుట. పూర్తిగా వ్యాపించియుండుట - అందుచేతనే పూర్ణుడు.
“తత్సృష్ట్వా తదేవాని ప్రావిశత్ - తదనుప్రవిశ్య సచ్చత్యచ్ఛా భవత్ -”.
ప్రపంచమును సృష్టించి దానిలోనే ప్రవేశించెను - ప్రవేశించెననగా దానంతటిలోను లోపల పైనా పూర్తిగా వ్యాపించె. అనగా ప్రంచములోనున్న ప్రతి వస్తువులోను కూడా పూర్తిగా వ్యాపించెను - అట్లు ప్రవేశించి, అన్నింటిలోను పూర్తిగా వ్యాపించి ఆ ప్రపంచములోని అన్ని వస్తువులు ఆత్మవస్తువు, అనాత్మవస్తువులు తానే ఆయెను - అందుచేత ప్రపంచములో ప్రతి వస్తువు తానే ఆయెను - తాను ప్రవేశించి, పూర్తిగా వ్యాపించని వస్తువు లేదు, తనుకాని వస్తువు లేదు -“ఆ హరిమయము గాని వస్తువు పరమాణువు లేదు -” (Every particle of matter contains Energy) అందుచేత విశ్వమయత యనగా విశ్వమంతటిలోని ప్రతి వస్తువులోను పూర్తిగా వ్యాపించియున్నవాడు భగవంతుడొక్కడే - (only one Energy pervades everything in the entire creation) - సృష్టి అంతటిలోను ఉన్నది ఒకే తత్వము.”హరిమయము విశ్వమంతయు” (ప్రపంచములోనున్నదంతా భగవంతుడే ఇంకొక వస్తువే లేదు - భగవంతుడు కాక వేరువస్తువులున్నాయి అనుకొనుట మిధ్య - అందుచేతనే భగవంతుడు అద్వయుడు - తనుతప్ప ఇతర వస్తువులేనివాడు). అందుచేతనే గజేంద్రుడు రక్షించమని మొర పెట్టినపుడు విష్ణువు తప్ప కలుగచేసుకొనలేదు - గజేంద్రుడులోనున్నవాడు అతనే, మొసలిలోనున్నవాడు అతనే, కనుక గజేంద్రుని రక్షించగలవాడతనొక్కడే) - “విశ్వమయుడు విభుడు, విష్ణుండు, జిష్ణుండు భక్తియుతనకడ్డు పడదలంచె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 94)
“వేద్యం, విశ్వమయం, స్వలీనభువనం స్వారాజ్యసౌఖ్యప్రదం” - (శ్రీరామకర్ణామృతం - 2 - 41)
prapaṃcamaṃtaṭanu niṃḍiyuṃḍuṭa. pūrtigā vyāpiṃciyuṃḍuṭa - aṃducētanē pūrṇuḍu.
“tatsṛṣṭvā tadēvāni prāviśat - tadanupraviśya saccatyacchā bhavat -”.
prapaṃcamunu sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu - pravēśiṃcenanagā dānaṃtaṭilōnu lōpala painā pūrtigā vyāpiṃce. anagā praṃcamulōnunna prati vastuvulōnu kūḍā pūrtigā vyāpiṃcenu - aṭlu pravēśiṃci, anniṃṭilōnu pūrtigā vyāpiṃci ā prapaṃcamulōni anni vastuvulu ātmavastuvu, anātmavastuvulu tānē āyenu - aṃducēta prapaṃcamulō prati vastuvu tānē āyenu - tānu pravēśiṃci, pūrtigā vyāpiṃcani vastuvu lēdu, tanukāni vastuvu lēdu -“ā harimayamu gāni vastuvu paramāṇuvu lēdu -” (Every particle of matter contains Energy) aṃducēta viśvamayata yanagā viśvamaṃtaṭilōni prati vastuvulōnu pūrtigā vyāpiṃciyunnavāḍu bhagavaṃtuḍokkaḍē - (only one Energy pervades everything in the entire creation) - sṛṣṭi aṃtaṭilōnu unnadi okē tatvamu.”harimayamu viśvamaṃtayu” (prapaṃcamulōnunnadaṃtā bhagavaṃtuḍē iṃkoka vastuvē lēdu - bhagavaṃtuḍu kāka vēruvastuvulunnāyi anukonuṭa midhya - aṃducētanē bhagavaṃtuḍu advayuḍu - tanutappa itara vastuvulēnivāḍu). aṃducētanē gajēṃdruḍu rakṣiṃcamani mora peṭṭinapuḍu viṣṇuvu tappa kalugacēsukonalēdu - gajēṃdruḍulōnunnavāḍu atanē, mosalilōnunnavāḍu atanē, kanuka gajēṃdruni rakṣiṃcagalavāḍatanokkaḍē) - “viśvamayuḍu vibhuḍu, viṣṇuṃḍu, jiṣṇuṃḍu bhaktiyutanakaḍḍu paḍadalaṃce” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 94)
“vēdyaṃ, viśvamayaṃ, svalīnabhuvanaṃ svārājyasaukhyapradaṃ” - (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 41)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.