← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వసృష్టి viśvasṛṣṭi

Original — తెలుగు

“యధోర్ణనాభిః సృజతే, గృహ్ణాతేచ, యథా పృధివ్యాం ఓషధియః సంభవంతి, యథా సతః పురుషాత్ కేశలో మాని, తథాక్షరాత్ సంభవతీహ విశ్వం” ( ముండకోపనిషత్)

(సాలె పురుగు గూడు కట్టుకొనుటకు దారములను సృష్టించి, వాటిని మరల తనలోనికే ఎట్లు తీసుకొనునో, ఎట్లు భూమిలోనుండి ఓషధులు - సస్యములు మొదలగునవి - పుట్టుచున్నవో, ఎట్లు సత్పురుషునినుండి కేశరోములు పుట్టుచున్నవో, అట్లే అక్షరుడు నుండి - నాశములేని భగవంతుడు నుండి యీ ప్రపంచము పుట్టుచున్నది.)

లోకే తావత్ యథా ఊర్ణనాభిః లూతాకీటః కించిదపి కారణాంతర మనపేక్ష్య, స్వశరీర వ్యతిరేకేణ తంతూన్ స్వయమేవ సృజతే, బహిర్విస్తారయతి, పునరపి తానేవ తంతూన్ గృహ్ణాతి, స్వాత్మావశేషం కరోతీత్యద్థః యథా చ పృధివ్యాం వ్రీహ్యాద్యోషధయః పృధివ్యనతి రిక్తాః సంభవంతి, యథాచ, సతోవిద్యమానాత్ పురుషాత్ మస్తకతద్భిన్న శరీరాపేక్షయా కేశాశ్చ లోమాశ్చ సంభవంతి కారణ విలక్షణా నీత్యర్థః, తథా నిమిత్తాంతరా నపేక్షాత్ అక్షరాత్ ఇహ సంసార మండలే విలక్షణ సలక్షణ భేదేన విశ్వం సమస్తం జగత్ సంభవంతి (ఆవిర్భవతీత్యర్థః).

(లోకములో సాలెపురుగు, తన శరీరముకాక ఇతర కారణ వస్తువు నభిలషించక తన గూడు కట్టుకొనుటకై దారములను తానే సృజించుచున్నది (తనలోనుండి పుట్టించుచున్నది). పైకి విస్తరింపచేయుచున్నది., తిరిగి వాటిని తనలోనికే తెసుకొనుచున్నది. (తనలోనే వాటిని లయము చేసుకొనుచున్నది. భూమిలో యవలు మొదలగు ఓషధులు (సస్యములు), భూమిలోనుండికాక - ఇతర కారణములు లేకుండగనే - పుట్టుచున్నవి. పురుషునినుండి ఇతర కారణములు లేకుండగనే కేశములు, రోమములు పుట్టుచున్నవి. ఆ ప్రకారముగానే, ఇతర కారణవస్తువుయొక్క అపేక్ష లేకుండగనే అక్షరుడైన పరబ్రహ్మనుండి (ఈ సంసారమందు) విలక్షణ సలక్షణ భేదముగల ఈ ప్రపంచమంతయు పుట్టుచున్నది).

Transliteration

“yadhōrṇanābhiḥ sṛjatē, gṛhṇātēca, yathā pṛdhivyāṃ ōṣadhiyaḥ saṃbhavaṃti, yathā sataḥ puruṣāt kēśalō māni, tathākṣarāt saṃbhavatīha viśvaṃ” ( muṃḍakōpaniṣat)

(sāle purugu gūḍu kaṭṭukonuṭaku dāramulanu sṛṣṭiṃci, vāṭini marala tanalōnikē eṭlu tīsukonunō, eṭlu bhūmilōnuṃḍi ōṣadhulu - sasyamulu modalagunavi - puṭṭucunnavō, eṭlu satpuruṣuninuṃḍi kēśarōmulu puṭṭucunnavō, aṭlē akṣaruḍu nuṃḍi - nāśamulēni bhagavaṃtuḍu nuṃḍi yī prapaṃcamu puṭṭucunnadi.)

lōkē tāvat yathā ūrṇanābhiḥ lūtākīṭaḥ kiṃcidapi kāraṇāṃtara manapēkṣya, svaśarīra vyatirēkēṇa taṃtūn svayamēva sṛjatē, bahirvistārayati, punarapi tānēva taṃtūn gṛhṇāti, svātmāvaśēṣaṃ karōtītyadthaḥ yathā ca pṛdhivyāṃ vrīhyādyōṣadhayaḥ pṛdhivyanati riktāḥ saṃbhavaṃti, yathāca, satōvidyamānāt puruṣāt mastakatadbhinna śarīrāpēkṣayā kēśāśca lōmāśca saṃbhavaṃti kāraṇa vilakṣaṇā nītyarthaḥ, tathā nimittāṃtarā napēkṣāt akṣarāt iha saṃsāra maṃḍalē vilakṣaṇa salakṣaṇa bhēdēna viśvaṃ samastaṃ jagat saṃbhavaṃti (āvirbhavatītyarthaḥ).

(lōkamulō sālepurugu, tana śarīramukāka itara kāraṇa vastuvu nabhilaṣiṃcaka tana gūḍu kaṭṭukonuṭakai dāramulanu tānē sṛjiṃcucunnadi (tanalōnuṃḍi puṭṭiṃcucunnadi). paiki vistariṃpacēyucunnadi., tirigi vāṭini tanalōnikē tesukonucunnadi. (tanalōnē vāṭini layamu cēsukonucunnadi. bhūmilō yavalu modalagu ōṣadhulu (sasyamulu), bhūmilōnuṃḍikāka - itara kāraṇamulu lēkuṃḍaganē - puṭṭucunnavi. puruṣuninuṃḍi itara kāraṇamulu lēkuṃḍaganē kēśamulu, rōmamulu puṭṭucunnavi. ā prakāramugānē, itara kāraṇavastuvuyokka apēkṣa lēkuṃḍaganē akṣaruḍaina parabrahmanuṃḍi (ī saṃsāramaṃdu) vilakṣaṇa salakṣaṇa bhēdamugala ī prapaṃcamaṃtayu puṭṭucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.